స్వేచ్ఛ షార్ట్స్ — తాజా తెలుగు వార్తలు

తాగునీటి వృథాపై జలమండలి సీరియస్.. వారికి జరిమానాలుతెలంగాణSwechaa21 Sep 2026, 09:11 PM

తాగునీటి వృథాపై జలమండలి సీరియస్.. వారికి జరిమానాలు

HMWSSB: హైదరాబాద్ నగరవాసులకు జలమండలి తీవ్రమైన హెచ్చరిక జారీ చేసింది. ఓవైపు గొంతు తడుపుకోవడానికి గుక్కెడు నీళ్లు దొరక్క శివార్లలో జనం అల్లాడుతుంటే, మరోవైపు తాగునీటితో కార్లు కడగడం, రోడ్లు, ఫ్లోర్లు క్లీన్ చేస్తూ నీటిని విచ్చలవిడిగా వృథా చేసేవారి ఆటలు ఇకపై సాగబోవని తేల్చి చెప్పింది. విలువైన తాగునీటిని వృథా చేస్తే భారీ ఎత్తున జరిమానాలు విధించడమే కాకుండా, రెండోసారి మిస్ యూజ్ చేస్తూ దొరికితే ఏకంగా తాగునీటి కనెక్షన్‌నే శాశ్వతంగా తొలగిస్తామని హెచ్చరిస్తూ సరికొత్త రూల్స్‌ను ప్రకటించింది.కేవలం మాటలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో జలమండలి ఆకస్మిక తనిఖీలను ముమ్మరం చేసింది. సోమవారం ఉదయం నీటి సరఫరా వేళ జూబ్లీహిల్స్ ప్రాంతంలో నిర్వహించిన దాడుల్లో తాగునీటిని వృథా చేస్తున్న ఐదుగురిని పట్టుకుని అక్కడికక్కడే భారీ జరిమానాలు విధించారు. ఇటీవల ఫ్లోర్ క్లీనింగ్ కోసం తాగునీటిని ఇష్టారాజ్యంగా వాడుతున్న ఓ మహిళకు ఏకంగా రూ.20,000 ఫైన్ వేసినట్లు అధికారులు వెల్లడించారు.

ప్రాణాలకు తెగించి నీటి కోసం రైతుల పోరాటంతెలంగాణSwechaa21 Sep 2026, 09:09 PM

ప్రాణాలకు తెగించి నీటి కోసం రైతుల పోరాటం

Jurala Water: ఎండిపోతున్న పంటలను కాపాడుకోవడానికి సాగునీటి కోసం రైతాంగం చేస్తున్న పోరాటం ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో తీవ్ర కలకలం రేపుతోంది. జూరాల ప్రాజెక్టు ఎడమ కాలువకు నీళ్లు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. అమరచింత మండల పరిధిలోని జూరాల ఎడమ కాలువ వద్దకు పోనివ్వకుండా రైతాంగాన్ని అడ్డుకునేందుకు అడుగడుగున భారీగా పోలీసులు మోహరించారు.

జూరాల ప్రాజెక్టు వద్దకు చేరుకున్న మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రాంమోహన్ రెడ్డిని పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో రైతులు, పోలీసుల మద్య తోపులాట జరిగింది. మక్తల్ మాజీ ఎమ్మెల్యేని పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు‌. రైతులపై లాఠీచార్జ్ జరపడం ఉద్రిక్తతలకు దారితీసింది.

KTR: 9 టీఎంసీలున్నా పంటలకు నీళ్లెందుకు వదలట్లేదు : కేటీఆర్తెలంగాణSwechaa21 Sep 2026, 08:42 PM

KTR: 9 టీఎంసీలున్నా పంటలకు నీళ్లెందుకు వదలట్లేదు : కేటీఆర్

KTR: జూరాల ప్రాజెక్టులో 9 టీఎంసీల నీళ్లు అందుబాటులో ఉన్నప్పటికీ, కళ్లముందే ఎండిపోతున్న పంటలకు సాగునీటిని ఎందుకు విడుదల చేయడం లేదని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రభుత్వాన్ని నిలదీశారు. పనికిరాని కుంటిసాకులతో రేవంత్ సర్కార్ పచ్చని పంటల ఉసురు తీస్తోందని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తాగునీటి అవసరాలకు కేవలం 2 టీఎంసీలు సరిపోతాయని తెలిసినా, మిగిలిన నీటిని ఆయకట్టుకు ఇవ్వకుండా రైతులను తీవ్ర సంక్షోభంలోకి నెట్టడం క్షమించరాని నేరమని మండిపడ్డారు.చేతికొచ్చిన పంటలు నాశనమవుతుంటే తట్టుకోలేక, గత్యంతరం లేని పరిస్థితుల్లో గేట్లు ఎత్తేందుకు ప్రయత్నించిన రైతులపై అక్రమ కేసులు బనాయించడం రేవంత్ ప్రభుత్వ రాక్షస పాలనకు నిదర్శనమని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల గోడు విని వారికి అండగా నిలవాల్సింది పోయి, కేసులు పెట్టి అరిగోస పెట్టడం దుర్మార్గమన్నారు.

Allu Arjun-Raaka-Making Video: రాకా మేకింగ్ వీడియో..ఈ దెబ్బతో శంకర్‌ని మించిపోనున్న అట్లీ!సినిమాSwechaa21 Sep 2026, 08:42 PM

Allu Arjun-Raaka-Making Video: రాకా మేకింగ్ వీడియో..ఈ దెబ్బతో శంకర్‌ని మించిపోనున్న అట్లీ!

Allu Arjun-Raaka: టెక్నాలజీ పెరిగిన తర్వాత సినిమాల పరంగా విజువల్ వండర్స్‌ను సృష్టిస్తున్నారు క్రియేటివ్ డైరెక్టర్. ఒకప్పుడు ఇలాంటి వండర్స్‌ని చూడాలంటే ఉన్న ఒకే ఒక్క ఆప్షన్ హాలీవుడ్ సినిమా. కానీ, శంకర్ ఆ తర్వాత ఎస్ ఎస్ రాజముళి లాంటి వారు వచ్చాక మన తెలుగు సినిమాలే హాలీవుడ్ స్థాయిలో రూపొందుతున్నాయి. టెక్నాలజీతో మన వాళ్ళు వండర్స్ క్రియెట్ చేస్తున్నారు.

