స్వేచ్ఛ షార్ట్స్ — తాజా తెలుగు వార్తలు

కన్నం వేసిన ఇంట్లో దొంగ జల్సా.. రెండ్రోజులు హాయిగా!తెలంగాణSwechaa21 Sep 2026, 01:22 PM

కన్నం వేసిన ఇంట్లో దొంగ జల్సా.. రెండ్రోజులు హాయిగా!

దొంగలు ఇటీవలి కాలంలో కొన్ని విచిత్ర పనులు చేస్తూ దొరికిపోతున్నారు.దొంగతనం చేసే క్రమంలోనే వారు అనుసరిస్తున్న విధానాలే ఇందుకు కారణంగా తెలుస్తోంది. చోరీకి వెళ్లిన దొంగ సాధారణంగా ఇంట్లో ఉన్నవి ఊడ్చేసి ఆ వెంటనే పరార్ అవుతాడు. కానీ, కొందరు ఈ మధ్యకాలంలో దొంగతనం కోసం ఇంట్లోకి చొరబడి జల్సాలు చేస్తున్నట్టు సమాచారం. కొందరు ఇంట్లో ఉన్న మందు బాటిళ్లు తాగి అక్కడే నిద్రపోవడం వంటివి చేస్తున్నారు. మరికొందరు కిచెన్‌లోకి చొరబడి ఇంట్లోని ఫుడ్ ఐటమ్స్ తేరగా లాగించేస్తున్నారు. అయితే, ఏపీలోని నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలో ఓ దొంగ ఇంట్లో చొరబడి రెండ్రోజులు అక్కడే హాయిగా నిద్రపోయినట్టు తెలిసింది. ఓనర్లు వచ్చి చూసి ఫిర్యాదు చేయగా అతన్ని అరెస్టు చేసినట్టు పోలీసులు తెలిపారు.

దానం పిటిషన్‌పై కీలక అప్‌డేట్.. విచారణకు సుప్రీంకోర్టు అంగీకారం!తెలంగాణSwechaa21 Sep 2026, 01:07 PM

దానం పిటిషన్‌పై కీలక అప్‌డేట్.. విచారణకు సుప్రీంకోర్టు అంగీకారం!

 తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర సంచలనం సృష్టిస్తున్న ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అనర్హత వ్యవహారం కీలక మలుపు తిరిగింది. పార్టీ ఫిరాయింపుల కేసులో తనపై అనర్హత వేటు వేస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ దానం నాగేందర్ దాఖలు చేసిన పిటిషన్‌పై బుధవారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (CJI) ధర్మాసనం విచారణ జరపనుంది. సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి ఈ పిటిషన్‌ను సుప్రీంకోర్టులో ప్రత్యేకంగా ప్రస్తావించి, అసెంబ్లీ స్పీకర్ నిర్ణయాన్ని పక్కనబెట్టి హైకోర్టు దానంను అనర్హుడిగా ప్రకటించిందని వివరించారు.

అఖిలేశ్ యాదవ్‌కు ఎంఐఎం చీఫ్ అసద్ ఓపెన్ ఆఫర్!NationalSwechaa21 Sep 2026, 12:59 PM

అఖిలేశ్ యాదవ్‌కు ఎంఐఎం చీఫ్ అసద్ ఓపెన్ ఆఫర్!

వచ్చే ఏడాది ప్రారంభంలో ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలోనే కేంద్రంలోని బీజేపీ సర్కార్‌తో పాటు సీఎం యోగి సర్కార్ కూడా యూపీ ఎన్నికల్లో అనుసరించాల్సిన గెలుపు అవకాశాలపై ఇప్పటినుంచే ప్రణాళికలు రచిస్తున్నట్టు సమాచారం.మరోవైపు ప్రతిపక్ష సమాజ్‌వాదీ పార్టీ (Sp), బహుజన సమాజ్ వాదీ పార్టీ (BSP), ఇతర పార్టీలు సైతం రాబోయే యూపీ ఎన్నికల్లో సత్తా చాటేందుకు కులాల వారీగా స్ట్రాటజీలు ప్లే చేస్తున్నట్టు సమాచారం. ఈ క్రమంలోనే ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్, యూపీలోని ప్రతిపక్ష పార్టీలకు ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ ఓపెన్ ఆఫర్ ఇచ్చారు. యూపీలో మూడోసారి బీజేపీ అధికారంలోకి రాకుండా అడ్డుకోవడమే తమ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. అఖిలేష్ యాదవ్‌, అక్కడి ప్రతిపక్ష పార్టీలకు పరోక్షంగా పొత్తు అంశంపై హింట్ ఇచ్చారు. యూపీలో బీజేపీ మూడోసారి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని తాము కోరుకోవడం లేదన్నారు.

