స్వేచ్ఛ షార్ట్స్ — తాజా తెలుగు వార్తలు

నిత్యం ఇంట్లో కుటుంబ కలహాలు ఏ దోషం వల్ల జరుగుతాయి!!SpiritualitySwechaa21 Sep 2026, 07:08 AM

నిత్యం ఇంట్లో కుటుంబ కలహాలు ఏ దోషం వల్ల జరుగుతాయి!!

ఇంట్లో చిన్న విషయానికే గొడవలు.. మాట మాటకూ మనస్పర్థలు.. ఒకే కుటుంబంలో ఉంటూ కూడా ప్రశాంతత లేకపోవడం.. ఇలాంటి పరిస్థితులను మన పెద్దలు కేవలం బయట కనిపించే కారణాలతోనే చూడలేదు. కుటుంబంలో శాంతి క్షీణించడానికి మనిషి ప్రవర్తన, ఆలోచనలు, ధర్మాచరణ కూడా కారణమవుతాయని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి.. భగవద్గీతలో శ్రీకృష్ణుడు కుటుంబ ధర్మం క్షీణిస్తే అధర్మం పెరుగుతుందని వివరిస్తాడు. కుటుంబాన్ని నిలబెట్టే విలువలు, పరస్పర గౌరవం, పెద్దల పట్ల మర్యాద, ధర్మబద్ధమైన జీవనం తగ్గిపోతే కలహాలకు వాతావరణం ఏర్పడుతుందని ఈ బోధలో అంతర్లీనమైన సందేశం.అలాగే గీతలో మరో ముఖ్యమైన విషయాన్ని శ్రీకృష్ణుడు చెబుతాడు. మనసు ఒక విషయంపై పదేపదే నిలిస్తే దానిపై ఆసక్తి పెరుగుతుంది.. ఆసక్తి కోరికగా మారుతుంది.. కోరిక నెరవేరకపోతే కోపం పుడుతుంది. ఆ కోపమే చివరికి వివేకాన్ని దెబ్బతీస్తుంది.

గణేషుడి నిమజ్జనం మానవాళికి ఇచ్చే సందేశం ఏమిటి?.SpiritualitySwechaa21 Sep 2026, 06:58 AM

గణేషుడి నిమజ్జనం మానవాళికి ఇచ్చే సందేశం ఏమిటి?.

గణేషుడి నిమజ్జనంతో మనిషి జీవితానికి సనాతన ధర్మం అందించే గొప్ప ఆధ్యాత్మిక సందేశంగా చెబుతారు.. వినాయకుడిని మట్టితో ప్రతిష్ఠించి.. భక్తిశ్రద్ధలతో పూజించి.. చివరకు అదే మట్టిని నీటిలో కలపడం వెనుక లోతైన తత్వం దాగి ఉందని అంటారు. పురాణ, ఆగమ సంప్రదాయాల భావనలో గణపతి ప్రకృతి తత్వానికి ప్రతీక. భూమి నుంచి రూపాన్ని తీసుకున్న విగ్రహం.. పూజ ద్వారా దైవస్వరూపంగా ఆరాధించబడుతుంది. అనంతరం నిమజ్జనంతో ఆ రూపం మళ్లీ పంచభూతాల్లో కలిసిపోతుంది. ఇది సృష్టి, స్థితి, లయ అనే ప్రకృతి చక్రాన్ని మన కళ్లముందు చూపించే ఆధ్యాత్మిక ప్రక్రియగా భావించవచ్చు.

సూర్యచంద్రులు దేవుళ్లేనా? వారు కనిపించక పోవడంలో ఉన్న దైవ రహస్యం ఏంటి?!SpiritualitySwechaa21 Sep 2026, 06:52 AM

సూర్యచంద్రులు దేవుళ్లేనా? వారు కనిపించక పోవడంలో ఉన్న దైవ రహస్యం ఏంటి?!

ఆకాశంలో కనిపించే సూర్యుడు, చంద్రుడు కేవలం ఖగోళ వస్తువులేనా? లేక వాటి వెనుక వేదాలు చెప్పే ఒక దైవిక వ్యవస్థ ఉందా? ఈ సందేహం చాలామందికి ఉంటుంది. ముఖ్యంగా మనిషి అంతరిక్షంలోకి వెళ్లి చంద్రుడిని పరిశీలించినప్పుడు, అక్కడ చంద్రదేవుడు ఎందుకు కనిపించలేదనే ప్రశ్న సహజంగానే వస్తుంది.

అయితే మన సనాతన ధర్మంలో సూర్యుడు, చంద్రుడు అంటే మన కళ్లకు కనిపించే భౌతిక గోళాలు మాత్రమే కాదు. వాటికి అధిష్ఠాన దేవతలు ఉన్నారని వేద సంప్రదాయం చెబుతుంది. అంటే మనం చూస్తున్న భౌతిక రూపానికి వెనుక ఒక దైవిక చైతన్యం, ఒక నియంత్రణ వ్యవస్థ ఉందనే భావన. భగవద్గీతలో శ్రీకృష్ణుడు సూర్యదేవుడైన వివస్వాన్‌కు యోగాన్ని బోధించినట్లు చెబుతాడు.

గెస్ట్ హౌస్‌కు రమ్మన్న ఆ పెద్దమనిషి ఎవరు?.. కాంగ్రెస్‌పై RSP ఫైర్!తెలంగాణSwechaa20 Sep 2026, 10:14 PM

గెస్ట్ హౌస్‌కు రమ్మన్న ఆ పెద్దమనిషి ఎవరు?.. కాంగ్రెస్‌పై RSP ఫైర్!