కుప్పం అభివృద్దిపై సీఎం చంద్రబాబు స్పెషల్ ఫోకస్.. రూ.327 కోట్లతో ..ఏపీSwechaa21 Sep 2026, 08:33 PM

కుప్పం అభివృద్దిపై సీఎం చంద్రబాబు స్పెషల్ ఫోకస్.. రూ.327 కోట్లతో ..

Kuppam: నారావారిపల్లె తనకు జన్మనిస్తే… కుప్పం రాజకీయ జీవితాన్ని ఇచ్చిందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. కుప్పాన్ని మోడల్‌ నియోజకవర్గంగా, స్వర్ణ కుప్పంగా తీర్చిదిద్దేందుకు సమగ్ర ప్రణాళికతో ముందుకెళ్తున్నామని తెలిపారు. గడిచిన రెండేళ్లలో రెట్టింపు ఉత్సాహంతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని, కుప్పం నుంచే ఏ పని చేయాలన్నా నాంది పలుకుతామని చంద్రబాబు చెప్పారు.

హంద్రీనీవా కాలువ ద్వారా కుప్పానికి నీరు

కుప్పంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. రూ.327 కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాలకు భూమిపూజ, శంకుస్థాపనలు చేశారు. ఆ తర్వాత బహిరంగ సభలో మాట్లాడారు. హంద్రీనీవా కాలువ ద్వారా కుప్పానికి నీరు తీసుకువచ్చి 133 చెరువులను నింపగలిగామని చంద్రబాబు తెలిపారు. కుప్పం నియోజకవర్గంలోని 550కు పైగా చిన్న నీటిపారుదల చెరువులను లిఫ్ట్‌ ఇరిగేషన్‌, పైప్‌లైన్లతో అనుసంధానం చేయనున్నట్లు వెల్లడించారు. యామిగానిపల్లి, మనపల్లి ప్రాంతాల్లో రిజర్వాయర్లు ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నామని పేర్కొన్నారు.

Varanasi-Mahesh: అక్టోబర్ వరకు ప్యాకప్! మహేష్ నెక్స్ట్ సినిమాకి సైన్ చేయోచ్చా?సినిమాSwechaa21 Sep 2026, 07:59 PM

Varanasi-Mahesh: అక్టోబర్ వరకు ప్యాకప్! మహేష్ నెక్స్ట్ సినిమాకి సైన్ చేయోచ్చా?

Varanasi: సూపర్ స్టార్ మహేష్ బాబు కొత్త సినిమాను ప్రకటించవచ్చా? వారణాసి షూటింగ్‌కి త్వరలోనే ప్యాకప్ చెప్పేస్తున్నారా? ప్రస్తుతం ఇదే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దాదాపు టాకీపార్ట్ పూర్తి కావచ్చిందట. కొద్దిపాటి షూటింగ్ మినహా 85 శాతానికి పైగా షూట్ ఫినిష్ అయినట్టుగా తెలుస్తోంది. సెప్టెంబర్ వరకూ మహేష్ కి సంబందించిన షూట్ పూర్తి కానుండగా అక్టోబర్ చివరకికల్లా వారణాసి మొత్తం షూట్ కంప్లీట్ అవనుందని సమాచారం.

Cancer Awareness: భక్తి పేరుతో ఆరోగ్యాన్ని బలి చేస్తున్నామా! అగరబత్తి, దోమల కాయిల్స్‌తో క్యాన్సర్ వస్తుందా?తెలంగాణSwechaa21 Sep 2026, 07:30 PM

Cancer Awareness: భక్తి పేరుతో ఆరోగ్యాన్ని బలి చేస్తున్నామా! అగరబత్తి, దోమల కాయిల్స్‌తో క్యాన్సర్ వస్తుందా?

Cancer Awareness: చాలా మంది వారి పూజ గదిల్లో దేవుడి ఫోటోల ముందు అగరబత్తి వెలిగించని మొక్కులు చెల్లించుకోవడం సాధారణంగా మనం చూస్తుంటాం. సువాసనల కోసం, పవిత్రత కోసం నిత్యం ధూపం వేయడం ఎప్పటి నుంచో వస్తున్న మన సంప్రదాయం. మరోవైపు రాత్రిపూట దోమల బెడద నుంచి తప్పించుకోవడానికి దోమల కాయిల్స్ వెలిగించి నిద్రపోవడం కూడా కామన్. అయితే ఈ పొగను పీల్చడం వల్ల ప్రాణాంతక క్యాన్సర్ వస్తుందా? సిగరెట్ కంటే ఈ పొగే అత్యంత ప్రమాదకరమా? అనే భయాందోళనలు సోషల్ మీడియా వేదికగా నిత్యం కలకలం రేపుతూనే ఉన్నాయి. అసలు ఈ ప్రచారంలో నిజమెంత? వైద్య నిపుణులు, శాస్త్రీయ పరిశోధనలు ఏం చెబుతున్నాయి..అగరబత్తులు, దోమల కాయిల్స్ కాలినప్పుడు కేవలం సువాసన మాత్రమే వెలువడదు. వాటి నుంచి అతి సూక్ష్మ కణాలు, వాలటైల్ ఆర్గానిక్ కాంపౌండ్స్, పాలీసైక్లిక్ ఆరోమాటిక్ హైడ్రోకార్బన్స్ వంటి ప్రమాదకర రసాయనాలు గాలిలోకి రిలీజ్ అవుతాయి. ఈ కణాలు గాలిలో ఎక్కువసేపు తేలియాడుతూ ఉండటం వల్ల శ్వాస ద్వారా మన ఊపిరితిత్తుల్లోకి చేరతాయి.