అంబర్‌పేటలో విషాదం.. కానిస్టేబుల్ ఆత్మహత్యక్రైమ్Swechaa21 Sep 2026, 12:18 PM

అంబర్‌పేటలో విషాదం.. కానిస్టేబుల్ ఆత్మహత్య

హైదరాబాద్ మహానగరంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. పోలీసు కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపింది. మూసారాంబాగ్ శాలివాహన నగర్‌లోని తన ఇంట్లో ఉరివేసుకుని కానిస్టేబుల్ ముత్తె చంద్రశేఖర్ (35) ప్రాణాలు తీసుకున్నాడు. ఆయన మృతిపై పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగం, అది కూడా పోలీసు డిపార్ట్మెంట్‌లో చేస్తూ బలవంతంగా ప్రాణాలు తీసుకోవాల్సిన అవసరం ఏం వచ్చిందని పోలీసులు విచారణ చేపట్టినట్టు తెలుస్తోంది. వివరాల్లోకివెళితే.. అంబర్‌పేట్ పోలీసు హెడ్‌క్వార్టర్స్‌లో ముత్తె చంద్రశేఖర్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. నిన్న అర్ధరాత్రి ఓ యువతికి వీడియో కాల్ చేసిన కానిస్టేబుల్..అనంతరం ఉరేసుకున్నాడు. తాను ఉరివేసుకుని చనిపోవాలని అనుకుంటున్నట్టు సదరు యువతికి ముందే చెప్పినట్టు తెలిసింది. భయాందోళనకు గురైన యువతి వెంటనే చైతన్యపురి పోలీసులకు సమాచారం ఇచ్చింది. వారు మలక్‌పేట్ పోలీసులకు సమాచారం ఇవ్వగా ఘటనా స్థలానికి చేరుకునేలోపే చంద్రశేఖర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

పోలీసుల వలయంలో జూరాల ప్రాజెక్టు.. రైతుల ధర్నా పిలుపుతో అలర్ట్!తెలంగాణSwechaa21 Sep 2026, 12:16 PM

పోలీసుల వలయంలో జూరాల ప్రాజెక్టు.. రైతుల ధర్నా పిలుపుతో అలర్ట్!

 జోగులాంబ గద్వాల జిల్లాలోని ప్రసిద్ధ జూరాల ప్రాజెక్టు వద్ద తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సాగునీటి విడుదల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అవలంభిస్తున్న వైఖరికి నిరసనగా, పంటలను కాపాడుకునేందుకు జూరాల వద్ద భారీ ధర్నా నిర్వహించేందుకు రైతులు సమాయత్తమయ్యారు. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తగా పోలీసులు జూరాల ప్రాజెక్టు పరిసర ప్రాంతాలను తమ అదుపులోకి తీసుకున్నారు. ప్రాజెక్టుకు వెళ్లే అన్ని ప్రధాన రహదారుల్లో పోలీసు బలగాలను భారీగా మోహరించారు.

మాస్కోపై డ్రోన్ సునామీ.. పుతిన్‌కు కొత్త సవాల్? మరో దశలోకి యుద్ధంInternationalSwechaa21 Sep 2026, 12:01 PM

మాస్కోపై డ్రోన్ సునామీ.. పుతిన్‌కు కొత్త సవాల్? మరో దశలోకి యుద్ధం

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం రోజురోజుకూ మరింత ప్రమాదకరంగా మారుతోంది. ఇప్పటివరకు ప్రధానంగా యుద్ధ ప్రాంతాలకే పరిమితమైన దాడులు.. ఇప్పుడు రష్యా రాజధాని మాస్కో వరకు చేరుతున్నాయి. తాజాగా మాస్కోపై ఉక్రెయిన్ భారీ స్థాయిలో డ్రోన్లతో దాడి చేయడం తీవ్ర కలకలం రేపింది.

గణేశ్ నిమజ్జన ఊరేగింపులో దారుణం.. మాంసం వ్యర్థ్యాలు!తెలంగాణSwechaa21 Sep 2026, 11:53 AM

గణేశ్ నిమజ్జన ఊరేగింపులో దారుణం.. మాంసం వ్యర్థ్యాలు!

హైదరాబాద్ మహానగరంలో మరోసారి శాంతిభద్రతలకు విఘాతం కల్పించేలా ఓ వర్గం ప్రజలు యత్నించారు. దీంతో మరోవర్గం ప్రజలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడంతో పాటు వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు. ఆదివారం హైదరాబాద్‌లోని పాతబస్తీ మాదన్నపేట పోలీస్‌స్టేషన్ పరిధిలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. డబుల్ బెడ్రూం పోలీస్ హౌసింగ్ సొసైటీ వద్ద గణేష్ నిమజ్జన ఊరేగింపు కార్యక్రమం జరిగింది. అదే సమయంలో భక్తులకు అన్నదాన కార్యక్రమం సైతం నిర్వహించారు. ఆ సమయంలో హౌసింగ్ సొసైటీ పై అంతస్తు నుంచి ఓ వర్గానికి చెందిన గుర్తు తెలియని వ్యక్తులు మాంసపు వ్యర్థ్యాలను కిందకు విసిరారు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన స్థానికులు, భక్తులు పెద్ద ఎత్తున ఘటనా స్థలానికి చేరుకుని నిరసనకు దిగారు. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు నిందితులను అరెస్టు చేశారు.

Khammam: ఇళ్ల కూల్చివేతల నోటీసులు.. యువతి కన్నీళ్లు!తెలంగాణSwechaa21 Sep 2026, 11:45 AM

Khammam: ఇళ్ల కూల్చివేతల నోటీసులు.. యువతి కన్నీళ్లు!

