స్వేచ్ఛ షార్ట్స్ — తాజా తెలుగు వార్తలు

WomensT20: మహిళల టీ20ల్లో స్మృతి మంధాన సరికొత్త చరిత్ర!క్రీడలుSwechaa20 Sep 2026, 01:06 PM

WomensT20: మహిళల టీ20ల్లో స్మృతి మంధాన సరికొత్త చరిత్ర!

 భారత మహిళా క్రికెట్ జట్టు ఓపెనర్ స్మృతి మంధాన అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో అరుదైన ఘనత సాధించి ప్రపంచ రికార్డును నెలకొల్పింది. మహిళల టీ20 ఫార్మాట్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచి న్యూజిలాండ్ స్టార్ క్రీడాకారిణి సుజీ బేట్స్ పేరిట ఉన్న సుదీర్ఘ రికార్డును అధిగమించింది. తన అద్భుతమైన ఫామ్‌ను కొనసాగిస్తూ అంతర్జాతీయ టీ20ల్లో ఏకంగా 4,760 పరుగుల మైలురాయిని చేరుకుని ఈ చరిత్రను తిరగరాసింది.  భారత జట్టుకు ఓపెనర్‌గా సుదీర్ఘకాలంగా సేవలందిస్తున్న మంధాన, పవర్‌ప్లే ఓవర్లలో వేగంగా పరుగులు సాధించడంలో స్మృతి ఆరితేలింది.

లాల్‌బాగ్‌ గణేశ్ ఉత్సవాల్లో తీవ్ర విషాదం..తెలంగాణSwechaa20 Sep 2026, 12:34 PM

లాల్‌బాగ్‌ గణేశ్ ఉత్సవాల్లో తీవ్ర విషాదం..

దేశవ్యాప్తంగా వినాయకచవితి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. అయితే, చవితి వేడుకల్లో భాగంగా అక్కడక్కడ అనుకోని ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి.నిమజ్జన వేడుకలకు హాజరై నీటమునిగి, విద్యుత్ షాక్‌తో పలువురు మరణించడం, యాక్సిడెంట్ వంటివి చోటుచేసుకోవడం ఇలా అనేకం వెలుగుచూస్తున్నాయి. తాజాగా దేశఆర్థిక రాజధాని ముంబైలోని లాల్‌బాగ్ గణపతి కొలువుదీరిన ప్రదేశంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు ఆరుగురు విద్యుత్ షాక్‌కు గురైనట్టు సమాచారం. ఆదివారం తెల్లవారుజామున ఓ గణేష్ మండపం సమీపంలో కరెంట్ షాక్‌తో ఇద్దరు మృతి చెందగా, మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల్లో ఓ చిన్నారి, మహిళ ఉన్నట్టు సమాచారం.

బాలాపూర్ గణనాథుడి సేవలో విజయ్ దేవరకొండ.. సెల్ఫీల కోసం ఎగబడ్డ అభిమానులు!సినిమాSwechaa20 Sep 2026, 12:23 PM

బాలాపూర్ గణనాథుడి సేవలో విజయ్ దేవరకొండ.. సెల్ఫీల కోసం ఎగబడ్డ అభిమానులు!

 రాజధాని హైదరాబాద్ నగరంలో గణేశ్‌ నవరాత్రి ఉత్సవాలు ఎంతో ఆధ్యాత్మిక శోభతో, వైభవంగా సాగుతున్నాయి. ఈ వేడుకల్లో భాగంగా టాలీవుడ్ ప్రముఖ కథానాయకుడు విజయ్ దేవరకొండ నగరంలోనే ఎంతో ప్రసిద్ధి చెందిన బాలాపూర్ వినాయకుని మండపాన్ని శనివారం రాత్రి సందర్శించారు. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తనయుడు పట్లోళ్ల కౌశిక్ రెడ్డితో కలిసి విచ్చేసిన విజయ్ దేవరకొండ, స్వామివారికి శ్రద్ధాభక్తులతో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు.

Nithin-Tollywood: ‘అలియాస్ రుక్మిణీ’ ఎక్కడి వరకూ వచ్చింది?సినిమాSwechaa20 Sep 2026, 12:21 PM

Nithin-Tollywood: ‘అలియాస్ రుక్మిణీ’ ఎక్కడి వరకూ వచ్చింది?

Nithin: టాలీవుడ్‌లో నితిన్‌కు లవర్ బాయ్ ఇమేజ్ ఉన్న సంగతి తెలిసిందే. ‘జయం’, ‘దిల్’, ‘ఇష్క్’, ‘గుండె జారి గల్లంతయ్యిందే’ వంటి సినిమాలతో హీరోగా తనకంటూ ఒక సపరేట్ ఇమేజ్‌ను సంపాదించుకున్నాడు నితిన్. ఇప్పుడు మరో ఆసక్తికరమైన ప్రేమకథతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు. ఆ సినిమానే ‘అలియాస్ రుక్మిణీ’. ప్రస్తుతం, షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్‌ను పూర్తి చేసుకునట్టుగా తాజా సమాచారం.

Heart-wrenching: తల్లి మృతదేహం వద్ద చిన్నారి రోదన.. కన్నీళ్లు పెట్టించిన ఘటన!క్రైమ్Swechaa20 Sep 2026, 11:51 AM

Heart-wrenching: తల్లి మృతదేహం వద్ద చిన్నారి రోదన.. కన్నీళ్లు పెట్టించిన ఘటన!