ఇప్పుడే జూరాల నీరు వదిలేస్తే.. వేసవిలో తాగేందుకు కూడా నీళ్లు దొరకవుతెలంగాణSwechaa21 Sep 2026, 07:06 PM

ఇప్పుడే జూరాల నీరు వదిలేస్తే.. వేసవిలో తాగేందుకు కూడా నీళ్లు దొరకవు

Jurala Water: జూరాలలో నీటి ఎద్దడిపై రాష్ట్ర పర్యాటక, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు స్పందించారు. జూరాలలో నీటి ఎద్దడి వాస్తవమే అని చెప్పారు. ఎగువ నుంచి నీటి ప్రవాహం లేకపోవడమే ఇందుకు కారణం అని వివరించారు. నీటి విడుదలకు కర్నాటక సీఎంతో మాట్లాడామని, ఆల్మట్టి నుంచి ఇవ్వాలని కోరామన్నారు. జూరాల నీటి విషయంలో బీఆర్ఎస్ కావాలనే రైతులను రెచ్చగొడుతోందని మంత్రి జూపల్లి ఆరోపించారు. కృష్ణా జలాలను తెలంగాణ కంటే ఏపీ ఎక్కువ వాడుకుంటోందని బీఆర్ఎస్ అబద్దాలు చెబుతోందని మండిపడ్డారు.

వేసవిలో తాగునీటికి ఎలా కేటీఆర్?

పదేళ్ల పాలనలో పాలమూరు రైతుల కోసం ఎందుకు ఒక్క రిజర్వాయర్ కూడా కట్టలేదని బీఆర్ఎస్ నాయకులను ఆయన ప్రశ్నించారు. తాము ప్రతి నీటి బొట్టును ఒడిసి పట్టుకునేందుకు చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. కేటీఆర్ డిమాండ్ చేస్తున్నట్లు ఇప్పుడు జూరాల నుంచి నీటిని విడుదల చేస్తే వచ్చే వేసవిలో తాగేందుకు కూడా నీళ్లు దొరకవని మంత్రి జూపల్లి హెచ్చరించారు.

Raaka-Guinness World Record: రిలీజ్ కి ముందే గిన్నిస్ వరల్డ్ రికార్డ్..ఐకాన్ స్టార్ రేంజ్ ఇదిసినిమాSwechaa21 Sep 2026, 06:57 PM

Raaka-Guinness World Record: రిలీజ్ కి ముందే గిన్నిస్ వరల్డ్ రికార్డ్..ఐకాన్ స్టార్ రేంజ్ ఇది

Raaka: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న భారీ బడ్జెట్ మూవీ ‘రాకా’. సన్ పిక్చర్స్ దాదాపు 750 కోట్ల బడ్జెట్‌తో నిర్మిస్తోంది. అయితే, భారతీయ సినిమా చరిత్రలోనే ఇప్పటివరకూ ఎక్కడా లేని విధంగా ప్రపంచ రికార్డును సాధించడం తెలుగు సినిమా పరిశ్రమకే గర్వకారణం. విఎఫెక్స్ రంగంలో అడ్వాన్స్డ్ మోషన్ క్యాప్చర్ టెక్నాలజీ ద్వారా ఏకంగా 37 మంది పర్‌ఫార్మర్లను ఒకేసారి రియల్ టైమ్‌లో క్యాప్చర్ చేసి ఈ సినిమా బృందం సరికొత్త రికార్డుని సాధించింది.

కాంగ్రెస్ ట్రాప్‌లో పడుతున్న బీఆర్ఎస్‌.. ఇమేజ్ డ్యామేజ్ తప్పదా..?తెలంగాణSwechaa21 Sep 2026, 06:50 PM

కాంగ్రెస్ ట్రాప్‌లో పడుతున్న బీఆర్ఎస్‌.. ఇమేజ్ డ్యామేజ్ తప్పదా..?

TG: తెలంగాణ రాజకీయాల్లో ప్రధాన ప్రతిపక్షంగా దూకుడు ప్రదర్శించాల్సిన బీఆర్‌ఎస్ వ్యూహాత్మకంగా కాంగ్రెస్ విసిరిన ట్రాప్‌లో చిక్కుకుపోయిందా? అసెంబ్లీ వేదికగా ప్రజా సమస్యలపై సర్కార్‌ను ఇరుకున పెట్టాలని భావించిన గులాబీ నేతలు.. ఇప్పుడు అధికార పార్టీ సంధించిన భూ ఆరోపణల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతున్నారా? అంటే రాజకీయ విశ్లేషకుల నుంచి అవుననే సమాధానమే వినిపిస్తోంది. ప్రజాక్షేత్రంలో లేవనెత్తాల్సిన కీలక అంశాలను పక్కనపెట్టి, తమ ఆస్తులను కాపాడుకోవడానికి, భూ ఆరోపణలను సమర్థించుకోవడానికే సమయం కేటాయిస్తుండటంతో ప్రజాక్షేత్రంలో బీఆర్‌ఎస్ గ్రాఫ్ మరింత పడిపోతోందన్న విశ్లేషణలు తెరపైకి వస్తున్నాయి.వాస్తవానికి అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారిన 22ఏ భూముల సమస్యతో పాటు పాలిటెక్నిక్ విద్యార్థుల ఇబ్బందులపై ప్రభుత్వాన్ని నిలదీయాలని బీఆర్‌ఎస్ పక్కా ప్లాన్ చేసింది. కానీ క్షేత్రస్థాయికి వచ్చేసరికి మాత్రం సీన్ రివర్స్ అయింది. గులాబీ పార్టీ ముఖ్య నేతలను లక్ష్యంగా చేసుకుని అధికార పక్షం సంధించిన భూ ఆరోపణలు బీఆర్ఎస్ శిబిరాన్ని పూర్తిగా ఆత్మరక్షణలో పడేశాయి.

Roshan Meka: అక్టోబర్ 30న ‘ఏమో ఏమో ఇది’..సినిమాSwechaa21 Sep 2026, 06:36 PM

Roshan Meka: అక్టోబర్ 30న ‘ఏమో ఏమో ఇది’..