 ఖమ్మం నగరంలోని శ్రీనివాసనగర్ ప్రాంతంలో నివాసముంటున్న నిరుపేద కుటుంబాలకు మున్సిపల్ అధికారులు ఇళ్ల కూల్చివేత నోటీసులు జారీ చేయడం తీవ్ర కలకలం రేపింది. తమ ఇళ్లను కూల్చివేస్తామని బెదిరిస్తున్నారని, ఆక్రమణల పేరుతో నోటీసులు ఇచ్చి ఖాళీ చేయాలనడం అన్యాయమని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవలే ఈ విషయమై బాధితులు రోడ్డుపై ధర్నాకు దిగారు. ఈ నేపథ్యంలో తండ్రి లేక, చెవుడు-మూగ ఉన్న తల్లిని పోషించుకుంటున్న ఓ యువతి కాంగ్రెస్ ప్రభుత్వం తమ నివాసాలను తొలగించేందుకు సిద్ధపడటంపై కన్నీరుమున్నీరుగా విలపిస్తూ మీడియాతో తన ఆవేదనను వ్యక్తం చేసింది.

AP: 9 మంది ఐపీఎస్ అధికారుల బదిలీ.. ఆదేశాలు జారీ చేసిన హోంశాఖ!ఏపీSwechaa21 Sep 2026, 11:19 AM

AP: 9 మంది ఐపీఎస్ అధికారుల బదిలీ.. ఆదేశాలు జారీ చేసిన హోంశాఖ!

 ఏపీలో భారీ స్థాయిలో ఐపీఎస్ అధికారుల బదిలీ అయ్యారు. పరిపాలనా సౌలభ్యం, పోలీసు శాఖలో సమర్థతను పెంపొందించే లక్ష్యంతో ప్రభుత్వం శుక్రవారం 9 మంది ఐపీఎస్ అధికారులను వివిధ కీలక స్థానాలకు బదిలీ చేస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఆదేశాలు తక్షణమే అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది. సీనియర్ అధికారులకు ప్రాధాన్యత కలిగిన విభాగాల బాధ్యతలతో పాటు పలు జిల్లాలకు కొత్త ఎస్పీలను నియమించడం ఈ బదిలీల ప్రక్రియలో ప్రధానంగా కనిపిస్తోంది.

MarketAnalysis: లాభాల దిశగా భారత మార్కెట్లు.. గిఫ్ట్ నిఫ్టీ ప్రతికూల సంకేతాలు!వ్యాపారంSwechaa21 Sep 2026, 10:41 AM

MarketAnalysis: లాభాల దిశగా భారత మార్కెట్లు.. గిఫ్ట్ నిఫ్టీ ప్రతికూల సంకేతాలు!

పశ్చిమాసియాలో రాజకీయ, సైనిక ఉద్రిక్తతలు కొనసాగుతున్నప్పటికీ, ముడిచమురు (Crude Oil) ధరలు బ్యారెల్‌కు 101.75 డాలర్ల స్థాయికి దిగిరావడం అంతర్జాతీయ మార్కెట్లకు నిలకడనిచ్చింది. అమెరికా ఫ్యూచర్స్ మార్కెట్లు లాభాల్లో కదులుతుండగా, ప్రధాన ఆసియా స్టాక్ ఎక్స్ఛేంజీలన్నీ సానుకూల ధోరణిలో ట్రేడ్ అవుతున్నాయి. అయితే, గిఫ్ట్ నిఫ్టీ (GIFT Nifty) స్వల్ప నష్టాలతో ప్రతిబింబిస్తుండటంతో, మన దేశీయ సూచీలు నేడు ఫ్లాట్ నుంచి స్వల్ప గ్యాప్ డౌన్‌తో ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Actress Kayadu: టీ అందించి, బట్టల షాపులో సేల్స్ గర్ల్..కట్ చేస్తే పాన్ ఇండియా హీరోయిన్!సినిమాSwechaa21 Sep 2026, 10:25 AM

Actress Kayadu: టీ అందించి, బట్టల షాపులో సేల్స్ గర్ల్..కట్ చేస్తే పాన్ ఇండియా హీరోయిన్!

Kayadu Lohar: సాధారణంగా హీరోయిన్ అనగానే ఓ మోడలింగ్ రంగంలో గుర్తింపు తెచ్చుకొని..ఆ తర్వాత మేకర్స్ కంట్లో పడి..హీరోయిన్‌గా అవకాశాలు అందుకున్నవాళ్ళే అనుకుంటారు. కానీ, ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలలో అవకాశాలు అందుకుంటున్న కయాదు లోహర్ కెరీర్ మాత్రం కష్టాల కడలి నుంచి మొదలైంది. ఆర్ధిక ఇబ్బందుల్లో టీ షాప్‌లో పనిచేయడమే కాకుండా బట్టల షాపులో సేల్స్ గర్ల్‌గాను పనిచేసినట్టుగా తెలిపింది.

కూటమిలో స్థానిక ఎన్నికల చిచ్చు..! ఇలాగైతే కష్టమంటున్న జనసైనికులుఏపీSwechaa21 Sep 2026, 10:06 AM

కూటమిలో స్థానిక ఎన్నికల చిచ్చు..! ఇలాగైతే కష్టమంటున్న జనసైనికులు

అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేయడం ఒక లెక్క. కానీ గ్రామం, మండలం, మున్సిపాలిటీ, జెడ్పీ స్థాయిలో ఎవరికి ఎంత బలం ఉందో తేల్చుకోవడం మరో లెక్క. అందుకే స్థానిక ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ కూటమిలో సీట్ల పంచాయితీ వేడెక్కుతోంది. టీడీపీ–జనసేన మధ్య స్థానిక స్థాయిలో పోటీ, పదవులపై ఆశలు ఇప్పటికే చర్చకు వస్తున్నాయి.