 తల్లి ప్రాణాలు తీసిన కిరాతకుల క్రూరత్వానికి ఓ పసిప్రాణం బలైంది. ఏ తప్పూ చేయని ఆ ఏడాదిన్నర పసిపాప.. ఉన్నట్టుండి కన్నతల్లి ప్రేమకు దూరమై అనాథగా మిగిలిపోయింది. రక్తపు మడుగులో నిర్జీవంగా పడివున్న తల్లి మృతదేహాన్ని పట్టుకుని, ఏమి జరిగిందో కూడా తెలియక ఆ చిన్నారి ఏడుస్తున్న దృశ్యం ప్రతీ ఒక్కరి గుండెలను పిండేసింది. కర్ణాటకలోని రాయచూరు జిల్లాలో జరిగిన ఈ దారుణ హత్యోదంతం స్థానికంగా తీవ్ర విషాదాన్ని, దిగ్భ్రాంతిని నింపింది. కర్ణాటకలోని రాయచూరు జిల్లాలో జరిగిన ఈ దారుణ హత్యోదంతం స్థానికంగా తీవ్ర విషాదాన్ని, దిగ్భ్రాంతిని నింపింది.

రేవంత్ సన్నిహితుడు నన్ను గెస్ట్‌హౌస్‌కు  రమ్మన్నాడు : మహిళా వ్యాపారవేత్త!తెలంగాణSwechaa20 Sep 2026, 11:45 AM

రేవంత్ సన్నిహితుడు నన్ను గెస్ట్‌హౌస్‌కు రమ్మన్నాడు : మహిళా వ్యాపారవేత్త!

రాష్ట్రంలో మహిళలకు వేధింపులు ఆగడం లేదు.రంగం ఏదైనా మహిళలు తమ అభ్యున్నతి కోసం చేసే పోరాటంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తున్నదని తెలుస్తోంది.ఉద్యోగాలు చేసే దగ్గర మాత్రమే కాకుండా ఇంటా,బయట, ఎక్కడపడితే అక్కడ లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్నట్టు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డి సన్నిహితుడు తనను వేధించినట్టు ఓ మహిళా వ్యాపారవేత్త సంచలన ఆరోపణలు చేసింది. ఈ మేరకు సోషల్ మీడియా ‘ఎక్స్’ వేదికగా పోస్టు పెట్టింది. ‘సాయం కోరితే సీఎం సన్నిహితుడు గెస్ట్ హౌస్‌కు రమ్మని పిలిచాడు. అడ్వర్టైజింగ్ రంగంలో కాంట్రాక్ట్ కోసం న్యాయబద్ధంగా అవకాశం ఇవ్వమని అడిగితే, సీఎంకు సన్నిహితుడైన ఒక వ్యక్తి గెస్ట్ హౌస్‌కు రావాలని పిలిచాడు’ అంటూ కె.శోభా రెడ్డి అనే మహిళా వ్యాపారవేత్త ఆవేదన వ్యక్తం చేసింది. ఎవరి పేర్లు చెప్పలేను కానీ ఇలాంటి అంశాలపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను అంటూ తన పోస్టులో పేర్కొంది.

Tollywood-Bobby: దర్శకుడు బాబీ హిట్స్ అండ్ ఫ్లాప్స్ లిస్ట్ ఇదే..మరి కాకా పరిస్థితేంటో?సినిమాSwechaa20 Sep 2026, 11:27 AM

Tollywood-Bobby: దర్శకుడు బాబీ హిట్స్ అండ్ ఫ్లాప్స్ లిస్ట్ ఇదే..మరి కాకా పరిస్థితేంటో?

Tollywood: మన సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలతో సినిమాలు చేయడం ఒక సవాల్. ఎందుకంటే..టాలీవుడ్, కోలీవుడ్ ఎక్కువగా ఫ్యాన్ బేస్డ్ ఇండస్ట్రీస్. అందుకే, స్టార్స్ ఇమేజ్‌కు తగ్గ కథ రాయాలి, అభిమానులను మెప్పించే మాస్ ఎలివేషన్స్ ఉండాలి. అలాగే, సాధారణ ప్రేక్షకుడిని కూడా థియేటర్‌కు రప్పించే కథా బలం ఉండాలి. ఈ విషయాలలో తనకంటూ ఒక ప్రత్యేకమైన శైలిని ఏర్పరుచుకున్న దర్శకుడు బాబీ (కె.ఎస్. రవీంద్ర).

AsianGames: ఆసియా క్రీడల్లో భారత్‌ బోణీ.. షూటింగ్‌లో రజతం!తెలంగాణSwechaa20 Sep 2026, 11:17 AM

AsianGames: ఆసియా క్రీడల్లో భారత్‌ బోణీ.. షూటింగ్‌లో రజతం!