Roshan Meka: సీనియర్ నటుడు శ్రీకాంత్ తనయుడు యంగ్ హీరో రోషన్ మేక, యంగ్ బ్యూటీ ప్రీతి ముకుందన్ జంటగా నటిస్తున్న లేటెస్ట్ రొమాంటిక్ మూవీ ‘ఏమో ఏమో ఇది’. ఈ సినిమాను దర్శకుడు శైలేష్ కొలను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇక, ఈ యూత్‌ఫుల్ లవ్ ఎంటర్‌టైనర్‌కు సంబంధించిన విడుదల తేదీపై చిత్ర బృందం నుంచి సాలిడ్ అప్డేట్ వచ్చింది.

Danam Nagender: దానం నాగేందర్‌ కేసు సుప్రీంలో వాయిదా.. అనర్హత వేట తప్పదా?తెలంగాణSwechaa21 Sep 2026, 05:30 PM

Danam Nagender: దానం నాగేందర్‌ కేసు సుప్రీంలో వాయిదా.. అనర్హత వేట తప్పదా?

Danam Nagender: తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అనర్హత వ్యవహారం ఇప్పుడు సర్వోన్నత న్యాయస్థానంలో తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. పార్టీ ఫిరాయింపుల చట్టం కింద తనపై అనర్హత వేటు వేస్తూ హైకోర్టు ఇచ్చిన చరిత్రాత్మక తీర్పుపై స్టే కోరుతూ ఆయన సుప్రీంకోర్టు తలుపు తట్టారు. అయితే తక్షణ ఉపశమనం కోసం ఆయన చేసిన ప్రయత్నాలకు అత్యున్నత న్యాయస్థానంలో ఎదురుదెబ్బ తగిలింది. ఈ పిటిషన్‌ను వెంటనే అత్యవసరంగా విచారించాలన్న విజ్ఞప్తిని పక్కనపెట్టిన ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) ధర్మాసనం, తదుపరి విచారణను బుధవారానికి వాయిదా వేసింది.దానం నాగేందర్ తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి సుప్రీంకోర్టులో వాదనలు వినిపిస్తూ కేసు తీవ్రతను వివరించారు. స్పీకర్ తిరస్కరించిన పిటిషన్‌ను పరిగణనలోకి తీసుకుని హైకోర్టు నేరుగా అనర్హత వేటు వేయడం నిబంధనలకు విరుద్ధమని వాదించారు. ఈ వ్యవహారంలో సుప్రీంకోర్టు తక్షణమే జోక్యం చేసుకుని స్టే ఇవ్వకపోతే ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానం ఖాళీ అయి, ఉప ఎన్నిక వచ్చే ప్రమాదం పొంచి ఉందని అత్యవసర విచారణను కోరారు.

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు శుభవార్త.. నిబంధనల సడలింపుతెలంగాణSwechaa21 Sep 2026, 05:23 PM

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు శుభవార్త.. నిబంధనల సడలింపు

Indiramma Illu: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ప్రజాప్రతినిధుల విజ్ఞప్తులతో నిర్మాణంలో ఉన్న ఇళ్లకు నిబంధనలు సడలించింది. ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలులో లబ్ధిదారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తొలగించి, నిర్మాణంలో ఉన్న ఇళ్లకు నిధులు అందేలా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.

ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ప్రజాప్రతినిధుల నుంచి వచ్చిన అనేక విజ్ఞప్తులను ముఖ్యమంత్రి రేవంత్ సూచనల మేరకు సానుకూలంగా పరిగణనలోకి తీసుకుని, ఇప్పటికే నిర్మాణం ప్రారంభించిన లబ్ధిదారులకు ఇబ్బంది కలగకుండా నిబంధనలను సడలిస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు మంత్రి పొంగులేటి వెల్లడించారు. ఇందిరమ్మ ఇళ్ల పోర్టల్‌లో ఇప్పటికే మంజూరై బేస్‌మెంట్ లేదా అంతకంటే పై స్థాయికి చేరుకున్న ఇళ్లకు L3 నుంచి L1 కేసులకు ఒకేసారి ప్రత్యేక అనుమతి (వన్ టైమ్ క్లియరెన్స్) ఇస్తూ నిధుల విడుదలకు ప్రభుత్వం అనుమతించిందని తెలిపారు.

January-12-Vidudala: కృతి శెట్టి ‘ఫస్ట్-లుక్’ పోస్టర్‌ విడుదలసినిమాSwechaa21 Sep 2026, 05:11 PM

January-12-Vidudala: కృతి శెట్టి ‘ఫస్ట్-లుక్’ పోస్టర్‌ విడుదల

January-12-Vidudala: విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్‌రామ్ హీరోలుగా రూపొందుతోన్న మల్టీస్టారర్ మూవీ ‘జనవరి 12 విడుదల’. హిట్ మెషిన్ అనిల్ రావిపూడి తెరక్కిస్తున్న సినిమాలో కీర్తి సురేష్, కృతి శెట్టి హీరోయిన్స్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ఈరోజు(21.09.2026) కృతి శెట్టి పుట్టినరోజు. ఈ సందర్భంగా, ‘జనవరి 12 విడుదల’ చిత్ర బృందం ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతూ ఒక ప్రత్యేకమైన సర్ప్రైజ్ ఇచ్చింది.

అదనపు కలెక్టర్ కాళ్లు మొక్కిన రైతులు.. సాగునీటి విడుదల కోసం వేడుకోలుతెలంగాణSwechaa21 Sep 2026, 05:00 PM

అదనపు కలెక్టర్ కాళ్లు మొక్కిన రైతులు.. సాగునీటి విడుదల కోసం వేడుకోలు

Gadwal Farmers: జోగులాంబ గద్వాల జిల్లాలో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. సాగునీటి కోసం మహిళా రైతులు అదనపు కలెక్టర్ కాళ్లు మొక్కారు. జూరాల నుంచి సాగునీటిని విడుదల చేయాలంటూ అదనపు కలెక్టర్ కాళ్లు పట్టుకుని ప్రాధేయపడ్డారు.

జోగులాంబ గద్వాల జిల్లాలో సాగునీటి కోసం రైతులు రోడ్డెక్కారు. కర్నూలు-గద్వాల రహదారిపై బైఠాయించారు. జూరాల కుడి కాలువ మీద ఆధారపడి సాగు చేసుకుంటున్న రైతులకు నీటిని విడుదల చేయాలని వారు ఆందోళనకు దిగారు. దాదాపు 5 గంటలుగా గద్వాల రహదారిపై నిరసన చేపట్టారు. పెద్దఎత్తున రైతులు రోడ్డెక్కడంతో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. 10 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.