Megastar Chiranjeevi: ఆ లుక్కే హైలెట్ అవుతుందిగా చిరు!సినిమాSwechaa21 Sep 2026, 09:57 AM

Megastar Chiranjeevi: ఆ లుక్కే హైలెట్ అవుతుందిగా చిరు!

Megastar Chiranjeevi: మెగాస్టార్ లేటెస్ట్ వీడియో చూస్తే ఎవరికైనా మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. అంత స్టైలిష్ లుక్‌లో దర్శనమిచ్చాడు అన్నయ్య. దీనికంతటికి కారణం..దర్శకుడు బాబి అంటున్నారు. ఇంతకముందు వాల్తేరు వీరయ్య సినిమాలో ముఠామేస్త్రిని మళ్ళీ రీక్రియేట్ చేసిన బాబీ..ఇప్పుడు ఇంకోలా ప్రజెంట్ చేయబోతున్నాడని తాజా లుక్ చూస్తేనే అర్థమైంది. ఏషియన్ సునీల్ నారంగ్ ఇంటికి విచ్చేసిన మెగాస్టార్ క్యాప్ పెట్టుకొని అదిపోయే లెవల్‌లో ఎంట్రీ ఇచ్చారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.

AI_Risks: మూడు సవాళ్ల సుడిగుండంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ!వ్యాపారంSwechaa21 Sep 2026, 09:56 AM

AI_Risks: మూడు సవాళ్ల సుడిగుండంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ!

 ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఊహించిన దానికంటే కొంత మెరుగ్గా నిలదొక్కుకున్నప్పటికీ, రాబోయే రోజుల్లో పలు తీవ్రమైన సవాళ్లు ఆర్థిక వ్యవస్థను వేధించే అవకాశం ఉందని అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టలినా జార్జీవా హెచ్చరించారు. ముఖ్యంగా నిరంతరాయంగా కొనసాగుతున్న ద్రవ్యోల్బణం, పెరిగిపోతున్న ప్రభుత్వాల అప్పుల భారం, కృత్రిమ మేధ (AI) పెట్టుబడుల చుట్టూ ఉన్న ఆర్థిక ప్రమాదాలు.. ఈ మూడు అంశాలు ప్రపంచ ఆర్థిక స్థిరత్వానికి పెద్ద ముప్పుగా పరిణమించే అవకాశం ఉందని ఆమె స్పష్టం చేశారు.

లవ్ మ్యారేజ్, మంచి ప్యాకేజీలు, కవలపిల్లలు..అయినా ఘోరం!తెలంగాణSwechaa21 Sep 2026, 09:51 AM

లవ్ మ్యారేజ్, మంచి ప్యాకేజీలు, కవలపిల్లలు..అయినా ఘోరం!

రాష్ట్రంలో మరో దారుణం చోటుచేసుకుంది. కులాంతర వివాహం చేసుకున్న ఓ మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ బలవన్మరణానికి పాల్పడింది. పెద్దలను ఎదురించి ప్రేమ వివాహం చేసుకున్న ఏపీకి చెందిన యువతి హైదరాబాద్ పరిధిలో ఫ్యామిలీతో కలిసి సంతోషంగా జీవిస్తోంది. ఏం జరిగిందో తెలీదు కొంతకాలంగా దంపతుల మధ్య మనస్పర్దలు వచ్చినట్టు సమాచారం. ఈ క్రమంలోనే ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలుస్తోంది. వివరాల్లోకివెళితే.. విశాఖపట్నంకు చెందిన రమాకాంత్, శ్రీకాకుళంకు చెందిన మౌనిక సంతోషి (28) ప్రేమించుకున్నారు. పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్నారు. హైదరాబాద్ – ఘట్‌కేసర్ ప్రాంతం పోచారం డివిజన్‌లోని గెలాక్సీ టవర్స్‌లో నివాసం ఉంటున్నారు. భార్యభర్తలు ఇద్దరూ ఉద్యోగం చేస్తున్నారు. మౌనిక యాక్సిస్ బ్యాంకులో సాఫ్ట్‌వేర్ ఉద్యోగినిగా పనిచేస్తుండగా రమాకాంత్ ఇన్ఫోసిస్‌లో హెచ్‌ఆర్‌గా పనిచేస్తున్నారు. గత కొంతకాలంగా ఇద్దరిమధ్య మనస్పర్దలు రావడంతో మౌనిక ఆత్మహత్యకు పాల్పడింది.

ElNinoEffect: ఎల్‌నినోతో గొంతు ఎండనున్న తెలంగాణ!స్వేచ్ఛ ఛైర్మన్ డెస్క్Swechaa21 Sep 2026, 09:41 AM

ElNinoEffect: ఎల్‌నినోతో గొంతు ఎండనున్న తెలంగాణ!