 ఆసియా క్రీడల ప్రారంభంలోనే భారత క్రీడాకారులు తమ ప్రతిభను చాటుతూ పతకాల ఖాతాను తెరిచారు. మహిళల 10మీటర్ల ఎయిర్ రైఫిల్ టీమ్ విభాగంలో భారత షూటింగ్ బృందం రజత పతకాన్ని చేజిక్కించుకుని దేశానికి తొలి మెడల్‌ను అందించింది. ఇలవేనిల్ వలరివన్, సోనమ్ మస్కర్, విదర్సా వినోద్‌లతో కూడిన భారత త్రయం అత్యుత్తమ ప్రదర్శనతో చైనా తర్వాతి స్థానంలో నిలిచి సిల్వర్ మెడల్‌ను కైవసం చేసుకుంది. మరోవైపు మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్(MMA) విభాగంలో భారత అథ్లెట్ సుచిక సరికొత్త చరిత్ర సృష్టించింది.

చిరంజీవి పాటకు మాస్ స్టెప్పులు.. ‘డీజే’ బీట్‌‌‌కు కుప్పకూలాడుఏపీSwechaa20 Sep 2026, 11:16 AM

చిరంజీవి పాటకు మాస్ స్టెప్పులు.. ‘డీజే’ బీట్‌‌‌కు కుప్పకూలాడు

ఏపీలో తీవ్ర విషాదం నెలకొంది. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో వినాయక నిమజ్జనం వేడుకల్లో డీజే సాంగ్స్‌కు కాకర్లమూడి ఏసు (48)ఎంతో ఉత్సాహంగా స్టెప్పులు వేశారు. ఆయనతో పాటు ఆయన కుటుంబసభ్యులు, మరికొంత కూడా డ్యాన్సులు వేశారు.ఉన్నట్టుండి ఏసు కుప్పకూలడంతో కుటుంబసభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. పరిశీలించిన వైద్యులు గుండెపోటుతో ఏసు మరణించినట్టు పేర్కొన్నారు.

హౌతీల విధ్వంసం.. సౌదీ ఎయిర్ పోర్టులో భారీ పేలుడుప్రపంచంSwechaa20 Sep 2026, 10:41 AM

హౌతీల విధ్వంసం.. సౌదీ ఎయిర్ పోర్టులో భారీ పేలుడు

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు, వరుస దాడుల నేపథ్యంలో ఇరాన్ సైతం దూకుడుగా వ్యవహరిస్తోంది. ఈ రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గకపోవడంతో మిడిల్ ఈస్టులోని గల్ఫ్ కంట్రీస్ తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. అమెరికా ఇరాన్‌ను లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడుతుంటే.. ఇరాన్ దాని మద్దతు దారులైన హౌతీ తీవ్రదారులు యూఎస్ మిత్రదేశాలపైన సౌదీ అరేబియా మీద విరుచుకుపడుతోంది. తాజాగా ముందస్తు హెచ్చరికలు జారీ చేసి మరీ హౌతీ రెబల్స్ సౌదీ అరేబియాలోని ఓ విమానాశ్రయం మీద భారీగా దాడులు చేసినట్టు సమాచారం. హౌతీల దాడులకు రియాద్ విమానాశ్రయం సమీపంలో భారీ పేలుడు సంభవించింది.సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లో వైమానిక దాడి హెచ్చరికల తర్వాత కింగ్ ఖాలిద్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలోని ఇంధన డిపోలో భారీగా మంటలు చెలరేగాయి. మంటలు భారీగా ఎగసిపడటంతో అధికారులు అప్రమత్తం అయ్యారు.

Tollywood-Next Movies: నాని క్రేజీ లైనప్..వరుసగా మూడు ప్రాజెక్ట్స్!సినిమాSwechaa20 Sep 2026, 10:39 AM

Tollywood-Next Movies: నాని క్రేజీ లైనప్..వరుసగా మూడు ప్రాజెక్ట్స్!

Tollywood: నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం ది ప్యారడైజ్ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే పనుల్లో బిజీగా ఉన్నాడు. కయాదు లోహర్ హీరోయిన్‌గా కీర్తి సురేష్ స్పెషల్ నంబర్‌లో అలరించనుండగా, మోహన్ బాబు విలన్ పాత్రలో నటించాడు. నాని స్నేహితుడు బిర్యాని పాత్రలో సంపూర్ణేష్ కనిపించనున్నాడు. అయితే, ప్యారడైజ్ తర్వాత రిలాక్స్ అవుతాడనుకుంటే వరుసగా మూడు క్రేజీ చిత్రాలను లైన్‌లో పెట్టాడు నేచురల్ స్టార్.

ఖగోళ అద్భుతం.. ఒకే ఫ్రేమ్‌లో శుక్ర గ్రహం, పాలపుంత!వైరల్ న్యూస్Swechaa20 Sep 2026, 10:18 AM

ఖగోళ అద్భుతం.. ఒకే ఫ్రేమ్‌లో శుక్ర గ్రహం, పాలపుంత!

 అంతరిక్షంలో చోటుచేసుకునే వింతలు, విడ్డూరాలు ఎప్పుడూ మానవాళిని విశేషంగా ఆకట్టుకుంటూనే ఉంటాయి. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS) నుంచి మన భూమి, ఇతర ఖగోళ వస్తువులు ఎలా కనిపిస్తాయో తెలియజేస్తూ వ్యోమగాములు పంచుకునే అరుదైన ఛాయాచిత్రాలకు అంతర్జాలంలో విశేష ప్రాధాన్యత ఉంటుంది. తాజాగా అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ (NASA)కు చెందిన ప్రముఖ వ్యోమగామి డోన్ పెటిట్ కెమెరాలో బందీ అయిన ఒక అత్యద్భుతమైన దృశ్యం ప్రస్తుతం సోషల్ మీడియాలో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. వ్యోమగామి పంచుకున్న ఈ ఒక్క చిత్రంలోనే పలు ఖగోళ వింతలు ఒకే చోట ఆవిష్కృతం కావడం ఎంతో విశేషం.