RS Praveen Kumar: తెలంగాణలో ‘ఎల్ నినో’ తెచ్చిన కరువు కంటే.. రేవంత్ సర్కార్ తెచ్చిన ‘ఎల్ కాంగో’ తెగులు వల్లే రాష్ట్రం అతలాకుతలమవుతోందని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా.ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నిప్పులు చెరిగారు. తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన అధికార కాంగ్రెస్ పార్టీ అవినీతి, శాంతిభద్రతల వైఫల్యాలను ఎండగడుతూ పలు దిగ్భ్రాంతికర అంశాలను బట్టబయలు చేశారు. ముఖ్యంగా ముఖ్యమంత్రి సన్నిహితుడికి సంబంధించిన గెస్ట్ హౌస్ వ్యవహారాన్ని ప్రస్తావిస్తూ ఆయన సంధించిన ప్రశ్నలు రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.రాష్ట్రంలో ఆడబిడ్డలకు రక్షణ లేకుండా పోయిందంటూ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ప్రకటనల కోసం ముఖ్యమంత్రి అత్యంత సన్నిహితుడిని కలిసిన ఓ మహిళా వ్యాపారవేత్తకు ఎదురైన చేదు అనుభవాన్ని ఆయన బయటపెట్టారు. ఆ మహిళను సదరు వ్యక్తి నేరుగా ‘గెస్ట్ హౌస్‌’కు రమ్మని వేధించాడని, ఈ దారుణాన్ని స్వయంగా బాధితురాలే సోషల్ మీడియా వేదికగా వెల్లడించినా ప్రభుత్వం ఎందుకు కిమ్మనడం లేదని ప్రశ్నించారు. "ప్రైవేట్ వ్యక్తుల ఆస్తులపైకి పోలీస్ పహారాతో వెళ్లే కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలకు దమ్ముంటే ఆ గెస్ట్ హౌస్ ఎవరిది? ఆ వివాదాస్పద సన్నిహితుడు ఎవరో తేల్చి ఆ మహిళకు న్యాయం చేయాలి" అని సూటి సవాల్ విసిరారు.

Khairatabad By Poll: గులాబీ గూటిలో ఖైరతాబాద్ లొల్లి.. దానంను ఢీకొట్టేది ఎవరు?తెలంగాణSwechaa20 Sep 2026, 10:08 PM

Khairatabad By Poll: గులాబీ గూటిలో ఖైరతాబాద్ లొల్లి.. దానంను ఢీకొట్టేది ఎవరు?

Khairatabad By Poll: హైదరాబాద్ రాజకీయాల్లో ఖైరతాబాద్ ఉప ఎన్నికల వేడి ఒక్కసారిగా రాజుకుంది. మాజీ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై అనర్హత వేటు పడటంతో ఈ సెగ్మెంట్‌లో బైపోల్ అనివార్యంగా మారింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలతో పాటు రాబోయే సాధారణ ఎన్నికలకు సెమీఫైనల్ లాంటి ఈ పోరు ప్రధాన పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారిందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.ముఖ్యంగా బీఆర్ఎస్‌కి చావో రేవో సమస్యగా మారింది. గతంలో సికింద్రాబాద్ కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఎదురైన ఫలితాల నేపథ్యంలో.. ఈసారి ఎలాగైనా ఖైరతాబాద్‌ను కైవసం చేసుకోవాలనే పట్టుదలతో గులాబీ దళం ముమ్మర కసరత్తు చేస్తుంది.ప్రస్తుతం బీఆర్‌ఎస్ వర్గాల్లో అత్యంత హాట్ టాపిక్‌గా మారిన అంశం తలసాని శ్రీనివాస్ యాదవ్ తనయుడు తలసాని సాయికిరణ్ యాదవ్ అభ్యర్థిత్వం. ఖైరతాబాద్ టికెట్‌ను తన కుమారుడికి కేటాయిస్తే గెలిపించుకుని వస్తానని తలసాని అధిష్టానం వద్ద గట్టి పట్టుదలతో ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో సంక్రాంతి వేడుకల సందర్భంగా నియోజకవర్గంలో దానం, తలసాని వర్గాల మధ్య తీవ్ర పోటీ వాతావరణం కనిపించింది. ఇప్పుడు ఉప ఎన్నిక ముంచుకొస్తుండటంతో దానం నాగేందర్‌ను ఢీకొట్టేందుకు సాయికిరణ్‌ను బరిలోకి దించేందుకు పావులు కదుపుతున్నారు. ఒకవేళ ఇది ఫిక్స్ అయితే ఖైరతాబాద్ పోరు కాస్తా 'దానం వర్సెస్ తలసాని' ప్రత్యక్ష యుద్ధంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Jio: జియో యూజర్లకు అదిరిపోయే ఆఫర్.. ఏడాది పాటు కాన్వా ప్రో ఫ్రీ! ఇలా పొందండి..దునియాSwechaa20 Sep 2026, 09:32 PM

Jio: జియో యూజర్లకు అదిరిపోయే ఆఫర్.. ఏడాది పాటు కాన్వా ప్రో ఫ్రీ! ఇలా పొందండి..

Jio: రిలయన్స్ జియో తమ యూజర్లకు అదిరిపోయే పండుగ ఆఫర్ ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది వాడుతున్న ప్రముఖ విజువల్ డిజైన్ ప్లాట్‌ఫామ్ ‘కాన్వా’ తో జియో కీలక భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా అర్హులైన కస్టమర్లకు ఏకంగా ఏడాది పాటు కాన్వా ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ను ఉచితంగా అందించేందుకు రంగం సిద్ధం చేసింది. గ్రాఫిక్ డిజైనర్లు, కంటెంట్ క్రియేటర్లు, విద్యార్థులకు ఇది ఊహించని గుడ్ న్యూస్‌గా మారింది.సాధారణంగా వేల రూపాయలు వెచ్చిస్తే తప్ప దక్కని కాన్వా ప్రో, కాన్వా ప్రో లైట్ సబ్‌స్క్రిప్షన్లను జియో యూజర్స్ ఉచితంగా పొందవచ్చు. ఈ ఆఫర్ ద్వారా కేవలం ప్రీమియం టూల్స్ మాత్రమే కాకుండా.. కాన్వా ప్రో లైట్ యూజర్లకు 50 జీబీ, కాన్వా ప్రో వినియోగదారులకు ఏకంగా 100 జీబీ క్లౌడ్ స్టోరేజ్ అదనపు బెనిఫిట్‌గా లభించనుంది. ఇప్పటికే సెప్టెంబర్ 16 నుంచి ఈ సరికొత్త ఆఫర్ అందుబాటులోకి వచ్చింది. అర్హత కలిగిన యూజర్లు ‘మైజియో’ యాప్ ద్వారా ఈ ఆఫర్‌ను నేరుగా యాక్టివేట్ చేసుకోవచ్చు.

Rashmika Mandanna-Mysa: "మైసా" టీజర్ అద్భుతం..ఇలాంటి సినిమా కదా కావాల్సింది..సినిమాSwechaa20 Sep 2026, 08:49 PM

Rashmika Mandanna-Mysa: "మైసా" టీజర్ అద్భుతం..ఇలాంటి సినిమా కదా కావాల్సింది..