ఎల్ నినో ముప్పు ముంచుకోస్తోంది. ఎండ తీవ్రత రోజు రోజుకు పెరుగుతోంది. ఎన్ని సంవత్సరాలు ఉంటుందో చెప్పలేని పరిస్థితి. రోజుకో విధంగా వాతవారణంలో మార్పులు వస్తున్నాయి. ఇలాంటి సమయంలో కురిసిన కొద్ది నీళ్లను ఒడిసి పట్టుకోకుండా, ప్రైవేట్ కంపెనీలకు ధారదత్తం చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. అధికారులు తప్పుడు లెక్కలు చెబుతున్నారు. పొతిరెడ్డిపాడుకు 8 వేల క్యూసెక్కులే అంటూ ప్రచారం చేస్తున్నారు. కానీ, రోజుకు 3 టీఎంసీలు తరలించునేంత గండి పెట్టుకున్నారు. పోతిరెడ్డిపాడు నుంచి గండికోట, చిత్రావతి లిఫ్ట్, గోరకల్లు పిన్నపురం వెళ్లే ప్రధాన ప్రాంతాల్లో పంప్డ్ స్టోరేజ్ హైడ్రో పవర్ ప్రాజెక్టులు ఉన్నాయి.

FutureCityLandGrab: తాండూరు ఎమ్మెల్యే కబ్జాలను వదలొద్దు!స్వేచ్ఛ ఛైర్మన్ డెస్క్Swechaa21 Sep 2026, 09:32 AM

FutureCityLandGrab: తాండూరు ఎమ్మెల్యే కబ్జాలను వదలొద్దు!

తెలంగాణకు ఫ్యూచర్ సిటీయే ఫ్యూచర్ అంటూ సీఎం రేవంత్ రెడ్డి తెగ ఊదరగొడుతున్నారు. భారీ పెట్టుబడులు అంటూ ఏ కార్యక్రమానికి వెళ్లినా చెప్పిందే చెబుతున్నారు. అయితే, ఫ్యూచర్ సిటీ చుట్టూ భూ కబ్జాలు భారీగానే జరుగుతున్నాయి. ఏకంగా 51 ఎకరాలపై కన్నేసిన తాండూరు ఎమ్మెల్యే రెవెన్యూ అధికారులతో కలిసి రికార్డులను తారుమారు చేస్తున్నారు. మొత్తం భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. దీనికి సంబంధించిన విషయాలను స్వేచ్ఛ న్యూస్ గతంలోనే కథనాలను ఇచ్చింది. తాజాగా బాధితులు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు లేఖ రాయడంతో ఈ అంశం మరోసారి చర్చనీయాంశమైంది.

Nani-Rashmika: నాని-రష్మికల వీడియో వైరల్..కాంబో మళ్ళీ ఫిక్సా?సినిమాSwechaa21 Sep 2026, 09:25 AM

Nani-Rashmika: నాని-రష్మికల వీడియో వైరల్..కాంబో మళ్ళీ ఫిక్సా?

Nani-Rashmika: నాని-రష్మికల వీడియో వైరల్..కాంబో మళ్ళీ ఫిక్సా? అవును ప్రస్తుతం ఇదే వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ వైరల్ అవుతోంది. తాజాగా, నాని-రష్మిక మందన్న అనుకోకుండా ఒకరికొకరు ఎదురుపడ్డారు. వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చి నానిని హగ్ చేసుకుంది రష్మిక. ఇద్దరు కొద్దిసేపు మాట్లాడుకున్నారు. ప్రస్తుతం, దీనికి సంబందించిన వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.

Badradri : కారులో చిన్నారి మృతితెలంగాణSwechaa21 Sep 2026, 09:16 AM

Badradri : కారులో చిన్నారి మృతి

కారులో ఆడుకుంటున్న చిన్నారి డోర్స్ లాక్ కావడంతో ఊపిరాడక ప్రాణాలు కోల్పోయింది.ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తీవ్ర విషాదం నింపింది. వివరాల్లోకివెళితే.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం వినోభానగర్ గ్రామ సర్పంచ్ నవీన్, ఐశ్వర్య దంపతులకు ఇద్దరు పిల్లలు తన్విత శ్రీ (4), సురక్ష ఉన్నారు.ఆదివారం స్కూలుకు సెలవు కావడంతో, ఇంటి వద్ద ఆడుకుంటూ ఉన్నారు. పేరెంట్స్ ఏదో పనిలో ఉండగా..పెద్ద కూతురు తన్విత శ్రీ లాక్ చేయని కారులో ఎక్కింది. ఆడుకుంటున్న క్రమంలోనే ఒక్కసారిగా కారు డోర్ లాక్ అయ్యింది. దీంతో ఊపిరాడక కాసేపటికే నాలుగేళ్ల చిన్నారి స్పృహ తప్పింది. చలనం లేకుండా పడి ఉన్న తన్విత శ్రీని గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించగా అప్పటికే మరణించినట్టు వైద్యులు నిర్ధారించారు.

