స్వేచ్ఛ షార్ట్స్ — తాజా తెలుగు వార్తలు

గణపతి పూజలో పెట్టిన కొబ్బరికాయను నిమజ్జనం తర్వాత ఏం చేస్తే మంచిది?..SpiritualitySwechaa19 Sep 2026, 06:59 AM

గణపతి పూజలో పెట్టిన కొబ్బరికాయను నిమజ్జనం తర్వాత ఏం చేస్తే మంచిది?..

గణేష్ ఉత్సవాల్లో గణపతి ప్రతిష్ఠతో పాటు కలశ స్థాపనకు కూడా ప్రత్యేక ప్రాధాన్యం ఉంటుంది. కలశంపై ఉంచే కొబ్బరికాయను హిందూ సంప్రదాయంలో పవిత్రంగా భావిస్తారు. పూజా కార్యక్రమాలు పూర్తయిన తర్వాత కూడా ఈ కొబ్బరికాయను సాధారణ వస్తువులా కాకుండా భక్తి, గౌరవంతో నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. అయితే గణపతి నిమజ్జనం తర్వాత కలశంలో ఉంచిన కొబ్బరికాయను ఏం చేయాలనే సందేహం చాలామందికి ఉంటుంది. కాగా గణపతి నిమజ్జనం పూర్తయిన తర్వాత కలశంలో కొబ్బరికాయ పాడవకుండా, తినడానికి అనువుగా ఉంటే దానిని పగలగొట్టి ప్రసాదంగా కుటుంబ సభ్యులు, బంధువులు లేదా భక్తులకు పంచుకోవచ్చు.. లేదా కొబ్బరికాయను వెంటనే ఉపయోగించలేని పరిస్థితిలో శుభ్రమైన ప్రదేశంలో ఉంచి, తర్వాత దేవాలయంలో సమర్పించవచ్చు. కొబ్బరికాయకు మొలక వచ్చినట్లయితే దానిని ఇంటి తోటలో లేదా అనుకూలమైన ప్రదేశంలో నాటడం కూడా మంచిదని ఆధ్యాత్మిక సంప్రదాయాలు చెబుతున్నాయి.

దుర్ముహూర్తంలో శుభకార్యాలు ఎందుకు చేయరు?..SpiritualitySwechaa19 Sep 2026, 06:53 AM

దుర్ముహూర్తంలో శుభకార్యాలు ఎందుకు చేయరు?..

మన రోజువారీ జీవితంలో ఏదైనా శుభకార్యం ప్రారంభించే ముందు పంచాంగం చూసే సంప్రదాయం మన దేశంలో అనాదిగా కొనసాగుతోంది. తిథి, వారం, నక్షత్రం, యోగంతో పాటు రాహుకాలం, యమగండం, దుర్ముహూర్తం వంటి కాలాలను కూడా పంచాంగంలో సూచిస్తారు. వీటిలో దుర్ముహూర్తం అంటే అసలు ఏమిటి? ఈ సమయంలో శుభకార్యాలు ఎందుకు చేయకూడదని సంప్రదాయం చెబుతోంది?.. జ్యోతిష్య పంచాంగ సంప్రదాయం ప్రకారం.. రోజులోని కొన్ని కాలాలను శుభకార్యాలకు అనుకూలంగా పరిగణించరు. అలాంటి కాలాల్లో దుర్ముహూర్తం ఒకటి. సాధారణంగా ఒక ముహూర్తం సుమారు 48 నిమిషాలకు సమానం. అయితే దుర్ముహూర్తం ప్రతిరోజూ ఒకే సమయంలో ఉండదు. సూర్యోదయం, సూర్యాస్తమయం, వారంలోని రోజు వంటి అంశాలను ఆధారంగా చేసుకుని దాని లెక్కలు మారుతాయి.

ఖైరతాబాద్‌లో ఉప ఎన్నిక.. హైఓల్టేజ్ ఫైట్‌కు రంగం సిద్ధం!తెలంగాణSwechaa19 Sep 2026, 12:02 AM

ఖైరతాబాద్‌లో ఉప ఎన్నిక.. హైఓల్టేజ్ ఫైట్‌కు రంగం సిద్ధం!

హైదరాబాద్‌ లో కీలక నియోజకవర్గమైన ఖైరతాబాద్‌.. మరోసారి రాష్ట్ర రాజకీయాల దృష్టిని ఆకర్షించబోతోందా..? ఎమ్మెల్యే అనర్హతతో ఖాళీ అయిన స్థానంలో జరగబోయే ఉప ఎన్నిక.. అసాధారణ ఎన్నికలా ఉండబోతోందా..? అధికార కాంగ్రెస్‌కు ఇది బలపరీక్ష అయితే.. బీఆర్ఎస్‌కు రీ ఎంట్రీకి సంకేతం ఇచ్చే అవకాశమా..?

AMRపై ఈడీ దాడులు.. రూ.6.35 కోట్ల ఆస్తులు సీజ్.. అసలు ఏం జరిగింది?తెలంగాణSwechaa18 Sep 2026, 11:28 PM

AMRపై ఈడీ దాడులు.. రూ.6.35 కోట్ల ఆస్తులు సీజ్.. అసలు ఏం జరిగింది?

