స్వేచ్ఛ షార్ట్స్ — తాజా తెలుగు వార్తలు

Jailer-2-Ranabaali: బ్లాక్ బస్టర్ సీక్వెల్‌కి ఇంకా బిజినెస్ డీల్ క్లోజ్ అవలేదా?సినిమాSwechaa18 Sep 2026, 02:47 PM

Jailer-2-Ranabaali: బ్లాక్ బస్టర్ సీక్వెల్‌కి ఇంకా బిజినెస్ డీల్ క్లోజ్ అవలేదా?

Jailer-2: సూపర్ స్టార్ రజినీ కాంత్ నటిస్తున్న లేటెస్ట్ సినిమాలలో ఒకటి జైలర్ 2. బ్లాక్ బస్టర్ జైలర్ కి సీక్వెల్ అనే విషయం అందరికీ తెలిసిందే. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రమ్య కృష్ణన్, యోగి బాబు, మీర్నా మరియు రిత్విక్ సీక్వెల్ లోనూ కంటిన్యూ అవుతున్నారు. ఇక, ఎస్.జె. సూర్య, మిథున్ చక్రవర్తి, విద్యా బాలన్, సూరజ్ వెంజరమూడు, అన్నా రాజన్.. ఇప్పుడు రెండవ భాగంలో జాయిన్ అయ్యారు. అయితే, ఇంతటి బ్లాక్ బస్టర్ అందుకున్న జైలర్ సీక్వెల్ మూవీకి ఇంకా బిజినెస్ క్లోజ్ కాకపోవడం ఆశ్చర్యంగా ఉంది.

Erravalli Lands Inquiry: రెవెన్యూ టీమ్స్ ఎంట్రీ.. ఎర్రవల్లి చుట్టూ హీటెక్కిన రాజకీయంతెలంగాణSwechaa18 Sep 2026, 02:33 PM

Erravalli Lands Inquiry: రెవెన్యూ టీమ్స్ ఎంట్రీ.. ఎర్రవల్లి చుట్టూ హీటెక్కిన రాజకీయం

Erravalli Lands Inquiry: మాజీ సీఎం కేసీఆర్‌కు చెందిన ఎర్రవల్లి ఫాంహౌస్ పరిసరాల్లోని భూములపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం దూకుడు పెంచింది. అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన ఆదేశాల మేరకు ఎర్రవల్లి, వెంకటాపూర్, వరదరాజపూర్ గ్రామాల పరిధిలోని భూ రికార్డులపై రెవెన్యూ యంత్రాంగం క్షేత్రస్థాయి విచారణను ముమ్మరం చేసింది. ఫాంహౌస్‌ను ఆనుకుని ఉన్న ఏకంగా 385 ఎకరాల అసైన్డ్, ప్రభుత్వ భూములు కబ్జాకు గురయ్యాయా అన్న కోణంలో అధికారులు జల్లెడ పడుతుండటం రాజకీయ వర్గాల్లో సంచలనం రేపుతోంది.నెల రోజుల్లోగా సమగ్ర నివేదిక ఇవ్వాలన్న ప్రభుత్వ ఆదేశాలతో సిద్దిపేట కలెక్టరేట్ సర్వే ల్యాండ్ రికార్డ్స్ ఏడీ సుదర్శన్, గజ్వేల్ ఆర్డీవో చంద్రకళ, మర్కూక్ తహసీల్దార్ నేతృత్వంలో అధికారుల బృందాలు రంగంలోకి దిగాయి.వెంకటాపూర్, వరదరాజపూర్, ఎర్రవల్లి సరిహద్దుల్లోని సర్వే నంబర్ 325తో పాటు పరిసర నంబర్లలోని అసైన్డ్ భూములను అధికారులు స్వయంగా పరిశీలించారు. అసలు రికార్డుల ప్రకారం ప్రభుత్వ భూమి ఎంత ఉండాలి? ప్రస్తుతం క్షేత్రస్థాయిలో ఉన్న విస్తీర్ణం ఎంత? అనే వివరాలను సరిపోల్చుతున్నారు.

Pa.Ranjith: 'వెట్టువం' వీడియో గ్లింప్స్ చూస్తే మైండ్ బ్లాకవ్వాల్సిందే!సినిమాSwechaa18 Sep 2026, 02:11 PM

Pa.Ranjith: 'వెట్టువం' వీడియో గ్లింప్స్ చూస్తే మైండ్ బ్లాకవ్వాల్సిందే!

Pa.Ranjith: కోలీవుడ్ స్టార్ డైరెక్టర్స్ లో పా. రంజిత్ కి ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. సూపర్ స్టార్ రజినీకాంత్ తో తీసిన కబాలి..ఎలాంటి సంచలన విజయాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే. రంజిత్ అంటేనే కొత్త తరహా కథలు, బలమైన పాత్రలు, కొత్త ప్రపంచాన్ని చూపించే ప్రయత్నాలు.. అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పా.రంజిత్ నుంచి ఇప్పటి వరకూ వచ్చిన మద్రాస్‌, కబాలి, సార్పట్ట పరంపర, తంగలాన్ కోలీవుడ్‌లో మంచి క్రేజ్ ను తెచ్చిపెట్టాయి.

సీమ ఆత్మగౌరవమే అజెండా.. కొత్త పార్టీపై విజయసాయిరెడ్డి వ్యాఖ్యలు!ఏపీSwechaa18 Sep 2026, 02:03 PM

సీమ ఆత్మగౌరవమే అజెండా.. కొత్త పార్టీపై విజయసాయిరెడ్డి వ్యాఖ్యలు!