రోహిత్, కోహ్లీ జట్టులో ఉన్నా లేకున్నా పెద్ద సమస్యేం లేదు: సందీప్ పాటిల్క్రీడలుSwechaa21 Sep 2026, 09:05 AM

రోహిత్, కోహ్లీ జట్టులో ఉన్నా లేకున్నా పెద్ద సమస్యేం లేదు: సందీప్ పాటిల్

రాబోయే 2027 వన్డే ప్రపంచకప్‌లో భారత సీనియర్ దిగ్గజ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు పాల్గొనడం లేదా దూరమవ్వడం వల్ల టీమిండియా ప్రదర్శనపై ఎలాంటి ప్రతికూల ప్రభావం పడదని భారత మాజీ ఆల్‌రౌండర్ సందీప్ పాటిల్ స్పష్టం చేశారు. ప్రస్తుతం భారత క్రికెట్ జట్టులో అద్భుతమైన ప్రతిభ కలిగిన యువ ఆటగాళ్లు సిద్ధంగా ఉన్నారని, ఎలాంటి పరిస్థితుల్లోనైనా సీనియర్ల స్థానాలను సమర్థవంతంగా భర్తీ చేసే సత్తా మన బెంచ్ స్ట్రెంగ్త్‌కు ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

George Krish: జూనియర్ సైంటిస్ట్ గా శర్వానంద్.!సినిమాSwechaa21 Sep 2026, 09:03 AM

George Krish: జూనియర్ సైంటిస్ట్ గా శర్వానంద్.!

George Krish: ఆగడు తర్వాత చాలా లాంగ్ గ్యాప్ తీసుకున్న దర్శకుడు శ్రీను వైట్ల మళ్ళీ కంబ్యాక్ ఇస్తూ చేస్తున్న సినిమా ‘జార్జ్ క్రిష్’. ఇందులో హీరోగా శర్వానంద్ నటిస్తున్న సంగతి తెలిసిందే. వీరి కాంబినేషన్ లో రాబోతున్న సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి. అయితే, తాజా సమాచారం మేరకు శర్వానంద్ ఈ సినిమాలో జూనియర్ సైంటిస్ట్ గా కనిపించబోతున్నాడట. ఇదే, నిజమైతే..శర్వాకి మంచి పాత్ర దక్కినట్టే అని చెప్పాలి.

హైదరాబాద్ పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ లో బిగ్ ఛేంజ్.. రవాణా సేవలపై గుడ్ న్యూస్!..తెలంగాణSwechaa21 Sep 2026, 08:50 AM

హైదరాబాద్ పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ లో బిగ్ ఛేంజ్.. రవాణా సేవలపై గుడ్ న్యూస్!..

హైదరాబాద్‌లో ప్రజా రవాణా మరింత సులభం కానుంది. మెట్రో, ఎంఎంటీఎస్, టీజీఎస్‌ఆర్టీసీ బస్సులకు ఒకే కామన్ టికెట్‌ను ప్రభుత్వం సిద్ధం చేసింది. ప్రయాణికులకు రియల్‌టైమ్ సమాచారం అందించే మొబైల్ యాప్‌తో పాటు.. మొదటి, చివరి మైలు కనెక్టివిటీ కోసం ఓలా, ఉబర్, ర్యాపిడో వంటి సేవలను అనుసంధానించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎంఎంటీఎస్ స్టేషన్ల నుంచి కాలనీలకు షటిల్, షేర్డ్ వాన్ సేవలను కూడా పరిశీలిస్తున్నారు. ఇప్పటికే ఏర్పాట్లు పూర్తికాగా.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా త్వరలోనే కామన్ టికెట్ ప్రారంభించే అవకాశం ఉంది.

సీఎం అపాయింట్మెంట్ ఇస్తే ఆయనకే చెబుతా : మహిళా వ్యాపారవేత్తతెలంగాణSwechaa21 Sep 2026, 08:43 AM

సీఎం అపాయింట్మెంట్ ఇస్తే ఆయనకే చెబుతా : మహిళా వ్యాపారవేత్త

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సన్నిహితుడు తనను వేధించినట్టు ఓ మహిళా వ్యాపారవేత్త సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.ఈ మేరకు సోషల్ మీడియా ‘ఎక్స్’ వేదికగా నిన్న ఆమె సంచలన పోస్టుపెట్టింది. ‘సాయం కోరితే సీఎం సన్నిహితుడు గెస్ట్ హౌస్‌కు రమ్మని పిలిచాడు. అడ్వర్టైజింగ్ రంగంలో కాంట్రాక్ట్ కోసం న్యాయబద్ధంగా అవకాశం ఇవ్వమని అడిగితే, సీఎంకు సన్నిహితుడైన ఒక వ్యక్తి గెస్ట్ హౌస్‌కు రావాలని పిలిచాడు’ అంటూ కె.శోభా రెడ్డి అనే మహిళా వ్యాపారవేత్త ఆవేదన వ్యక్తం చేసింది. తాజాగా దీనిపై సదరు బాధిత మహిళా వ్యాపారవేత్త స్పందించారు. ఈసారి ఏకంగా వీడియో సందేశం విడుదల చేశారు.తనపై కావాలని దుష్ప్రచారం చేస్తున్నారని వీడియో సందేశంలో మిధున అడ్వర్టైజింగ్ ఏజెన్సీ యజమాని శోభారెడ్డి కన్నీటి పర్యంతం అయ్యారు.సీఎం రేవంత్ రెడ్డి తనకు ఒక్క అపాయిట్మెంట్ ఇస్తే మున్సిపల్ శాఖలో శాఖలో జరుగుతున్న అవినీతిపై ఆధారాలు కూడా బయటపెడతానని పేర్కొన్నారు.