ఏఎంఆర్ గ్రూప్ సంస్థలపై జరిగిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సోదాలకు సంబంధించి కీలక అప్‌డేట్ వచ్చింది. సెప్టెంబర్ 11న హైదరాబాద్‌తో పాటు ఇతర ప్రాంతాల్లో సోదాలు నిర్వహించిన ఈడీ.. తాజాగా ఈ వ్యవహారంపై అధికారిక ప్రకటన విడుదల చేసింది.

వారితోనూ రాజీనామా చేయించి ఎన్నికలకు రండితెలంగాణSwechaa18 Sep 2026, 11:27 PM

వారితోనూ రాజీనామా చేయించి ఎన్నికలకు రండి

Disqualification: దానం నాగేందర్ పై అనర్హత వేటు వేస్తూ హైకోర్టు ఇచ్చిన సంచలన తీర్పుపై బీఆర్ఎస్, బీజేపీ స్పందించాయి. హైకోర్టు తీర్పు ఆ రెండు పార్టీల నాయకులు స్వాగతించారు. న్యాయస్థానం నిర్ణయంపై హర్షం వ్యక్తం చేశారు. కోర్టు తీర్పు కాంగ్రెస్ పార్టీకి, సీఎం రేవంత్ రెడ్డికి చెంపపెట్టుగా అభివర్ణించారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం బుద్ధి తెచ్చుకోవాలని, పార్టీ ఫిరాయించిన మిగతా ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలని బీఆర్ఎస్, బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు.

Shashwat Sachdev: RC 17 కి ధురంధర్ మ్యూజిక్ డైరెక్టర్!సినిమాSwechaa18 Sep 2026, 10:50 PM

Shashwat Sachdev: RC 17 కి ధురంధర్ మ్యూజిక్ డైరెక్టర్!

Shashwat Sachdev: సుకుమార్ మొదటి సారి సంగీత దర్శకుడి విషయంలో వైల్డ్ డెసిషన్ తీసుకోబోతున్నాడా? ప్రస్తుతం అవుననే సమాధానం వస్తోంది. దీనికి, కారణాలు ఏంటనేవి స్పష్టంగా తెలియదు గానీ, కెరీర్ ప్రారంభం నుంచి ఉన్న రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్‌ను పక్కన పెట్టి 'ధురంధర్' ఫేమ్ శాస్వత్ సచ్‌దేవ్‌ని తీసుకునే ఆలోచనలో సుకుమార్ ఉన్నట్టుగా తాజా సమాచారం. ఇదే, నిజమైతే..టాలీవుడ్‌లో మ్యూజిక్ డైరెక్టర్స్‌కి ఠఫ్ కాంపిటీషన్ ఖాయం.

రేవంత్‌.. మా భూములన్నీ రాసిస్తాం.. పేదల అకౌంట్లలో లక్ష కోట్లు వేస్తావా : కేటీఆర్తెలంగాణSwechaa18 Sep 2026, 10:02 PM

రేవంత్‌.. మా భూములన్నీ రాసిస్తాం.. పేదల అకౌంట్లలో లక్ష కోట్లు వేస్తావా : కేటీఆర్

KTR: తెలంగాణ రాజకీయాల్లో మరోసారి నిప్పు రాజుకుంది. మాజీ సీఎం కేసీఆర్ కుటుంబానికి రాష్ట్రవ్యాప్తంగా రూ.లక్ష కోట్ల విలువైన భూములున్నాయంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రేవంత్ చేసిన ఆరోపణలను తుత్తునియలు చేస్తూ.. కనీవినీ ఎరుగని రీతిలో నేరుగా సీఎంకే బహిరంగ సవాల్ విసిరారు.కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనలో ఘోరంగా విఫలమైందని, ఇచ్చిన 420 హామీల అమలులో మోసం చేసిందని కేటీఆర్ మండిపడ్డారు. రాష్ట్రంలో రైతులు కరెంట్ కోతలు, యూరియా కొరత, సాగునీటి కష్టాలతో అల్లాడుతుంటే.. నిరుద్యోగులకు ఇచ్చిన రెండు లక్షల ఉద్యోగాల హామీ గాల్లో కలిసిపోయిందని విమర్శించారు. ఈ వైఫల్యాలన్నింటి నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే ప్రధాన ప్రతిపక్షంపై అడ్డగోలుగా బురదజల్లుతున్నారని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్ల కుంభకోణం జరిగిందంటూ గతంలో ఎన్నికల వేళ గగ్గోలు పెట్టి, ఇప్పటివరకు ఒక్క రూపాయి అవినీతిని కూడా నిరూపించలేకపోయారని ఎద్దేవా చేశారు.

Erravalli Land Survey: కేసీఆర్ ఫాంహౌస్ వద్ద ముగిసిన డే-2 సర్వే.. నెక్స్ట్ ఏంటి?తెలంగాణSwechaa18 Sep 2026, 09:19 PM

Erravalli Land Survey: కేసీఆర్ ఫాంహౌస్ వద్ద ముగిసిన డే-2 సర్వే.. నెక్స్ట్ ఏంటి?