Rashmika Mandanna: నేషనల్ క్రష్ రష్మిక మందన్న నటిస్తున్న క్రేజీ చిత్రాల్లో ఒకటి మైసా. దర్శకుడు రవీంద్ర పుల్లె తెరకెక్కిస్తున్న ఈ పాన్ ఇండియా చిత్రాన్ని అన్‌ఫార్ములా ఫిల్మ్స్ పతాకంపై భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇక, ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన పోస్టర్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా మైసా టీజర్ ను చిత్ర బృందం రిలీజ్ చేసింది. ఈ టీజర్ ఒక్కటి చాలు సినిమా ఏ రేంజ్‌లో ఉండబోతుందో.

పాలమూరు లేకపోతే కేసీఆర్ అడుక్కుతింటుండే.. కోమటిరెడ్డి ఫైర్!తెలంగాణSwechaa20 Sep 2026, 08:48 PM

పాలమూరు లేకపోతే కేసీఆర్ అడుక్కుతింటుండే.. కోమటిరెడ్డి ఫైర్!

Komatireddy Venkat Reddy: దేవరకద్ర నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనుల శంకుస్థాపన సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి గులాబీ బాస్‌ కేసీఆర్, కేటీఆర్‌లపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పాలమూరు ప్రజల ఆదరణ వల్లే కేసీఆర్ సీఎం అయ్యారని గుర్తుచేసిన ఆయన.. కేటీఆర్‌ను ఉద్దేశించి ఘాటైన వ్యాఖ్యలు చేయడంతో సభా ప్రాంగణం ఒక్కసారిగా హోరెత్తింది.బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై మంత్రి కోమటిరెడ్డి తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. "ఆనాడు మహబూబ్‌నగర్ ప్రజలు ఎంపీగా గెలిపించకపోతే కేసీఆర్ ఇంట్లోనే పడుకుంటుండే. పాలమూరు ప్రజలు పెట్టిన రాజకీయ బిక్ష వల్లే కేసీఆర్ ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగారు. వారి అండదండలే లేకుంటే బయట అడుక్కుతింటుండేవాళ్లు. అలాంటిది పదేళ్లు రాష్ట్రాన్ని ఏలిన కేసీఆర్.. తనను గెలిపించిన పాలమూరు గడ్డకు చేసిందేంటి? పదేళ్ల పాలనలో తెలంగాణ మీద పడి రాష్ట్రాన్ని నిలువునా దోచుకుని లక్షల కోట్ల అప్పులపాలు చేశారు. చివరకు తండ్రీకొడుకులు కలిసి 100 ఎకరాల అక్రమ ఆస్తులను కూడబెట్టడమే పనిగా పెట్టుకున్నారు" అంటూ నిప్పులు చెరిగారు.

ఉప ఎన్నికలొస్తే కాంగ్రెస్‌కు రాజకీయ నిమజ్జనమే.. : బండి సంజయ్తెలంగాణSwechaa20 Sep 2026, 08:21 PM

ఉప ఎన్నికలొస్తే కాంగ్రెస్‌కు రాజకీయ నిమజ్జనమే.. : బండి సంజయ్

Bandi Sanjay: అధికార కాంగ్రెస్ పార్టీ తీరుపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ నిప్పులు చెరిగారు. అధికారంలో ఉండి కూడా ప్రతిపక్షాల మాదిరిగా ఫాంహౌజ్‌ల చుట్టూ తిరగడం ఏంటని ఎద్దేవా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉప ఎన్నికలొస్తే కాంగ్రెస్‌కు రాజకీయ నిమజ్జనమే అని అన్నారు. ఫాంహౌజ్ వివాదంపై కాంగ్రెస్ నేతలు చేస్తున్న రచ్చను బండి సంజయ్ తీవ్రంగా తప్పుపట్టారు. "ఫాంహౌజ్ ఏమైనా ప్రజలు వెళ్లి చూసొచ్చే టూరిస్ట్ కేంద్రమా? అనుమతి లేకుండా ప్రైవేట్ భూముల్లోకి వెళ్లే అధికారం మీకెక్కడిది? అసలు అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ కాదా? అక్కడ ఏమైనా ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురై ఉంటే, లేదా భూదోపిడీ జరిగి ఉంటే వెంటనే ఆధారాలతో సహా బయటపెట్టి వాటిని స్వాధీనం చేసుకోండి. అంతేకానీ, దోషులపై క్రిమినల్ చర్యలు తీసుకోకుండా ఈ విజిట్లు, హడావుడి దేనికి? ప్రతిపక్షంలో ఉన్నవాళ్లు విమర్శల కోసం అక్కడికి వెళ్తే అర్థం చేసుకోవచ్చు.. కానీ అధికారంలో ఉండి కూడా ఈ రకమైన విన్యాసాలు చేయడం విడ్డూరంగా ఉంది" అంటూ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

The Paradise-Ticket Hike: నైజాంలో ప్యారడైజ్ కి టికెట్ హైక్ తో పాటు ప్రీమియర్స్‌కి పర్మిషన్స్సినిమాSwechaa20 Sep 2026, 07:50 PM

The Paradise-Ticket Hike: నైజాంలో ప్యారడైజ్ కి టికెట్ హైక్ తో పాటు ప్రీమియర్స్‌కి పర్మిషన్స్

The Paradise: గత కొంతకాలంగా మన సౌత్ సినిమా ఇండస్ట్రీలో పాన్ ఇండియా స్కేల్ లో రూపొందించే సినిమాలకి రిలీజ్ సయమలో రెండు తెలుగు రాష్ట్రాలలో టికెట్ ధరలను పెంచమని కోరుతు మేకర్స్ ప్రభుత్వాలకి లేఖ రాస్తున్నాయి. దానిని పరిశీలించిన సినిమాటోగ్రఫీ మంత్రి..అధికారులతో మాట్లాడి..అవసరం మేరకు రిలీజ్ రోజు నుంచి కొద్ది రోజులు సింగిల్ స్క్రీన్స్, మల్టీప్లెక్స్‌లో ధరలను పెంచుతూ జీవోను ఇస్తున్నారు.

Kaaka-Chiru: చిరు లీక్స్‌లో కాకా టైటిల్ మీనింగ్ ఇదే!సినిమాSwechaa20 Sep 2026, 07:27 PM

Kaaka-Chiru: చిరు లీక్స్‌లో కాకా టైటిల్ మీనింగ్ ఇదే!

