స్వేచ్ఛ షార్ట్స్ — తాజా తెలుగు వార్తలు

Vaishnavi Chaitanya: వైష్ణవి వయసెంతో తెలుసా..? 32 కాదు..వికీపీడియా తప్పు చెప్తోంది!సినిమాSwechaa22 Sep 2026, 02:28 PM

Vaishnavi Chaitanya: వైష్ణవి వయసెంతో తెలుసా..? 32 కాదు..వికీపీడియా తప్పు చెప్తోంది!

Vaishnavi Chaitanya: కెరీర్ ప్రారంభంలో చిన్న చిన్న పాత్రల్లో కనిపించింది. కొన్ని షార్ట్ ఫిలింస్ లోనూ బాగా నటించి గుర్తింపు తెచ్చుకుంది. అలా, టాలీవుడ్‌లో అందరి దృష్టిని ఆకర్షించిన తెలుగమ్మాయి వైష్ణవి చైతన్య..అల వైకుంఠపురములో సినిమాలో అల్లు అర్జున్‌తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంది. ఆ తర్వాత బేబి సినిమాతో టాలీవుడ్‌లో హీరోయిన్‌గా సరికొత్త సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే, ఇప్పుడు ఈ బ్యూటీ వయసు విషయంలో గుగూల్‌లో తప్పుగా ఉందని చెప్పింది. తన వయసు 32 కాదని, 25 ఏళ్ళేనని రివీల్ చేసింది.

తెలంగాణలో ప్రమాదంలో 43లక్షల ఓట్లు.. ఈసీ నోటీసులపై ఓటర్ల బేఖాతరు!తెలంగాణSwechaa22 Sep 2026, 02:27 PM

తెలంగాణలో ప్రమాదంలో 43లక్షల ఓట్లు.. ఈసీ నోటీసులపై ఓటర్ల బేఖాతరు!

 తెలంగాణలో భారత ఎన్నికల సంఘం (EC) చేపట్టిన ఓటర్ల సగ్ర సమగ్ర సవరణ (SIR) ప్రక్రియలో ఊహించని పరిణామాలు వెలుగుచూస్తున్నాయి. సవరణ నిమిత్తం ఈసీ జారీ చేసిన నోటీసులకు స్పందించడంలో ఓటర్లు బేఖాతరు చేస్తుండటంతో దాదాపు 43.98 లక్షల మంది(53.62%) ఓట్లు రద్దయ్యే ప్రమాదం నెలకొంది. మొత్తం 82.02లక్షల మందికి నోటీసులు పంపగా, కేవలం 38 లక్షల మంది మాత్రమే ఇప్పటివరకు విచారణకు హాజరయ్యారు. అత్యంత విచిత్రంగా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గంలో నోటీసులు అందుకున్న 66,342 మంది ఓటర్లలో ఏకంగా 63,984 మంది (96%) విచారణకు గైర్హాజరు కావడం కలకలం రేపుతోంది.

రామచంద్రరావు అరెస్ట్‌పై బండి సంజయ్ ఫైర్.. కాంగ్రెస్ సర్కార్‌కు వార్నింగ్!తెలంగాణSwechaa22 Sep 2026, 01:43 PM

రామచంద్రరావు అరెస్ట్‌పై బండి సంజయ్ ఫైర్.. కాంగ్రెస్ సర్కార్‌కు వార్నింగ్!

 జూరాల ప్రాజెక్టు సందర్శనకు బయల్దేరిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచంద్రరావు అరెస్ట్‌ను, ఇతర బీజేపీ నేతల ముందస్తు హౌజ్ అరెస్టులను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తీవ్రంగా ఖండించారు. జూరాల ప్రాజెక్టును సందర్శించి ఆయకట్టు రైతుల సమస్యలు తెలుసుకోవడానికి వెళ్తుంటే అరెస్టులు చేయడం దారుణమని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో అసలు ప్రజాస్వామ్య పాలన నడుస్తోందా లేక పోలీసులతో రాజ్యమేలుతున్నారా? అని ప్రభుత్వాన్ని నిలదీశారు.

వైద్యరంగాన్ని విస్మరించిన రేవంత్ రెడ్డి.. రిమ్స్ ప్రమాద ఘటనపై కేటీఆర్ విమర్శలు!తెలంగాణSwechaa22 Sep 2026, 01:25 PM

వైద్యరంగాన్ని విస్మరించిన రేవంత్ రెడ్డి.. రిమ్స్ ప్రమాద ఘటనపై కేటీఆర్ విమర్శలు!

 ఆదిలాబాద్ జిల్లా రిమ్స్ ఆస్పత్రిలోని పీడియాట్రిక్ వార్డులో షార్ట్ సర్క్యూట్ కారణంగా చోటుచేసుకున్న అగ్నిప్రమాదంలో ముగ్గురు పసిపాపలు ప్రాణాలు కోల్పోవడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి, విచారం వ్యక్తం చేశారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన, అస్వస్థతకు గురైన మరో 23 మంది పసిపిల్లలకు ప్రభుత్వం తక్షణమే అత్యుత్తమ వైద్య సేవలుందించి వారి ప్రాణాలను కాపాడాలని సామాజిక మాధ్యమం ద్వారా విజ్ఞప్తి చేశారు.