Erravalli Land Survey: తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌కు చెందిన ఎర్రవల్లి ఫాంహౌస్ పరిసరాల్లో ఏం జరుగుతోందన్నది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం ఎర్రవల్లి పరిధిలోని ఫాంహౌస్ భూములపై రెవెన్యూ అధికారులు చేపట్టిన క్షేత్రస్థాయి విచారణ రెండో రోజు ముగిసింది. సరిహద్దు భూముల లెక్కలు తేల్చేందుకు అధికారులు స్పీడ్ పెంచడంతో ఈ వ్యవహారం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది.ఎర్రవల్లి, వెంకటాపూర్, వరదరాజపూర్ గ్రామాల సరిహద్దుల్లో ఉన్న సర్వే నెంబర్ 325లోని ఏకంగా 388 ఎకరాల భూమిపై అధికారులు ప్రధానంగా గురిపెట్టారు. గురువారం నాడే ఈ మూడు గ్రామాల సరిహద్దు ప్రాంతాలను గుర్తించి స్పష్టమైన మార్కింగ్ పూర్తి చేసిన అధికారులు, రెండో రోజు ఆ భూముల చరిత్రపై పూర్తిస్థాయిలో ఆరా తీశారు.

300 ఎకరాల కబ్జా నిరూపించకపోతే.. సీఎం, మంత్రులు రాజీనామా చేస్తారా?తెలంగాణSwechaa18 Sep 2026, 08:58 PM

300 ఎకరాల కబ్జా నిరూపించకపోతే.. సీఎం, మంత్రులు రాజీనామా చేస్తారా?

భూ కబ్జా ఆరోపణలపై కాంగ్రెస్ నేతలకు బహిరంగ సవాల్ విసిరారు హరీశ్ రావు. 300 ఎకరాలు కేసీఆర్ కబ్జాలో ఉన్నాయన్నారు.. దీనిపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపిద్దామని కోరితే కాంగ్రెస్ నేతలు తోక ముడిచారని ఎద్దేవా చేశారు. తమ నాయకుడు కేసీఆర్ దళితుల భూమిని కబ్జా చేశారని నిరూపిస్తే తామంతా రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఒకవేళ దళితుల భూమిని కేసీఆర్ కబ్జా చేయలేదని తేలితే.. సీఎం రేవంత్, మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ రాజీనామా చేస్తారా అంటూ కాంగ్రెస్ నేతలకు సవాల్ విసిరారు హరీశ్.

చిత్రం లేదు
తెలంగాణSwechaa18 Sep 2026, 08:49 PM

రేవంత్ ఆరోపణలు.. వాళ్ల నుంచి మద్దతు కరువు

Telangana Politics: తెలంగాణ రాజకీయాల్లో సీఎం రేవంత్ రెడ్డిది దూకుడు రాజకీయం అని చాలా మంది రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతుంటారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పార్టీపై, పాలనపై విమర్శలు చేసే ప్రత్యర్థులపై విరుచుకుపడటంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. అయితే ఇటీవల అసెంబ్లీలో గులాబీ పార్టీ పెద్దల భూముల వ్యవహారంపై సీఎం విసిరిన బాంబు ప్రకంపనలు సృష్టించింది. కానీ, ఈ యుద్ధంలో సీఎంకు సొంత కేబినెట్, ఎమ్మెల్యేల నుంచి దక్కిన మద్దతు చూస్తే.. "హస్తం గూట్లో రేవంత్ ఏకాకిగా మారుతున్నారా?" అనే అనుమానాలు రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి.ఎర్రవల్లి ఫాంహౌస్ పరిసరాల్లోని వందలాది ఎకరాల అసైన్డ్ భూముల అంశాన్ని స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా బట్టబయలు చేశారు. ప్రత్యర్థి పార్టీ మూలాలను కదిలించేలా ఇంతటి భారీ అస్త్రాన్ని ప్రయోగించినప్పుడు సాధారణంగా అధికార పక్ష మంత్రులు, ఎమ్మెల్యేలు మూకుమ్మడిగా విరుచుకుపడాలి. ప్రభుత్వ వాదనను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలి.

Venkatesh-Trivikram-Dimple: ‘ఆదర్శ కుటుంబం’లో ఆ ఇద్దరి మసాలా సాంగ్..సినిమాSwechaa18 Sep 2026, 08:34 PM

Venkatesh-Trivikram-Dimple: ‘ఆదర్శ కుటుంబం’లో ఆ ఇద్దరి మసాలా సాంగ్..

Venkatesh-Trivikram: సీనియర్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్, సీనియర్ దర్శకుడు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో రూపొందుతోన్న సినిమా ‘ఆదర్శ కుటుంబం - హౌస్ నెం.47’ (AK47). వెంకీ-గురూజీల కాంబో అంటేనే అంచనాలు ఏ రేంజ్‌లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అందుకే, ఈ క్రేజీ ప్రాజెక్ట్ మొదలైనప్పటి నుంచే అంచనాలు పీక్స్‌లో ఉన్నాయి. దీంతో, ఓ స్పెషల్ నంబర్ ని ప్లాన్ చేశారట. ఈ సాంగ్‌లో నివేతా, డింపుల్ కనిపించబోతున్నటుగా సమాచారం.