చికెన్ ప్రియులకు షాక్.. మళ్లీ కొండెక్కిన ధరలుతెలంగాణSwechaa20 Sep 2026, 10:16 AM

చికెన్ ప్రియులకు షాక్.. మళ్లీ కొండెక్కిన ధరలు

నాన్ వెజ్ ప్రియులకు మరో షాక్ తగిలింది.చికెన్ ధరలు కొండెక్కాయి. ఆదివారం కావడంతో ఈరోజు మాంసానికి భారీగా డిమాండ్ ఉంటుంది. మిగతా వారాల్లో కొందరు మాంసానికి దూరంగా ఉంటారు. సండే హాలిడే కావడం, కుటుంబసభ్యులు అంతా ఇంట్లోనే ఉంటారు కాబట్టి.. ఎక్కువగా నాన్‌వెజ్ తినడానికి మక్కువ చూపిస్తుంటారు. భారీ డిమాండ్ నేపథ్యంలోనే వ్యాపారులు సైతం క్యాష్ చేసుకునేందుకు ధరలు పెంచడానికి మొగ్గుచూపుతారు.ఈ క్రమంలోనే చికెన్ ధరలు మరోసారి పెరిగాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ చికెన్ ధరలు పెరిగినట్టు సమాచారం.గతవారంతో పోలిస్తే ఈ వారం చికెన్ ధర కిలోపై రూ.20 నుంచి రూ.30వరకు పెరిగినట్టు సమాచారం.పౌల్ట్రీ ఉత్పత్తి, డిమాండుకు సరిపడా సరఫరా వ్యత్యాసాల కారణంగా వ్యాపారులు ధరలను పెంచినట్లు తెలుస్తోంది. మటన్ ధర సామాన్యుడికి అందుబాటులో లేకపోవడంతో పేదలు, మధ్యతరగతి ప్రజలు చికెన్, చేపలు తినేందుకు ఆసక్తి చూపిస్తుంటారు.

GoldPriceToday: మళ్లీ పైపైకి పసిడి.. తాజా బులియన్ మార్కెట్ ధరలు ఇవే!వ్యాపారంSwechaa20 Sep 2026, 09:47 AM

GoldPriceToday: మళ్లీ పైపైకి పసిడి.. తాజా బులియన్ మార్కెట్ ధరలు ఇవే!

 దేశీయ బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు మళ్లీ క్రమంగా పెరుగుదల బాటపట్టాయి. గడిచిన కొన్ని రోజులుగా పసిడి రేట్లు కొంతమేర తగ్గడంతో స్థిరత్వం కనిపిస్తుందని భావించిన కొనుగోలుదారులకు ఈ తాజా పెరుగుదల కొంత ఆందోళన కలిగిస్తోంది. అంతర్జాతీయ విపణిలో చోటుచేసుకుంటున్న శీఘ్ర మార్పుల వల్ల రానున్న రోజుల్లో పసిడి ధ‌ర‌లు సరికొత్త ఆల్‌టైమ్ రికార్డులను సృష్టించే అవకాశం ఉందని ఆర్థిక రంగ విశ్లేషకులు భావిస్తున్నారు. తెలంగాణ రాజధాని హైదరాబాద్ బులియన్ మార్కెట్ తాజా లెక్కల ప్రకారం.. పసిడి ధరల్లో స్పష్టమైన వ్యత్యాసం కనిపించింది.

పెళ్లిపేరుతో మోసం.. మహాభారతం సీరియల్‌లో భీముడు అరెస్టు!క్రైమ్Swechaa20 Sep 2026, 09:36 AM

పెళ్లిపేరుతో మోసం.. మహాభారతం సీరియల్‌లో భీముడు అరెస్టు!

దేశవ్యాప్తంగా ఫేమస్ అయిన మహాభారతం సీరియల్‌లో భీముడి పాత్రలో నటించిన యాక్టర్, రెజ్లర్ సౌరవ్ గుజ్జర్‌ను హైదరాబాద్ గచ్చిబౌలి పోలీసులు అరెస్టు చేశారు. పెళ్లిపేరుతో మోసం చేశాడని, లైంగికంగా వాడుకుని వదిలేశాడని ఓ యువతి ఇచ్చిన ఫిర్యాదుతో ముంబై ఎయిర్ పోర్టులో పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. సౌరవ్ గుజ్జర్ బాలీవుడ్ బుల్లితెరలో నటించడంతో పాటు సినిమాల్లోనూ పలు విలన్ పాత్రలు పోషించాడు. దీనికి తోడు అమెరికాలో నిర్వహించే రెజ్లింగ్ క్రీడల్లోనూ పార్టిసిపేట్ చేసి సత్తా చాటాడు. వివరాల్లోకివెళితే.. 2021లో ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పరిచయమైన గుజ్జర్.. అనంతరం వాట్సాప్ వేదికగా సన్నిహితంగా మెలిగాడని యువతి తన ఫిర్యాదులో పేర్కొన్నట్టు సమాచారం. 2021 డిసెంబర్ 25న తొలిసారి కలిశామని, భార్యతో సమాన హక్కులు కల్పిస్తానని హామీ ఇచ్చాడంటూ యువతి ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలిసింది. తనకు సన్నిహితంగా ఉంటూ దగ్గరయ్యాడని, తీరా పెళ్లి పేరు ఎత్తితే పట్టించుకోవడం లేదని బాధితురాలు ఫిర్యాదు చేసింది.