Kaaka: మెగాస్టార్ చిరంజీవి ఇటీవల తన సినిమాలకి సంబందించిన లీక్స్ ఇస్తూ అభిమానుల్లో ఆతృతను పెంచుతున్న సంగతి తెలిసిందే. ఆయన నోట మాట వస్తే చాలు.. అది లీక్ అవుతుందా? లేక కావాలనే బయటకు వస్తుందా? అని అందరూ చర్చించుకుంటున్నారు. ముఖ్యంగా, ఆయన ప్రస్తుతం నటిస్తున్న కాకా సినిమా విషయంలో అదే జరుగుతోంది. ఓపెనింగ్ రోజే సినిమా టైటిల్ ని లీక్ చేయడానికి ట్రై చేసి ఆసక్తి రేపాడు.

Kalvakuntla Kavitha: నేను ఎవరి బాణాన్ని కాదు.. బహుజనుల బాణాన్ని : కవితతెలంగాణSwechaa20 Sep 2026, 07:14 PM

Kalvakuntla Kavitha: నేను ఎవరి బాణాన్ని కాదు.. బహుజనుల బాణాన్ని : కవిత

Kalvakuntla Kavitha: సీఎం రేవంత్‌రెడ్డి సొంత అడ్డా కొడంగల్‌ గడ్డపై నుంచి తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత చేసిన కామెంట్స్ ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తున్నాయి. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలపై ముప్పేట దాడి చేస్తూనే.. స్థానిక పరిస్థితులపై నేరుగా సీఎంపైనే ప్రశ్నల వర్షం కురిపించారు. వికారాబాద్‌ జిల్లా కొడంగల్‌లో కార్యకర్తల భారీ ర్యాలీ నడుమ నిర్వహించిన ‘పాంచజన్య సంకల్ప సభ’లో ఆమె చేసిన ప్రసంగం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో దుమారం రేపుతోంది.తన రాజకీయ అస్తిత్వంపై వస్తున్న విమర్శలను కవిత సూటిగా తిప్పికొట్టారు. "కాంగ్రెస్‌ విడిచిన బాణమని బీఆర్‌ఎస్‌ నేతలు ప్రచారం చేస్తుంటే.. కేసీఆర్‌ వదిలిన బాణమంటూ సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతున్నారు. మరికొందరు బుర్రలేని వ్యక్తులు నేను బీజేపీ బాణమంటూ ప్రచారం చేస్తున్నారు. కొడంగల్‌ సాక్షిగా తేల్చి చెబుతున్నా.. నేనెవరి బాణాన్నీ కాదు. అధికారానికి, నాణ్యమైన విద్యకు నోచుకోని తెలంగాణ బహుజనుల బాణాన్ని నేను. తెలంగాణ యువత గొంతుకను, అంబేడ్కర్‌ వాదాన్ని, మహాత్మా జ్యోతిబా ఫూలే ఆత్మగౌరవ నినాదాన్ని నేను" అంటూ గర్జించారు.

Amazon 'గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్' సేల్ డేట్స్ ఫిక్స్.. డిస్కౌంట్ల జాతర మొదలయ్యేది అప్పుడే!దునియాSwechaa20 Sep 2026, 06:00 PM

Amazon 'గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్' సేల్ డేట్స్ ఫిక్స్.. డిస్కౌంట్ల జాతర మొదలయ్యేది అప్పుడే!

Amazon: దసరా, దీపావళి సీజన్ రాకముందే ఈ-కామర్స్ రంగంలో వార్ స్టార్ట్ అయ్యింది. ఆన్‌లైన్ షాపింగ్ ప్రియులకు నిద్రలేకుండా చేసే అసలైన డిస్కౌంట్ల పండగకు రంగం సిద్ధమైంది. తన ప్రత్యర్థి సంస్థ ఫ్లిప్‌కార్ట్ కంటే ఒక అడుగు ముందే ఉంటూ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ సరికొత్త ఎత్తుగడ వేసింది. మోస్ట్ అవేటెడ్ ‘గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2026’ సేల్ ఎప్పటినుంచి ప్రారంభం కానుందో అధికారికంగా రివీల్ చేసింది.ఈ ఏడాది ఫెస్టివల్ వార్‌లో అమెజాన్ ముందస్తు వ్యూహం ఆసక్తికరంగా మారింది. ఫ్లిప్‌కార్ట్ తన పాపులర్ ‘బిగ్ బిలియన్ డేస్’ సేల్‌ను అక్టోబర్ 9 నుంచి తీసుకువస్తుండగా, దానికి ఒక్కరోజు ముందే.. అంటే అక్టోబర్ 8 నుంచే అమెజాన్ ‘గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్’ పండగ మొదలుకానుంది. ఫ్లిప్‌కార్ట్ బ్లాక్ మెంబర్లకు అక్టోబర్ 8 నుంచి యాక్సెస్ ఉన్నప్పటికీ, అమెజాన్ మాత్రం తన సాధారణ సేల్‌ను అదే రోజున ఓపెన్ చేసి భారీగా ట్రాఫిక్‌ను లాగేందుకు ప్లాన్ చేసింది.

Warangal MGM: వరంగల్ ఎంజీఎంలో షాకింగ్ ఘటన.. పెచ్చులూడి పడి పలువురికి గాయాలు!తెలంగాణSwechaa20 Sep 2026, 05:08 PM

Warangal MGM: వరంగల్ ఎంజీఎంలో షాకింగ్ ఘటన.. పెచ్చులూడి పడి పలువురికి గాయాలు!

Warangal MGM: వరంగల్ ఎంజీఎం ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రమాదం చోటుచేసుకుంది. రోగాల నుంచి విముక్తి పొందేందుకు ఆస్పత్రికి వచ్చిన పేషెంట్లపై పెచ్చులూడి పడ్డాయి. ఆరోగ్యశ్రీ వార్డులో ఎప్పటిలాగే ఆదివారం చికిత్స పొందుతున్న రోగులు, వారికి సపర్యలు చేస్తున్న కుటుంబ సభ్యులతో సందడిగా ఉంది. సరిగ్గా అదే సమయంలో ఎవరూ ఊహించని రీతిలో వార్డు పైకప్పు పెచ్చులు పెద్ద శబ్దంతో ఒక్కసారిగా ఊడి కిందపడ్డాయి. ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే ఆ శిథిలాలు నేరుగా రోగులపై పడ్డాయి. ఈ ఊహించని పరిణామంతో వార్డులో చికిత్స పొందుతున్న సారయ్య, మస్తాన్, స్వరూపలతో పాటు వారిని పరామర్శించేందుకు వచ్చిన బంధువులు తీవ్రంగా గాయపడ్డారు. అంతేకాకుండా అక్కడే విధి నిర్వహణలో ఉన్న ఇద్దరు పారిశుద్ధ్య కార్మికులు కూడా ఈ ప్రమాదం బారినపడ్డారు.పైకప్పు విరిగిపడటంతో ఒక్కసారిగా తీవ్ర భయాందోళనకు గురైన తోటి పేషెంట్లు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బయటకు పరుగులు తీశారు. అప్రమత్తమైన ఇతర సిబ్బంది వెంటనే క్షతగాత్రులను ఎమర్జెన్సీ వార్డు తరలించి తక్షణ చికిత్స అందించారు.