Janwada Farmhouse: జన్వాడ ఫామ్ హౌస్‌ను కేటీఆర్‌కు లీజుకు ఇచ్చా.. ముట్టడిస్తే కేసులు పెడతా  : ప్రదీప్‌రెడ్డితెలంగాణSwechaa18 Sep 2026, 08:19 PM

Janwada Farmhouse: జన్వాడ ఫామ్ హౌస్‌ను కేటీఆర్‌కు లీజుకు ఇచ్చా.. ముట్టడిస్తే కేసులు పెడతా : ప్రదీప్‌రెడ్డి

Janwada Farmhouse: తెలంగాణ పాలిటిక్స్‌లో తీవ్ర దుమారం రేపుతున్న జన్వాడ ఫాంహౌస్ వివాదం మరింత వేడెక్కింది. శనివారం ఉదయం కాంగ్రెస్ నాయకులు ఫాంహౌస్‌ను ముట్టడించేందుకు రెడీ అవుతున్న టైంలో, ఆ ఆస్తి అసలు యజమాని ప్రదీప్ రెడ్డి రంగంలోకి దిగి హెచ్చరికలు జారీ చేశారు. ఫాంహౌస్ వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాజకీయ కుట్రలతోనే తన వ్యక్తిగత ఆస్తిని వివాదాల్లోకి లాగుతున్నారని మండిపడ్డారు.మాజీ మంత్రి కేటీఆర్‌తో తనకున్న సంబంధాలపై ప్రదీప్ రెడ్డి స్పష్టత ఇచ్చారు. "జన్వాడ ఫాంహౌస్ నా కష్టార్జితంతో కొనుగోలు చేసిన ఆస్తి. కేటీఆర్ నాకు చిన్ననాటి ఫ్రెండ్ కావడంతో, 2019లో దీనిని ఆయనకు లీజు ఇచ్చా. ఇందులో ఎలాంటి సీక్రెట్స్, అక్రమాలు లేవు. కేవలం కేటీఆర్‌తో తనకున్న సాన్నిహిత్యం కారణంగానే కొందరు ఉద్దేశపూర్వకంగా నాపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు" అని ఆయన వివరించారు..

Kayadu Lohar-Nani-Paradise: మొదటిసారి ఒక హీరోయిన్ విషయంలో నాని ఇలా!సినిమాSwechaa18 Sep 2026, 07:58 PM

Kayadu Lohar-Nani-Paradise: మొదటిసారి ఒక హీరోయిన్ విషయంలో నాని ఇలా!

Kayadu Lohar: సెప్టెంబర్ 24న అత్యంత భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది 'ది ప్యారడైజ్ సినిమా'. నేచురల్ స్టార్ నాని నటించిన ఈ సినిమాకి 'దసరా' ఫేమ్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించాడు. ఎలాంటి ట్రైలర్ కట్ లేకుండా ఎ సర్టిఫికెట్‌తో నేరుగా థియేటర్స్‌లోకి రాబోతోంది 'ప్యారడైజ్'. ఈ నేపథ్యంలో జోరుగా ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు. దీనిలో, భాగంగా చెన్నైలో జరిగిన ప్రెస్ మీట్‌లో నాని హీరోయిన్ కయాదు లోహర్ ప్రమోషన్స్‌కి రాకపోవడానికి ఇంకో సినిమానే కారణం అని క్లారిటీ ఇచ్చాడు.

Vishwambhara-Update: 'విశ్వంభర' మూవీపై దర్శకుడి ఆవేదనా ఇది?సినిమాSwechaa18 Sep 2026, 07:23 PM

Vishwambhara-Update: 'విశ్వంభర' మూవీపై దర్శకుడి ఆవేదనా ఇది?

Vishwambhara: ఒకే ఒక్క సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని ఆకట్టుకున్నాడు యువ దర్శకుడు మల్లిడి వశిష్ట. ఆ సినిమానే బింబిసారా. నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించారు. ఈ సినిమాకి ముందు కళ్యాణ్ రామ్ కి సరైన హిట్ లేదు. సోషియో ఫాంటసీ మూవీగా వచ్చిన బింబిసారా బాక్సాఫీస్ వద్ద మంచి కమర్షియల్ హిట్‌గా నిలిచింది. దీంతో, మెగాస్టార్ చిరంజీవిని డైరెక్ట్ చేసే ఛాన్స్ అందుకున్నాడు. అదే, విశ్వంభర. తాజాగా ఈ సినిమాపై వశిష్ట పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది.

బెంగాల్ రాజకీయాల్లో కీలక మలుపు.. నందిగ్రామ్ బైపోల్‎ నుంచి తప్పుకున్నTMC అభ్యర్థి!!..NationalSwechaa18 Sep 2026, 07:12 PM

బెంగాల్ రాజకీయాల్లో కీలక మలుపు.. నందిగ్రామ్ బైపోల్‎ నుంచి తప్పుకున్నTMC అభ్యర్థి!!..

పశ్చిమ బెంగాల్ ఉప ఎన్నికల వేళ మమతా బెనర్జీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. నందిగ్రామ్‌లో టీఎంసీ తరఫున బరిలో ఉన్న సంచితా ప్రధాన్ డే.. ముఖ్యమంత్రి సువేందు అధికారితో భేటీ అనంతరం అనూహ్యంగా పోటీ నుంచి తప్పుకున్నారు. దీంతో నందిగ్రామ్‌లో కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతు ఇస్తున్నట్లు మమత ప్రకటించారు. పార్టీ పేరు, గుర్తుపై ఈసీ నిర్ణయాన్ని బీజేపీ కుట్రగా ఆరోపించిన దీదీ.. ఎన్ని అడ్డంకులు వచ్చినా పోరాటం కొనసాగిస్తానని స్పష్టం చేశారు.