మత సామరస్యం అంటే ఇదే.. రూ.1.45లక్షలకు గణేశ్ లడ్డూను దక్కించుకున్న ముస్లిం దంపతులు!తెలంగాణSwechaa20 Sep 2026, 09:29 AM

మత సామరస్యం అంటే ఇదే.. రూ.1.45లక్షలకు గణేశ్ లడ్డూను దక్కించుకున్న ముస్లిం దంపతులు!

శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలో మానవత్వానికి, మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే ఒక అరుదైన సన్నివేశం ఆవిష్కృతమైంది. వినాయక నిమజ్జనోత్సవాల సందర్భంగా నిర్వహించిన స్వామివారి లడ్డూ వేలంలో చాందిని, మస్తాన్‌ వలి అనే ముస్లిం దంపతులు అత్యంత ఉత్సాహంగా పాల్గొన్నారు. అందరినీ ఆశ్చర్యపరుస్తూ పోటీపడిన ఈ దంపతులు ఏకంగా రూ.1,45,000 చెల్లించి గణనాథుని దివ్య ప్రసాదాన్ని తమ వశం చేసుకున్నారు. విశ్వాసాలు, ఆచారాలు వేరైనా సోదరభావం, భక్తి భావన ఒకటేనని చాటిచెప్పిన ఈ సంఘటన స్థానిక ప్రజల హృదయాలను విశేషంగా ఆకట్టుకుంది.

Asia war: మిడిల్ ఈస్ట్‌లో హై టెన్షన్.. అప్రమత్తమైన ఇరాన్-అమెరికా-ఇజ్రాయెల్!!..InternationalSwechaa20 Sep 2026, 09:15 AM

Asia war: మిడిల్ ఈస్ట్‌లో హై టెన్షన్.. అప్రమత్తమైన ఇరాన్-అమెరికా-ఇజ్రాయెల్!!..

పశ్చిమాసియాలో మరోసారి యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి. మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో పరిస్థితులు ఆందోళనకరంగా మారాయి. ఇరాన్, దాని ప్రాక్సీ దళాలు, అమెరికా-ఇజ్రాయెల్ కూటమి మధ్య ఘర్షణలు తీవ్రరూపం దాల్చడంతో ఈ ప్రాంతంలో ఎప్పుడేం జరుగుతుందోనన్న భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. రాబోయే సైనిక ముప్పును ముందస్తుగా ఊహిస్తూ ఇరాన్ తన సాయుధ బలగాలను అప్రమత్తం చేసింది. పరిస్థితుల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన క్యాంప్ డేవిడ్ పర్యటనను వెంటనే రద్దు చేసుకుని, అత్యవసరంగా వైట్ హౌస్‌కు చేరుకున్నారు. అలాగే, ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహు కూడా తన అమెరికా పర్యటనను మధ్యలోనే ముగించుకుని అత్యవసరంగా స్వదేశానికి తిరుగుపయనమయ్యారు.

Bollywood: రణ్‌వీర్–దీపికా దంపతులకు ఆడపిల్ల..“వెల్కమ్ బేబీ గర్ల్, 19/9/2026” అంటూ క్యాప్షన్సినిమాSwechaa20 Sep 2026, 09:11 AM

Bollywood: రణ్‌వీర్–దీపికా దంపతులకు ఆడపిల్ల..“వెల్కమ్ బేబీ గర్ల్, 19/9/2026” అంటూ క్యాప్షన్

Bollywood: బాలీవుడ్ స్టార్ కపుల్ రణ్‌వీర్ సింగ్, దీపికా పదుకోనె దంపతులు ఆనందంలో మునిగి తేలుతున్నారు. వారి ఇంట్లోకి కొత్త అథితి వచ్చారు. ఈ జంటకి పండంటి ఆడబిడ్డ జన్మించింది. ఈ విషయాన్ని రణ్‌వీర్ సింగ్, దీపికా పదుకోనె సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ఇక, ఈ సందర్భంగా వారు..“వెల్కమ్ బేబీ గర్ల్, 19/9/2026” అంటూ క్యాప్షన్ ఇవ్వడం ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం, సోషల్ మీడియాలో ఇదే వార్త వైరల్ అవుతోంది.

LPG: వంటగ్యాస్ సబ్సిడీకి కొత్త రూల్.. అక్టోబర్ 1 నుంచి అమలు!NationalSwechaa20 Sep 2026, 09:05 AM

LPG: వంటగ్యాస్ సబ్సిడీకి కొత్త రూల్.. అక్టోబర్ 1 నుంచి అమలు!