AI: 2030 నాటికి ఏఐ మనుషులను చంపేస్తుందా..?దునియాSwechaa21 Sep 2026, 04:32 PM

AI: 2030 నాటికి ఏఐ మనుషులను చంపేస్తుందా..?

AI: ప్రస్తుతం ప్రపంచాన్ని శాసిస్తున్న సరికొత్త మాయాజాలం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ). పనులను సులభతరం చేసే సాధనంగా మొదలైన ఈ సాంకేతికత, ఇప్పుడు మానవాళి ఉనికినే ప్రశ్నార్థకంగా మార్చే స్థాయికి దూసుకెళ్తోంది. అత్యంత అధునాతనమైన ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ (AGI) 2030 నాటికి పూర్తిస్థాయిలో రూపుదిద్దుకుంటుందని, అది మానవ మనుగడను శాశ్వతంగా తుడిచిపెట్టే ప్రమాదం ఉందని స్వయంగా టెక్ దిగ్గజం గూగుల్ డీప్‌మైండ్ పరిశోధకులు వేసిన అంచనా ప్రస్తుతం ప్రపంచాన్ని తీవ్ర భయాందోళనలకు గురిచేస్తోంది. ఏఐ కూడా తన సిస్టమ్స్ సొంతంగా నిర్ణయాలు తీసుకుంటున్నాయని ప్రకటించిన వేళ, గూగుల్ డీప్‌మైండ్ హెచ్చరికలు మరోసారి వైరల్ అవుతున్నాయిఇప్పటి వరకు మనం చూస్తున్న ఏఐ కేవలం నిర్దిష్ట టాస్కులకు మాత్రమే పరిమితం. కానీ ఏజిఐ (AGI) అలా కాదు. మనుషుల కంటే వేగంగా విభిన్న రంగాల్లోని జ్ఞానాన్ని అర్థం చేసుకోవడం, నేర్చుకోవడం, దాన్ని స్వతంత్రంగా అమలు చేయడం దీని ప్రత్యేకత.

ఇసుక అక్రమ రవాణపై కఠిన చర్యలకు ఆదేశాలు..తెలంగాణSwechaa21 Sep 2026, 03:52 PM

ఇసుక అక్రమ రవాణపై కఠిన చర్యలకు ఆదేశాలు..

Sanjay Jaju: సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు సోమవారం బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో గనులు, భూగర్భ వనరుల శాఖపై ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. శాఖ పనితీరు, పరిపాలన అంశాలు, ఆదాయ సమీకరణ, సిబ్బంది నియామకాలు, పదోన్నతులు తదితర అంశాలపై సీఎస్ సమగ్రంగా సమీక్షించారు. శాఖ పరిధిలోని ఖనిజ వనరుల సమర్థవంతమైన వినియోగం ద్వారా ప్రభుత్వ ఆదాయాన్ని పెంచేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

ఇసుక అక్రమ రవాణ, తవ్వకాలపై కఠిన చర్యలు

శాఖలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ, ఉద్యోగుల పదోన్నతులకు సంబంధించిన ప్రక్రియను నిబంధనల మేరకు వేగవంతం చేయాలని సూచించారు. సిబ్బంది కొరత కారణంగా శాఖ కార్యకలాపాలకు ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఇసుక అక్రమ రవాణా, అక్రమ తవ్వకాలు, అనధికారికంగా ఖనిజాల తరలింపును అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని సీఎస్ ఆదేశించారు. అక్రమ కార్యకలాపాలు జరిగే ప్రాంతాలను గుర్తించి నిరంతరం తనిఖీలు నిర్వహించాలని, విజిలెన్స్ బృందాలతో ఆకస్మిక తనిఖీలు, దాడులు చేపట్టి అక్రమ రవాణకు అడ్డుకట్ట వేయాలన్నారు.

Ramya Rao: ఛార్జీలకు డబ్బులేని సంతోష్ రావుకు వేల కోట్లు ఎక్కడివి : రమ్యారావుతెలంగాణSwechaa21 Sep 2026, 03:47 PM

Ramya Rao: ఛార్జీలకు డబ్బులేని సంతోష్ రావుకు వేల కోట్లు ఎక్కడివి : రమ్యారావు

బీఆర్‌ఎస్ కీలక నేత, మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ రావు ఆస్తుల వ్యవహారంపై తాజాగా కల్వకుంట్ల రమ్యా రావు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. రమ్యా రావు కామెంట్స్ ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతోంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో అడుగుపెట్టేందుకు కనీసం బస్సు ఛార్జీలకూ దిక్కులేని వ్యక్తి.. ఇప్పుడు నగరంలో అత్యంత ఖరీదైన ప్రాంతంలో వేల కోట్ల విలువ చేసే కమర్షియల్ కాంప్లెక్స్‌లు ఎలా నిర్మించారంటూ నేరుగా ప్రశ్నలు కురిపించారు.

జూరాల జలాలు తెలంగాణ రైతులకే చెందాలితెలంగాణSwechaa21 Sep 2026, 03:38 PM

జూరాల జలాలు తెలంగాణ రైతులకే చెందాలి

Jurala Water: తెలంగాణ రైతులను ఆగం చేయొద్దని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి రేవంత్ సర్కార్ కు విజ్ఞప్తి చేశారు. జూరాల జలాలు తెలంగాణ రైతులకే చెందాలని ఆయన డిమాండ్ చేశారు. తాగునీటికి 2 టీఎంసీలు పోను.. మిగతా నీటిని సాగుకు కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరారు. కాగా, జూరాల ప్రాజెక్ట్ దగ్గర ధర్నాకు వెళ్లకుండా మాజీమంత్రి నిరంజన్‌ రెడ్డిని పోలీసులు వనపర్తిలో గృహ నిర్బంధం చేశారు.