రాహుల్ సభలో మోదీపై స్కిట్.. భగ్గుమన్న బీజేపీ!!..NationalSwechaa20 Sep 2026, 04:53 PM

రాహుల్ సభలో మోదీపై స్కిట్.. భగ్గుమన్న బీజేపీ!!..

ఇండోర్‌లో రాహుల్ గాంధీ నిర్వహించిన ‘ఛాత్రోంకీ గుంజ్’ కార్యక్రమం ఇప్పుడు పొలిటికల్ ఫైర్‌కు కారణమైంది. ప్రధాని నరేంద్ర మోదీ హావభావాలను స్టాండప్ కమెడియన్ పుల్కిత్ మణి అనుకరిస్తూ స్కిట్ చేయగా.. ఆ సమయంలో రాహుల్ గాంధీ కూడా వేదికపైనే ఉన్నారు. దీంతో బీజేపీ తీవ్రంగా స్పందించింది. పార్టీ అధికార ప్రతినిధి సీఆర్ కేశవన్.. ఈ ప్రదర్శనను అసభ్య ప్రవర్తన, చౌకబారు ట్రోలింగ్‌గా అభివర్ణించారు. ఇలాంటి రాజకీయ సంస్కృతి యువతలో రాహుల్ గాంధీపై ప్రభావం చూపదంటూ విమర్శలు గుప్పించారు.

ప్రేక్షకులు బ్రహ్మరథం.. ఇండస్ట్రీ మౌనం!.. "ఇరుముడి" పై ఇదేం తీరు?..సినిమాSwechaa20 Sep 2026, 04:07 PM

ప్రేక్షకులు బ్రహ్మరథం.. ఇండస్ట్రీ మౌనం!.. "ఇరుముడి" పై ఇదేం తీరు?..

శివ నిర్వాణ దర్శకత్వంలో వచ్చిన ఇరుముడి పెద్ద హిట్టయింది. ఇంతటి విజయాన్ని సాధించిన ఇరుముడి టీమ్ ను మెగా కాంపౌండ్ హీరోలు అభినందించారు. పవన్ కల్యాణ్ ప్రత్యేకంగా ట్వీట్ వేశారు. చిరంజీవి టీమ్ ను తన ఇంటికి ఆహ్వానించి అభినందించారు. రవితేజను ఆలింగనం చేసుకొని మరీ మెచ్చుకున్నారు. ఇందులో రామ్ చరణ్ కూడా కనిపించాడు. ఈ సినిమా థియేటర్లలోకొచ్చి ఇప్పటికీ నెల రోజులు అవుతుంది. కానీ ఇంతవరకు ఇతర టాలీవుడ్ ప్రముఖులు ఈ చిత్రాన్ని మెచ్చుకుని, టీమ్ ను అభినందించక పోవడం విడ్డూరంగా మారింది. టాలీవుడ్ అంటే ఒక కుటుంబం, మేమంతా ఒక్కటే అని చెప్పుకునే సోకాల్డ్ ప్రముఖులెవ్వరూ ఇరుముడి విజయంపై స్పందించక పోవడం శోచనీయం..

Etela Rajender: సీఎం కుర్చీపై ఈటల కన్ను పడిందా?.. ఆ ఇంటర్వ్యూ క్లిప్‌తో నెట్టింట దుమారం!తెలంగాణSwechaa20 Sep 2026, 04:01 PM

Etela Rajender: సీఎం కుర్చీపై ఈటల కన్ను పడిందా?.. ఆ ఇంటర్వ్యూ క్లిప్‌తో నెట్టింట దుమారం!

Etela Rajender: తెలంగాణ రాజకీయ ముఖచిత్రంపై ఎప్పటికప్పుడు రాజుకునే ‘సామాజిక న్యాయం’ నినాదం మరోసారి తెరపైకి వచ్చింది. రాష్ట్ర జనాభాలో సింహభాగం ఉన్న వెనుకబడిన వర్గాలకు (బీసీలకు) అత్యున్నత అధికార పీఠం ఎందుకు అందని ద్రాక్షగా మిగిలిపోతోంది? ఉద్యమాల గడ్డపై సామాజిక సమీకరణాల చర్చ ఎటు మళ్లుతోందని అంటూ ఒక ఇంటర్వ్యూలో బీజేపీ సీనియర్ నేత, ఎంపీ ఈటల రాజేందర్ తాజా కామెంట్స్ ఇప్పుడు అధికార, విపక్ష శిబిరాల్లో సరికొత్త ప్రకంపనలు రేపుతున్నాయి.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి పాలన మొదలుకొని నేటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం వరకు దాదాపు ఏడు దశాబ్దాల రాజకీయ ప్రస్థానాన్ని పరిశీలిస్తే ఒక చేదు నిజం స్పష్టంగా కనిపిస్తుంది. ఎందరో ఉద్దండులు ముఖ్యమంత్రులుగా మారినా, సంఖ్యాపరంగా అత్యధికంగా ఉన్న బీసీ, ఎస్సీ వర్గాలకు పాలనా పగ్గాలు చేపట్టే అవకాశం దక్కలేదు. ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష నెరవేరి దశాబ్దం గడిచినా తెలంగాణ గడ్డపై అదే ఆధిపత్య రాజకీయ సమీకరణాలు పునరావృతమవుతున్నాయన్న భావన ప్రజల్లో ఉంది. ఈ సున్నితమైన అంశాన్ని నేరుగా ఎత్తిచూపడం ద్వారా ఈటల రాజేందర్ తెలంగాణ రాజకీయాల్లో అత్యంత క్లిష్టమైన చర్చకు తెరలేపారు.

KetanAgarwalCase: కేతన్ అగర్వాల్ హత్య కేసులో పురోగతి.. కోర్టులో 5,053 పేజీల ఛార్జిషీట్ దాఖలు!క్రైమ్Swechaa20 Sep 2026, 03:39 PM

KetanAgarwalCase: కేతన్ అగర్వాల్ హత్య కేసులో పురోగతి.. కోర్టులో 5,053 పేజీల ఛార్జిషీట్ దాఖలు!

 దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన యువ వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ హత్య కేసులో మహారాష్ట్ర పోలీసులు విచారణ పూర్తి చేసి కోర్టులో ఛార్జిషీట్ సమర్పించారు. పుణె కోర్టులో దాఖలు చేసిన ఈ 5,053 పేజీల భారీ ఛార్జిషీట్‌లో ఈ దారుణ హత్య వెనుక ఉన్న కుట్ర, పథకరచన, అమలుకు సంబంధించిన ప్రణాళికను పోలీసులు సమగ్రంగా వివరించారు. ఈకేసులో ప్రధాన నిందితురాలైన కాబోయే భార్య సియా గోయల్, ఆమె ప్రియుడు చేతన్ చౌదరి, మరో నిందితుడు రితేష్ హంగేలను అరెస్ట్ చేసినట్లు అధికారులు వెల్లడించారు.

కోర్టు తీర్పు వచ్చినా వీడని EPS కష్టాలు.. హైయర్ పెన్షన్‌కు కొత్త అడ్డంకులు!!..NationalSwechaa20 Sep 2026, 03:39 PM

కోర్టు తీర్పు వచ్చినా వీడని EPS కష్టాలు.. హైయర్ పెన్షన్‌కు కొత్త అడ్డంకులు!!..

ఎంప్లాయిమెంట్ పెన్షన్ యోజన (EPS-1995) కింద హైయర్ పెన్షన్ కోసం ఎదురుచూస్తున్న ఉద్యోగులు, పెన్షనర్లకు సంబంధించిన అంశంపై బీజేపీ రాజ్యసభ సభ్యులు అజిత్ మాధవ్రావ్ గోపచ్డే ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు. పెండింగ్‌లో ఉన్న హైయర్ ఈపీఎస్ పెన్షన్ కేసులలో జోక్యం చేసుకుని, అర్హులైన పెన్షనర్ల సమస్యలను ఒకేలాంటి నిబంధనలతో నిర్దేశిత కాలపరిమితిలోగా పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రక్రియలో తలెత్తుతున్న ఇబ్బందులు, వివిధ కోర్టుల్లో నడుస్తున్న కేసులు, పెన్షన్ల చెల్లింపుల్లో అసమానతలు వంటి కీలక అంశాలను ఆయన లేఖలో ప్రస్తావించారు.

భార్య ముక్కు కొరికిన భర్త.. దీనివెనుక ఇంత స్టోరీ నడిచిందా?వైరల్ న్యూస్Swechaa20 Sep 2026, 03:30 PM

భార్య ముక్కు కొరికిన భర్త.. దీనివెనుక ఇంత స్టోరీ నడిచిందా?

దంపతులు గొడవ పడిన ఘటనలో భర్త భార్య ముక్కు కొరికాడని ఓ వార్త వైరల్ అయ్యింది.అయితే, దానివెనుక పెద్ద స్టోరీ ఉందని తాజాగా వెలుగుచూసింది. భార్య భర్తల మధ్య గొడవకు మనస్పర్దలు కారణం కావని..భార్య వివాహేతర సంబంధమే కారణమని తెలిసింది. భర్తను కాదని ఇంట్లో చెప్పకుండా ప్రియుడితో వెళ్లిన భార్య.. మరల పిల్లల కోసం దొంగతనంగా ఇంట్లోకి చొరబడటంతో ఇద్దరి మధ్య తగవులాట చోటుచేసుకుంది.ఈ క్రమంలోనే భర్త.. భార్య ముక్కు కొరికినట్టు తెలుస్తుండగా.. బాధితురాలు మాత్రం మరో విధంగా పోలీసులకు స్టేట్మెంట్ ఇచ్చింది. పోలీసుల విచారణలో అసలు విషయం వెలుగుచూసింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని హర్డోయి జిల్లా కేంద్రంలో చోటుచేసుకోగా.. ఆలస్యంగా వెలుగుచూసింది. పూర్తి వివరాల్లోకివెళితే.. సాధన(27), దీపక్ భార్యాభర్తలు..వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. దీపక్ ఫ్రెండ్‌తో సాధన వివాహేతర సంబంధం పెట్టుకొని, రెండున్నర నెలల క్రితం అతనితో వెళ్లిపోయింది.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇక ఉండదా?.. ట్రంప్ కొత్త నేమ్ గేమ్!..InternationalSwechaa20 Sep 2026, 03:19 PM

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇక ఉండదా?.. ట్రంప్ కొత్త నేమ్ గేమ్!..

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ఓ ప్రకటన ఇప్పుడు టెక్ ప్రపంచంలో ఆసక్తికర చర్చకు దారితీసింది. ఏఐకి ఉన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే పేరు అంత ఆకర్షణీయంగా లేదని భావించిన ట్రంప్.. దానికి కొత్త పేరు పెట్టేందుకు తన సోషల్ మీడియా వేదిక ట్రూత్ సోషల్‌లో ఓ పోల్ నిర్వహించారు. ప్రస్తుతం ఉన్న ఆర్టిఫిషియెల్ ఇంటెలిజెన్స్ అనే పేరు సరైనది కాదని, అది అంతగా ఆకర్షణీయంగా కూడా లేదని ట్రంప్ అభిప్రాయపడ్డారు. ఏఐకి బదులుగామూడు పేర్లు సూపర్ ఇంటెలిజెన్స్, ఎక్స్‌ట్రీమ్ ఇంటెలిజెన్స్, సుప్రీం ఇంటెలిజెన్స్‌ను ఆయన సూచించారు. ఈ మూడు పేర్లలో ఏది బాగుంటుందో తన ఫాలోవర్లు ఓటు వేయాలని ట్రంప్ కోరారు.

Nara Lokesh:  తరగతి గది నుంచే సమాజంలో నిజమైన మార్పు: నారా లోకేశ్ఏపీSwechaa20 Sep 2026, 03:06 PM

Nara Lokesh:  తరగతి గది నుంచే సమాజంలో నిజమైన మార్పు: నారా లోకేశ్

 పాఠశాల గదుల నుంచే సమాజంలో విప్లవాత్మకమైన మార్పులు సాధ్యమవుతాయని, అందుకే తాను విద్యాశాఖను బాధ్యతాయుతంగా ఎంచుకున్నానని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. అధునాతన సాంకేతికతకు భారతీయ సంప్రదాయ నైతిక విలువలను జోడించడం ద్వారా విద్యార్థులు అంతర్జాతీయ వేదికలపై జగజ్జేతలుగా ఎదగవచ్చని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రభుత్వ సంస్కరణలకు చాగంటి లాంటి మహనీయుల ఆదర్శాలు తోడైతే రాష్ట్ర విద్యావ్యవస్థ దేశంలోనే ప్రథమ స్థానంలో నిలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

Telangana BJP: ఎవరి దారి వారిదే.. అసెంబ్లీ సాక్షిగా బీజేఎల్ పీలో ఏం జరిగింది?తెలంగాణSwechaa20 Sep 2026, 02:48 PM

Telangana BJP: ఎవరి దారి వారిదే.. అసెంబ్లీ సాక్షిగా బీజేఎల్ పీలో ఏం జరిగింది?