 దేశీయ వంటగ్యాస్ (LPG) వినియోగదారులకు కేంద్ర పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వ శాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. రాయితీ(సబ్సిడీ) ధరకే వంటగ్యాస్ సిలిండర్లను పొందాలంటే 2026 అక్టోబర్ 1 నాటికి బయోమెట్రిక్ ఆధార్ ప్రామాణీకరణ (BAA) ప్రక్రియను పూర్తి చేయడం తప్పనిసరి అని స్పష్టం చేసింది. అర్హులైన పేద కుటుంబాలకు మాత్రమే సబ్సిడీ ప్రయోజనాలు అందేలా చూడటంతో పాటు, గృహ అవసరాల సిలిండర్లు వాణిజ్య, పారిశ్రామిక రంగాలకు అక్రమంగా మళ్లకుండా నిరోధించడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.  

దానం దెబ్బతో కడియంలో టెన్షన్.. స్టేషన్‌ఘన్‌పూర్‌లో పొలిటికల్ హీట్!!..తెలంగాణSwechaa20 Sep 2026, 08:42 AM

దానం దెబ్బతో కడియంలో టెన్షన్.. స్టేషన్‌ఘన్‌పూర్‌లో పొలిటికల్ హీట్!!..

దానం నాగేందర్‌పై అన్హరత వేటు పడటంతో ఇప్పుడు స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరికి టెన్షన్ పట్టుకున్నట్టు ప్రచారం జరుగుతుంది. ఈ క్రమంలో ఆయన కూడా పార్టీ ఫిరాయించినట్టు బలమైన ఆధారాలు ఉన్నట్టు న్యాయనిపుణులు భావిస్తున్నారు. ఇప్పటికే ఆయనపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ పార్టీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. త్వరలో ఆ కేసు విచారణకు రానుంది. అప్పుడు కడియం సభ్యత్వం సైతం రద్దు చేస్తూ ఉన్నత న్యాయ స్థానం తీర్పువెలువరిస్తుందని బీఆర్ఎస్ నేతలు అంచనా వేస్తున్నారు.

యూట్యూబర్ వైష్ణవి సోదరుడు సంతోష్ అరెస్ట్.. పక్కా ప్లాన్‌తోనే హరిబాబు హత్య!క్రైమ్Swechaa20 Sep 2026, 08:40 AM

యూట్యూబర్ వైష్ణవి సోదరుడు సంతోష్ అరెస్ట్.. పక్కా ప్లాన్‌తోనే హరిబాబు హత్య!

 నిజామాబాద్ నగరంలోని ఆర్‌ఆర్ చౌరస్తాలో సంచలనం సృష్టించిన చిత్తరి హరిబాబు హత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు. యూట్యూబర్ వైష్ణవి సోదరుడు, ఈ హత్య కేసు ప్రధాన నిందితుడైన గంధం సంతోష్‌ను నిజామాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు వైజాగ్ పారిపోయేందుకు యత్నిస్తుండగా నిజామాబాద్ బైపాస్ వద్ద రైల్వే స్టేషన్‌కు వెళ్తున్న సమయంలో ప్రత్యేక బృందాలు పథకం ప్రకారం అదుపులోకి తీసుకున్నాయి. జగిత్యాల జిల్లా కోరుట్లకు చెందిన హరిబాబు, మాదాపూర్ గ్రామానికి చెందిన యూట్యూబర్ వైష్ణవిలది ప్రేమ వివాహం. అయితే కుటుంబ కలహాలు, అదనపు కట్నం వేధింపుల కారణంగా ఈఏడాది మార్చి 16న నాలుగు నెలల గర్భిణి అయిన వైష్ణవిని హరిబాబు దారుణంగా హత్య చేశారనే ఆరోపణలు ఉన్నాయి.

Prabhas-Sandeep: స్పిరిట్ ప్రభాస్ కెరీర్‌లో చాలా ప్రత్యేకం..ఎందుకంటే!సినిమాSwechaa20 Sep 2026, 08:40 AM

Prabhas-Sandeep: స్పిరిట్ ప్రభాస్ కెరీర్‌లో చాలా ప్రత్యేకం..ఎందుకంటే!

Prabhas: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటుస్తున్న లేటెస్ట్ సినిమా ‘స్పిరిట్’. ఇప్పటికే, ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇందులో, ప్రభాస్ వైల్డ్ పోలీస్ గా కనిపించబోతున్నాడు. హెవీ యాక్షన్ డ్రామాగా సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇక, తాజా సంచారం మేరకు స్పిరిట్ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ ను సందీప్ రెడ్డి వంగ ప్లాన్ చేశాడట.

Keerthy Suresh-Movies Line Up: కథ, దర్శకుల ఎంపిక బాగానే ఉంది..మరి హిట్టేది?సినిమాSwechaa20 Sep 2026, 08:15 AM

Keerthy Suresh-Movies Line Up: కథ, దర్శకుల ఎంపిక బాగానే ఉంది..మరి హిట్టేది?

Keerthy Suresh: మన సౌత్ ప్రేక్షకులకు బాగా ఇష్టమైన హీరోయిన్స్ లో కీర్తి సురేష్ ఒకరు. ‘మహానటి’ సినిమాతో గొప్ప నటిగా తన స్థాయిని మరో మెట్టు పైకి చేర్చుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో కీర్తికి కీర్తితో పాటు అవార్డులు, ప్రశంసలు దక్కాయి. ఈ సినిమా తర్వాత తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో విభిన్న కథా చిత్రాలను చేస్తూ పాన్ స్థాయిలో గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నాలలో ఉంది.