పోరాటం నాకు కొత్త కాదు.. మళ్లీ గెలుస్తా- హైకోర్టు తీర్పుపై దానం నాగేందర్తెలంగాణSwechaa18 Sep 2026, 07:08 PM

పోరాటం నాకు కొత్త కాదు.. మళ్లీ గెలుస్తా- హైకోర్టు తీర్పుపై దానం నాగేందర్

Danam Nagender: తనపై అనర్హత వేటు వేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై దానం నాగేందర్ స్పందించారు. హైకోర్టు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు వెల్లడించారు. కాగా, హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టును ఆశ్రయించే అంశంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని దానం తెలిపారు. ఉప ఎన్నికకైనా సిద్ధమే అని తేల్చి చెప్పారు. ఖైరతాబాద్ ఉపఎన్నిక షెడ్యూల్ ఎప్పుడు వచ్చినా తాను సిద్ధంగా ఉన్నట్లు దానం చెప్పారు. ఎన్నికలు తనకు కొత్తేమీ కాదన్నారు. మళ్లీ పోరాడతా, మళ్లీ గెలుస్తా అనే ధీమా వ్యక్తం చేశారు. కాగా, ఏ పార్టీ తరపున బరిలోకి దిగతారు అనేదానిపై మాత్రం దానం నాగేందర్ క్లారిటీ ఇవ్వలేదు.

ఎర్రవల్లిలో కేసీఆర్ కబ్జాలు నిజమేనా?తెలంగాణSwechaa18 Sep 2026, 06:57 PM

ఎర్రవల్లిలో కేసీఆర్ కబ్జాలు నిజమేనా?

Erravalli Farmhouse: తెలంగాణ రాజకీయాల్లో హీట్ పెంచేసిన మాజీ సీఎం కేసీఆర్ ఎర్రవల్లి ఫాంహౌస్ భూముల వ్యవహారంలో మరో సంచలన అంశం వెలుగులోకి వచ్చింది. ఫాంహౌస్ లగ్జరీ అవసరాల కోసం ఏకంగా పేద దళితుల అసైన్డ్ భూములనే కబ్జా చేశారనే ఆరోపణలకు సంబంధించి డాక్యుమెంటరీ ఆధారాలు సోషల్ మీడియాలో ప్రత్యక్షం కావడం ఇప్పుడు కలకలం రేపుతోంది. దళితుల కడుపు కొట్టి, వారి సాగు భూముల్లో ఓ భారీ చెరువునే నిర్మించారన్న అంశం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది.

అనర్హత వేటు.. సుప్రీంకోర్టును ఆశ్రయించే యోచనలో దానం నాగేందర్!తెలంగాణSwechaa18 Sep 2026, 06:44 PM

అనర్హత వేటు.. సుప్రీంకోర్టును ఆశ్రయించే యోచనలో దానం నాగేందర్!

హైకోర్టు తీర్పు నేపథ్యంలో దానం నాగేందర్ ఏ విధంగా ముందుకెళ్లనున్నారు అనేదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. హైకోర్టు తీర్పుపై దానం నాగేందర్ సుప్రీంకోర్టును ఆశ్రయించే యోచనలో ఉన్నారని తెలుస్తోంది. గతంలో భూపతి రెడ్డి కూడా ఇదే తరహాలో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది. ఈ క్రమంలో దానం నాగేందర్ సుప్రీంకోర్టును ఆశ్రయించినా గత కేసులో మాదిరిగానే తీర్పు రావచ్చని కొందరు న్యాయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Tollywood-nani-Comments: పాన్-ఇండియా ట్యాగ్‌పై నాని కామెంట్స్...నిజమే కదా!సినిమాSwechaa18 Sep 2026, 06:37 PM

Tollywood-nani-Comments: పాన్-ఇండియా ట్యాగ్‌పై నాని కామెంట్స్...నిజమే కదా!

Tollywood: ఒకప్పుడు తెలుగు సినిమా, తమిళ సినిమా, హిందీ సినిమా, కన్నడ సినిమా, మలయాళ సినిమా అంటూ ఆయా రీజనల్ భాషను గుర్తిస్తూ చెప్పుకునే వారు. కానీ, గత కొన్నేళ్ళుగా ఈ పద్ధతి మారి సౌత్‌లో ఏ సినిమా పలు భాషల్లో రిలీజైతే అది పాన్-ఇండియా అంటూ పిలుస్తున్నారు. అసలు, పాన్ ఇండియా సినిమా అంటే ఏంటీ..? అని చాలామంది ప్రశ్నించారు కూడా. నానీ కూడా ఇప్పుడు ఈ ట్యాగ్ అంటే నచ్చదని తేల్చిపారేశాడు.

దానంపై అనర్హత.. జంపింగ్‌ జిలానీలకు ఇదొక గుణపాఠమా..?తెలంగాణSwechaa18 Sep 2026, 06:23 PM

దానంపై అనర్హత.. జంపింగ్‌ జిలానీలకు ఇదొక గుణపాఠమా..?