జూరాల ప్రాజెక్టులో నీటి లభ్యత ఉన్నప్పటికీ పాలమూరు రైతులకు సాగునీరు అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ఆరోపించారు. జూరాల ముట్టడికి వెళ్లకుండా తనను వ్యవసాయ క్షేత్రంలోనే పోలీసులు నిర్బంధించారని, అక్కడి నుంచి వనపర్తిలోని తన నివాసానికి తరలించి గృహ నిర్బంధం చేశారని తెలిపారు. రైతు సమస్యలపై పోరాడుతున్న నాయకులను అరెస్ట్ చేయడం సరికాదన్నారు.

‘ఓడినా సంబురాలా..?’ పాక్ క్రికెట్ జట్టుపై వసీం అక్రమ్ ఫైర్!క్రీడలుSwechaa21 Sep 2026, 03:21 PM

‘ఓడినా సంబురాలా..?’ పాక్ క్రికెట్ జట్టుపై వసీం అక్రమ్ ఫైర్!

 ఇంగ్లండ్‌ పర్యటనలో టెస్టు సిరీస్‌ను 3-0 తేడాతో అత్యంత ఘోరంగా ఓడిపోయిన పాకిస్థాన్ క్రికెట్ జట్టు తీరుపై, అభిమానుల వైఖరిపై ఆ దేశ దిగ్గజ ఫాస్ట్ బౌలర్ వసీం అక్రమ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. వైఫల్యాలను మర్చిపోయి సగటు వ్యక్తిగత ప్రదర్శనలను గొప్పగా వేడుక చేసుకోవడం ఆటగాళ్లలోని, అభిమానులలోని నిరాశాజనకమైన మనస్తత్వానికి అద్దం పడుతోందని ఆయన ఘాటుగా విమర్శించాడు. సిరీస్ ఓడిపోయినప్పుడు సిగ్గుతో ముఖం దాచుకోవాలి తప్ప విమానాశ్రయాల్లో సంబరాలు చేసుకోకూడదని తీవ్ర చురకలంటించాడు.

తప్పులుంటే  సరిచేయాలి..చిన్నవాటికే నోటీసులిస్తారా? : సీపీఐ  నారాయణతెలంగాణSwechaa21 Sep 2026, 03:18 PM

తప్పులుంటే సరిచేయాలి..చిన్నవాటికే నోటీసులిస్తారా? : సీపీఐ నారాయణ

దేశవ్యాప్తంగా జరుగుతున్న ఓటరు జాబితా సమగ్ర సవరణ(ఎస్ఐఆర్) ప్రక్రియపై తీవ్రవిమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఓటరు జాబితాలో పేరు ఉన్నప్పటికీ చిన్న చిన్న తప్పుల కారణంగా కేంద్ర ఎన్నికల సంఘం నోటీసులు ఇవ్వడాన్ని తాజాగా సీపీఐ జాతీయ కంట్రోల్ కమిషన్ చైర్మన్ డాక్టర్ కె నారాయణ తప్పుబట్టారు.ఓటరు జాబితాలో పేరు లేని వారి ఓట్లు డిలీజ్ చేయడంతో పాటు ఓటు ఉన్నవారికి మిస్టేక్స్ పేరిట నోటీసులు ఇచ్చి వేధించడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎద్దు ఈనిందంటే దూడను కట్టేయమన్న చందంగా ఎన్నికల సంఘం తీరు ఉందని సెటైర్లు వేశారు. ఓటర్ల హక్కులను కాపాడేలా ఈసీ పనిచేయడం లేదన్నారు. ఓటర్లను అవమానించేలా ఈసీ చర్యలు ఉన్నాయని మండిపడ్డారు. ఎస్ఐఆర్ పేరుతో ఎన్నికల సంఘం చేస్తున్న వింత, వికృత చర్యలు ప్రజల్లో అనేక అనుమానాలు కలిగిస్తున్నాయని పేర్కొన్నారు.

లైసెన్స్ సెక్షన్‌లో నగదు లెక్కలు.. బండ్లగూడ ఆర్టీవో కార్యాలయంలో అక్రమ వసూళ్ల దందా!..తెలంగాణSwechaa21 Sep 2026, 03:16 PM

లైసెన్స్ సెక్షన్‌లో నగదు లెక్కలు.. బండ్లగూడ ఆర్టీవో కార్యాలయంలో అక్రమ వసూళ్ల దందా!..

ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి ఆరోపణలు రోజురోజుకూ పెరుగుతున్న వేళ.. హైదరాబాద్ బండ్లగూడ ఆర్టీవో కార్యాలయం మరోసారి వార్తల్లోకి వచ్చింది. లైసెన్స్ జారీ సెక్షన్‌లో కానిస్టేబుల్ అరుణ్ పెద్ద మొత్తంలో 500 రూపాయల నోట్లను లెక్కిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరోవైపు, డాక్యుమెంట్లు సరిగా ఉన్నా సామాన్యులను తిప్పుతున్నారని.. మధ్యవర్తుల ద్వారా వెళ్తే పనులు వేగంగా పూర్తవుతున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. వైరల్ వీడియోలోని నగదు ఎవరిది? ఎక్కడి నుంచి వచ్చింది? ఆరోపణల్లో నిజమెంత? సమగ్ర విచారణతోనే అసలు విషయం తేలాల్సి ఉంది.

చిత్రం లేదు
వైరల్ న్యూస్Swechaa21 Sep 2026, 03:00 PM

జంటపై ఓ గుంపు అమానుషం.. వేధింపులు, కిడ్నాప్‌నకు యత్నం!