ప్రపంచ నగరాల్లో భారత్ దూకుడు.. హైదరాబాద్‌కు కీలక స్థానం!..వ్యాపారంSwechaa20 Sep 2026, 07:51 AM

ప్రపంచ నగరాల్లో భారత్ దూకుడు.. హైదరాబాద్‌కు కీలక స్థానం!..

హైదరాబాద్, ముంబై, చెన్నై మహానగరాలు భారతదేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలిచాయని, అవి అత్యంత బలమైన పట్టణ ఆర్థిక వ్యవస్థలుగా ఉన్నాయని 'ఆక్స్‌ఫర్డ్‌ ఎకనామిక్స్‌' నివేదిక వెల్లడించింది. అంచనా వేసిన జీడీపీ వృద్ధిలో హైదరాబాద్‌ అంతర్జాతీయ స్థాయిలో 15వ స్థానంలో నిలిచిందని పేర్కొంది. 2050 నాటికి హైదరాబాద్ మరింత పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగే అవకాశముందని, అంతర్జాతీయ నగరాల సూచీలో 58వ స్థానానికి చేరుకుంటుందని తెలిపింది.

Kayadu Lohar-Immortal: కయాదు ఖాతాలో "ఇమ్మోర్టల్" హిట్ సినిమానా?సినిమాSwechaa20 Sep 2026, 07:35 AM

Kayadu Lohar-Immortal: కయాదు ఖాతాలో "ఇమ్మోర్టల్" హిట్ సినిమానా?

Kayadu Lohar: యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాశ్‌ కుమార్‌ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘ఇమ్మోర్టల్‌’. ఇటీవల తమిళంలో విడుదలైన ఈ చిత్రం అక్కడ యావరేజ్ టాక్‌ను తెచ్చుకుంది. ఇక ఇప్పుడు తెలుగు వెర్షన్‌లోనూ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక్కడ, కూడా ఇమ్మోర్టల్ యావరేజ్ టాక్ నే తెచ్చుకుంది. హర్రర్ జానర్‌లోనే ఒక డిఫరెంట్ కాన్సెప్ట్‌తో వచ్చిన ఇమ్మోర్టల్ కి ప్రధాన బలం హీరోయిన్ కయాదు లోహర్. ఆమె పాత్ర, కథలో ప్రాధాన్యత సినిమాకి హైలెట్‌గా నిలిచాయి.

గుండెలో దడ రావడానికి కారణాలు ఏమిటి?..HealthSwechaa20 Sep 2026, 07:35 AM

గుండెలో దడ రావడానికి కారణాలు ఏమిటి?..

గుండెలో ఒక్కసారిగా దడ రావడం.. వేగంగా కొట్టుకుంటున్నట్టు అనిపించడం.. మధ్యలో బీట్ మిస్ అయినట్టుగా లేదా గుండె ఫ్లట్టర్ అవుతున్నట్టుగా అనిపించడం చాలామందికి ఎదురయ్యే సమస్య. వైద్య పరిభాషలో దీన్ని హార్ట్ పాల్పిటేషన్స్ అంటారు. ఇది తరచూ వస్తుంటే కారణాన్ని గుర్తించడం అవసరమని నిపుణులు అంటున్నారు.

ఇక ఆరోగ్య నిపుణుల ప్రకారం గుండెలో దడకు మొదటి కారణాల్లో ఒత్తిడి, ఆందోళన, భయం, పానిక్ వంటి భావోద్వేగ పరిస్థితులు ఉంటాయి. నిద్ర సరిగా లేకపోవడం, అధికంగా వ్యాయామం చేయడం, శరీరంలో నీరు తగ్గడం కూడా గుండె వేగాన్ని పెంచవచ్చు. కెఫీన్, నికోటిన్, ఆల్కహాల్, ఎనర్జీ డ్రింక్స్ వంటి పదార్థాలు కొందరిలో పాల్పిటేషన్స్‌ను ప్రేరేపించవచ్చు. కొన్ని జలుబు మందులు, ఆస్తమా లేదా ఇతర మందులు కూడా కారణం కావచ్చని పేర్కొంటున్నారు.

పాదాల్లో మంట పుడుతుందా? శరీరం ఇస్తున్న సంకేతం ఇదే!..HealthSwechaa20 Sep 2026, 07:24 AM

పాదాల్లో మంట పుడుతుందా? శరీరం ఇస్తున్న సంకేతం ఇదే!..

అరికాళ్లు మంటగా అనిపించడం.. చాలామంది సాధారణ సమస్యగానే తీసుకుంటారు. కానీ ఈ మంట తరచూ వస్తుంటే, ముఖ్యంగా రాత్రివేళల్లో ఎక్కువగా అనిపిస్తుంటే.. దాని వెనుక కారణాన్ని గుర్తించడం చాలా ముఖ్యం. వైద్య నిపుణుల ప్రకారం, అరికాళ్లలో మంటకు ప్రధాన కారణాల్లో ఒకటి పెరిఫెరల్ న్యూరోపతి.. అంటే చేతులు, కాళ్లలోని నరాలు దెబ్బతినడం. ఈ సమస్యలో మంటతో పాటు తిమ్మిరి, సూదులు గుచ్చినట్టుగా అనిపించడం, నొప్పి లేదా స్పర్శ తగ్గడం కూడా ఉండొచ్చు.