TG Politics: ఎన్నికల్లో ఒక పార్టీ గుర్తుపై పోటీ చేయడం.. గెలిచాక అధికార పార్టీ పంచన చేరడం.. తెలంగాణ రాజకీయాల్లో కొన్నేళ్లుగా సాధారణ అలవాటుగా మారిపోయింది. ఓటర్ల తీర్పును అపహాస్యం చేస్తూ పార్టీలు మారినా తమకేమీ కాదనే ధీమాతో ఉండే నాయకులకు తాజాగా ఉన్నత న్యాయస్థానం ఊహించని షాక్ ఇచ్చింది. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై హైకోర్టు అనర్హత వేటు వేయడం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. పార్టీ ఫిరాయింపులకు పాల్పడే నేతలకు చట్టం గుణపాఠం నేర్పగలదన్న బలమైన సంకేతాన్ని ఈ తీర్పు ఇచ్చినట్లు అయ్యింది.తాజాగా ఘటనలో దానం నాగేందర్ చేసిన అతిపెద్ద తప్పిదం ఆయన రాజకీయ భవిష్యత్తుకే గొడ్డలిపెట్టుగా మారిందనే వాదనలు వినిపిస్తున్నాయి. బీఆర్‌ఎస్ గుర్తుపై ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్‌లోకి వెళ్లడమే కాకుండా, సికింద్రాబాద్ లోక్‌సభ స్థానం నుంచి హస్తం పార్టీ ‘బి-ఫామ్’పై ఆయన ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన సంగతి తెలిసిందే. వేరే పార్టీ టికెట్‌పై అధికారికంగా ఎన్నికల బరిలోకి దిగడమే ఆయన పార్టీ మారారనడానికి తిరుగులేని న్యాయపరమైన సాక్ష్యంగా మారింది. కోర్టు ముందు ఎలాంటి సాకులూ నిలబడకుండా నేరుగా ఆయనపై అనర్హత వేటు పడటానికి ఇదే ప్రధాన కారణమైందని చెబుతున్నారు.

కొత్త ఇన్‌ఛార్జ్ వస్తే మొదటికే మోసం వస్తుందా? కాంగ్రెస్ నేతల్లో మొదలైన వణుకు!తెలంగాణSwechaa18 Sep 2026, 05:55 PM

కొత్త ఇన్‌ఛార్జ్ వస్తే మొదటికే మోసం వస్తుందా? కాంగ్రెస్ నేతల్లో మొదలైన వణుకు!

Telangana Congress: తెలంగాణ కాంగ్రెస్ నాయకుల్లో మళ్లీ ఆశల పల్లకి ఊగుతోంది. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఢిల్లీ పర్యటనకు వెళ్లడం, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్‌తో అత్యవసరంగా భేటీ కావడంతో గాంధీ భవన్‌లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. పార్టీ అధికారంలోకి వచ్చి మూడేళ్లు గడుస్తున్నా కార్యకర్తలకు దక్కని నామినేటెడ్ పదవుల వ్యవహారం ఎట్టకేలకు ఒక కొలిక్కి రానుందా? లేక ప్రతిసారీ చెప్పే ‘వాయిదాల పంచాంగం’ మళ్లీ తెరపైకి వస్తుందా? అన్న చర్చ ఇప్పుడు జోరందుకుంది.అయితే, ఈ సడన్ ఢిల్లీ టూర్ వెనుక ఓ కీలక పరిణామం దాగి ఉందన్నది గాంధీ భవన్ వర్గాల టాక్. ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్ త్వరలోనే సుదీర్ఘ కాలం పాటు విదేశాలకు వెళ్లనున్నారు. ఆమె వెళ్లేలోపే ఈ జాబితాలను ఆమోదింపజేయకపోతే.. ఒకవేళ రాష్ట్రానికి కొత్త ఇన్‌ఛార్జ్ వస్తే మొత్తం కసరత్తు మళ్లీ మొదటికే వస్తుందన్న భయంతోనే ఆయన ఢిల్లీకి వెళ్లినట్లు తెలుస్తోంది.మహేష్ గౌడ్ చేతిలోని ప్రతిపాదనలకు అధిష్టానం వెంటనే పచ్చజెండా ఊపుతుందా? లేక ఆశావహులకు మళ్లీ నిరీక్షణే మిగులుతుందా? అన్నది ప్రస్తుతం కాంగ్రెస్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈసారైనా పంచాయితీ తెగి లిస్టు బయటకు వస్తుందో, లేదంటే మళ్లీ కథ మొదటికే వస్తుందో చూడాలి.

ఆర్టీసీ కార్మికుల నిరీక్షణకు తెర.. రాష్ట్ర యూనియన్ ఎన్నికల షెడ్యూల్ ఖరారు!..తెలంగాణSwechaa18 Sep 2026, 05:44 PM

ఆర్టీసీ కార్మికుల నిరీక్షణకు తెర.. రాష్ట్ర యూనియన్ ఎన్నికల షెడ్యూల్ ఖరారు!..

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో గుర్తింపు యూనియన్ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్, ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యాయి. సీక్రెట్ బ్యాలెట్ విధానంలో అత్యధిక మెజారిటీ కలిగిన యూనియన్‌ను ఎన్నుకునేందుకు గాను రిటర్నింగ్ అధికారి, హైదరాబాద్ జాయింట్ లేబర్ కమిషనర్ శుక్రవారం ఈ ఎన్నికల షెడ్యూల్‌ను అధికారికంగా ప్రకటించారు. ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 9వ తేదీన పోలింగ్ జరగనుంది.

Allu Arjun-Raaka Updates: 'రాకా' నుంచి అప్‌డేట్స్ మొదలు..ఇక ఏదైనా ఖండాంతరాలు దాటే..!సినిమాSwechaa18 Sep 2026, 05:30 PM

Allu Arjun-Raaka Updates: 'రాకా' నుంచి అప్‌డేట్స్ మొదలు..ఇక ఏదైనా ఖండాంతరాలు దాటే..!

Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తోన్న అత్యంత భారీ పాన్ వరల్డ్ సినిమా రాకా. తాజాగా, ఈ సినిమా నుంచి అప్‌డేట్స్ మొదలయ్యాయి. 37 అనే నంబర్ ని వదిలి అందరిలో ఓ క్యూరియాసిటీని పెంచారు. అయితే, దీనికర్థం అల్లు అర్జున్ రాకా మూవీలో తోడేలుగా కనిపిస్తాడని..ఆ నంబర్ కి అర్థం కూడా అదేనంటూ వార్తలు వస్తున్నాయి. ఇక, తాజాగా సోషల్ మీడియాలో మరో అప్‌డేట్ ని పంచుకున్నారు. ఈ సినిమా నుంచి గ్లింప్స్ రాబోతోంది.

పార్టీ ఫిరాయించిన మిగతా ఎమ్మెల్యేలకు ఇదే గతి- కేటీఆర్తెలంగాణSwechaa18 Sep 2026, 05:14 PM

పార్టీ ఫిరాయించిన మిగతా ఎమ్మెల్యేలకు ఇదే గతి- కేటీఆర్

KTR: ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు తెలంగాణ హైకోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. దానంపై అనర్హత వేటు వేసింది. దానం నాగేందర్ శాసనసభ సభ్యత్వంపై అనర్హత వేటు వేస్తూ సంచలన తీర్పు వెలువరించింది న్యాయస్థానం. పార్టీ ఫిరాయింపుల వ్యవహారంలో బీఆర్‌ఎస్‌, బీజేపీ ఎమ్మెల్యేలు దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు ఈ నిర్ణయం తీసుకుంది.

దానంపై అనర్హత వేటు వేస్తూ హైకోర్టు ప్రకటించిన తీర్పుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. తెలంగాణ హైకోర్టు తీర్పుపై కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. పార్టీ ఫిరాయించిన మిగతా ఎమ్మెల్యేలకు ఇదే గతి పడుతుందని హెచ్చరించారు. ‘సత్యమేవ జయతే’ అంటూ ఎక్స్‌లో పోస్ట్ చేశారు కేటీఆర్.

హైకోర్టు తీర్పు కాంగ్రెస్ పార్టీకి, సీఎం రేవంత్‌కి చెంపదెబ్బతెలంగాణSwechaa18 Sep 2026, 04:41 PM

హైకోర్టు తీర్పు కాంగ్రెస్ పార్టీకి, సీఎం రేవంత్‌కి చెంపదెబ్బ

Padi Kaushik Reddy: ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కు హైకోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. దానం నాగేందర్ శాసనసభ సభ్యత్వంపై హైకోర్టు అనర్హత వేటు వేసింది. పార్టీ ఫిరాయింపు అంశంలో ఈ మేరకు న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించింది. దీనిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి స్పందించారు. హైకోర్టు తీర్పు కాంగ్రెస్ పార్టీకి, సీఎం రేవంత్ కి చెంపదెబ్బ అని చెప్పారు. అమ్ముడుపోతే అనర్హత తప్పదని మేము గతంలోనే చెప్పామన్నారు. మిగిలిన 8మందిపైనా అనర్హత వేటు పడే వరకు పోరాటం కొనసాగిస్తామని పాడి కౌశిక్ రెడ్డి తెలిపారు. అధికారం ఉందని విర్రవీగితే ఎదురుదెబ్బలు తప్పవన్నారు. ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగే ఉపఎన్నికలో బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగురవేస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై అనర్హత వేటు!తెలంగాణSwechaa18 Sep 2026, 04:28 PM

ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై అనర్హత వేటు!

TG Politics: ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు తెలంగాణ హైకోర్టులో ఊహించని షాక్ తగిలింది. ఆయన శాసనసభ సభ్యత్వంపై హైకోర్టు అనర్హత వేటు వేస్తూ సంచలన తీర్పు వెలువరించింది. పార్టీ ఫిరాయింపుల వ్యవహారంలో బీఆర్‌ఎస్‌, బీజేపీ ఎమ్మెల్యేలు దాఖలు చేసిన పిటిషన్లను న్యాయస్థానం విచారణకు స్వీకరించి ఈ నిర్ణయం తీసుకుంది.

దానం నాగేందర్‌పై అనర్హత వేటుSwechaa18 Sep 2026, 04:24 PM

దానం నాగేందర్‌పై అనర్హత వేటు

ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. పార్టీ ఫిరాయింపు కేసులో దానం నాగేందర్ పై కోర్టు అనర్హత వేటు వేసింది. ఎమ్మెల్యే దానం.. పార్టీ మారలేదు అన్న అసెంబ్లీ స్పీకర్ తీర్పును కోర్టు కొట్టివేసింది. దానం నాగేందర్ పై అనర్హత వేటు వేయాలంటూ ఏలేటి మహేశ్వర్ రెడ్డి, పాడి కౌశిక్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టు నేడు తీర్పును వెలువరించింది.

పార్టీ ఫిరాయింపు అంశంలో హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. దానం నాగేందర్ విషయంలో స్పీకర్ నిర్ణయాన్ని కోర్టు తప్పుపట్టింది. అనర్హత పిటిషన్లు కొట్టివేస్తూ స్పీకర్ తీసుకున్న నిర్ణయాన్ని న్యాయస్థానం రద్దు చేసింది.