బిహార్‌లో ఓ దారుణ ఘటన వెలుగుచూసింది. ఓ యువతి పట్ల కొందరు దుండగులు చాలా అమానుషంగా ప్రవర్తించారు. ఏకాంతంగా గడిపేందుకు ఓ జంట నిర్మానుష్య ప్రాంతానికి వెళ్లగా వారిని గమనించిన ఓ గుంపు వెంటాడి వేధింపులకు గురిచేసింది. ఓ వైపు అబ్బాయిని పట్టుకుని వేధించడంతో పాటు యువతిని సైతం అసభ్యంగా తాకుతూ రాక్షస ఆనందాన్ని పొందారు.ఈ ఉదంతాన్ని ఆ గుంపులోని ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయగా ప్రస్తుతం వైరల్ అవుతోంది.ఈ ఘటన బిహార్‌లోని జమూయిలో చోటుచేసుకోగా ఆలస్యంగా వెలుగుచూసింది. నిర్మానుష్య ప్రాంతంలో ఏకాంతంగా ఉన్న జంటను టార్గెట్ చేసిన కొందరు దుండగులు.. వారిపై మూకుమ్మడిగా దాడికి పాల్పడ్డారు.యువతి పట్ల అత్యంత అమానుషంగా ఘోరంగా ప్రవర్తించారు.యువతిని అసభ్యకరంగా తాకుతూ తీవ్ర వేధింపులకు గురి చేశారు.ఓ వ్యక్తి ఆమె ప్రైవేట్ పార్ట్స్ తాకుతూ ఎత్తుకుని వెళ్లేందుకు ప్రయత్నించాడు. చివరికి కాళ్లావేళ్లా పడితే అప్పుడు ఆ ప్రేమజంటను దుండగులు వదిలేసినట్టు తెలిసింది.

AirFareHike: విమాన ప్రయాణ చార్జీలకు రెక్కలు.. కొన్ని రూట్లలో 300శాతం వరకు పెంపు!NationalSwechaa21 Sep 2026, 02:54 PM

AirFareHike: విమాన ప్రయాణ చార్జీలకు రెక్కలు.. కొన్ని రూట్లలో 300శాతం వరకు పెంపు!

 దీపావళి పండగ సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి సొంతూళ్లకు వెళ్లాలనుకుంటున్న విమాన ప్రయాణికులకు ఏవియేషన్ సంస్థలు గట్టి షాక్ ఇస్తున్నాయి. అధిక పండగ డిమాండ్, విమాన ఇంధన (ATF) ధరలు విపరీతంగా పెరగడంతో దేశీయ, అంతర్జాతీయ విమాన ప్రయాణ చార్జీలు ఆకాశాన్నంటాయి. ప్రధాన నగరాల మధ్య సర్వీసుల్లో గతంతో పోలిస్తే టికెట్ ధరలు రెట్టింపు కంటే అధికంగా నమోదు కావడంతో పండగ ప్రయాణం సామాన్యులకు తీవ్ర భారంగా మారింది.

కృష్ణా జలాలు కుప్పంకు.. పాలమూరును ఎండబెడతారా : హరీశ్ రావుతెలంగాణSwechaa21 Sep 2026, 02:43 PM

కృష్ణా జలాలు కుప్పంకు.. పాలమూరును ఎండబెడతారా : హరీశ్ రావు

Harish Rao: కృష్ణా జలాల తరలింపు, ఉమ్మడి మహబూబ్‌నగర్ రైతాంగం కష్టాలపై కాంగ్రెస్ సర్కార్‌పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు. శ్రీశైలం నుంచి వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌లోని కుప్పం వరకు కృష్ణా జలాలు నిరాటంకంగా తరలిపోతుంటే, కళ్లముందే ఉన్న పాలమూరు నేలలకు మాత్రం చుక్క నీరు ఇవ్వలేని దుస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని మండిపడ్డారు. ఇది పాలకుల చేతగానితనానికి నిదర్శనమని, స్వయంగా ‘పాలమూరు బిడ్డ’ అని చెప్పుకునే సీఎం రేవంత్ రెడ్డి స్థానిక రైతులకు చేస్తున్న తీరని నమ్మకద్రోహమని విమర్శించారు.జూరాల ఆయకట్టు పరిధిలో ఎండిపోతున్న పంటలను కాపాడాలని, వెంటనే సాగునీరు విడుదల చేయాలని ప్రజాస్వామ్యబద్ధంగా ఆందోళన బాట పట్టిన అన్నదాతలను, వారికి మద్దతుగా నిలిచిన బీఆర్‌ఎస్ నాయకులను అక్రమంగా నిర్బంధించడాన్ని హరీశ్ రావు తీవ్రంగా తప్పుబట్టారు. మాజీ మంత్రులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, డాక్టర్ లక్ష్మారెడ్డి, వి.శ్రీనివాస్ గౌడ్, మాజీ శాసనసభ్యులు చిట్టెం రామ్మోహన్ రెడ్డి, ఆల వెంకటేశ్వర్ రెడ్డి తదితరులను అరెస్ట్ చేయడం ప్రభుత్వ నిరంకుశ వైఖరికి అద్దం పడుతోందన్నారు. నీళ్లు అడిగిన రైతన్నల చేతులకు సంకెళ్లు వేయడం, ప్రాజెక్టుల వద్ద ఖాకీ బలగాలను మోహరించి భయానక వాతావరణం సృష్టించడం సిగ్గుచేటని అన్నారు.

పోలీసు దిగ్భంధంలో మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి ఫాంహౌస్!తెలంగాణSwechaa21 Sep 2026, 02:39 PM

పోలీసు దిగ్భంధంలో మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి ఫాంహౌస్!

తెలంగాణ రాజకీయాలు ఊహించని మలుపు తీసుకున్నాయి. ధరణి మాటున గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ నేతలు అడ్డగోలుగా భూములు దోచుకున్నారని అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించిన విషయం తెలిసిందే.దీనికి తోడు మాజీ సీఎం కేసీఆర్ ఎర్రవల్లి ఫాంహౌస్ భూములపై సర్వే చేసి ప్రభుత్వ భూముల లెక్క తేల్చాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం ఎర్రవల్లిలో కేసీఆర్ వ్యవసాయ క్షేత్రం పరిసరాల్లో భూముల సర్వే కొనసాగుతోంది. అయితే, మరో బీఆర్ఎస్ మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి ఫాంహౌస్ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. గత రెండు రోజులుగా వందలాది మంది పోలీసులు జగదీష్ రెడ్డి వ్యవసాయ క్షేత్రం బయట మోహరించి దిగ్బంధనం చేసినట్టు సమాచారం.ఎలాంటి సమాచారం ఇవ్వకుండా పోలీసులను పంపి ప్రభుత్వ యంత్రాంగాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం దుర్వినియోగం చేస్తున్నదని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. మాజీ మంత్రి ఫాంహౌస్ వద్ద పోలీసులు భారీగా ఎందుకు మోహరించారని ప్రశ్నిస్తే సరైన సమాధానం కూడా లేదని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు.