ముఖ్యంగా మధుమేహం ఉన్నవారిలో రక్తంలో చక్కెర ఎక్కువకాలం నియంత్రణలో లేకపోతే నరాలు దెబ్బతిని అరికాళ్లలో మంట, తిమ్మిరి వంటి లక్షణాలు కనిపించవచ్చు. అందుకే మంటతో పాటు పాదాల్లో స్పర్శ తగ్గడం, చిన్న గాయాలు కూడా తెలియకపోవడం ఉంటే నిర్లక్ష్యం చేయకూడదని ఆరోగ్యనిపుణులు పేర్కొంటున్నారు.

Megastar Chiranjeevi-New Business: మెగాస్టార్ కూడా ఆ బిజినెస్‌లోకి దిగారా!సినిమాSwechaa20 Sep 2026, 07:12 AM

Megastar Chiranjeevi-New Business: మెగాస్టార్ కూడా ఆ బిజినెస్‌లోకి దిగారా!

Megastar Chiranjeevi: మన టాలీవుడ్ స్టార్ హీరోలు కేవలం సినిమాలతో మాత్రమే కాకుండా ఇతర వ్యాపారాలలోనూ ఎంటరవుతున్నారు. మల్టీప్లెక్స్, హోటల్స్, రియల్ ఎస్టేట్ సహా మరెన్నో బడా వ్యాపారాలతో బిజీగా ఉంటున్నారు. ఇప్పటికే, మన టాలీవుడ్‌లో మల్టీప్లెక్స్ బిజినెస్‌లో వచ్చిన మహేష్, అల్లు అర్జున్, రవితేజ, విజయ్ దేవరకొండ మంచి లాభాలను చూస్తున్నారు. ఇప్పుడు, ఈ లిస్ట్‌లో మెగాస్టార్ చిరంజీవి కూడా చేరడం విశేషం.

ఆత్మహత్య ఎందుకు చేసుకోకూడదు? శాస్త్రం చెప్పేది ఇదే!..SpiritualitySwechaa20 Sep 2026, 07:09 AM

ఆత్మహత్య ఎందుకు చేసుకోకూడదు? శాస్త్రం చెప్పేది ఇదే!..

మనిషికి లభించిన ఈ మానవ జన్మ కేవలం జీవించడానికి మాత్రమే కాదు.. తన జీవిత పరమార్థాన్ని తెలుసుకోవడానికి లభించిన ఒక అరుదైన అవకాశం. అందుకే భారతీయ ఆధ్యాత్మిక సంప్రదాయంలో శరీరాన్ని మన స్వంత ఆస్తిగా కాకుండా.. దైవం ప్రసాదించిన సాధనంగా భావిస్తారు. జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు, పరిస్థితులు భరించలేనివిగా అనిపించినప్పుడు.. జీవితం నుంచి తప్పించుకోవడమే పరిష్కారంగా భావించడం ఆధ్యాత్మిక దృష్టిలో సరైన మార్గం కాదు. ఎందుకంటే మనిషి ఎదుర్కొనే సుఖదుఃఖాలు కేవలం యాదృచ్ఛిక సంఘటనలు కావని.. వాటి వెనుక కర్మ సిద్ధాంతం పనిచేస్తుందని శాస్త్రాలు వివరిస్తాయి.

మాయా బంధంలో జీవుడు ఎలా చిక్కుకుంటాడు?SpiritualitySwechaa20 Sep 2026, 07:00 AM

మాయా బంధంలో జీవుడు ఎలా చిక్కుకుంటాడు?

ఈ భౌతిక ప్రపంచంలో మనిషి అనుభవించే ప్రతి సుఖం వెనుక ఒక కోరిక ఉంటుంది.. ప్రతి దుఃఖం వెనుక ఒక బంధం ఉంటుంది. నేను అనే భావన బలపడిన కొద్దీ, జీవుడు తన అసలు స్వరూపానికి దూరమవుతాడు. తాను ఈ శరీరం కాదని, పరమాత్మతో నిత్య సంబంధం కలిగిన జీవాత్మనని మరచిపోయిన క్షణం నుంచే మాయా బంధం మొదలవుతుంది.

శ్రీకృష్ణ తత్త్వం ప్రకారం జీవాత్మ భౌతిక ప్రకృతిలో పుట్టింది కాదు. అది కృష్ణుని పరాశక్తికి చెందిన నిత్యమైన అణు స్వరూపం. కానీ కృష్ణుని పట్ల విముఖత కలిగినప్పుడు, భౌతిక ప్రకృతి జీవుడిని తన గుణాలతో ఆవరించుకుంటుంది. అప్పుడు నేనే భోక్తను.. నేనే కర్తను.. నేనే నియంత్రకుడిని అనే అహంకారం అతడి చైతన్యాన్ని కప్పివేస్తుంది. అదే బంధనానికి మూలం.. అదే భౌతిక దుఃఖానికి కారణం.