బెంగళూరులో పర్యావరణ హిత "ది ఎర్త్ సెంటర్"..NationalSwechaa21 Sep 2026, 08:32 AM

బెంగళూరులో పర్యావరణ హిత "ది ఎర్త్ సెంటర్"..

ప్రకృతి, సాంకేతికత, ఆధునిక పని వాతావరణాన్ని సమన్వయం చేస్తూ బెంగళూరులోని వైట్‌ఫీల్డ్‌లో ‘ది ఎర్త్ సెంటర్‌’ను రూపొందించారు. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌తో కలిసి సీఎం చంద్రబాబు ది ఎర్త్ సెంటర్ భవనాన్ని ప్రారంభించారు. సుస్థిర నిర్మాణం, ప్రకృతి అనుసంధానం, రీ-సైకిల్ చేసిన పదార్థాల వినియోగం వంటి అంశాలకు ఆ భవనంలో ప్రాధాన్యం ఇచ్చారు.

ఆసియా క్రీడల్లో భారత్ జోరు.. తొలిరోజే పతకాల హోరు!..InternationalSwechaa21 Sep 2026, 08:00 AM

ఆసియా క్రీడల్లో భారత్ జోరు.. తొలిరోజే పతకాల హోరు!..

ఆసియా క్రీడలు–2026లో భారత్ తొలిరోజే సత్తా చాటింది. షూటింగ్‌లో ఎలావెనిల్ వలరివన్ రెండు రజత పతకాలతో మెరిసింది. మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్‌లో సుచికా తారియల్ సెమీఫైనల్‌కు చేరి భారత్‌కు మరో పతకాన్ని ఖాయం చేసింది. మహిళల హాకీలో ఉజ్బెకిస్థాన్‌పై భారత్ ఏకంగా 19–0తో ఘన విజయం సాధించింది. బ్యాడ్మింటన్‌లో కజకిస్థాన్‌ను 3–0తో ఓడించి క్వార్టర్‌ఫైనల్‌కు చేరింది. టేబుల్ టెన్నిస్‌లోనూ మహిళల జట్టు సింగపూర్‌పై విజయం సాధించింది. ఇక క్రికెట్‌లో స్మృతి మంధాన టీ20ల్లో అత్యధిక పరుగుల రికార్డును బద్దలు కొట్టి కొత్త చరిత్ర సృష్టించింది.

Trivikram-Mythri: మైత్రీ వారికి ‘ఆదర్శ కుటుంబం’ హక్కులు..సినిమాSwechaa21 Sep 2026, 07:59 AM

Trivikram-Mythri: మైత్రీ వారికి ‘ఆదర్శ కుటుంబం’ హక్కులు..

Trivikram: టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు అటు నిర్మాణంలోనూ ఇటు డిస్ట్రిబ్యూషన్‌లో మైత్రీ మూవీ మేకర్స్ మిగతా వారికి గట్టి పోటీ ఇస్తోంది. ముఖ్యంగా, దిల్ రాజు లాంటి అగ్ర నిర్మాత, డిస్ట్రిబ్యూటర్‌గా వెలిగిన ఆయనకి ఈ మధ్య చాలా సినిమాలు దక్కడం లేదు. నిర్మాతగా కూడా ఆయనతో సినిమాలు చేయడానికి బిగ్ స్టార్ అంతగా ఆసక్తి చూపించడం లేదని ఇండస్ట్రీలో టాక్ ఉంది. ఈ నేపథ్యంలోనే మైత్రీ వారికి ‘ఆదర్శ కుటుంబం’ హక్కులు దక్కాయి.

యువత భవిష్యత్తుపై షాకింగ్ గణాంకాలు.. కలవర పెడుతున్న నీట్!!..తెలంగాణSwechaa21 Sep 2026, 07:40 AM

యువత భవిష్యత్తుపై షాకింగ్ గణాంకాలు.. కలవర పెడుతున్న నీట్!!..

తెలంగాణ యువత భవిష్యత్తుపై ఆందోళన కలిగించే విషయాలను తాజా గణాంకాలు బయటపెడుతున్నాయి. చదువుకోవాల్సిన, ఉద్యోగం చేయాల్సిన లేదా ఏదైనా నైపుణ్యం నేర్చుకోవాల్సిన వయసులో.. రాష్ట్రంలోని గణనీయమైన సంఖ్యలో యువత ఈ మూడింటికీ దూరంగా ఉంటున్నట్టు పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే గణాంకాలు చెబుతున్నాయి.

15 నుంచి 29 ఏళ్ల మధ్య ఉన్న తెలంగాణ యువతలో 26.5 శాతం మంది NEET కేటగిరీలో ఉన్నారు. అంటే.. ఉద్యోగంలో లేరు, విద్యను కొనసాగించడం లేదు, ఎలాంటి వృత్తి నైపుణ్య శిక్షణ కూడా పొందడం లేదు. ఇది కేవలం నిరుద్యోగ సమస్యతో సమానం కాదు. ఉద్యోగం కోసం ప్రయత్నించే నిరుద్యోగులతో పోలిస్తే.. విద్య, ఉపాధి, స్కిల్లింగ్ మూడింటికీ దూరంగా ఉన్న వర్గం కావడంతో NEET పరిస్థితి మరింత ఆందోళన కలిగించే అంశంగా మారుతోంది.