షాద్‌నగర్‌లో విషాదం.. స్కూల్ మెట్ల పైనుంచి పడి విద్యార్థిని మృతితెలంగాణSwechaa18 Sep 2026, 04:14 PM

షాద్‌నగర్‌లో విషాదం.. స్కూల్ మెట్ల పైనుంచి పడి విద్యార్థిని మృతి

Student Dies: రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఓ ప్రైవేట్ స్కూల్‌లో మెట్లు దిగుతూ కిందపడి విద్యార్థిని మృతి చెందింది. మృతి చెందిన బాలిక పేరు వర్ణిక. వయసు 9ఏళ్లు. నాలుగో తరగతి చదువుతోంది. వర్ణిక స్కూల్ మెట్లు దిగుతూ ప్రమాదవశాత్తు జారి పడింది. ఆ వెంటనే అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. స్కూల్ యాజమాన్యం వెంటనే బాలికను ఆసుపత్రికి తరలించింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ విద్యార్థిని మరణించింది. వర్ణిక మెట్లు దిగుతూ జారిపడిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి.

చిత్రం లేదు
తెలంగాణSwechaa18 Sep 2026, 03:50 PM

Vaishnavi Episode: యూట్యూబర్ వైష్ణవి ఉదంతం.. మనకు ఏం నేర్పుతోంది..?

Vaishnavi Episode: ఒక నిండు ప్రాణం బలైపోయింది.. మరొకరి జీవితం కటకటాల పాలైంది.. ఇంకొకరి కుటుంబం నడిరోడ్డుపై నిస్సహాయంగా మిగిలిపోయింది.. యూట్యూబర్ వైష్ణవి విషాదాంతం, దాని తర్వాత జరిగిన పరిణామాలు చూస్తుంటే సమాజం ఎటు వెళ్తోంది అనే ప్రశ్న తలెత్తక మానదు. ఈ మొత్తం వ్యవహారంలో ఒకరు కాదు.. సందర్భాన్ని బట్టి ఒక్కొక్కరు చేసిన తప్పిదాలే చివరకు ఈ తీవ్ర పరిణామాలకు దారితీసినట్లు కనిపిస్తుంది.వైష్ణవి జీవితంలో తీసుకున్న మొదటి నిర్ణయమే ఆమె పాలిట శాపంగా మారినట్లు కనిపిస్తుంది. కన్నవారి అనుభవాన్ని, వారి ఆందోళనను పక్కనపెట్టి.. హరిబాబు ఎలాంటి వాడు, అతని నేపథ్యం ఏమిటి అనే కనీస ఆలోచన లేకుండా అతనిని పెళ్లి చేసుకోవడం ఆమె చేసిన పెద్ద పొరపాటు. వయసుతో వచ్చే ఆకర్షణను ప్రేమ అనుకుని, కుటుంబానికి దూరమై తీసుకునే ఆవేశపూరిత నిర్ణయాలు ఎలాంటి విపరిణామాలకు దారితీస్తాయో ఆమె ఘటన మరోసారి నిరూపించింది. కన్నవారి మాట వినకపోతే జీవితం ఎంతటి అంధకారంలోకి నెట్టబడుతుందో చెప్పడానికి వైష్ణవి విషాదమే ఒక హెచ్చరికహరిబాబు చేసిన నేరం క్షమించరానిది. తాళి కట్టిన భార్యను కంటికి రెప్పలా చూసుకోవాల్సింది పోయి, కన్నతల్లి, అన్నల మాటలు నెత్తికెక్కించుకుని అదనపు కట్నం కోసం ఆమెను నిత్యం వేధించాడు. చివరికి ఆ వేధింపులు ఒక ప్రాణాన్ని తీసే స్థాయికి దిగజారాయి. సొంత ఆలోచన లేకుండా ఇతరుల చెప్పుడు మాటలు విని, రక్తపు కూడు తిన్న హరిబాబు తన చేతులతో తానే తన జీవితాన్ని సర్వనాశనం చేసుకున్నాడు. భార్యను బలితీసుకుని సమాజం ముందు హంతకుడిగా నిలబడ్డాడు.

గచ్చిబౌలిలో పక్కకు ఒరిగిన నాలుగు అంతస్తుల భవనం.. భయాందోళనలో స్థానికులు!తెలంగాణSwechaa18 Sep 2026, 03:09 PM

గచ్చిబౌలిలో పక్కకు ఒరిగిన నాలుగు అంతస్తుల భవనం.. భయాందోళనలో స్థానికులు!

 హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ఐటీ కారిడార్ పరిధిలోని ఎన్టీఆర్ నగర్‌లో కలకలం నెలకొంది. నిర్మాణంలో ఉన్న ఒక నాలుగంతస్తుల భవనం ఒక్కసారిగా పక్కకు ఒరిగిపోవడంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. కేవలం 50గజాల చిన్న విస్తీర్ణంలో ఎలాంటి నిబంధనలు పాటించకుండా ఈ బహుళ అంతస్తుల భవనాన్ని నిర్మిస్తున్నట్లు సమాచారం. భవనం పిల్లర్లు కుంగిపోయి, పక్కనే ఉన్న ఇతర ఇళ్లపైకి ఒరిగిపోవడంతో స్థానిక ప్రజలు తీవ్ర భయంతో బయటకు పరుగులు తీశారు.