కోట్ల ఆస్తులు.. బినామీల పేర్లు.. 'నిమ్స్' లక్ష్మీభాస్కర్ అవినీతి సామ్రాజ్యం బట్టబయలు!క్రైమ్Swechaa22 Sep 2026, 01:14 PM

కోట్ల ఆస్తులు.. బినామీల పేర్లు.. 'నిమ్స్' లక్ష్మీభాస్కర్ అవినీతి సామ్రాజ్యం బట్టబయలు!

 రాష్ట్రంలోనే అత్యున్నత వైద్య సేవలు అందించే నిమ్స్(NIMS) ఆస్పత్రిలో ఆసుపత్రిలో ఏసీబీ అధికారులు నిర్వహించిన ఆకస్మిక దాడులు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టిస్తున్నాయి. నిమ్స్ అడిషినల్ సూపరింటెండెంట్ డాక్టర్ నోరి లక్ష్మీభాస్కర్ అక్రమ సంపాదన, బినామీ వ్యవస్థపై అవినీతి నిరోధకశాఖ (ఏసీబీ) విరుచుకుపడింది. ఆయన ఆదాయానికి మించి కోట్లాది రూపాయల ఆస్తులు కూడబెట్టారనే పక్కా సమాచారంతో మంగళవారం వేకువజాము నుంచే హైదరాబాద్ నగరం సహా మూడు జిల్లాల్లోని మొత్తం 12కు పైగా కీలక ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు ప్రారంభమయ్యాయి.

దానం సీటుకు డేంజర్ బెల్స్..! సుప్రీంకోర్టులో ఏం జరగబోతోంది?తెలంగాణSwechaa22 Sep 2026, 12:40 PM

దానం సీటుకు డేంజర్ బెల్స్..! సుప్రీంకోర్టులో ఏం జరగబోతోంది?

తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు అందరి చూపూ ఢిల్లీ వైపే. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అనర్హత వ్యవహారం సుప్రీంకోర్టు గడపకు చేరడంతో తదుపరి పరిణామాలపై ఉత్కంఠ నెలకొంది. హైకోర్టు ఇచ్చిన తీర్పుపై దానం నాగేందర్ సవాల్ చేయగా.. అత్యున్నత న్యాయస్థానం ఎలాంటి ఆదేశాలు ఇవ్వబోతోందన్నది ఆసక్తికరంగా మారింది.

గణేశ్ నిమజ్జనంలో కొండచిలువతో డ్యాన్స్.. రంగంలోకి పోలీసులు!క్రైమ్Swechaa22 Sep 2026, 11:50 AM

గణేశ్ నిమజ్జనంలో కొండచిలువతో డ్యాన్స్.. రంగంలోకి పోలీసులు!

 హైదరాబాద్‌లో ఇటీవల జరిగిన గణేశ్ నిమజ్జన శోభాయాత్రలో ఓ డ్యాన్స్ గ్రూప్ చేసిన విన్యాసం తీవ్ర వివాదాస్పదమైంది. విశాఖపట్నానికి చెందిన ఒక డ్యాన్స్ బృందం నిమజ్జన వేడుకల్లో భాగంగా ప్రదర్శన ఇచ్చింది. అయితే, తమ పెర్ఫార్మెన్స్‌లో ప్రత్యేకత ఉండాలని భావించిన సదరు గ్రూప్‌లోని ఒక యువతి, ప్రాణాపాయాన్ని సైతం లెక్కచేయకుండా నిజమైన కొండచిలువతో డ్యాన్స్ చేసి అందరినీ విస్మయానికి గురిచేసింది.  మహిళా డ్యాన్సర్ తన మెడలో భారీ ఇండియన్ రాక్ పైథాన్ (కొండచిలువ) వేసుకుని రోడ్డుపై స్టెప్పులు వేసింది. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వ్యాపించడంతో పాటు వన్యప్రాణి సంరక్షణ అధికారుల దృష్టికి వెళ్లాయి.

Mokshagna-Tollywood: కన్‌ఫర్మ్ మోక్షజ్ఞ డెబ్యూకి జానర్ ఫిక్స్..సినిమాSwechaa22 Sep 2026, 11:23 AM

Mokshagna-Tollywood: కన్‌ఫర్మ్ మోక్షజ్ఞ డెబ్యూకి జానర్ ఫిక్స్..