మైండ్ ప్రశాంతంగా ఉండాలంటే.. ఈ యోగా పద్ధతి ట్రై చేయండి!..HealthSwechaa21 Sep 2026, 07:26 AM

మైండ్ ప్రశాంతంగా ఉండాలంటే.. ఈ యోగా పద్ధతి ట్రై చేయండి!..

ప్రస్తుత జీవనశైలిలో ఒత్తిడి, ఆందోళన, మానసిక అలసట వంటి సమస్యలు చాలామందిని వేధిస్తున్నాయి. పని ఒత్తిడి, వ్యక్తిగత సమస్యలు, నిద్రలేమి, నిరంతరం ఆలోచించడం వంటి కారణాలతో మనసుపై భారం పెరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో యోగా, ధ్యానం, శ్వాసాభ్యాసాలు వంటి పద్ధతులు ఒత్తిడిని నియంత్రించుకోవడంలో కొంతమందికి ఉపయోగపడవచ్చు. అయితే తీవ్రమైన మానసిక సమస్యలు ఉన్నప్పుడు వైద్య నిపుణుల సలహా తీసుకోవడం చాలా ముఖ్యం.

ఇలాంటి యోగా పద్ధతుల్లో అర్హటిక్ యోగాకు కూడా ప్రత్యేక స్థానం ఉందని వరల్డ్ ప్రాణిక్ హీలింగ్, ఇండియా డైరెక్టర్ శ్రీరామ్ రాజగోపాల్ తెలిపారు. గ్రాండ్ మాస్టర్ చోవా కోక్ సుయ్ అభివృద్ధి చేసిన అర్హటిక్ యోగా.. మానసిక స్పష్టత, ఏకాగ్రత, భావోద్వేగ సమతుల్యతను పెంపొందించడమే లక్ష్యంగా రూపొందించబడిందని ఆయన వివరించారు.

ఆకలి వేసినప్పుడు కడుపులో శబ్ధాలు ఎందుకు వస్తాయి?..HealthSwechaa21 Sep 2026, 07:15 AM

ఆకలి వేసినప్పుడు కడుపులో శబ్ధాలు ఎందుకు వస్తాయి?..

ఆకలి వేసినప్పుడు కడుపులో గుడుగుడు, గురుగురు అంటూ శబ్ధాలు రావడం చాలా సాధారణం. చాలామందికి ఇవి ఆకలికి సంకేతంగా భావిస్తారు. అయితే ఈ శబ్ధాలు కేవలం కడుపు ఖాళీగా ఉండటం వల్ల మాత్రమే రావు. జీర్ణవ్యవస్థలో జరిగే సహజ కదలికలే దీనికి ప్రధాన కారణం అని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. మన కడుపు, పేగుల్లో ఆహారం లేకపోయినా జీర్ణవ్యవస్థ పూర్తిగా నిశ్చలంగా ఉండదు. కొంత సమయం గడిచిన తర్వాత కడుపు, చిన్నపేగుల్లో కండరాలు తరంగాల్లా కుదుస్తూ, లోపల ఉన్న ద్రవాలు, గాలి, జీర్ణరసాలను ముందుకు కదిలిస్తాయి. దీనినే వైద్యపరంగా మైగ్రేటింగ్ మోటార్ కాంప్లెక్స్ అంటారు. ఈ కదలికల సమయంలో గాలి, ద్రవాలు పేగుల్లో కదలడంతో గుడుగుడు శబ్ధాలు వినిపిస్తాయి.

నిత్యం ఇంట్లో కుటుంబ కలహాలు ఏ దోషం వల్ల జరుగుతాయి!!SpiritualitySwechaa21 Sep 2026, 07:08 AM

నిత్యం ఇంట్లో కుటుంబ కలహాలు ఏ దోషం వల్ల జరుగుతాయి!!

ఇంట్లో చిన్న విషయానికే గొడవలు.. మాట మాటకూ మనస్పర్థలు.. ఒకే కుటుంబంలో ఉంటూ కూడా ప్రశాంతత లేకపోవడం.. ఇలాంటి పరిస్థితులను మన పెద్దలు కేవలం బయట కనిపించే కారణాలతోనే చూడలేదు. కుటుంబంలో శాంతి క్షీణించడానికి మనిషి ప్రవర్తన, ఆలోచనలు, ధర్మాచరణ కూడా కారణమవుతాయని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి.. భగవద్గీతలో శ్రీకృష్ణుడు కుటుంబ ధర్మం క్షీణిస్తే అధర్మం పెరుగుతుందని వివరిస్తాడు. కుటుంబాన్ని నిలబెట్టే విలువలు, పరస్పర గౌరవం, పెద్దల పట్ల మర్యాద, ధర్మబద్ధమైన జీవనం తగ్గిపోతే కలహాలకు వాతావరణం ఏర్పడుతుందని ఈ బోధలో అంతర్లీనమైన సందేశం.అలాగే గీతలో మరో ముఖ్యమైన విషయాన్ని శ్రీకృష్ణుడు చెబుతాడు. మనసు ఒక విషయంపై పదేపదే నిలిస్తే దానిపై ఆసక్తి పెరుగుతుంది.. ఆసక్తి కోరికగా మారుతుంది.. కోరిక నెరవేరకపోతే కోపం పుడుతుంది. ఆ కోపమే చివరికి వివేకాన్ని దెబ్బతీస్తుంది.