సిమ్‌కార్డుల విషయంలో కేంద్రం వార్నింగ్.. నిందితులకు మూడేళ్ల జైలు, భారీ జరిమానా!NationalSwechaa21 Sep 2026, 02:22 PM

సిమ్‌కార్డుల విషయంలో కేంద్రం వార్నింగ్.. నిందితులకు మూడేళ్ల జైలు, భారీ జరిమానా!

 ఇతరుల గుర్తింపు పత్రాలను వారి ప్రమేయం లేకుండా దుర్వినియోగం చేస్తూ సిమ్ కార్డులు పొందడం, ఐఎంఈఐ (IMEI) నంబర్లను అక్రమంగా మార్చడంపై కేంద్ర టెలికమ్యూనికేషన్ల శాఖ (DoT) అత్యంత కఠినమైన హెచ్చరికలు జారీ చేసింది. కొత్త టెలికమ్యూనికేషన్ల చట్టం-2023 ప్రకారం ఇలాంటి చర్యలను తీవ్రమైన నేరాలుగా (Cognizable and Non-bailable) పరిగణిస్తామని, నిందితులకు మూడేళ్ల వరకు జైలు శిక్షతో పాటు రూ.50లక్షల వరకు జరిమానా విధించే అవకాశముందని స్పష్టం చేసింది. ఛత్తీస్‌గఢ్‌లో ఇటీవల వెలుగుచూసిన ఓ మోసం ఆధారంగా కేంద్రం ఈ నిర్ణయాన్ని వివరించింది.

హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనం బంద్.. ట్యాంక్‌బండ్ పరిసరాల్లో హైటెన్షన్తెలంగాణSwechaa21 Sep 2026, 01:42 PM

హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనం బంద్.. ట్యాంక్‌బండ్ పరిసరాల్లో హైటెన్షన్

హైదరాబాద్ మహానగరంలో గణపతి నిమజ్జనాలు కొనసాగుతున్నాయి. వినాయకతి చవితి పండుగ సందర్భంగా ప్రతిష్టించిన విగ్రహాల నిమజ్జనం మూడో రోజు నుంచే ప్రారంభం అవ్వగా.. తాజాగా జీహెచ్ఎంసీ తీసుకున్న నిర్ణయంతో గణేశ్ ఉత్సవ సమితి సభ్యులు, అధికారులకు మధ్య తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే చారిత్రక ట్యాంక్ బండ్ పరిసరాల్లో ఒక్కసారిగా హై టెన్షన్ వాతావరణం నెలకొంది. హుస్సేన్ సాగర్‌లో గణేష్ నిమజ్జనాలను నిషేధిస్తూ అధికారులు ఏర్పాటు చేసిన బ్యానర్లపై భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి తీవ్రంగా మండిపడింది. ఈ క్రమంలోనే నిరసనకు దిగిన ఉత్సవ సమితి నేతలను పోలీసులు అడ్డుకోవడంతో ట్యాంక్ బండ్ పరిసరాలు రణరంగంలా మారాయి.

రణరంగంగా మారిన జూరాల పరిసరాలు.. మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యేల అరెస్టు!తెలంగాణSwechaa21 Sep 2026, 01:25 PM

రణరంగంగా మారిన జూరాల పరిసరాలు.. మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యేల అరెస్టు!

 ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని జూరాల ప్రాజెక్టు ఆయకట్టు రైతులకు తక్షణమే సాగునీరు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్‌ఎస్ పార్టీ చేపట్టిన ‘జూరాల ప్రాజెక్టు ముట్టడి’ పిలుపు తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. రైతుల ఆందోళనలకు మద్దతుగా డ్యామ్‌పై ధర్నా నిర్వహించేందుకు పిలుపునివ్వడంతో పోలీసులు అడుగడుగునా రక్షణ వలయాన్ని ఏర్పాటు చేశారు. జూరాల ప్రాజెక్ట్ 12 కిలోమీటర్ల పరిధి నుంచి డ్యామ్ మీది వరకు భారీగా బలగాలను మోహరించి, రోడ్లకు అడ్డంగా బారికేడ్లు, పోలీసు వాహనాలను అడ్డుపెట్టి ఆత్మకూరు - గద్వాల ప్రధాన రహదారిపై రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు.

కన్నం వేసిన ఇంట్లో దొంగ జల్సా.. రెండ్రోజులు హాయిగా!తెలంగాణSwechaa21 Sep 2026, 01:22 PM

కన్నం వేసిన ఇంట్లో దొంగ జల్సా.. రెండ్రోజులు హాయిగా!

దొంగలు ఇటీవలి కాలంలో కొన్ని విచిత్ర పనులు చేస్తూ దొరికిపోతున్నారు.దొంగతనం చేసే క్రమంలోనే వారు అనుసరిస్తున్న విధానాలే ఇందుకు కారణంగా తెలుస్తోంది. చోరీకి వెళ్లిన దొంగ సాధారణంగా ఇంట్లో ఉన్నవి ఊడ్చేసి ఆ వెంటనే పరార్ అవుతాడు. కానీ, కొందరు ఈ మధ్యకాలంలో దొంగతనం కోసం ఇంట్లోకి చొరబడి జల్సాలు చేస్తున్నట్టు సమాచారం. కొందరు ఇంట్లో ఉన్న మందు బాటిళ్లు తాగి అక్కడే నిద్రపోవడం వంటివి చేస్తున్నారు. మరికొందరు కిచెన్‌లోకి చొరబడి ఇంట్లోని ఫుడ్ ఐటమ్స్ తేరగా లాగించేస్తున్నారు. అయితే, ఏపీలోని నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలో ఓ దొంగ ఇంట్లో చొరబడి రెండ్రోజులు అక్కడే హాయిగా నిద్రపోయినట్టు తెలిసింది. ఓనర్లు వచ్చి చూసి ఫిర్యాదు చేయగా అతన్ని అరెస్టు చేసినట్టు పోలీసులు తెలిపారు.