Mokshagna: గత నాలుగైదేళ్ళ నుంచి నందమూరి మోక్షజ్ఞ హీరోగా ఎంటరవబోతున్నాడని వార్తలు వచ్చాయి. కానీ, ఎప్పటికప్పుడు పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది. ఎట్టకేలకి, ఇటీవల మైత్రీ మూవీ మేకర్స్ మోక్షజ్ఞ ను టాలీవుడ్‌కి పరిచయం చేస్తున్నట్టుగా వెల్లడించారు. ఇక, ఈ సినిమాకి మల్లిడి వశిష్ఠ దర్శకత్వం వహించబోతున్నారు. ప్రస్తుతం, ఈ సినిమాకి సెకండాఫ్ స్క్రిప్ట్ వర్క్ జరుగుతోందని సమాచారం.

Madhapur: ఓయో రూమ్‌లో యువతి అనుమానాస్పద మృతి.. ప్రియుడే హత్య చేశాడా?క్రైమ్Swechaa22 Sep 2026, 10:40 AM

Madhapur: ఓయో రూమ్‌లో యువతి అనుమానాస్పద మృతి.. ప్రియుడే హత్య చేశాడా?

హైదరాబాద్‌లోని మాదాపూర్ సిద్దిక్ నగర్‌లోని ఒక ఓయో(OYO) హోటల్‌లో యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం తీవ్ర కలకలం రేపింది. మృతురాలిని విశాఖపట్నంకు చెందిన షారన్ నిఖిత టోప్నోగా పోలీసులు గుర్తించారు. ఆమె తన ప్రియుడు శ్రీనివాస రవి తేజతో కలిసి నిన్న(సోమవారం) మధ్యాహ్నం నగరానికి వచ్చి, సిద్ధిఖీనగర్ రోడ్డునంబర్ 5లోని 'హోటల్ OSLN టెర్మినస్' రూమ్ నంబర్ 303లో అద్దెకు దిగారు. సోమవారం తెల్లవారుజామున సుమారు 1గంట సమయంలో కొండాపూర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రి నుంచి మహిళ మృతి చెందినట్లు మాదాపూర్ పోలీసులకు సమాచారం అందింది.

ఆదిలాబాద్‌ రిమ్స్‌ అగ్నిప్రమాదంపై సీఎం దిగ్భ్రాంతి.. సమగ్ర విచారణకు ఆదేశం!తెలంగాణSwechaa22 Sep 2026, 10:28 AM

ఆదిలాబాద్‌ రిమ్స్‌ అగ్నిప్రమాదంపై సీఎం దిగ్భ్రాంతి.. సమగ్ర విచారణకు ఆదేశం!

 ఆదిలాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (రిమ్స్) ఆసుపత్రిలోని ఎస్‌ఎన్‌సీయూ (SNCU) వార్డులో సంభవించిన తీవ్ర అగ్నిప్రమాద ఘటనపై సీఎం రేవంత్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి, విచారం వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో ఇద్దరు పసిపాపలు ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమని పేర్కొన్నారు. మృతి చెందిన చిన్నారుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపిన సీఎం.. బాధితులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని హామీ ఇచ్చారు.

సచివాలయానికి సీఎం రేవంత్‌రెడ్డి.. ఉద్యోగ సంఘాల నేతలతో కీలక భేటీ!తెలంగాణSwechaa22 Sep 2026, 09:56 AM

సచివాలయానికి సీఎం రేవంత్‌రెడ్డి.. ఉద్యోగ సంఘాల నేతలతో కీలక భేటీ!

 తెలంగాణ సచివాలయానికి నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రానున్నారు. ఉదయం 11:30గంటలకు ఆయన సెక్రటేరియట్‌కు చేరుకుని, పలు శాఖల అధికారులతో పాటు ఉద్యోగుల సమస్యలపై చర్చించనున్నారు. ప్రధానంగా ఉద్యోగ సంఘాలు కోరుతున్న పలు డిమాండ్లపై ముఖ్యమంత్రితో ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ భేటీకి ముందే నిన్న(సోమవారం) సీఎస్ సంజయ్ జాజు నేతృత్వంలో ప్రభుత్వ ప్రతినిధులు, ఉద్యోగ సంఘాల నాయకులు మొదటి దఫా సంప్రదింపులు జరిపారు.

OutdoorMediaMafia: ఔట్ డోర్ మీడియా.. అదో పెద్ద మాఫియా?స్వేచ్ఛ ఛైర్మన్ డెస్క్Swechaa22 Sep 2026, 09:44 AM

OutdoorMediaMafia: ఔట్ డోర్ మీడియా.. అదో పెద్ద మాఫియా?