Telangana BJP: తెలంగాణ అసెంబ్లీ వేదికగా ప్రధాన ప్రతిపక్ష పాత్రను సమర్థవంతంగా పోషించేందుకు వచ్చిన గోల్డెన్ ఛాన్స్‌ను బీజేపీ శాసనసభ్యులు చేజేతులా జారవిడుచుకున్నారన్న చర్చ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది. సమావేశాల ఆరంభంలోనే బీఆర్‌ఎస్ సభ్యులు సస్పెండ్ కావడంతో, ప్రభుత్వ వైఫల్యాలను నిలదీసి ప్రజల్లో బలమైన ముద్ర వేసే అద్భుతమైన అవకాశం కాషాయ దళానికి దక్కింది. అయితే ఆ అవకాశాన్ని ప్రజా సమస్యల పరిష్కారానికి వాడాల్సింది పోయి, అంతర్గత కుమ్ములాటలు, వ్యక్తిగత ఇగోలకే పరిమితం చేశారన్న విమర్శలు ఇప్పుడు సొంత గూటి నుంచే వెల్లువెత్తుతున్నాయి.ఈ సెషన్‌లో అత్యంత సంచలనంగా మారిన అంశం శాసనసభా ప్రాంగణంలోని బీజేఎల్‌పీ కార్యాలయంలో జరిగిన తీవ్ర వాగ్వాదం. స్వల్పకాలిక చర్చల్లో పార్టీ తరఫున మాట్లాడే అవకాశం ఎవరికి దక్కాలనే దానిపై సభ్యులు పరస్పరం కేకలు వేసుకునే స్థాయికి వివాదం వెళ్లిందని సమాచారం.ప్రత్యేకించి శాంతిభద్రతల అంశంపై తనకు మాట్లాడే అవకాశం ఎందుకు ఇవ్వరంటూ ఓ బీజేపీ ఎమ్మెల్యే అగ్గిమీద గుగ్గిలమైనట్లు తెలిసింది. అసెంబ్లీ కారిడార్‌లోనే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, నేరుగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడికే ఫోన్ చేసి ఏకంగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానంటూ హెచ్చరికలు జారీ చేసినట్లు టాక్. చివరికి ఆయనను బుజ్జగించేందుకు స్పీకర్‌ను కోరి మరీ మాట్లాడే వెసులుబాటు కల్పించాల్సి వచ్చిందంటే అసమ్మతి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చనే కామెంట్స్ విపిస్తున్నాయి.

మల్లురవి సిగ్గులేకుండా హరీశ్ రావు ఇంటిముందు నిల్చున్నాడు : ఆర్ఎస్ ప్రవీణ్తెలంగాణSwechaa20 Sep 2026, 02:43 PM

మల్లురవి సిగ్గులేకుండా హరీశ్ రావు ఇంటిముందు నిల్చున్నాడు : ఆర్ఎస్ ప్రవీణ్

రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు, అన్నదాతలకు సాగు నీళ్లు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్న తీరుపై బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం తెలంగాణ భవన్ వేదికగా ఆయన మీడియాతో మాట్లాడారు. రేవంత్ రెడ్డి పాలనపై ఈ సందర్భంగా తీవ్ర విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రికి పాలన చేతకాదని ప్రజలకు అర్థమైందని, అందుకే ఆగ్రహించిన అన్నదాతలు జూరాల ప్రాజెక్టు తాళాలు పగులగొట్టి వెళ్లి మరీ ఆయకట్టుకు నీళ్లు వదులుకున్నారని చెప్పారు. ఆయకట్టుకు నీళ్లు అందించాలని, రైతుల సమస్యలు, ఇబ్బందులను కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్లే రైతులు తాళాలు పగులగొట్టి సాగు కోసం ప్రాజెక్టు గేట్లు ఎత్తి నీళ్లు వదులుకున్నారని పేర్కొన్నారు. దీనిని బట్టి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పనితీరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చని తెలిపారు.కాంగ్రెస్ పార్టీ ఎంపీ మల్లు రవి నియోజకవర్గంలో ఇలా జరిగితే ఆయన ఏం చేస్తున్నారని, ప్రజా సమస్యలు పట్టవా? అని ఆర్ ప్రవీణ్ కుమార్ మండిపడ్డారు.

దళితుల భూమిని తీసుకోం.. విషప్రచారాన్ని నమ్మొద్దు : మంత్రి పొంగులేటితెలంగాణSwechaa20 Sep 2026, 02:28 PM

దళితుల భూమిని తీసుకోం.. విషప్రచారాన్ని నమ్మొద్దు : మంత్రి పొంగులేటి

దళితులు, గిరిజనుల భూములను లాక్కోవడం ప్రజాప్రభుత్వ విధానం కాదని, వారి అంగుళం భూమిని కూడా తీసుకోబోమని రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి స్పష్టంచేశారు.సీఎం రేవంత్ నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం దళితుల భూములకు సంపూర్ణ రక్షణగా నిలుస్తుందని, ఈ విషయంలో ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఆదివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో మంత్రి భరోసా ఇచ్చారు. రాష్ట్రంలో రెండున్నరేండ్ల క్రితం దళితులు, గిరిజనులు, బడుగు బలహీన వర్గాల ప్రజల ఆశీస్సులతో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని పేర్కొన్నారు.సామాజిక న్యాయం, పేదల సంక్షేమం, అణగారిన వర్గాల అభ్యున్నతి కాంగ్రెస్ పాలనలో ఎప్పుడూ ప్రధాన ప్రాధాన్యతలుగా ఉన్నాయన్నారు. దేశంలో, రాష్టంలో పేదలు, దళితులు, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నది కాంగ్రెస్ ప్రభుత్వాలేనని గుర్తుచేశారు.

Priyanka Mohan: రవితేజకి జంటగా బ్యూటీ ఫిక్స్!సినిమాSwechaa20 Sep 2026, 02:28 PM

Priyanka Mohan: రవితేజకి జంటగా బ్యూటీ ఫిక్స్!

