స్వేచ్ఛ షార్ట్స్ — తాజా తెలుగు వార్తలు

యజ్ఞం చేయడంలో ఉన్న రహస్యం ఏమిటి?..SpiritualitySwechaa20 Sep 2026, 06:53 AM

యజ్ఞం చేయడంలో ఉన్న రహస్యం ఏమిటి?..

భారతీయ ఆధ్యాత్మిక సంప్రదాయంలో యజ్ఞం అంటే కేవలం అగ్నిలో ఆహుతులు సమర్పించే ఒక క్రతువు మాత్రమే కాదు.. మనలోని స్వార్థాన్ని దహించి, సమస్త లోక క్షేమాన్ని కోరే ఒక మహోన్నత ఆధ్యాత్మిక సాధన.మన సంస్కృతిలో గాయత్రిని తల్లిగా, యజ్ఞాన్ని తండ్రిగా భావించే సంప్రదాయం ఉంది. గాయత్రీ ఉపాసనలోనూ యజ్ఞానికి ప్రత్యేక స్థానం ఉంది. మంత్రజపం ద్వారా మనస్సును పవిత్రం చేసుకుంటే.. యజ్ఞం ద్వారా ఆ సాధనను విశ్వశక్తికి సమర్పించే భావన ఏర్పడుతుంది.

అగ్నికి సమర్పించే ప్రతి ఆహుతి వెనుక ఒక గొప్ప తాత్విక సందేశం దాగి ఉంది. మనకు లభించినది ప్రకృతి ప్రసాదమేనని గుర్తించి.. దానిలో కొంత భాగాన్ని తిరిగి సమాజానికి, ప్రకృతికి, దైవానికి సమర్పించడమే యజ్ఞ తత్వం.వేద సంప్రదాయంలో యజ్ఞం కేవలం వ్యక్తిగత శ్రేయస్సు కోసం మాత్రమే కాదు.. కుటుంబం, సమాజం, ప్రకృతి, సమస్త జీవుల క్షేమాన్ని కోరుతూ నిర్వహించే పవిత్ర కర్మగా భావించబడింది.

AIని ఆపేదెవరు..? ట్రంప్‌ సంచలన నిర్ణయం.. AI ఫోర్స్‌!InternationalSwechaa20 Sep 2026, 12:34 AM

AIని ఆపేదెవరు..? ట్రంప్‌ సంచలన నిర్ణయం.. AI ఫోర్స్‌!

AI ప్రపంచాన్ని మార్చేస్తున్న వేళ.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తీసుకున్న తాజా నిర్ణయం చర్చనీయాంశంగా మారింది. AI అభివృద్ధిని స్లో డౌన్ చేయాలన్న పరిశ్రమ నిపుణుల మాటలను పక్కనపెట్టి.. ఏకంగా AI కోసం ప్రత్యేక దళాన్ని ఏర్పాటు చేయాలని ట్రంప్‌ ప్రకటించారు. అసలు ఈ AI ఫోర్స్‌ ఏంటి..? AI జార్‌ ఎందుకు..?

నల్లమల పులి కాదు.. చంద్రబాబు సంకలో పిల్లితెలంగాణSwechaa19 Sep 2026, 11:33 PM

నల్లమల పులి కాదు.. చంద్రబాబు సంకలో పిల్లి

Ktr: రేవంత్ రెడ్డి అసమర్థ పాలన వల్ల జూరాల ఆయకట్టు ఆగమయ్యే పరిస్థితి ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. ఏపీ కృష్ణా నీళ్ళు దోచుకుంటోందని ఆరోపించారు. పాలమూరు బిడ్డ పాలమూరు రైతుల నోట్లో మట్టి కొట్టారని సీఎం రేవంత్ పై విరుచుకుపడ్డారు. వనపర్తి జిల్లా పెబ్బేరు పట్టణంలో సబ్ స్టేషన్ నుండి సుభాష్ చౌరస్తా వరకు ర్యాలీలో కేటీఆర్ పాల్గొన్నారు. ఆయన వెంట మాజీ మంత్రులు నిరంజన్ రెడ్డి, లక్ష్మారెడ్డి, శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారు.

సాగునీటి కోసం రోడ్డెక్కిన రైతులు..తెలంగాణSwechaa19 Sep 2026, 11:03 PM

సాగునీటి కోసం రోడ్డెక్కిన రైతులు..

Farmers Protest: జూరాల ప్రాజెక్టు ఆయకట్టు కింద సాగు చేస్తున్న వరి పంటలు ఎండుముఖం పడుతుండడంతో రైతులు జూరాల డ్యాంపై ధర్నా చేపట్టారు. ఎల్ నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు తలెత్తడంతో జూరాల కుడి, ఎడమ కాలువలకు సాగునీటిని అధికారులు బంద్ చేశారు. దీంతో పంటలకు నీరు అందక సాగునీటి సమస్య తీవ్రరూపం దాల్చింది. పంటలకు సాగునీరు అందకపోవడంతో రైతులు ఆందోళన బాట పట్టారు. జూరాల ప్రాజెక్టు నుంచి పంటలకు వెంటనే నీటిని విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ రైతులు రోడ్లపైకి వచ్చి ధర్నాలు నిర్వహిస్తున్నారు. గద్వాల జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ కార్యాలయం ఎదుట కూడా రైతులు ఆందోళన చేపట్టి తమ సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.

చిత్రం లేదు
తెలంగాణSwechaa19 Sep 2026, 10:20 PM

BJP Silence: మైలేజ్ పెంచుకునే పనిలో కాంగ్రెస్, బీఆర్ఎస్.. సైలెంట్ గా బీజేపీ

BJP Silence: తెలంగాణ గడ్డపై ప్రస్తుతం రాజకీయం మొత్తం రియల్ ఎస్టేట్, భూ దందాల చుట్టూనే రౌండ్లు కొడుతోంది. ఎర్రవల్లి ల్యాండ్ ఇష్యూ నుంచి హైదరాబాద్ శివారుల్లోని వేల కోట్ల విలువైన ఆస్తుల వరకు.. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతలు పరస్పరం ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటున్నారు. ప్రతిరోజూ మీడియా ముఖంగా ప్రెస్‌మీట్లు, సవాళ్లు, ప్రతిసవాళ్లతో పతాక శీర్షికలు దక్కించుకునేందుకు ఈ రెండు పార్టీలు హోరాహోరీగా పోటీపడుతున్నాయి. అయితే ఈ రణరంగంలో బీజేపీ పార్టీ అనుసరిస్తున్న ‘అంతుచిక్కని మౌనం’ వెనుక కారణాలు ఏంటో సొంత పార్టీ క్యాడర్‌కే అర్థం కావడం లేదు. అయితే రాజకీయ వర్గాలు మాత్రం కాషాయ దళం మౌనం వెనక పెను రాజకీయ విస్ఫోటనం దాగి ఉందని అభిప్రాయపడుతున్నారు.కాంగ్రెస్, బీఆర్ఎస్ రోజూవారీ పబ్లిసిటీ స్టంట్లు చేస్తూ ప్రజల్లో ఒకరిని మించి మరొకరు నిందలు వేసుకుంటుంటే.. కాషాయ పార్టీ మాత్రం ఈ రొంపిలోకి నేరుగా దిగకుండా వ్యూహాత్మకంగా సైలెంట్ అయింది. ఎర్రవల్లి రీ-సర్వే లొల్లిలో ఇరువర్గాల వాదనలను గమనిస్తూ, కాంగ్రెస్ - గులాబీ పార్టీలు రెండూ ఒకరి అక్రమాలను మరొకరు బయటపెట్టుకునే వరకు బీజేపీ వెయిట్ చేద్దాం అనే ధోరణి ఉన్నట్లు కనిపిస్తోంది. రెండు పార్టీల నాయకులు ఒకరిపై ఒకరు చేసుకుంటున్న భూ ఆరోపణల వల్ల అంతిమంగా ప్రజల్లో వారిద్దరి విశ్వసనీయత అడుగంటిపోతుందనేది కమలం పార్టీ లెక్క అని అంటున్నారు.

KCR: ఫాంహౌస్ లో కబ్జా ఆరోపణలు.. కేసీఆర్ మౌనంతో మరింత డ్యామేజ్..?తెలంగాణSwechaa19 Sep 2026, 10:12 PM

KCR: ఫాంహౌస్ లో కబ్జా ఆరోపణలు.. కేసీఆర్ మౌనంతో మరింత డ్యామేజ్..?

KCR: తెలంగాణ రాజకీయ ముఖచిత్రం ఇప్పుడు గజ్వేల్ వైపు మళ్లింది. మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు కంచుకోట లాంటి ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రం చుట్టూ భూ ఆక్రమణ వివాదం ముసురుకోవడం రాష్ట్రవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. ప్రభుత్వ, అసైన్డ్ భూములతో పాటు సమీప చెరువులు, కాలువల స్థలాలను ఫాంహౌస్ కోసం కబ్జా చేశారంటూ అధికార కాంగ్రెస్ పార్టీ విమర్శలు ముమ్మరం చేస్తుండగా, వివాదం కేంద్రంలో ఉన్న కేసీఆర్ మాత్రం పెదవి విప్పకపోవడం రాజకీయ విశ్లేషకులను సైతం విస్మయానికి గురిచేస్తోంది.హైదరాబాద్ పరిసరాల్లో చెరువుల పరిరక్షణ పేరుతో 'హైడ్రా' పేల్చిన బాంబులు ఇప్పటికే బడా నేతల్లో గుబులు రేపాయి. ఇప్పుడు ఆ రగడ ఏకంగా కేసీఆర్ వ్యక్తిగత అడ్డా అయిన ఎర్రవల్లి ఫామ్‌హౌస్ హద్దుల వరకు చేరింది. ఇప్పటికే అధికారులు క్షేత్రస్థాయిలో రెవెన్యూ సర్వే నిర్వహించి, అతి తర్వలో ఈ నివేదికను ప్రభుత్వానికి సమర్పించే అవకాశం ఉంది. ఒకవేళ ఎర్రవల్లి ఫాంహౌస్ కోసం భూములు ఆక్రమణకు గురైనట్లు తేలితే ఏమాత్రం ఉపేక్షించబోమని ఇప్పటికే అధికార పక్షం స్పష్టం చేసింది.

Pan India Cinema: పాన్ ఇండియా సినిమా వల్ల సినిమా ఇండస్ట్రీకి లాభమా నష్టమా?సినిమాSwechaa19 Sep 2026, 09:53 PM

Pan India Cinema: పాన్ ఇండియా సినిమా వల్ల సినిమా ఇండస్ట్రీకి లాభమా నష్టమా?

Pan India Cinema: దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి రూపొందించిన బాహుబలి సిరీస్ నుంచి మన సౌత్‌లో పాన్‌ ఇండియా సినిమాల ప్రభావం ఎక్కువైంది. దీనివల్ల సినిమా ఇండస్ట్రీకి లాభాలు కూడా ఉన్నాయి, నష్టాలు కూడా ఉన్నాయి. అయితే దీన్ని కేవలం “లాభం” లేదా “నష్టం”గా కాకుండా, ఇండస్ట్రీలో వచ్చిన ఒక పెద్ద మార్పుగా కూడా చూడవచ్చు.

iPhones: రూ. 3 లక్షలైనా ఎగబడి కొంటున్నారు.. ఐఫోన్‌లకు ప్రపంచవ్యాప్తంగా ఎందుకంత క్రేజ్?దునియాSwechaa19 Sep 2026, 09:22 PM

iPhones: రూ. 3 లక్షలైనా ఎగబడి కొంటున్నారు.. ఐఫోన్‌లకు ప్రపంచవ్యాప్తంగా ఎందుకంత క్రేజ్?

iPhones: ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి ఎన్ని బ్రాండ్లు వచ్చినా, ఎన్ని అత్యాధునిక ఫీచర్లను పరిచయం చేసినా 'ఆపిల్' సృష్టించే హవా ముందు అవన్నీ దిగదుడుపే అవుతున్నాయి. తాజాగా విడుదలైన 'ఐఫోన్ 18' సిరీస్‌లో తొలి ఫోల్డబుల్ ఫోన్ టాప్ వేరియంట్ ధర అక్షరాలా రూ. 3.29 లక్షలు దాటింది. కనీస వేరియంట్ ధరలే రూ. 1.64 లక్షల నుంచి స్టార్ట్ అవుతున్నాయి. సామాన్యులకే కాదు, మధ్యతరగతికి సైతం మైండ్ బ్లాంక్ అయ్యే ఈ స్థాయి ధరలు ఉన్నప్పటికీ.. ముంబై, ఢిల్లీ, హైదరాబాద్‌లలోని ఆపిల్ స్టోర్ల ముందు జనాలు అర్ధరాత్రి నుంచే బారులు తీరి మరీ కొనుగోలు చేశారు. అసలు ఐఫోన్‌కు ఇంత పిచ్చి ఎందుకు? రూ. లక్షలు గుమ్మరించి మరీ కొనేలా చేసే ఆ మాయాజాలం ఏంటి?ప్రస్తుత సమాజంలో ఐఫోన్ అనేది కేవలం సమాచార మార్పిడి సాధనంగా మాత్రమే మిగల్లేదు. అదొక లగ్జరీ లైఫ్ స్టైల్‌కి, స్టేటస్ సింబల్‌గా మారిపోయింది. చేతిలో ఆపిల్ లోగోతో ఉన్న సరికొత్త ఫోన్ కనిపిస్తే సమాజంలో ప్రత్యేక గుర్తింపు దక్కుతుందనే అభిప్రాయం యూజర్లలో నాటుకుపోయింది. ప్రతీసారీ కొత్త సిరీస్ వచ్చినప్పుడు "అందరికంటే ముందుగా నేనే సొంతం చేసుకున్నా" అనే ఆత్మసంతృప్తి, స్పెషల్ ఫీలింగ్ కస్టమర్లను గంటల తరబడి క్యూలలో నిలబెడుతోంది.

సుప్రీంకోర్టుకు దానం నాగేందర్.. నెక్ట్స్ ఏం జరగనుంది?తెలంగాణSwechaa19 Sep 2026, 08:01 PM

సుప్రీంకోర్టుకు దానం నాగేందర్.. నెక్ట్స్ ఏం జరగనుంది?

Danam Nagender: దానం నాగేందర్ పై అనర్హత వేటు అంశంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. దానం నాగేందర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా తనపై అనర్హత వేటు వేస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును దానం సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. శనివారం మధ్యాహ్నం సర్వోన్నత న్యాయస్థానంలో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ సోమవారం విచారణకు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఎర్రవల్లి భూముల సర్వేలో గందరగోళం.. వెంకటాపూర్ రైతుల ధర్నా!తెలంగాణSwechaa19 Sep 2026, 07:40 PM

ఎర్రవల్లి భూముల సర్వేలో గందరగోళం.. వెంకటాపూర్ రైతుల ధర్నా!

Erravalli: సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలోని ఎర్రవల్లి మరోసారి తీవ్ర ఉద్రిక్తతకు వేదికైంది. మాజీ సీఎం కేసీఆర్ ఫాంహౌస్‌కు అత్యంత సమీపంలో ఉన్న సర్వే నెంబర్ 325 పరిధిలోని భూముల వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతూ రాజకీయంగా, పాలనాపరంగా హాట్ టాపిక్‌గా మారింది. ఈ సర్వే నెంబర్‌లోని మొత్తం 388 ఎకరాల భూమి సరిహద్దులను తేల్చేందుకు రెవెన్యూ యంత్రాంగం రంగంలోకి దిగగా, సరిగ్గా సర్వే మొదలయ్యే సమయానికి ఊహించని రీతిలో పక్క గ్రామం రైతులు తెరపైకి వచ్చి పంచాయితీ పెట్టడం సంచలనంగా మారింది.ఎర్రవల్లి పరిధిలోని ఈ వివాదాస్పద సర్వే నెంబర్‌లో అధికారులు రీ-సర్వే చేపట్టడంపై శివారు వెంకటాపూర్ గ్రామస్థులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగారు. మొత్తం 388 ఎకరాల భూమి కేవలం ఎర్రవల్లి వాసులదే కాదని, అందులో ఎర్రవల్లి రైతులకు 250 ఎకరాలు మాత్రమే చెందుతుందని వారు కుండబద్దలు కొట్టారు. మిగిలిన భూమిపై వెంకటాపూర్ గ్రామ రైతులకు పూర్తి చట్టబద్ధమైన హక్కులు ఉన్నాయని తేల్చి చెప్పారు. దశాబ్దాల క్రితం రెవెన్యూ అధికారులు, కింది స్థాయి సిబ్బంది చేసిన తప్పిదాల వల్లే రికార్డులు తారుమారయ్యాయని, తప్పుడు ఎంట్రీలతో తమ హక్కులను కాలరాశారని మండిపడుతున్నారు. ప్రస్తుతం చేస్తున్న సర్వేను పాత కాస్రా, సిత్వార్ రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే పూర్తి చేయాలని, లేనిపక్షంలో ఊరుకునేది లేదని గట్టిగా హెచ్చరిస్తున్నారు.

Tollywood-Rashmika: టాలీవుడ్‌లో నంబర్ 1 హీరోయిన్ ఎవరు?సినిమాSwechaa19 Sep 2026, 07:31 PM

Tollywood-Rashmika: టాలీవుడ్‌లో నంబర్ 1 హీరోయిన్ ఎవరు?

Tollywood: తెలుగు సినిమా ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా సౌత్ మొత్తంగా చూసుకుంటే ఎప్పటికప్పుడు హీరోయిన్ స్థానం మారుతూ ఉంటుంది. ఖచ్చితంగా ఒకరిని నంబర్ 1 హీరోయిన్ అని చెప్పడానికి లేదు. 2026లో ‘టాలీవుడ్‌ నుంచి గనక చూసుకుంటే నంబర్ 1 హీరోయిన్’ గా స్టార్‌డమ్‌, పాన్‌-ఇండియా క్రేజ్‌, పెద్ద సినిమాలు, మార్కెట్‌ డిమాండ్‌ వంటి అంశాలను కలిపి పరిగణలోకి తీసుకోవాల్సి వస్తుంది.

అనర్హత వేటుపై సుప్రీంకోర్టుకు దానం నాగేందర్Swechaa19 Sep 2026, 07:20 PM

అనర్హత వేటుపై సుప్రీంకోర్టుకు దానం నాగేందర్

అనర్హత వేటు అంశంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. దానం నాగేందర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తనపై అనర్హత వేటు వేస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు దానం నాగేందర్. ఈ పిటిషన్ సోమవారం విచారణకు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఒక్క ఎకరం ఎండినా.. రేవంత్‌ను వదిలేది లేదుతెలంగాణSwechaa19 Sep 2026, 07:15 PM

ఒక్క ఎకరం ఎండినా.. రేవంత్‌ను వదిలేది లేదు

KTR: పాలమూరు రైతులకు సీఎం రేవంత్ తీవ్ర అన్యాయం చేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. పాలమూరు బిడ్డ పాలమూరు రైతు నోట్లో మట్టి కొట్టి నీళ్లు కిందికి వదిలాడని రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు. సీఎం రేవంత్ గురుదక్షిణ కింద పోతిరెడ్డిపాడు నుంచి నీళ్లు వదిలారని అన్నారు. గురువుకు 100 టీఎంసీల నీరు ఇస్తే.. జూరాల రైతులకు 18 టీఎంసీల నీరే ఇచ్చారని చెప్పారు.

Tollywood-Movies: వీఎఫెక్స్ వల్ల ఆలస్యం అవుతున్న సినిమాలు..దర్శకులకి పెద్ద పరీక్షే!సినిమాSwechaa19 Sep 2026, 06:47 PM

Tollywood-Movies: వీఎఫెక్స్ వల్ల ఆలస్యం అవుతున్న సినిమాలు..దర్శకులకి పెద్ద పరీక్షే!

Tollywood: గతంలో సినిమా షూటింగ్ పూర్తయితే, విడుదలకు పెద్దగా సమయం పట్టేది కాదు. కానీ, ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ముఖ్యంగా భారీ బడ్జెట్‌, పీరియాడిక్‌, ఫాంటసీ, యాక్షన్‌, సోషియో-ఫాంటసీ సినిమాల విషయంలో షూటింగ్ పూర్తయిన తర్వాతే అసలు పెద్ద పని మొదలవుతోంది.

చిత్రం లేదు
తెలంగాణSwechaa19 Sep 2026, 06:40 PM

ధాన్యం అక్రమాలకు చెక్.. రంగంలోకి 'SHT'

SHT Strategy: తెలంగాణలో ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్ల వేళ ఏటా తెరపైకి వచ్చే దళారుల దందా, ధాన్యం రీసైక్లింగ్, నకిలీ రశీదుల అక్రమాలకు శాశ్వత బ్రేక్ వేసేందుకు పౌర సరఫరాల శాఖ అత్యంత కఠినమైన యాక్షన్ ప్లాన్‌ను రెడీ చేసింది. 2026-27 ఖరీఫ్ సీజన్‌లో రాష్ట్రాన్ని ముంచెత్తనున్న రికార్డు స్థాయి 65 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోళ్లకు ప్రభుత్వం సరికొత్త ‘SHT’ (స్టోరేజ్, హమాలీ, ట్రాన్స్‌పోర్ట్) అస్త్రాన్ని బయటికి వదిలారు. ప్రతి లారీకి జీపీఎస్ ట్రాకింగ్, మిల్లులపై మెరుపు దాడులకు ప్రత్యేక యాప్, నకిలీ షీట్లకు చెక్ పెట్టేందుకు కఠిన హెచ్చరికలు జారీ చేస్తూ పౌర సరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర రంగంలోకి దిగారు.ధాన్యం కొనుగోలు కేంద్రాల (పీపీసీ) నుంచి మిల్లులకు తరలించే క్రమంలో పక్కదారి పట్టడం లేదా కాగితాల్లోనే కొనుగోళ్లు చూపించి అక్రమాలకు పాల్పడటం గతంలో తీవ్ర చర్చనీయాంశమైంది. ఈసారి అటువంటి తప్పిదాలకు ఏమాత్రం తావులేకుండా ప్రతి వాహనానికి తప్పనిసరిగా 'జీపీఎస్' ట్రాకింగ్ సిస్టమ్ అమర్చాలని ఆదేశాలు జారీ అయ్యాయి. దీంతో ఏ లారీ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుందో క్షణక్షణం మానిటర్ చేయనున్నారు. అంతేకాకుండా, అధికారులు మిల్లుల్లో అకస్మాత్తుగా తనిఖీలు చేయడానికి సరికొత్త 'ఫిజికల్ వెరిఫికేషన్ మొబైల్ యాప్'ను అందుబాటులోకి తెచ్చారు.

కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు ప్రైవేట్ భూముల్లోకి రావడం చట్టవ్యతిరేకంతెలంగాణSwechaa19 Sep 2026, 05:56 PM

కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు ప్రైవేట్ భూముల్లోకి రావడం చట్టవ్యతిరేకం

ప్రదీప్ రెడ్డికి చెందిన జన్వాడ ఫాంహౌస్ పై కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు దాడికి రావడం దుర్మార్గం అని అడ్వకేట్ రాజేశ్వరరావు మండిపడ్డారు. ప్రదీప్ రెడ్డి చట్ట వ్యతిరేకంగా ఎలాంటి పనులకు పాల్పడలేదని ఆయన తెలిపారు. దశాబ్దాల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ... ఈ విధంగా ప్రైవేట్ వ్యక్తి భూమిపైకి రావడం ఏంటి? అని ప్రశ్నించారు. ప్రైవేట్ వ్యక్తిపై దాడికి రావడం అంటే రాజ్యాంగంపై దాడి చెయ్యడమే అని అన్నారు. 3, 4 ఎకరాల్లో ఉన్న ఫాంహౌస్ పై కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు దాడికి వచ్చారని రాజేశ్వరరావు ఆరోపించారు. చట్టాల గురించి మాట్లాడే నైతిక హక్కు కాంగ్రెస్ పార్టీకి లేదన్నారు. కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు ప్రైవేట్ భూముల్లోకి రావడం చట్ట వ్యతిరేకం అని వ్యాఖ్యానించారు.

Eshwaramma: డబ్బులిస్తాం రాజీపడండి.. ఈశ్వరమ్మ యాదవ్ ఆడియో లీక్ !తెలంగాణSwechaa19 Sep 2026, 05:45 PM

Eshwaramma: డబ్బులిస్తాం రాజీపడండి.. ఈశ్వరమ్మ యాదవ్ ఆడియో లీక్ !

Eshwaramma: రాజకీయ పలుకుబడి, అధికార మదం ఓ నిరుపేద యువకుడి ప్రాణాన్ని బలితీసుకుంది. బైక్ వివాదంలో మొదలైన గొడవ.. ఓ నిండు ప్రాణం గాల్లో కలవడానికి కారణమైంది. యాదగిరిగుట్ట ఆలయ పాలక మండలి సభ్యురాలు పోచబోయిన ఈశ్వరమ్మ యాదవ్ మనవడు సురేశ్ యాదవ్ సాగించిన రాక్షస వేధింపులే గిరిజన యువకుడి బలవన్మరణానికి దారితీశాయన్న ఆరోపణలు తీవ్ర సంచలనం రేపుతున్నాయి. ఘటన జరిగిన తర్వాత తప్పును సరిదిద్దుకోవాల్సింది పోయి, కేసును నీరుగార్చేందుకు బాధితులపై బెదిరింపులకు దిగుతుండటంపై ప్రజా సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.ఓ బైక్ వ్యవహారంలో ఎరుకల సామాజికవర్గానికి చెందిన రాజేష్ అనే గిరిజన యువకుడితో సురేశ్ యాదవ్ పంచాయితీ పెట్టుకున్నాడు. అంతటితో ఆగకుండా రాజేష్‌పై నిర్దాక్షిణ్యంగా దాడికి పాల్పడ్డాడు. గత మూడు రోజులుగా సురేశ్ యాదవ్ చేస్తున్న శారీరక దాడులు, తీవ్ర వేధింపులను తట్టుకోలేక, తీవ్ర మానసిక క్షోభకు గురైన రాజేష్ అర్ధరాత్రి వేళ బలవన్మరణానికి పాల్పడ్డాడు. తన చావుకు కారణమైన వారి వేధింపులను తట్టుకోలేకే అతడు ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.

ఉత్కంఠంగా జన్వాడ ఫామ్ హౌస్‍ వ్యవహారం.. రంగంలోకి హైడ్రా!!..తెలంగాణSwechaa19 Sep 2026, 05:41 PM

ఉత్కంఠంగా జన్వాడ ఫామ్ హౌస్‍ వ్యవహారం.. రంగంలోకి హైడ్రా!!..

తెలంగాణ పాలిటిక్స్‌లో భూముల వివాదం మళ్లీ భగ్గుమంటోంది. కేసీఆర్ కుటుంబం భూములపై సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చేసిన ఆరోపణలతో మొదలైన వేడి.. ఇప్పుడు జన్వాడ వరకు చేరింది. సిద్దిపేట తర్వాత కాంగ్రెస్ నేతలు జన్వాడ ఫామ్‌హౌస్ పరిసరాల్లో పర్యటించి భూములు, నాళా ఆక్రమణలు, నిర్మాణ అనుమతులపై ప్రశ్నలు లేవనెత్తారు. హైడ్రా, మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేశారు. అయితే ఫామ్‌హౌస్ యాజమాన్యంపై ప్రదీప్‌రెడ్డి తన వాదనను వినిపించారు. దీంతో ఆరోపణలు, ప్రత్యారోపణల మధ్య జన్వాడ ఎపిసోడ్ తెలంగాణ రాజకీయాల్లో మరో హాట్ టాపిక్‌గా మారింది.

పేదల ఇండ్ల కూల్చివేతకు నోటీసులు.. ఖమ్మంలో హైటెన్షన్తెలంగాణSwechaa19 Sep 2026, 05:36 PM

పేదల ఇండ్ల కూల్చివేతకు నోటీసులు.. ఖమ్మంలో హైటెన్షన్

ఖమ్మం జిల్లాలో మరోసారి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎలాంటి అనుమతులు లేకుండా ప్రభుత్వ స్థలాల్లో అక్రమంగా ఇల్లు నిర్మించుకున్నారంటూ మున్సిపల్ అధికారులు స్థానికులకు నోటీసులు ఇచ్చినట్టు తెలుస్తోంది. దీంతో బాధితులు అంతా ఒక్కసారి రోడ్డు మీదకు వచ్చారు. ఈ ఘటనతో శ్రీనివాస నగర్‌లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అన్యాయంగా తమ ఇండ్లను ఎలా కూలుస్తారంటూ ప్రజలు ఆందోళన బాట పట్టారు. కాంగ్రెస్ సర్కార్ పేదల ఇండ్లను కూల్చి భూములు లాక్కోవాలని చూస్తున్నదని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఈ క్రమంలోనే స్థానికులు మీడియాతో తమ గోడును వెల్లిబుచ్చారు. ‘నోటీసులు వచ్చి నెలరోజులు అయితే మాకు చెప్పకుండా ఇప్పుడు వచ్చి మమ్మల్ని ఖాళీ చేయండి అంటున్నారు . మా ఇల్లు వదిలి మేము ఎక్కడికి పోము.. సచ్చినా, బ్రతికినా ఇక్కడే ఉంటాము. ఓట్ల కోసం కాంగ్రెస్ వాళ్ళు అమ్మ అయ్యా అంటూ వచ్చి కాళ్ళు పట్టుకుంటారు.. కానీ, మొన్న ధర్నా చేస్తే మా బాధ ఏంటని ఒక్కరు కూడా అడగలేదు’ అని ఓ మహిళ ఆవేదన వ్యక్తం చేసింది.

Srikanth Odela: చిరంజీవికి ముందే చెప్పా..ప్యారడైజ్ తర్వాత 3 నెలలు బ్రేక్!సినిమాSwechaa19 Sep 2026, 05:24 PM

Srikanth Odela: చిరంజీవికి ముందే చెప్పా..ప్యారడైజ్ తర్వాత 3 నెలలు బ్రేక్!

Srikanth Odela: సినిమా అనేది కంప్లీట్‌గా క్రియేటివ్ మైండ్‌తో చేయాల్సిన పని. మానసిక ఒత్తిడితో పాటు శారీరక శ్రమ కూడా చాలా ఉంటుంది. ఒక కథ అనుకున్న తర్వాత అది పూర్తి స్థాయిలో సిద్ధం చేసి మేకర్స్‌ని ఒప్పించి..హీరోని ఒప్పించి సెట్స్ మీదకి తీసుకురావదం పెద్ద ఛాలెంజ్. ఇక, అక్కడ నుంచి సినిమా రిలీజ్ అయ్యే వరకూ చాలా ఒత్తిడి ఉంటుంది. అందుకే, సినిమా అయ్యాక దర్శకుడు..హీరో కొన్నాళ్ళు రెస్ట్ తీసుకుంటారు. శ్రీకాంత్ ఓదెల కూడా 3 నెలలు రెస్ట్ తీసుకోనున్నట్టుగా వెల్లడించాడు.

బీసీల లెక్కలు తేలాల్సిందే.. జాతీయ జనగణనపై కొత్త డిమాండ్!..తెలంగాణSwechaa19 Sep 2026, 05:14 PM

బీసీల లెక్కలు తేలాల్సిందే.. జాతీయ జనగణనపై కొత్త డిమాండ్!..

బీసీ జనగణనపై తెలంగాణలో మరోసారి డిమాండ్ బలంగా వినిపించింది. జాతీయ జనగణనలో బీసీ, ఓబీసీలకు ప్రత్యేక కాలమ్ ఏర్పాటు చేసి.. కులాల వారీగా సమగ్ర వివరాలు సేకరించాలని జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి కోరారు. ఈ మేరకు మంత్రి పొన్నం ప్రభాకర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. 2027 జనగణనలో ఖచ్చితమైన గణాంకాలు సేకరిస్తే.. బీసీల సామాజిక, ఆర్థిక, విద్యా పరిస్థితుల ఆధారంగా విధానాలు రూపొందించేందుకు ఉపయోగపడతాయని తెలిపారు. కేంద్రంపై ఒత్తిడి కోసం అన్ని పార్టీలు, బీసీ సంఘాలతో కలిసి జాతీయ స్థాయిలో ఉద్యమం చేపట్టాలని పిలుపునిచ్చారు.

ఈ భూములు మీవేనా? ప్రూవ్ చేస్కోండి.. ఎర్రవల్లి రైతులకు నోటీసులు!తెలంగాణSwechaa19 Sep 2026, 05:11 PM

ఈ భూములు మీవేనా? ప్రూవ్ చేస్కోండి.. ఎర్రవల్లి రైతులకు నోటీసులు!

అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన ఒక్క ఆదేశం ఎర్రవల్లి రైతులకు కొత్త ఇబ్బందులను తీసుకొచ్చినట్టు తెలుస్తోంది. మాజీ సీఎం కేసీఆర్ ఫాంహౌస్‌లో సుమారు 388 ఎకరాల ప్రభుత్వ భూమి ఉన్నదని, అధికారులు వెంటనే సర్వే చేసి లెక్కలు తేల్చి వాటిని స్వాధీనం చేసుకోవాలని ఆదేశించిన విషయం తెలిసిందే. గత రెండు, మూడు రోజులుగా రెవెన్యూ అధికారులు ఎర్రవల్లి కేసీఆర్ వ్యవసాయ క్షేత్రం పరిసరాల్లో సర్వేలు చేస్తున్నారు. మర్కూక్ మండలం ఆఫీసులో ముందుగా రికార్డులు పరిశీలించిన అధికారులు.. భూముల లెక్కలు తేల్చే పనిలో నిమగ్నమయ్యారు. ఈ క్రమంలోనే దళిత రైతులకు రెవెన్యూ అధికారులు నోటీసులు జారీ చేసినట్టు సమాచారం.సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం ఎర్రవెల్లిలో సర్వే పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం దళితులకు నోటీసులు ఇవ్వడంతో వారంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఈ భూమి మీదే అని నిరూపించుకునేందుకు ఆధారాలు చూపాలని అధికారులు నోటీసులు ఇస్తున్నారని దళిత రైతులు మండిపడుతున్నారు.

జన్వాడ ఫాంహౌస్ పై హైడ్రాకు కాంగ్రెస్ ఫిర్యాదు..తెలంగాణSwechaa19 Sep 2026, 04:56 PM

జన్వాడ ఫాంహౌస్ పై హైడ్రాకు కాంగ్రెస్ ఫిర్యాదు..

అక్రమంగా జన్వాడ ఫాంహౌస్ నిర్మించారని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. నాలాను కబ్జా చేసి ఫాంహౌస్ కట్టారని చెప్పారు. జన్వాడ ఫాంహౌస్ కేటీఆర్ ది కాదు.. నాదే అని ప్రదీప్ రెడ్డి అంటున్నారు.. అసలు ప్రదీప్ కి ఫాంహౌస్ భూమి ఎలా వచ్చింది? అని చామల ప్రశ్నించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బాల్య స్నేహితుడే ప్రదీప్ రెడ్డి అని తెలిపారు. ఈ ఫాంహౌస్ లో రెంట్ కు ఉంటున్నా అని కేటీఆర్ అంటున్నారు... కానీ.. ప్రదీప్ రెడ్డి, కేటీఆర్ కు మధ్య ఎలాంటి అగ్రిమెంట్ లేదని ఎంపీ చామల వెల్లడించారు. గతంలో జన్వాడ ఫాంహౌస్ దగ్గర డ్రోన్ ఎగురవేస్తే రేవంత్ రెడ్డిపై కేసు పెట్టారని ఆయన గుర్తు చేశారు.

22A : 22ఏ సమస్యలపై ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు : పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డితెలంగాణSwechaa19 Sep 2026, 04:54 PM

22A : 22ఏ సమస్యలపై ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు : పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి

తెలంగాణలో భూములు, ప్లాట్ల కొనుగోలుదారులను ఏళ్ల తరబడి వేధిస్తున్న అత్యంత క్లిష్టమైన సమస్య 'సెక్షన్ 22-ఏ'. నిషేధిత భూముల జాబితాలో చిక్కుకుని రిజిస్ట్రేషన్లు కాక, ఉన్న ఆస్తులను అమ్ముకోలేక లక్షలాది మంది సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. అసెంబ్లీ వేదికగా సీఎం చేసిన ప్రకటనను అమలు చేస్తూ, 22-ఏ సమస్యలను ఫాస్ట్ ట్రాక్ పద్ధతిలో పరిష్కరించేందుకు ప్రభుత్వం అధికారికంగా ఉన్నత స్థాయి కమిటీని రంగంలోకి దించింది. ఈ మేరకు శాసనసభలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి కీలక ప్రకటన చేశారు.నిషేధిత ఆస్తుల జాబితాపై వేగంగా నిర్ణయాలు తీసుకునేందుకు ప్రభుత్వం జీ.ఓ.ఆర్.టి నెం. 564ను జారీ చేసింది. సీసీఎల్‌ఏ (CCLA) డి.ఎస్.లోకేష్ కుమార్ ఛైర్మన్‌గా వ్యవహరించే ఈ త్రిసభ్య కమిటీలో.. న్యాయశాఖ కార్యదర్శి పాపి రెడ్డి, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ ఐజీ రాజీవ్ గాంధీ హనుమంతు సభ్యులుగా ఉంటారు. నిషేధిత జాబితాలోని అడ్డంకులను తొలగించి, అర్హులైన బాధితులకు త్వరితగతిన ఊరట కల్పించడమే ఈ కమిటీ ప్రధాన లక్ష్యం.

Sai Abhyankar: అల్లు అర్జున్ - రాకా మూవీకి ఎలా స్సెలెక్ట్ అయ్యాడనంటే..సినిమాSwechaa19 Sep 2026, 04:43 PM

Sai Abhyankar: అల్లు అర్జున్ - రాకా మూవీకి ఎలా స్సెలెక్ట్ అయ్యాడనంటే..

Sai Abhyankar: రాకా..ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న లేటెస్ట్ పాన్ వరల్డ్ సినిమా. కోలీవుడ్ యంగ్ డైరెక్టర్ అట్లీ కుమార్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా, ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్‌కి సంబందించిన న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సన్ పిక్చర్స్ నిర్మిస్తోన్న ఈ సినిమాకి ముందు ఇద్దరు టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్‌ని అనుకున్నారట. కానీ, చివరికి సాయి అభ్యంకర్ ఫైనల్ అయినట్టుగా తెలిసింది.

జన్వాడ ఫాంహౌస్ నాలాపై కట్టారు, ఎలాంటి అనుమతులు లేవుతెలంగాణSwechaa19 Sep 2026, 04:41 PM

జన్వాడ ఫాంహౌస్ నాలాపై కట్టారు, ఎలాంటి అనుమతులు లేవు

KTR Janwada Farmhouse: కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల బృందం జన్వాడ ఫాంహౌస్‌కు వెళ్లింది. ఫాంహౌస్ దగ్గర భూములను పరిశీలించింది. బీఆర్ఎస్ నేతల భూ అక్రమాల గురించి ప్రజలకు తెలియజేయడానికి తామంతా జన్వాడ ఫాంహౌస్ కు వచ్చామని ప్రజాప్రతినిధుల బృందం తెలిపింది. ప్రభుత్వ భూములను ఎంత మేరకు ఆక్రమించుకున్నారో చూశామని కాంగ్రెస్ నేతలు వెల్లడించారు. జన్వాడ ఫాంహౌస్ నాలాపై కట్టారని మల్లు రవి ఆరోపించారు. ఫాంహౌస్ నిర్మాణానికి ఎలాంటి అనుమతులు లేవన్నారాయన. అసలు ఫామ్ హౌస్ ఎవరి పేరు మీద ఉందో స్పష్టత లేదని చెప్పారు.

KTR vs Komatireddy: నల్గొండలో హీటెక్కిన పాలిటిక్స్! కేటీఆర్ పాదయాత్ర వర్సెస్ కోమటిరెడ్డి సవాల్తెలంగాణSwechaa19 Sep 2026, 04:32 PM

KTR vs Komatireddy: నల్గొండలో హీటెక్కిన పాలిటిక్స్! కేటీఆర్ పాదయాత్ర వర్సెస్ కోమటిరెడ్డి సవాల్

KTR vs Komatireddy: ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య సాగునీటి వ్యవహారం తీవ్ర రాజకీయ దుమారానికి దారితీసింది. ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొనడం, ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు అడుగంటడంతో స్టార్ట్ అయిన ఈ వాటర్ వార్.. ప్రస్తుతం ఇరు పార్టీల మధ్య మాటల యుద్ధంగా మారింది. సాగర్ ఎడమ కాలువకు నీటి విడుదల, ఏపీ ప్రభుత్వం నీటిని తరలించుకుపోవడంపై గులాబీ, హస్తం నేతలు పరస్పరం తీవ్ర ఆరోపణలు చేసుకుంటున్నారు.సాగర్ ఆయకట్టు రైతాంగాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ మిర్యాలగూడలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రైతు నిరసన సభ నిర్వహించారు. సాగర్ ఎడమ కాలువకు వెంటనే నీటి విడుదల షెడ్యూల్ ప్రకటించాలని డిమాండ్ చేశారు.

మహిళను జుట్టుపట్టుకుని ఈడ్చుకెళ్లిన ఘటన.. డీజీపీ సంచలన ఆదేశాలుక్రైమ్Swechaa19 Sep 2026, 03:52 PM

మహిళను జుట్టుపట్టుకుని ఈడ్చుకెళ్లిన ఘటన.. డీజీపీ సంచలన ఆదేశాలు

హైదరాబాద్ మహానగరంలో ఓ మహిళ పట్ల పోలీసు హోంగార్డు అమానుషంగా వ్యవహరించిన విషయం తెలిసిందే. ఆమె మీద లాఠీతో దాడి చేయడంతో పాటు మాట వినడం లేదని జుట్టుపట్టుకుని కింద పడేసి ఈడ్చుకెళ్లినట్టు తెలుస్తోంది. ఆ సమయంలో ఆమెను విడిచిపెట్టాలని మరో వ్యక్తి ఎంత వేడుకున్నా సదరు హోంగార్డు వినిపించుకోలేదు. దీంతో స్థానిక యువకులు కొందరు ఆ దారుణ ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో వదిలారు. అది కాస్త క్షణాల్లోనే వైరల్ అయ్యింది. ఈ విషయం కాస్త డీజీపీ సీవీ ఆనంద్ వద్దకు చేరడంతో ఆయన సీరియస్ అయ్యారు. సదరు హోంగార్డు రాష్ట్ర పోలీసు విభాగానికి చెందిన వ్యక్తి అయినా డిప్యూటేషన్ మీద భారతీయ రైల్వే తరఫున పనిచేస్తున్నారని క్లారిటీ ఇచ్చారు. మహిళపై హోంగార్డు దాడి చేసిన తీరును డీజీపీ సీవీ ఆనంద్ తీవ్రంగా ఖండించారు. మహిళ పట్ల విచక్షణా రహితంగా ప్రవర్తించిన ఆయనను సర్వీస్ నుంచి తొలగించడంతో పాటు క్రిమినల్ కేసులు నమోదు చేయాలని సైబరాబాద్ పోలీస్ కమిషనర్‌కు ఆదేశాలు జారీచేశారు.

Suhas Controversy: రంగుతో పనేంటి భయ్యా? డైరెక్టర్ మతిమారన్‌ను ఆడేసుకుంటున్న నెటిజన్లు!సినిమాSwechaa19 Sep 2026, 03:43 PM

Suhas Controversy: రంగుతో పనేంటి భయ్యా? డైరెక్టర్ మతిమారన్‌ను ఆడేసుకుంటున్న నెటిజన్లు!

Suhas Controversy: క్రియేటివ్ ఫీల్డ్‌లో ఉంటూ పబ్లిక్ స్టేజ్‌లపై కల్లర్ ప్రస్తావన తీసుకురావడం సోషల్ మీడియాలో తీవ్ర దుమారానికి దారితీసింది. ‘మండాడి’ సక్సెస్ మీట్ వేదికగా టాలీవుడ్ వెర్సటైల్ యాక్టర్ సుహాస్ స్కిన్ టోన్, ఆయన ఎదుర్కొన్న కామెంట్స్ గురించి దర్శకుడు మతిమారన్ మాట్లాడిన మాటలు ఇప్పుడు నెట్టింట తీవ్ర చర్చకు, ఆగ్రహానికి కారణమయ్యాయి.సక్సెస్ మీట్‌లో డైరెక్టర్ మతిమారన్ మాట్లాడుతూ.. సుహాస్ ఎంతో టాలెంటెడ్ యాక్టర్ అయినప్పటికీ, గతంలో వర్ణ వివక్షతో కూడిన కామెంట్స్ ఎదుర్కోవాల్సి వచ్చిందనే అంశాన్ని ప్రస్తావించారు. అయితే ఈ క్రమంలో ఆయన మాట్లాడిన తీరు తెలుగు ప్రేక్షకులను, పరిశ్రమను కించపరిచేలా ఉందంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. "కలర్ ఫోటో", "రైటర్ పద్మభూషణ్" వంటి సినిమాలతో తన అద్భుతమైన నటనతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న సుహాస్ టాలెంట్‌ను చూడకుండా.. బహిరంగ వేదికపై రంగును తెరపైకి తేవడంపై టాలీవుడ్ ఆడియన్స్ సోషల్ మీడియా వేదికపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆయన క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

ఖైరతాబాద్ బై పోల్.. బరిలో నిలిచేది ఎవరో చెప్పిన టీపీసీసీ చీఫ్!తెలంగాణSwechaa19 Sep 2026, 03:26 PM

ఖైరతాబాద్ బై పోల్.. బరిలో నిలిచేది ఎవరో చెప్పిన టీపీసీసీ చీఫ్!

ఎమ్మెల్యే దానం నాగేందర్ శాసనసభ సభ్యత్వాన్ని హైకోర్టు రద్దు చేసిన విషయం తెలిసిందే. తాజాగా దీనిపై టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ స్పందించారు. పార్టీ ఫిరాయింపుల అంశంలో హైకోర్టు వెలువరించిన తీర్పును ఆయన స్వాగతించారు. అయితే, ఈ తీర్పు కాంగ్రెస్ సర్కారుకు చెంపపెట్టు కాదని, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీకి వర్తిస్తుందని పేర్కొన్నారు. శనివారం టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ మీడియాతో మాట్లాడుతూ.. దానం నాగేందర్ సభ్యత్వం రద్దు, రాష్ట్రంలోని ప్రస్తుత రాజకీయ పరిణామాలపై స్పష్టత ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎలాంటి ఫిరాయింపులు జరగలేదన్నారు. కేవలం కాంగ్రెస్ పార్టీ అందిస్తున్న సంక్షేమం, ప్రజా పాలన, అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై మాత్రమే ప్రతిపక్ష ఎమ్మెల్యేలు తమ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చారని గుర్తుచేశారు. దానం నాగేందర్ తిరిగి ఖైరతాబాద్ ఉపఎన్నిక బరిలో నిలుస్తారా? లేదా? అనేది కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పరిశీలించి నిర్ణయిస్తుందని వెల్లడించారు.