మిథున యాడ్ ఏజెన్సీకి చెందిన మహిళను కాంగ్రెస్ నేత లైగింక వేధింపులకు గురి చేశారని బాధితురాలు ఆరోపించారు. నిజానికి ఆమెకు అన్యాయం జరిగితే పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలి. కానీ ట్విట్టర్ వేదికగా పెట్టిన పోస్ట్, ఆ తర్వాత విడుదలైన వీడియోతో కన్ఫ్యూజన్ చేసింది. అందరూ మంచి వాళ్లే అంటూ ప్రతిపక్షాలకు ఆయుధం ఇచ్చింది. ఆమె మనోభావాలను దెబ్బతీసిన, వేధింపులకు గురి చేసిన వారికి శిక్ష పడాలి. కానీ, ఆ పేరుతో సోషల్ మీడియాలో బ్లేమ్ చేయడం ఎవరికీ మంచిది కాదు. అలా అని పేరు చెప్పకపోవడంతో అనేక మంది ఎన్నో రకాలుగా ఊహించుకుంటున్నారు. అసలు ఈ మాఫియా ఎందుకు ఇలా తయారైందో స్వేచ్ఛ న్యూస్ చైర్మన్ దేవేందర్ రెడ్డి గత 4 ఏండ్లుగా వార్తలు రాస్తూనే ఉన్నారు.

2027.. తెలంగాణ ఎన్నికల నామ సంవత్సరం! సై అంటున్న పార్టీలుతెలంగాణSwechaa22 Sep 2026, 09:40 AM

2027.. తెలంగాణ ఎన్నికల నామ సంవత్సరం! సై అంటున్న పార్టీలు

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నప్పటికీ.. రాజకీయ పార్టీల్లో మాత్రం ఎన్నికల వాతావరణం మొదలైనట్టుగా కనిపిస్తోంది. గ్రేటర్‌ హైదరాబాద్‌ రాజకీయాల్లో వరుస పరిణామాలు పార్టీలను అప్రమత్తం చేస్తున్నాయి.

sircilla: కేటీఆర్ కంచుకోటలోకి కాంగ్రెస్ ఎంట్రీ!!..తెలంగాణSwechaa22 Sep 2026, 09:22 AM

sircilla: కేటీఆర్ కంచుకోటలోకి కాంగ్రెస్ ఎంట్రీ!!..

బీఆర్ఎస్ నియోజకవర్గాలే టార్గెట్ గా సభలు నిర్వహించాలని అధికార కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. దీనిలో భాగంగా మాజీ మంత్రి కే తారక రామారావు ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల నియోజకవర్గ కేంద్రంలో తొలి బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించారు. ఈ నెల 30వ తేదీ బుధవారం సాయంత్రం సిరిసిల్ల జిల్లా కేంద్రంలో సభ నిర్వహిస్తారు. ఈ సభకు ముఖ్యఅతిథిగా సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ సహా మంత్రులు, పార్టీ నాయకులు హాజరుకానున్నారు.

నిమ్స్‌లో తొలిసారి ఏసీబీ ఆకస్మిక సోదాలు.. అడిషనల్ సూపరింటెండెంట్ ఇంట్లో తనిఖీలు!క్రైమ్Swechaa22 Sep 2026, 09:21 AM

నిమ్స్‌లో తొలిసారి ఏసీబీ ఆకస్మిక సోదాలు.. అడిషనల్ సూపరింటెండెంట్ ఇంట్లో తనిఖీలు!

హైదరాబాద్‌లోని నిజామ్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్) ఆస్పత్రిలో ఏసీబీ అధికారులు తొలిసారి సోదాలు చేపట్టారు. ఆసుపత్రి అడిషనల్ సూపరింటెండెంట్ డాక్టర్ లక్ష్మీభాస్కర్‌ లక్ష్యంగా అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) అధికారులు మంగళవారం ఉదయం మెరుపు దాడులు నిర్వహించారు. ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయనే పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన ఏసీబీ బృందాలు ఏకకాలంలో పలు చోట్ల తనిఖీలు చేపట్టాయి.  నిమ్స్ ఆసుపత్రి చరిత్రలోనే ఓ ఉన్నతాధికారిపై ఈ స్థాయిలో ఏసీబీ సోదాలు జరగడం ఇదే మొదటిసారి కావడంతో తీవ్ర కలకలం రేపింది. ఈ సోదాలు ఏకకాలంలో మూడు జిల్లాల పరిధిలోని 12విభిన్న ప్రాంతాల్లో కొనసాగాయి.

ఇరాన్‌కు ప్రపంచవ్యాప్తంగా విమాన సేవలు బంద్.. అమెరికా భారీ ఆర్థిక ఆంక్షలు!InternationalSwechaa22 Sep 2026, 08:57 AM

ఇరాన్‌కు ప్రపంచవ్యాప్తంగా విమాన సేవలు బంద్.. అమెరికా భారీ ఆర్థిక ఆంక్షలు!

 అమెరికా ప్రభుత్వం ఇరాన్‌పై తన ఆర్థిక ఒత్తిడిని తీవ్ర స్థాయికి చేర్చింది. సెప్టెంబర్ 23 నుంచి ప్రపంచవ్యాప్తంగా ఇరాన్‌కు చెందిన అన్ని విమానయాన సంస్థల సర్వీసులను నిలిపివేయనున్నట్లు యూఎస్ ట్రెజరీ ప్రకటించింది. ఇరాన్ విమానాలకు ఏ దేశంలోనైనా ఏ విమానాశ్రయం అయినా ఇంధనం నింపినా, ల్యాండింగ్ సేవలు అందించినా, లేదా టికెట్లు విక్రయించినా ఆయా సంస్థలను అమెరికా డాలర్ ఆధారిత ఆర్థిక వ్యవస్థ నుంచి శాశ్వతంగా తొలగిస్తామని 'సెకండరీ ఆంక్షల' రూపంలో కఠిన హెచ్చరికలు జారీ చేసింది.

కాళేశ్వరం అవినీతిలో కొత్త ట్విస్ట్.. నిధుల మళ్లింపు వారి ఖాతాల్లోకే!?..తెలంగాణSwechaa22 Sep 2026, 08:50 AM

కాళేశ్వరం అవినీతిలో కొత్త ట్విస్ట్.. నిధుల మళ్లింపు వారి ఖాతాల్లోకే!?..

కాళేశ్వరం అవినీతి వ్యవహారంలో మరో కీలక కోణం తెరపైకి వచ్చింది. ఇప్పటివరకు అధికారుల వ్యక్తిగత ఆస్తులు, బ్యాంకు ఖాతాలపై దర్యాప్తు సాగుతుండగా.. ఇప్పుడు ఉద్యోగుల అసోసియేషన్ల ఖాతాలపైనా ఫోకస్ పెట్టాలన్న చర్చ మొదలైంది. కాళేశ్వరం పనులు సాగిన సమయంలో ఆయా ఖాతాల్లో భారీగా నిధులు జమయ్యాయా? ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరికి బదిలీ అయింది? అనే అంశాలు దర్యాప్తులో కీలకంగా మారుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతిపై సమగ్ర విచారణ అవసరమంటుండగా.. బీఆర్ఎస్ ఆరోపణలను రాజకీయ కక్షగా కొట్టిపారేస్తోంది. దీంతో అసోసియేషన్ ఖాతాల వ్యవహారం కాళేశ్వరం కేసులో మరో కీలక లింక్‌గా మారింది.

Korukonda: కబ్జాలో  దేవుడి భూములు.. పరాయి పంచన 100 ఎకరాలు!!..ఏపీSwechaa22 Sep 2026, 08:02 AM

Korukonda: కబ్జాలో దేవుడి భూములు.. పరాయి పంచన 100 ఎకరాలు!!..

గ్రామపెద్దల కారణంగా కోరుకొండ దేవస్థానానికి సంబంధించిన సుమారు 100.08 ఎకరాలు పరాయి వ్యక్తుల చేతుల్లోకి వెళ్లిపోయింది. నాలుగు మండలాల పరిధిలోని 11 గ్రామాల్లో సుమారు 40 మంది పేరుతో ఈ భూములు ఉన్నాయి. 2012, 2013లోనే ఇవి పరాయి పంచన ఉన్నట్లు దేవాదాయశాఖ అధికారులు గుర్తించారు. కానీ నేటికీ చర్యలు తీసుకోలేదు.

మోకాళ్ళ నొప్పులు ఎందుకు వస్తాయి?..HealthSwechaa22 Sep 2026, 07:40 AM

మోకాళ్ళ నొప్పులు ఎందుకు వస్తాయి?..

మోకాళ్ళ నొప్పి.. చాలామందిని తరచూ ఇబ్బంది పెట్టే సమస్య. కొన్నిసార్లు ఎక్కువసేపు నిలబడటం లేదా నడవడం వల్ల వస్తే.. మరికొన్ని సందర్భాల్లో శరీరంలో జరుగుతున్న ఇతర మార్పులకు ఇది సంకేతంగా ఉండొచ్చని వైద్యులు చెబుతున్నారు. నొప్పి తీవ్రత, వచ్చే సమయం, నొప్పితో పాటు కనిపించే ఇతర లక్షణాలను బట్టి కారణాన్ని గుర్తించవచ్చని చెబుతున్నారు.

సాధారణంగా ఎక్కువసేపు నడవడం, నిలబడటం, వ్యాయామం చేయడం లేదా ఒక్కసారిగా శారీరక శ్రమ పెంచడం వల్ల కాలి కండరాలపై ఒత్తిడి పెరిగి నొప్పి రావచ్చు. కండరాలు పట్టేయడం కూడా మరో కారణం. శరీరంలో నీరు తగ్గడం, ఎక్కువగా చెమట పట్టడం, ఎలక్ట్రోలైట్లలో మార్పులు, కండరాలపై అధిక శ్రమ వంటి కారణాలతో ముఖ్యంగా రాత్రివేళ కాలి పిక్కల్లో క్రాంప్స్ రావచ్చు.

Gadwal: సాగునీటి కోసం రోడ్డెక్కిన రైతులు.. జమ్మిచేడు వద్ద భారీ ధర్నా!..తెలంగాణSwechaa22 Sep 2026, 07:35 AM

Gadwal: సాగునీటి కోసం రోడ్డెక్కిన రైతులు.. జమ్మిచేడు వద్ద భారీ ధర్నా!..

సాగునీటి కోసం రైతులు రోడ్డెక్కారు.. చేతికొచ్చే దశలో ఉన్న వరి పంటను కాపాడుకునేందుకు గద్వాల నియోజకవర్గ రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. జూరాల–నెట్టెంపాడు ఆయకట్టు కింద సాగు చేసిన వరి పంటకు నీరు అందక ఎండిపోయే పరిస్థితి ఏర్పడిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.

నిన్న జమ్మిచేడు సమీపంలో గద్వాల–కర్నూలు ప్రధాన రహదారిపై రైతులు ధర్నాకు దిగారు. జూరాల ప్రాజెక్టు నుంచి కాలువలకు వెంటనే నీటిని విడుదల చేసి పంటలను కాపాడాలని డిమాండ్ చేశారు. దాదాపు ఐదు గంటల పాటు కొనసాగిన ఈ నిరసనతో రహదారిపై భారీగా ట్రాఫిక్ స్తంభించింది.

కళ్లు మసకబారుతున్నాయా? అయితే ఈ సమస్య కావచ్చు!..HealthSwechaa22 Sep 2026, 07:21 AM

కళ్లు మసకబారుతున్నాయా? అయితే ఈ సమస్య కావచ్చు!..

కళ్లు మసకగా కనిపించడం చాలామంది సాధారణ సమస్యగానే భావిస్తారు. కానీ తరచూ ఇలా జరుగుతుంటే నిర్లక్ష్యం చేయకూడదని వైద్యులు సూచిస్తున్నారు. కంటి చూపు పవర్ మారడం వల్ల దూరం లేదా దగ్గరలోని వస్తువులు స్పష్టంగా కనిపించకపోవచ్చు.. అలాగే వయసు పెరిగే కొద్దీ వచ్చే ప్రెస్బయోపియా వల్ల కూడా దగ్గర చూపు మసకబారవచ్చు. అలాగే కంప్యూటర్, మొబైల్ వంటి డిజిటల్ స్క్రీన్లను ఎక్కువసేపు చూడటం వల్ల కళ్లపై ఒత్తిడి పెరిగి డ్రై ఐ, కంటి మంట, అలసట, తాత్కాలికంగా మసక చూపు రావచ్చు. స్క్రీన్ చూస్తున్నప్పుడు రెప్పలు తక్కువగా కొట్టడం కూడా కంటి పొడిబారడానికి కారణమవుతుంది. మరో ముఖ్యమైన కారణం డయాబెటిస్. రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉన్నప్పుడు కంటి లెన్స్‌లో ద్రవ మార్పులు జరిగి తాత్కాలికంగా చూపు మసకబారవచ్చు.

మానవుడు మట్టి కుండతో సమానం అంటారు ఎందుకు?..SpiritualitySwechaa22 Sep 2026, 07:14 AM

మానవుడు మట్టి కుండతో సమానం అంటారు ఎందుకు?..

మనిషి జీవితం నీటిలో బుడగ వంటిది. శరీరం మట్టి కుండతో సమానం అని పోల్చుతారు.. వేదాంతపరమైన ఈ వ్యాఖ్యలు అంతసులువుగా అందరికీ అర్థం కావు. కానీ ఆథ్యాత్మిక పరంగా ఎంతో లోతైన అర్థాన్ని కలిగి ఉంటాయని మన పండితులు చెబుతారు. ఇక మట్టిని నీటితో కలిపి, ఆకారం ఇచ్చి, అగ్నిలో కాల్చితే కుండ తయారవుతుంది. మనిషి శరీరం కూడా ప్రకృతి అనే మహాశక్తి చేతిలో అలా రూపుదిద్దుకున్నదేనని మన సనాతన ధర్మం చెబుతుంది. ఉపనిషత్తులలో మానవ శరీరాన్ని పంచభూతాల సమాహారంగా వివరించారు. భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం... ఈ ఐదు తత్త్వాలే శరీర నిర్మాణానికి ఆధారమని గర్భోపనిషత్ వివరిస్తుంది. శరీరంలో గట్టిగా ఉన్నది భూమి తత్త్వం, ద్రవంగా ఉన్నది జల తత్త్వం, వేడిమి అగ్ని తత్త్వం, కదలిక వాయు తత్త్వం, ఖాళీ ప్రదేశాలు ఆకాశ తత్త్వానికి ప్రతిరూపాలని చెప్పబడింది.

సృష్టిలో ఏదీ సంపూర్ణం కాదు.. ఇదే సృష్టికర్త ఇచ్చిన గొప్ప సందేశం!SpiritualitySwechaa22 Sep 2026, 07:05 AM

సృష్టిలో ఏదీ సంపూర్ణం కాదు.. ఇదే సృష్టికర్త ఇచ్చిన గొప్ప సందేశం!

సృష్టిలో ప్రతి వరంతో పాటు ఒక చిన్న లోటు కూడా ఉంటుంది. చెరకుకు తీపి ఉంది.. కానీ పండు లేదు. బంగారానికి మెరుపుంది.. కానీ సువాసన లేదు. సూర్యుడికి వెలుగు ఉంది.. కానీ చల్లదనం లేదు. చంద్రుడికి చల్లదనం ఉంది.. కానీ సూర్యుడి తేజస్సు లేదు. ఇదే సృష్టికర్త మనిషికి చెప్పే గొప్ప సత్యం. ఈ లోకంలో ఏదీ సంపూర్ణం కాదు.. ప్రతి బలానికి ఒక పరిమితి ఉంటుంది. కాబట్టి మనిషి తన గొప్పతనాన్ని చూసి గర్వపడకుండా.. తన లోటును గుర్తించి వినయంగా జీవించాలి. లభించిన వరాలకు కృతజ్ఞత.. లోటులకు అంగీకారం.. ఇదే నిజమైన ఆధ్యాత్మిక పరిపక్వత.

శివారాధనలో మొగలి పువ్వు ఎందుకు నిషేధం?..SpiritualitySwechaa22 Sep 2026, 07:01 AM

శివారాధనలో మొగలి పువ్వు ఎందుకు నిషేధం?..

శివారాధనలో మొగలి పువ్వుకు ఎందుకు స్థానం లేదని చెబుతారు.. పురాణగాథ ప్రకారం.. బ్రహ్మ, విష్ణువుల మధ్య గొప్పతనంపై వివాదం వచ్చినప్పుడు, అనంతమైన అగ్నిస్తంభంగా శివుడు ప్రత్యక్షమయ్యాడు. విష్ణువు సత్యాన్ని అంగీకరించగా.. బ్రహ్మ అసత్యానికి మొగలి పువ్వును సాక్షిగా నిలబెట్టాడు. దీంతో శివుడు బ్రహ్మ అహంకారాన్ని, మొగలి పువ్వు అసత్యాన్ని తిరస్కరించాడు. అందుకే ఈ కథ మనకు చెప్పే సత్యం ఒక్కటే.. పూజలో పుష్పం కంటే పవిత్రమైనది మనసు. అలంకారం కంటే నిజాయితీ గొప్పది. అహంకారాన్ని విడిచి సత్యాన్ని ఆశ్రయించినప్పుడే శివతత్త్వానికి చేరువవుతాం.

ట్రంప్‌కు మీడియా షాక్.. CNNకు మద్దతుగా 5 టీవీ నెట్‌వర్క్‌ల సంచలన నిర్ణయం!InternationalSwechaa22 Sep 2026, 12:16 AM

ట్రంప్‌కు మీడియా షాక్.. CNNకు మద్దతుగా 5 టీవీ నెట్‌వర్క్‌ల సంచలన నిర్ణయం!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, మీడియా సంస్థల మధ్య వివాదం కీలక మలుపు తిరిగింది. వైట్‌హౌస్‌ నుంచి కొన్ని మీడియా సంస్థల జర్నలిస్టులకు ప్రవేశం నిరాకరించిన నేపథ్యంలో, CNNకు మద్దతుగా అమెరికాలోని ప్రధాన టెలివిజన్ నెట్‌వర్క్‌లు సంయుక్తంగా కీలక నిర్ణయం తీసుకున్నాయి.

పిల్లలపై లైంగిక నేరాల కంటెంట్‌కు చెక్.. భారత అధికారులకు నేరుగా రిపోర్ట్ చేయనున్న గూగుల్!NationalSwechaa21 Sep 2026, 11:47 PM

పిల్లలపై లైంగిక నేరాల కంటెంట్‌కు చెక్.. భారత అధికారులకు నేరుగా రిపోర్ట్ చేయనున్న గూగుల్!

ఆన్‌లైన్ ప్రపంచంలో పిల్లలపై లైంగిక వేధింపులకు సంబంధించిన కంటెంట్‌ వ్యాప్తిని అరికట్టేందుకు టెక్ దిగ్గజం గూగుల్ కీలక అడుగు వేయనుంది. ఇలాంటి కంటెంట్‌కు సంబంధించిన కేసుల్లో సమాచారాన్ని భారత అధికారులకు నేరుగా అందించే విధానాన్ని అమలు చేసే ప్రతిపాదనపై చర్చిస్తున్నట్లు గూగుల్ వెల్లడించింది.

Official-Fauzi: ప్రభాస్ ఫౌజీ పోస్ట్ పోన్..వెల్లడించిన నిర్మాత.!సినిమాSwechaa21 Sep 2026, 10:44 PM

Official-Fauzi: ప్రభాస్ ఫౌజీ పోస్ట్ పోన్..వెల్లడించిన నిర్మాత.!

Official: ఇటీవల మన పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న ఫౌజీ సినిమా విడుదల వాయిదా పడబోతుందని వార్తలు వచ్చాయి. ఇదే వార్తలు ఇంతకముందు పదే పదే వస్తుండటంతో నిర్మాతలలో ఒకరైన యలమంచిలి రవి స్పందించాడు. డిసెంబర్ 3న పాన్ ఇండియా వైడ్‌గా రిలీజ్ కన్‌ఫర్మ్ అని ఆయన ప్రకటించారు. కానీ, ఇప్పుడు ఇన్నిరోజుల నుంచి వస్తున్న వార్తలే నిజమయ్యాయి. ఇదే, నిర్మాత ఇప్పుడు ఫౌజీ కాస్త ఆలస్యం అవుతుందని రివీల్ చేశాడు.

Shopping Mall Opening: రూ.9లకే చీర.. ఎగబడ్డ జనాలు.. తోపులాటతెలంగాణSwechaa21 Sep 2026, 10:00 PM

Shopping Mall Opening: రూ.9లకే చీర.. ఎగబడ్డ జనాలు.. తోపులాట

Shopping Mall Opening: షాపింగ్ మాల్ నిర్వాహకులు ప్రకటించిన రూ.9 చీరల ఆఫర్ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ప్రారంభోత్సవ వేళ చీరల కోసం మహిళలు ఎగబడటంతో భారీ ఎత్తున తోపులాట చోటుచేసుకుంది. ఈ ఘటనలో పలువురు మహిళలు తీవ్రంగా గాయపడ్డారు.యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన 'గరుడ షాపింగ్ మాల్' ప్రారంభోత్సవ కార్యక్రమం సోమవారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి సినీ నటి మీనాక్షి చౌదరి ముఖ్య అతిథిగా హాజరై మాల్‌ను ప్రారంభించారు. హీరోయిన్ రాకతో పాటు, ఓపెనింగ్ సందర్భంగా కేవలం రూ.9లకే చీర అందిస్తున్నామంటూ నిర్వాహకులు బంపర్ ఆఫర్ ప్రకటించారు.

Ayodhya Ram Mandir: రామమందిరంలో 105 సార్లు చోరీ.. బట్టలు, జేబుల్లో దాచి ఎత్తుకెళ్లిన వైనందునియాSwechaa21 Sep 2026, 09:31 PM

Ayodhya Ram Mandir: రామమందిరంలో 105 సార్లు చోరీ.. బట్టలు, జేబుల్లో దాచి ఎత్తుకెళ్లిన వైనం

Ayodhya Ram Mandir: కోట్లాది మంది భక్తుల కొంగుబంగారమైన అయోధ్య రామాలయంలో కనీవినీ ఎరుగని మహాపరాధం వెలుగు చూసింది. భక్తులు భక్తిశ్రద్ధలతో రాముడికి సమర్పించుకున్న కానుకలను కాపాడాల్సిన చేతులే స్వాహా చేసిన ఘటన సంచలనం సృష్టిస్తుంది. అయోధ్య రామ మందిర విరాళాల చోరీ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు ఎదుట దిగ్భ్రాంతికర నిజాలను బయటపెట్టింది. మందిరంలో ఒకసారి, రెండుసార్లు కాదు.. ఏకంగా 105 సార్లు పక్కా ప్లాన్‌తో విరాళాలను కొల్లగొట్టారన్న సంచలన వాస్తవాన్ని సిట్ ఆధారాలతో సహా కోర్టుకు నివేదించింది.విరాళాల లెక్కింపు ప్రక్రియ కోసం నియమితులైన సిబ్బందే ఈ ఘరానా దోపిడీకి పాల్పడినట్లు దర్యాప్తులో తేలింది. హుండీ నగదును లెక్కించే సమయంలో ఎవరికీ అనుమానం రాకుండా సిబ్బంది తమ బట్టలు, జేబులు, చివరకు షూలలో సైతం కరెన్సీ నోట్లను దాచి గుట్టుచప్పుడు కాకుండా బయటకు తరలించినట్లు వెల్లడించారు. పవిత్రమైన ఆలయంలో విరాళాల లెక్కింపు పేరిట జరిగిన ఈ దోపిడీ విజువల్స్ అన్ని కూడా అక్కడున్న సీసీటీవీ కెమెరాల్లో స్పష్టంగా రికార్డయ్యాయని సిట్ సుప్రీంకోర్టు ధర్మాసనానికి తెలిపింది.

The Paradise-Censor: సెన్సార్ పూర్తి (A)..‘ది ప్యారడైజ్’ పెద్దలకు మాత్రమే..సినిమాSwechaa21 Sep 2026, 09:23 PM

The Paradise-Censor: సెన్సార్ పూర్తి (A)..‘ది ప్యారడైజ్’ పెద్దలకు మాత్రమే..

The Paradise: న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో తెరకెక్కింది ‘ది ప్యారడైజ్’. ఈ గురువారం (సెప్టెంబర్ 24) పాన్ ఇండియా వైడ్‌గా థియేటర్లలోకి రాబోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం, జోరుగా ప్రమోషన్స్ జరుగుతున్నాయి. ఇక, ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో తాజాగా సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఎ సర్టిఫికెట్‌తో ఈ సినిమా రిలీజ్ కాబోతోంది.