Priyanka Mohan: మాస్ మహారాజ్ రవితేజ త్వరలో కొత్త సినిమా షూటింగ్‌లో జాయిన్ కాబోతున్నాడు. ఇటీవలే ఇరుముడి సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న ఆయన వెంటనే రెండు ప్రాజెక్ట్స్‌ను లైన్‌లో పెట్టాడు. వాటిలో ఒకటి దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కనుండగా, ఇంకోటి వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో పట్టాలెక్కబోతోంది. అయితే, తాజా సమాచారం మేరకు ఇందులో హీరోయిన్‌గా ప్రియాంక మోహన్ ఫిక్సైనట్టుగా తెలుస్తోంది.

JapanFirstGold: ఆసియా క్రీడలు.. జపాన్‌కు దక్కిన తొలి స్వర్ణ పతకం!క్రీడలుSwechaa20 Sep 2026, 02:23 PM

JapanFirstGold: ఆసియా క్రీడలు.. జపాన్‌కు దక్కిన తొలి స్వర్ణ పతకం!

ఆసియా క్రీడలు 2026లో జపాన్ అథ్లెట్ తకుమి హోజో అద్భుతమైన నైపుణ్యంతో మెరిసి తన దేశానికి ఐకానిక్ విజయాన్ని అందించారు. తీవ్రమైన పోటీ నెలకొన్న పురుషుల వ్యక్తిగత ట్రైథ్లాన్ ఈవెంట్‌లో హోజో అగ్రస్థానంలో నిలిచి, ఈ క్రీడల్లో జపాన్ ఖాతాలో మొట్టమొదటి స్వర్ణ పతకాన్ని జమ చేశారు. అత్యంత ఉత్కంఠభరితంగా సాగిన ఈ రేసులో ఆద్యంతం ఆధిక్యాన్ని ప్రదర్శించిన ఆయన విశ్వవేదికపై జపాన్ జెండాను రెపరెపలాడించారు.  శారీరక దారుఢ్యానికి, సత్తువకు తీవ్రమైన పరీక్షగా నిలిచే ఈ ట్రైథ్లాన్ పోటీల్లో అథ్లెట్లు వరుసగా మూడు కఠినమైన విభాగాల్లో పోటీపడాల్సి ఉంటుంది.

కాలం తెచ్చిన కరువు కాదు.. కాంగ్రెస్సే తెచ్చింది : హరీశ్ రావుతెలంగాణSwechaa20 Sep 2026, 02:03 PM

కాలం తెచ్చిన కరువు కాదు.. కాంగ్రెస్సే తెచ్చింది : హరీశ్ రావు

రాష్ట్రంలో వర్షాలు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మాజీ మంత్రి హరీశ్ రావు మరోసారి ఫైర్ అయ్యారు. వర్భాభావ పరిస్థితుల కారణంగా నీళ్లు లేక పంటలు ఎండిపోతున్నాయని, పెట్టిన పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితులు లేవని, ఇప్పటికైనా కాంగ్రెస్ సర్కార్ మొద్దునిద్ర వీడాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం ఉదయం సోషల్ మీడియా ‘ఎక్స్’ వేదికగా ఆసక్తికర పోస్టు పెట్టారు. ‘నీళ్లు ఉన్నా మోటార్లు ఆన్ చేసి నీళ్లు ఎత్తలేని దద్దమ్మ ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం!. ఇది కాలం తెచ్చిన కరువు కాదు.. కాంగ్రెస్ పాలన తెచ్చిన కరువు!’ అని ఆగ్రహం వ్యక్తంచేశారు. కాళేశ్వరం వద్ద నీరు వృథాగా పోతున్నా పంపుహౌసుల ద్వారా ఎత్తిపోసి అన్నదాతలకు నీళ్లు ఇవ్వడం లేదని, రేవంత్ సర్కార్ కావాలనే రైతుల మీద పగ తీర్చుకుంటుందని ఆరోపించారు.

పేరు,సంతకం లేకుండా ప్రెస్‌నోట్ విడుదల ఏంటి!!తెలంగాణSwechaa20 Sep 2026, 01:33 PM

పేరు,సంతకం లేకుండా ప్రెస్‌నోట్ విడుదల ఏంటి!!

ఎర్రవెల్లి ఫామ్‌హౌస్‌ పరిసరాల్లోని భూములపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో నిష్పక్షపాత విచారణ జరిపించాలని జనసేన పార్టీ డిమాండ్‌ చేసింది. మాజీ సీఎం కేసీఆర్ ఫామ్‌హౌస్‌ పరిసరాల్లో సుమారు 700 ఎకరాల భూములపై రెవెన్యూ అధికారులు సర్వే నిర్వహిస్తున్న తరుణంలో అందులో 388 ఎకరాలు ప్రభుత్వ భూమి అని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన అంశంపైనా విచారణ జరగాలని జనసేన తెలంగాణ రాష్ట్ర ఇన్‌చార్జి నేమూరి శంకర్ గౌడ్ డిమాండ్ చేశారు. ఆయన మీడియాతో మాట్లాడినట్టు ఓ ప్రెస్‌నోట్ విడుదలైంది. అయితే, ఈ ప్రెస్‌నోట్ ఎవరు విడుదల చేశారు? అతని పేరు, సంతకం లేకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నది. ఈ ప్రెస్‌నోట్ ఫేక్ అని సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరుగుతోంది.

Sandeep Reddy Vanga-CM: వరంగల్ ఏయిర్ పోర్ట్ కి సందీప్ రెడ్డి రెండు పేర్లు..సీఎం రియాక్షన్ ఇదే!సినిమాSwechaa20 Sep 2026, 01:13 PM

Sandeep Reddy Vanga-CM: వరంగల్ ఏయిర్ పోర్ట్ కి సందీప్ రెడ్డి రెండు పేర్లు..సీఎం రియాక్షన్ ఇదే!

Sandeep Reddy Vanga: తెలంగాణలోని వరంగల్‌కు అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటు కావాలన్న దశాబ్దాల కల సాకారం కాబోతోంది. ప్రస్తుతం, ఈ దిశగా అడుగులు పడుతున్న నేపథ్యంలో.. ఈ ఎయిర్‌పోర్టుకు ఏ పేరు పెట్టాలనే అంశం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఎంత్ప ఆసక్తికరంగా మారింది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోషల్ మీడియా వేదికగా ప్రజల నుంచి పేరు సూచనలు కోరడంతో పలువురు ప్రముఖులు తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు.