స్వేచ్ఛ షార్ట్స్ — తాజా తెలుగు వార్తలు

ఖైరతాబాద్ బై పోల్.. బరిలో నిలిచేది ఎవరో చెప్పిన టీపీసీసీ చీఫ్!తెలంగాణSwechaa19 Sep 2026, 03:26 PM

ఖైరతాబాద్ బై పోల్.. బరిలో నిలిచేది ఎవరో చెప్పిన టీపీసీసీ చీఫ్!

ఎమ్మెల్యే దానం నాగేందర్ శాసనసభ సభ్యత్వాన్ని హైకోర్టు రద్దు చేసిన విషయం తెలిసిందే. తాజాగా దీనిపై టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ స్పందించారు. పార్టీ ఫిరాయింపుల అంశంలో హైకోర్టు వెలువరించిన తీర్పును ఆయన స్వాగతించారు. అయితే, ఈ తీర్పు కాంగ్రెస్ సర్కారుకు చెంపపెట్టు కాదని, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీకి వర్తిస్తుందని పేర్కొన్నారు. శనివారం టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ మీడియాతో మాట్లాడుతూ.. దానం నాగేందర్ సభ్యత్వం రద్దు, రాష్ట్రంలోని ప్రస్తుత రాజకీయ పరిణామాలపై స్పష్టత ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎలాంటి ఫిరాయింపులు జరగలేదన్నారు. కేవలం కాంగ్రెస్ పార్టీ అందిస్తున్న సంక్షేమం, ప్రజా పాలన, అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై మాత్రమే ప్రతిపక్ష ఎమ్మెల్యేలు తమ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చారని గుర్తుచేశారు. దానం నాగేందర్ తిరిగి ఖైరతాబాద్ ఉపఎన్నిక బరిలో నిలుస్తారా? లేదా? అనేది కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పరిశీలించి నిర్ణయిస్తుందని వెల్లడించారు.

CKalyan: సినీ నిర్మాత సి.కల్యాణ్‌పై కేసు.. ప్లాట్లు కబ్జా చేశారంటూ ఆరోపణలు!సినిమాSwechaa19 Sep 2026, 03:02 PM

CKalyan: సినీ నిర్మాత సి.కల్యాణ్‌పై కేసు.. ప్లాట్లు కబ్జా చేశారంటూ ఆరోపణలు!

 టాలీవుడ్ ప్రముఖ నిర్మాత సీ.కల్యాణ్‌తో పాటు పలువురు వ్యక్తులపై మాదాపూర్ పోలీసు స్టేషన్‌లో స్థల కబ్జా ఫిర్యాదు నమోదైంది. మాదాపూర్ పరిధిలోని సున్నంచెరువు ప్రాంతంలో ఉన్న తమ ప్లాట్లను నిర్మాత సీ కళ్యాణ్ అక్రమంగా కబ్జా చేశారని సియాట్ (SEAT) సొసైటీ అధ్యక్షుడు శ్యామ్ సింగ్, ప్లాట్ల యజమానులు పోలీసులకు రాతపూర్వకంగా పిటిషన్ సమర్పించారు. గట్ బేగంపేట్‌లోని సర్వేనంబర్లు 12, 12ఎ, 13 పరిధిలో తమకు చెందిన ప్లాట్లు ఉన్నాయని ఈ సందర్భంగా ప్లాట్ యజమానులు వెల్లడించారు.

లీడర్ల భూముల గొడవ.. పాలిటెక్నిక్ విద్యార్థులను పట్టించుకోరా?తెలంగాణSwechaa19 Sep 2026, 02:41 PM

లీడర్ల భూముల గొడవ.. పాలిటెక్నిక్ విద్యార్థులను పట్టించుకోరా?

TG: రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ నాయకుల ఫాంహౌస్‌లు, భూ సరిహద్దుల వివాదాలే నిత్యం పతాక శీర్షికల్లో నిలుస్తున్న వేళ.. వేలాది మంది సామాన్య విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదపుటంచున పడిన సంగతి పట్టించుకోవడం లేదన్న విమర్శలు వెల్లువెత్తున్నాయి. సాంకేతిక విద్యా రంగాన్ని సమూలంగా మార్చేస్తామంటూ రాష్ట్ర ప్రభుత్వం తెరపైకి తెచ్చిన వివాదాస్పద ‘జీవో ఎంఎస్ నంబర్ 97’ ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా తీవ్ర నిరసన జ్వాలలను రగిలిస్తోన్న సంగతి తెలిసిందే.

దశాబ్దాలుగా పేద, మధ్యతరగతి బిడ్డలకు ఇంజినీరింగ్ భరోసాగా నిలిచిన పాలిటెక్నిక్ వ్యవస్థను ప్రభుత్వం నామరూపాల్లేకుండా చేస్తోందన్న ఆందోళనతో విద్యార్థులు తరగతులు బహిష్కరించి రహదారులపై బైఠాయిస్తున్నారు.

జూలై 3న ప్రభుత్వం గుట్టుచప్పుడు కాకుండా జారీ చేసిన జీవో 97 ప్రకారం.. రాష్ట్రంలోని పాలిటెక్నిక్ కళాశాలలు, డిప్లొమా కోర్సులను నూతనంగా ఏర్పాటైన 'శక్తి' (SHAKTI - స్కిల్, హ్యూమన్ క్యాపిటల్ అండ్ నాలెడ్జ్ ట్రైనింగ్ ఇనిషియేటివ్స్) శాఖతో పాటు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ పరిధిలోకి మారుస్తున్నారు. నైపుణ్యాభివృద్ధి ముసుగులో తీసుకువచ్చిన ఈ మార్పు.. సాంకేతిక విద్యా ప్రమాణాలకే గొడ్డలిపెట్టుగా మారిందని విద్యార్థి సంఘాలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నాయి.

కాలం మారింది.. కథ మారిందా? కేసీఆర్-ఈటల పాత లెక్కలు!!..తెలంగాణSwechaa19 Sep 2026, 02:30 PM

కాలం మారింది.. కథ మారిందా? కేసీఆర్-ఈటల పాత లెక్కలు!!..

రాజకీయాల్లో కాలం మారితే.. పాత కథలకూ కొత్త అర్థాలు వస్తుంటాయి! ఇప్పుడు తెలంగాణలో కేసీఆర్ భూముల వ్యవహారం మరోసారి హాట్‌టాపిక్‌గా మారింది. ఈ అంశంపై సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీశాయి. గతంలో జరిగిన పరిణామాలు, అప్పటి నిర్ణయాలు.. ఇప్పుడు మరోసారి తెరపైకి వస్తున్నాయి. దీంతో అప్పటి లెక్కలు ఏంటి? ఇప్పటి రాజకీయ పరిస్థితుల్లో అవి ఎందుకు చర్చగా మారాయి? అన్నది ఆసక్తికరంగా మారింది. మొత్తానికి.. కేసీఆర్ భూముల వ్యవహారంపై రేవంత్ వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపాయి.

ఢిల్లీలో మరో ‘నిర్భయ’ ఘటన..కదిలే టెంపోలో గ్యాంగ్ రేప్!క్రైమ్Swechaa19 Sep 2026, 02:17 PM

ఢిల్లీలో మరో ‘నిర్భయ’ ఘటన..కదిలే టెంపోలో గ్యాంగ్ రేప్!

దేశరాజధానిలో ఢిల్లీలో మరో దారుణం చోటుచేసుకుంది. అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే ఢిల్లీ పరిసరాల్లో మరో బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడటంతో పాటు హత్య చేశారు దుండగులు. ఇటీవలే కదిలే బస్సులో ఓ మైనర్‌పై డ్రైవర్, కండక్టర్ దారుణానికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో బాధితురాలు ప్రాణాలతో బయటపడింది. తాజా ఘటన మాత్రం అందుకు భిన్నం..కదులుతున్న టెంపోలో 17 ఏళ్ల బాలికపై గ్యాంగ్ రేప్ జరిగినట్టు సమాచారం. అత్యాచారం చేసిన అనంతరం బాధితురాలిని చంపేసి, శవాన్ని పొలాల్లో విసిరేసినట్టు తెలిసింది. నలుగురు నిందితులు ఈ దారుణానికి పాల్పడగా.. అందులో ముగ్గురు మైనర్లు ఉన్నట్టు తెలిసింది. నిందితులంతా బాధితురాలికి పరిచయస్తులే కావడం గమనార్హం.

మమతా బెనర్జీకి మరో షాక్.. ఉప ఎన్నికల బరి నుంచి తప్పుకున్న మరో అభ్యర్థి!NationalSwechaa19 Sep 2026, 02:03 PM

మమతా బెనర్జీకి మరో షాక్.. ఉప ఎన్నికల బరి నుంచి తప్పుకున్న మరో అభ్యర్థి!

పశ్చిమ బెంగాల్‌ రాజకీయాల్లో తీవ్ర సంక్షోభం నెలకొంది. రాబోయే ఉప ఎన్నికల నేపథ్యంలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వర్గానికి వరుసగా విపరీతమైన ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. నందిగ్రామ్ నియోజకవర్గ అభ్యర్థి సంచితా ప్రధాన్ డే తన నామినేషన్‌ను ఉపసంహరించుకున్న మరుసటి రోజే, రేజీనగర్ నుంచి పోటీలో ఉన్న మమత వర్గం అభ్యర్థి రబియుల్ ఆలం చౌధురి కూడా ఎన్నికల బరి నుంచి తప్పుకున్నారు. అక్టోబర్ 6న ఈ రెండు స్థానాలకు ఉప ఎన్నికలు జరగాల్సి ఉండగా, ఈ పరిణామాలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపుతున్నాయి.

సీఎం నాతో ఇదే చెప్పారు.. అదే చేస్తా : దానం నాగేందర్తెలంగాణSwechaa19 Sep 2026, 01:40 PM

సీఎం నాతో ఇదే చెప్పారు.. అదే చేస్తా : దానం నాగేందర్

అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్న సమయంలోనే ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ మీద అనర్హత వేటు వేస్తూ తెలంగాణ హైకోర్టు తీర్పు నిచ్చిన విషయం తెలిసిందే.ఈ విషయంలో తనకు నెగెటివ్ తీర్పు వస్తుందని ఆయన కూడా ఊహించలేదని తెలిసింది. దీంతో కొంత నిరాశకు గురైన దానం నాగేందర్.. శనివారం మరోసారి మీడియాతో మాట్లాడారు. పార్టీ ఫిరాయింపులకు పాల్పడినందుకు ఆయన సభ్యత్వాన్ని హైకోర్టు రద్దు చేయగా.. అప్పీల్‌కు వెళ్తారా? అని మీడియా ప్రతినిధులు అడుగగా.. సుప్రీంకోర్టుకు వెళ్లేది లేదని ఆయన క్లారిటీ ఇచ్చారు. సుప్రీంకోర్టుకు వెళ్లాలా వద్దా? అనేది స్పీకర్ నిర్ణయమని స్పష్టంచేశారు. ఎందుకంటే ఫిరాయింపులపై స్పీకర్ తీసుకున్న నిర్ణయం ఆధారంగానే తీర్పు కాపీ వచ్చిందని , తాను ఆర్డర్ కాపీని పూర్తిగా చదివానని చెప్పారు. నిన్న సీఎం రేవంత్ రెడ్డిని కలిశానని చెప్పిన దానం.. ‘నువ్వు ఫైటర్.. ఫైట్ చేద్దామని’ సీఎం తనతో అన్నారని పేర్కొన్నారు. తనకు ఎన్నికలు కొత్త కాదని, ఎన్నికల్లో కొట్లాడటానికి ఇష్టపడతానని, కార్యకర్తలకు కూడా ఇదే విషయం చెప్పానన్నారు.

PetrolPumpUPI: పెట్రోల్ పంపుల్లో యూపీఐ పేమెంట్లపై డీలర్ల కీలక నిర్ణయం!NationalSwechaa19 Sep 2026, 01:28 PM

PetrolPumpUPI: పెట్రోల్ పంపుల్లో యూపీఐ పేమెంట్లపై డీలర్ల కీలక నిర్ణయం!

 స్మార్ట్‌ఫోన్ చేతిలో ఉంటే చాలు పెట్రోల్ బంకుల్లో క్షణాల్లో యూపీఐ (UPI) ద్వారా డబ్బులు చెల్లించే సదుపాయానికి త్వరలోనే ఆటంకాలు ఎదురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అక్టోబర్ 15 నుంచి రూ.2,000కు మించిన ఎంపిక చేసిన డిజిటల్ వ్యాపార లావాదేవీలపై మర్చంట్ డిస్కౌంట్ రేట్ (MDR) అమలు చేయాలని కేంద్రం నిర్ణయించడమే దీనికి కారణం. ఈ కొత్త రుసుముల విధానంపై పెట్రోల్ పంప్ డీలర్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ కొత్త నిబంధనల ప్రకారం పెట్రోల్, రైల్వే, టెలికాం రంగాల్లో రూ.2,000 కంటే ఎక్కువ జరిగే ఒక్కో యూపీఐ లావాదేవీపై రూ.5ఫ్లాట్ ఎండీఆర్‌గా చెల్లించాల్సి ఉంటుంది.

ఎంతకు తెగించార్రా.. ఆ బంగారం అమ్మి భార్యకు ఐ ఫోన్ బహుమతి!వైరల్ న్యూస్Swechaa19 Sep 2026, 01:13 PM

ఎంతకు తెగించార్రా.. ఆ బంగారం అమ్మి భార్యకు ఐ ఫోన్ బహుమతి!

ఐఫోన్ అంటే కొందరికి అమితమైన ఇష్టం ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా పేరొందిన బ్రాండ్ కావడంతో దానిని ఎలాగైనా సొంతం చేసుకోవాలని ప్లాన్ చేస్తుంటారు. ముఖ్యంగా భారతీయులకు ఐఫోన్‌తో విడదీయని బంధం ఏర్పడింది. ఒకప్పుడు ఐఫోన్‌ అంటే కేవలం డబ్బులు ఉన్నవారి దగ్గరే ఉండేదనే భావన ఉంది. కానీ, ఇప్పుడు సామాన్య, మధ్యతరగతి ప్రజలు సైతం యాపిల్ ఫోన్స్ వాడుతున్నారు. టెక్నాలజీ ఎక్కువగా వినియోగించే వారు తప్పకుండా ఐఫోన్ క్యారీ చేస్తున్నారు. ఎందుకంటే ఐఫోన్‌లో తీసే ఫొటోలు అంత క్లారిటీగా ఉంటాయి. హెచ్‌డీ కెమెరాలకు తీసిపోని విధంగా పిక్చర్స్ క్యాప్చర్ చేయడం దాని సొంతం. కాగా, నిన్న ఐఫోన్ కొనేందుకు వచ్చిన కొందరిని ఇన్ ఫ్లూయెన్సర్స్ ఇంటర్వ్యూ చేయగా..షాకింగ్ నిజాలు వెలుగుచూశాయి. ఓ వ్యక్తి తన వద్ద ఐఫోన్ 18 సిరీస్ కొనేందుకు డబ్బులు లేకపోవడంతో తన తాత ముత్తాతల కాలం నుంచి వారసత్వంగా వచ్చిన బంగారం అమ్మి లేటెస్ట్ సిరీస్ ఐఫోన్ కొని తన భార్యకు బహుమతి ఇవ్వాలని అనుకుంటున్నట్టు పేర్కొన్నారు. మరొకరు తన భార్యకు గిఫ్టు ఇచ్చేందుకు పంజాబ్ నుంచి నోయిడాకు జర్నీ చేసినట్టు వెల్లడించారు.

దానం దశ తిరగడం లేదా?.. ఇప్పుడు ఏ దారి?..తెలంగాణSwechaa19 Sep 2026, 01:06 PM

దానం దశ తిరగడం లేదా?.. ఇప్పుడు ఏ దారి?..

దానం నాగేందర్ రాజకీయ ప్రస్థానంలో మరోసారి అనూహ్య మలుపు! ఎమ్మెల్యేగా అనర్హత వేటు పడటంతో ఇప్పుడు ఆయన ముందు ఉపఎన్నిక సవాల్ నిలిచింది. గతంలో 2004లో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఉపఎన్నికలో ఓడిపోయిన దానం.. 2024లో ఎంపీగా పోటీ చేసి పరాజయం పాలయ్యారు. ఇప్పుడు మళ్లీ ఉపఎన్నిక బరిలోకి వస్తానంటున్నారు. మరి కాంగ్రెస్ మళ్లీ అవకాశం ఇస్తుందా? దానం దశ తిరుగుతుందా? లేక మరోసారి రాజకీయ ఎదురుదెబ్బే ఎదురవుతుందా? అసలు దానం రాజకీయాలకు కాలం కలిసొస్తుందా లేదా అన్నదే ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో హాట్ టాపిక్ గా మారింది.

NorthKorea: దళాలు విధ్వంసకరంగా మారాలి.. కిమ్ జోంగ్ ఉన్ ఆదేశాలు!InternationalSwechaa19 Sep 2026, 12:54 PM

NorthKorea: దళాలు విధ్వంసకరంగా మారాలి.. కిమ్ జోంగ్ ఉన్ ఆదేశాలు!

 ఉత్తర కొరియా తమ సైనిక, ఆయుధ సామర్థ్యాలను అత్యున్నత స్థాయికి తీసుకెళ్లేందుకు కసరత్తు వేగవంతం చేసింది. తమ దేశ ఫిరంగి దళాలు(ఆర్టిలరీ) ప్రపంచంలోనే అత్యంత కేంద్రీకృత, అత్యంత విధ్వంసకర శక్తిగా రూపాంతరం చెందాలని ఆ దేశ అధినేత కిమ్ జోంగ్ ఉన్ ఆదేశించారు. వారం రోజులుగా పలు ప్రధాన ఆయుధ తయారీ కర్మాగారాలను, క్షిపణి ఉత్పాదక కేంద్రాలను సందర్శించిన కిమ్, ఈ సందర్బంగా ఆర్మీ ఉన్నతాధికారులకు దిశా నిర్దేశం చేశారని ఉత్తర కొరియా అధికారిక వార్తా సంస్థ కేసీఎన్ఏ (KCNA) వెల్లడించింది.

ఖైరతాబాద్ బైపోల్ ఖాయమా..? ఉప ఎన్నిక ఎప్పుడు జరుగుతుంది?తెలంగాణSwechaa19 Sep 2026, 12:29 PM

ఖైరతాబాద్ బైపోల్ ఖాయమా..? ఉప ఎన్నిక ఎప్పుడు జరుగుతుంది?

హైకోర్టు తీర్పుతో ఎమ్మెల్యే దానం నాగేందర్ అనర్హతకు గురయ్యారు. ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానం ఖాళీ అయినట్లు కోర్టు స్పష్టంగా ప్రకటించింది. తీర్పు కాపీని అసెంబ్లీ స్పీకర్, ఎన్నికల సంఘానికి పంపాలని ఆదేశించింది. దీంతో ఖైరతాబాద్‌లో మళ్లీ ఎన్నిక జరగడం దాదాపు ఖాయమైన పరిణామంగా కనిపిస్తోంది. ఉప ఎన్నిక ఖాయమైతే.. అది ఎప్పుడు?

బంగ్లాదేశ్ శరణార్థులకు ఎస్సీ సర్టిఫికెట్లు ఇవ్వాలి: బీజేపీ ఎమ్మెల్యేతెలంగాణSwechaa19 Sep 2026, 12:23 PM

బంగ్లాదేశ్ శరణార్థులకు ఎస్సీ సర్టిఫికెట్లు ఇవ్వాలి: బీజేపీ ఎమ్మెల్యే

తెలంగాణ శాసనసభలో సిర్పూర్ నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు ప్రభుత్వాన్ని ఒక సంచలన, కీలకమైన విజ్ఞప్తిని చేశారు. దశాబ్దాల క్రితం బంగ్లాదేశ్ (అప్పటి తూర్పు పాకిస్థాన్) నుంచి పశ్చిమ బెంగాల్ మీదుగా తెలంగాణలోని కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గానికి వలస వచ్చి స్థిరపడిన బెంగాలీ కుటుంబాలకు 'ఎస్సీ' (షెడ్యూల్డ్ కులాల) సామాజిక వర్గ ధ్రువీకరణ పత్రాలు (Caste Certificates) మంజూరు చేయాలని ఆయన అసెంబ్లీ వేదికగా ప్రభుత్వాన్ని కోరారు.

మద్యం షాపుల రెన్యూవల్ ఫీజు వివాదం.. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు!ఏపీSwechaa19 Sep 2026, 11:53 AM

మద్యం షాపుల రెన్యూవల్ ఫీజు వివాదం.. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు!

 ఆంధ్రప్రదేశ్‌లో మద్యం షాపుల లైసెన్స్ పునరుద్ధరణ (రెన్యూవల్) రుసుముపై నెలకొన్న వివాదంపై ఏపీ హైకోర్టు కీలకమైన మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం నోటిఫై చేసిన ఫీజును చెల్లించి, నిర్ణీత గడువులోగా దరఖాస్తు చేసుకోవాలని మద్యం దుకాణ యజమానులను ఆదేశించింది. సెప్టెంబర్ 21వ తేదీతో రెన్యూవల్ దరఖాస్తుల గడువు ముగియనున్న నేపథ్యంలో, ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లీసా గిల్, జస్టిస్ చల్లా గుణరంజన్‌లతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఈ మేరకు తీర్పు వెలువరించింది.

భక్తులకు అలర్ట్.. తిరుమల ఘాట్ రోడ్డులో బైక్‌లకు నో ఎంట్రీ!ఏపీSwechaa19 Sep 2026, 11:45 AM

భక్తులకు అలర్ట్.. తిరుమల ఘాట్ రోడ్డులో బైక్‌లకు నో ఎంట్రీ!

 తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని తిరుమల తిరుపతి దేవస్థానం (TTD), పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. బ్రహ్మోత్సవాల్లో అత్యంత ముఖ్య ఘట్టమైన 'గరుడ సేవ' సందర్భంగా రెండు ఘాట్ రోడ్లలోనూ ద్విచక్ర వాహనాల (బైక్‌ల) రాకపోకలను తాత్కాలికంగా నిషేధించారు. ఈ ఆంక్షలు సెప్టెంబర్ 18వ తేదీ రాత్రి 9 గంటల నుంచి ప్రారంభమయ్యాయి. సెప్టెంబర్ 20వ తేదీ ఉదయం 6 గంటల వరకు ఈ నిబంధనలు అమల్లో ఉంటాయని అధికారులు స్పష్టం చేశారు.

చేతిలో డిగ్రీ పట్టాలు..జాబ్‌మేళాకు పోటెత్తిన నిరుద్యోగులుతెలంగాణSwechaa19 Sep 2026, 11:30 AM

చేతిలో డిగ్రీ పట్టాలు..జాబ్‌మేళాకు పోటెత్తిన నిరుద్యోగులు

రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం జాబ్‌మేళాను నిర్వహిస్తోంది. శనివారం కోదాడ పట్టణంలోని సీసీ రెడ్డి కాన్వెంట్‌లో నిర్వహించిన మెగా జాబ్‌మేళాకు పెద్ద సంఖ్యలో నిరుద్యోగులు తరలివచ్చారు. ఉదయం నుంచే అభ్యర్థులు భారీగా తరలి రావడంతో కాన్వెంట్ ప్రాంగణం కిక్కిరిసిపోయింది. ఉద్యోగం కోసం వచ్చిన అభ్యర్థులు ముందుగా పేర్లను నమోదు చేసుకుని, అర్హతలకు అనుగుణంగా కేటాయించిన స్టాల్స్‌ వద్దకు చేరుకున్నట్టు సమాచారం.స్టాల్స్‌ వద్ద అభ్యర్థులు క్యూ లైన్లలో నిలబడి వివిధ కంపెనీల ప్రతినిధులు నిర్వహించిన ఇంటర్వ్యూలు, ఇతర ఎంపిక ప్రక్రియల్లో పాల్గొన్నారు. వివిధ రంగాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించడంతో యువత నుంచి భారీ స్పందన కనిపించింది. జాబ్‌మేళాకు పెద్దఎత్తున అభ్యర్థులు తరలిరావడంతో నిర్వాహకులు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశారు.

‘దానం’ ఔట్.. దెబ్బకు మిగతా ఎమ్మెల్యేలు పీచేముడ్?తెలంగాణSwechaa19 Sep 2026, 11:03 AM

‘దానం’ ఔట్.. దెబ్బకు మిగతా ఎమ్మెల్యేలు పీచేముడ్?

అధికార పార్టీలో సీన్ మారుతున్నట్టు తెలుస్తోంది. దానం నాగేందర్ ఎపిసోడ్ అనంతరం పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన నేతలు ఆలోచనలో పడ్డారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయాక ఆ పార్టీ గుర్తుమీద గెలిచిన సుమారు 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వారిపై కొన్ని నెలల పాటు ఫిరాయింపుల చట్టం కింద స్పీకర్ ఆధ్వర్యంలో విచారణ జరిగింది.హైకోర్టు పలుమార్లు మొట్టికాయలు వేయడంతో గడ్డం ప్రసాద్ కుమార్..పార్టీ మారిన వారందరికీ క్లీన్ చిట్ ఇచ్చారు. దానంకు క్లీన్‌చిట్ ఇవ్వడంపై బీఆర్ఎస్ అభ్యంతరం వ్యక్తం చేసింది.ఆయన బీఆర్ఎస్ గుర్తు మీద ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా గెలిచి తన పదవికి రాజీనామా చేయకుండానే కాంగ్రెస్‌లో చేరి అనంతరం హస్తం పార్టీ బీఫాం మీద సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు.ఇదే విషయాన్ని గులాబీ నేతలు హైకోర్టులో అప్పీల్ చేయగా.. ఆయన సభ్యత్వంపై న్యాయస్థానం అనర్హత వేటు వేసింది. ఇక పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తిరిగి బీఆర్ఎస్ గూటికి చేరారు.

పాచిపోయిన ఫాంహౌజ్‌ల గోల వద్దు?స్వేచ్ఛ ఛైర్మన్ డెస్క్Swechaa19 Sep 2026, 10:47 AM

పాచిపోయిన ఫాంహౌజ్‌ల గోల వద్దు?

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు కమ్మ కులస్తులు ఎంతో వివాదాస్పద జూబ్లీహిల్స్, మాదాపూర్, కూకట్ పల్లి లాంటి ఏరియాలు కబ్జా పెట్టారు. అదే కారణంతో తెలంగాణ ఉద్యమం ప్రారంభమైంది. కేసీఆర్ లాంటి పొలిటీషియన్‌కు అర్ధమయ్యే తెలంగాణ గడ్డపై బతికే వారికి భూమిపై సొయి లేదు. అంటూ నీళ్లు, నిధులు, నియమాకాల పేరుతో ప్రారంభించారు. కానీ, కల సాకారం అయ్యేలా ఉందని భూమిపై ముందుగానే ఆశతో కేసీఆర్ ఎలాంటి లాభాపేక్ష లేకుండా పేరు కోసం భూమి కొనుగోలు చేసుకున్నారు.

AI Fake report: ఏఐ తప్పుడు రిపోర్ట్.. అమెరికా-చైనా మధ్య తప్పిన యుద్ధ గండం!InternationalSwechaa19 Sep 2026, 10:25 AM

AI Fake report: ఏఐ తప్పుడు రిపోర్ట్.. అమెరికా-చైనా మధ్య తప్పిన యుద్ధ గండం!

కృత్రిమ మేధ (AI) అందించిన తప్పుడు సమాచారం వల్ల ప్రపంచ రక్షణ రంగంలో తీవ్ర కలకలం రేగింది. ఏఐ చాట్‌బాట్ చేసిన ఊహించని పొరపాటు కారణంగా అమెరికా, చైనాల మధ్య దాదాపు సైనిక ఘర్షణ లేదా యుద్ధ వాతావరణం నెలకొనే పరిస్థితి తలెత్తింది. ఈ విస్మయపరిచే ఘటనకు సంబంధించిన కథనాన్ని ఓ అంతర్జాతీయ వార్తా సంస్థ వెల్లడించింది. దీనికి సంబంధించి అందిన సమాచారం ప్రకారం.. ఈ ఏడాది తొలినాళ్లలో మధ్యప్రాచ్య సముద్ర ప్రాంతంలో ప్రయాణిస్తున్న ఒక చైనా సరుకు రవాణా నౌకలో అణ్వాయుధాలకు ఉపయోగించే అత్యంత ప్రమాదకరమైన పరికరాలు ఉన్నాయంటూ అమెరికా సైనిక నిఘా విభాగానికి ఒక నివేదిక అందింది.

హెచ్‌-1బీ వీసాలపై ట్రంప్ మరో షాక్..1 లక్ష డాలర్ల ఫీజు పొడిగిస్తూ కీలక నిర్ణయం!InternationalSwechaa19 Sep 2026, 10:13 AM

హెచ్‌-1బీ వీసాలపై ట్రంప్ మరో షాక్..1 లక్ష డాలర్ల ఫీజు పొడిగిస్తూ కీలక నిర్ణయం!

 అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ హెచ్‌-1బీ (H-1B) వీసాలకు సంబంధించి తీవ్రమైన నిర్ణయం తీసుకున్నారు. కొన్ని కేటగిరీల హెచ్‌-1బీ దరఖాస్తులకు విధించిన 1లక్ష డాలర్ల (సుమారు రూ.84 లక్షలు) భారీ రుసుమును మరికొంత కాలం కొనసాగిస్తున్నట్లు అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. దీనికితోడు హెచ్‌-1బీ వీసాలను స్పాన్సర్ చేసే కంపెనీలు అమెరికన్ ఉద్యోగులను తొలగిస్తున్నాయా లేదా అనే అంశంపై కఠినమైన నిఘా పెట్టాలని అధికారులను ఆదేశించారు. విదేశీ నిపుణులపై ఆధారపడటాన్ని తగ్గించి, స్థానిక అమెరికన్లకు ఉపాధి అవకాశాలు పెంచడమే లక్ష్యంగా వైట్‌హౌస్ ఈ చర్యలు చేపట్టింది.

పాఠశాలల్లో చికెన్ బిర్యానీ.. కండిషన్స్ అప్లయ్!NationalSwechaa19 Sep 2026, 09:58 AM

పాఠశాలల్లో చికెన్ బిర్యానీ.. కండిషన్స్ అప్లయ్!

విద్యార్థులకు పాఠశాలల్లో చికెన్ బిర్యానీ వడ్డించేందుకు తమిళనాడు సర్కార్ ప్రతిపాదన తీసుకొచ్చిన విషయం తెలిసిందే. దీని మీద ప్రస్తుతం కసరత్తు జరుగుతున్నట్టు తెలుస్తోంది. దీనిమీద ప్రతిపక్ష డీఎంకే పార్టీ నుంచి విమర్శలు వెల్లువెత్తినా సీఎం విజయ్ మాత్రం ముందుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నట్టు సమాచారం. విద్యార్థులను పోషకాహార లోపం నుంచి బయటపడేయాలని టీవీకే సర్కార్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం (మిడ్-డే మీల్స్) కింద వారానికి ఒకసారి చికెన్ బిర్యానీ అందించాలని, దీని మీద అధ్యాయనం చేయాలని ఇప్పటికే అధికారులను సీఎం విజయ్ ఆదేశించినట్టు తెలిసింది. విద్యార్థుల్లో పోషకాహార లోపాన్ని నివారించడంతో పాటు, ప్రభుత్వ బడుల్లో వారి హాజరు శాతాన్ని పెంచాలనే లక్ష్యంతో ఈ ప్రతిపాదనను సిద్ధం చేసినట్లు తాజాగా తమిళనాడు విద్యాశాఖ మంత్రి తెలిపారు.

అమానుషం.. మహిళను జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లిన కానిస్టేబుల్!వైరల్ న్యూస్Swechaa19 Sep 2026, 09:27 AM

అమానుషం.. మహిళను జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లిన కానిస్టేబుల్!

 హైదరాబాద్‌లోని హఫీజ్‌పేట్ రైల్వే స్టేషన్‌ ఆవరణలో అత్యంత అమానుషమైన సంఘటన చోటుచేసుకుంది. ఓ సామాన్య మహిళ పట్ల గవర్నమెంట్ రైల్వే పోలీస్ (RPF) కానిస్టేబుల్ ఒకరు విచక్షణారహితంగా ప్రవర్తిస్తూ, తీవ్ర దౌర్జన్యానికి దిగాడు. రైల్వే స్టేషన్‌ ప్రాంగణంలోని ఒక దుకాణం వద్ద నిలబడి ఉన్న సదరు మహిళపై కానిస్టేబుల్ ఒక్కసారిగా విరుచుకుపడి దాడి చేశాడు. ఈ హఠాత్ పరిణామంతో అక్కడున్న ప్రయాణికులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.

Keerthy Suresh-Comments: మగవాళ్ళు ఏడవకూడదా? కీర్తి షాకింగ్ కామెంట్స్!సినిమాSwechaa19 Sep 2026, 09:01 AM

Keerthy Suresh-Comments: మగవాళ్ళు ఏడవకూడదా? కీర్తి షాకింగ్ కామెంట్స్!

Keerthy Suresh: సౌత్ స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న సినిమా ‘డోరతి’. కార్తిక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సెప్టెంబర్ 25న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. దర్శకుడి టేకింగ్, ఇళయరాజా సంగీతం, అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్ ప్రీమియర్ వంటి అంశాలతో ఈ సినిమా అందరిలోనూ విపరీతమైన ఆసక్తిని రేకెత్తిస్తోంది. అయితే, తాజాగా ఈ సినిమా గురించి 'మగవాళ్ళు ఏడవకూడదా'.. అంటూ కీర్తి చెప్పిన మాట నెట్టింట వైరల్ అవుతోంది.

తెలుగు రాష్ట్రాలకు తుఫాన్ గండం.. పలు జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్‌!తెలంగాణSwechaa19 Sep 2026, 08:54 AM

తెలుగు రాష్ట్రాలకు తుఫాన్ గండం.. పలు జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్‌!

 ఎల్‌నినో ప్రభావంతో వర్షాల జాడే కనుమరుగవుతున్న వేళ అల్పపీడన ప్రభావంతో అప్పుడప్పుడు వర్షాలు కురిసి మురిపిస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా వాతావరణ శాఖ కీలక అప్‌డేట్ ఇచ్చింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వారం రోజుల పాటు వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. అల్పపీడనం వాయుగుండంగా మారి తుఫాన్‌గా రూపాంతరం చెందే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.

శంషాబాద్‌లో అదుపుతప్పిన కారు నలుగురు మృతి!..క్రైమ్Swechaa19 Sep 2026, 08:31 AM

శంషాబాద్‌లో అదుపుతప్పిన కారు నలుగురు మృతి!..

శంషాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అదుపుతప్పిన కారు కల్వర్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు. మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. మృతులంతా మహబూబ్‌నగర్‌ జిల్లా నవాబుపేట మండలం చౌడూరు గ్రామ వాసులుగా పోలీసులు పేర్కొన్నారు..

Rashmika-South Fans: నేను పర్‌ఫెక్ట్ కాదు..నా అభిమానులే చెప్పారు!సినిమాSwechaa19 Sep 2026, 08:22 AM

Rashmika-South Fans: నేను పర్‌ఫెక్ట్ కాదు..నా అభిమానులే చెప్పారు!

Rashmika Mandanna: కన్నడ బ్యూటీ రష్మిక మందన్న తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తాను పర్‌ఫెక్ట్ కాదని చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇంతకీ, ఆమె ఏ విషయంలో ఇలా మాట్లాడిందీ అంటే భాష విషయంలో. మాతృ భాష కాకుండా మిగతా భాషలలో సినిమాలు చేస్తున్న రష్మిక కెరీర్ ప్రారంభ రోజులను గుర్తు చేసుకొని ఇలా చెప్పుకొచ్చింది. నాకు ఏ భాష అంతగా రాదని ఓపెన్‌గా చెప్పింది.

భగ్గుమంటున్న ధరలు.. సామాన్యుడి బతుకులో మంటలు!..తెలంగాణSwechaa19 Sep 2026, 08:03 AM

భగ్గుమంటున్న ధరలు.. సామాన్యుడి బతుకులో మంటలు!..

ప్రస్తుతం సెప్టెంబరు రెండోవారం ముగిసినా సరైన వర్షాలు లేవు. ఎల్‌నినో ప్రభావంతో ఎండల తీవ్రత పెరిగి పంట దిగుబడులు తగ్గుతున్నాయి. దీంతో నిత్యావసర ధరలు భగ్గుమంటున్నాయి. ఆ ప్రభావం హోటళ్లలోనూ కనిపిస్తోంది. టీస్టాల్‌ నుంచి భోజన హోటల్‌ వరకు అందరూ ధరలు పెంచేశారు. సామాన్యులు బయట ఏది కొనాలన్నా.. ఏది తినాలన్నా పరిస్థితులు భారంగా మారాయి.

Vishwambhara-UV Creations: నష్టాల్లో యు.వి క్రియేషన్స్‌..విశ్వంభర వీఎఫెక్స్ కి బడ్జెట్ లేదా?సినిమాSwechaa19 Sep 2026, 07:49 AM

Vishwambhara-UV Creations: నష్టాల్లో యు.వి క్రియేషన్స్‌..విశ్వంభర వీఎఫెక్స్ కి బడ్జెట్ లేదా?

Vishwambhara: మెగాస్టార్‌ చిరంజీవి ప్రస్తుతం రెండు సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. వీటిలో ఒకటి ఎప్పుడో మొదలైన ‘విశ్వంభర’ చిత్రం కాగా, రెండో సినిమా ఈ ఏడాది షూటింగ్ ప్రారంభం అయిన ‘కాకా’. ఈ రెండు సినిమాల విడుదల తేదీలపై గత కొన్నిరోజులుగా రక రకాల వార్తలు వచ్చి అభిమానులను కన్‌ఫ్యూజ్ చేస్తున్నాయి. ‘కాకా’ రిలీజ్ విషయంలో క్లారిటీ ఉంది గానీ, ‘విశ్వంభర’ మాత్రం ఆర్థిక ఇబ్బందుల వల్ల ఆగిందని సమాచారం.

మద్య నిషేధంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!!..తెలంగాణSwechaa19 Sep 2026, 07:32 AM

మద్య నిషేధంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!!..

సంపూర్ణ మద్య నిషేధంపై సుప్రీంకోర్టు చేసిన కీలక వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. మద్యం అందుబాటును పూర్తిగా నిలిపివేయడం ద్వారా సమస్య అంతమవుతుందని భావించడం కంటే.. అక్రమ సారా తయారీ, కల్తీమద్యం, దొంగచాటు రవాణా, రహస్యంగా మద్యం విక్రయాలు వంటి పరిణామాలు మరింత ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.

మెదడు చురుగ్గా పనిచేయాలంటే ఏం చేయాలి?..HealthSwechaa19 Sep 2026, 07:10 AM

మెదడు చురుగ్గా పనిచేయాలంటే ఏం చేయాలి?..

మన శరీరాన్ని నడిపించే అత్యంత కీలకమైన అవయవాల్లో మెదడు ఒకటి. ఆలోచించడం, జ్ఞాపకశక్తి, నిర్ణయాలు తీసుకోవడం, శరీర కదలికలను నియంత్రించడం వంటి ఎన్నో ముఖ్యమైన పనులు మెదడు ద్వారానే జరుగుతాయి. అందుకే మెదడు ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ప్రతి ఒక్కరికీ అవసరం.. ముందుగా మానసిక ఒత్తిడిని తగ్గించుకోవాలి. ధ్యానం, యోగా, ప్రాణాయామం వంటి పద్ధతులు విశ్రాంతికి, ఒత్తిడి నియంత్రణకు సహాయపడతాయి. అదే సమయంలో అధిక రక్తపోటు, రక్తంలో చక్కెర, కొలెస్ట్రాల్ వంటి అంశాలను అదుపులో ఉంచుకోవడం కూడా మెదడు ఆరోగ్యానికి ముఖ్యమే. అవసరమైతే వైద్యుల సూచనలతో చికిత్స తీసుకోవాలి. క్రమం తప్పకుండా శారీరక వ్యాయామం చేయడం వల్ల శరీరానికి రక్త ప్రసరణ మెరుగుపడటమే కాకుండా, మెదడు ఆరోగ్యానికి కూడా ప్రయోజనం కలుగుతుంది.