 ఏపీలో త్వరలో కొత్త రాజకీయ పార్టీతో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన ప్రకటన చేసిన విషయం తెలిసిందే. పార్టీ పెట్టడానికి ముందే ఆయన తమ అజెండా, పార్టీపై తన నిర్ణయాలను ప్రకటిస్తూ రాష్ట్ర రాజకీయాల్లో హీట్ ను పెంచుతున్నారు. ఈ నేపథ్యంలో అనంతపురంలో శుక్రవారం(నేడు) ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో త్వరలోనే ఒక కొత్త అధ్యాయం ప్రారంభం కాబోతోందని, రాయలసీమ ప్రాంత అభివృద్ధి, ప్రజల ఆత్మగౌరవానికి వేదికగా రాజకీయ పార్టీని ఆవిర్భవిస్తున్నట్లు విజయసాయిరెడ్డి వెల్లడించారు.

Zombie Reddy-2: జాంబీ రెడ్డి సీక్వెల్ లో ఉపేంద్ర..పోస్టర్‌తోనే హీటెక్కించారుగా!సినిమాSwechaa18 Sep 2026, 01:42 PM

Zombie Reddy-2: జాంబీ రెడ్డి సీక్వెల్ లో ఉపేంద్ర..పోస్టర్‌తోనే హీటెక్కించారుగా!

Zombie Reddy-2: టాలీవుడ్ లో రూపొందుతోన్న క్రేజీ సీక్వెల్ చిత్రాల్లో జాంబీ రెడ్డి 2 ఒకటి. యంగ్ హీరో తేజ సజ్జ నటిస్తున్న ఈ సీక్వెల్ సినిమాను భారూ బడ్జెట్‌తో రూపొందిస్తున్నారు. దర్శకుడు ప్రశాంత్ వర్మ యూనివర్స్ నుంచి వస్తోన్న ఈ చిత్రాన్ని సుపర్ణ ఎస్ వర్మ తెరకెక్కిస్తున్నారు. ఇక, ఈ సినిమాను హను మాన్ కంటే ముందు చేసిన జాంబీరెడ్డి సినిమాకి సీక్వెల్ ని మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే.

22ABanLands: నిద్రమత్తు వీడిన సర్కార్.. 22-ఏ భూసమస్యల పరిష్కారానికి హైలెవల్ కమిటీ!తెలంగాణSwechaa18 Sep 2026, 01:33 PM

22ABanLands: నిద్రమత్తు వీడిన సర్కార్.. 22-ఏ భూసమస్యల పరిష్కారానికి హైలెవల్ కమిటీ!

 తెలంగాణ రాష్ట్రంలో సెక్షన్ 22-ఏ కింద నిషేధిత జాబితాలో చిక్కుకున్న భూముల సమస్యలను శాశ్వతంగా తేల్చేందుకు ప్రభుత్వం రంగంలోకి దిగింది. నిబంధనల పేరుతో భూ యజమానులు అనుభవిస్తున్న నరకయాతనకు ముగింపు పలుకుతూ, క్షేత్రస్థాయి విజ్ఞప్తులను పరిశీలించేందుకు గాను ముగ్గురు ఉన్నతాధికారుల నేతృత్వంలో ఓ ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేస్తూ అధికారిక ఆదేశాలు ఇచ్చింది. ఈ నిర్ణయంతో నిషేధిత జాబితా ఉచ్చులో చిక్కుకుని, కష్టపడి కొనుక్కున్న సొంత భూమిపై ఎలాంటి హక్కులూ లేక అల్లాడుతున్న లక్షలాది మంది సామాన్యులకు పెద్ద ఊరట లభించనుంది.

మీడియాతో అబద్ధాలు రాయిస్తున్నారు.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!తెలంగాణSwechaa18 Sep 2026, 12:58 PM

మీడియాతో అబద్ధాలు రాయిస్తున్నారు.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

 ఫార్ములా-ఈ రేసింగ్ కేసు విచారణలో భాగంగా నాంపల్లి కోర్టుకు హాజరైన అనంతరం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కేసీఆర్ కుటుంబం లక్ష కోట్ల రూపాయల ఆస్తులను కొల్లగొట్టిందంటూ రేవంత్‌రెడ్డి తన అనుకూల మీడియాతో తప్పుడు కథనాలు రాయించారని ఆయన మండిపడ్డారు. రేవంత్ రెడ్డికి సవాల్ విసురుతూ.. ‘కేవలం వేయి కోట్లు ఇచ్చి ఆ లక్ష కోట్ల ఆస్తులన్నింటినీ రేవంత్ రెడ్డి తీసుకోమని, మిగిలిన 99 వేల కోట్లతో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని’ ఎద్దేవా చేశారు.

iPhone18Pro: డబ్బులది ఏముందిలే.. చేతిలో ఐఫోన్ ఉండాలి అంతే!వ్యాపారంSwechaa18 Sep 2026, 12:30 PM

iPhone18Pro: డబ్బులది ఏముందిలే.. చేతిలో ఐఫోన్ ఉండాలి అంతే!

ఒక వైపు ధర చూస్తే లక్షల మాటే. మరోవైపు స్టోర్ తెరిచేది ఉదయం 8గంటలకైతే, జనాలు మాత్రం ముందు రోజు రాత్రి నుంచే క్యూ లైన్లలో నిలబడుతున్నారు. సాధారణంగా ఏదైనా పండుగ లేదా జాతర ఉంటేనే జనంతో కిక్కిరిసిన దృశ్యాలు కనిపిస్తాయి. కానీ, యాపిల్ సంస్థ కొత్త ఐఫోన్‌ను మార్కెట్లోకి తెచ్చిందంటే చాలు.. దేశవ్యాప్తంగా అదొక పెద్ద వేడుకలా మారిపోతుంది. ‘కొంటే ఐఫోనే కొనాలి, అది కూడా అమ్మకానికి వచ్చిన రోజే చేతిలో పడాలి’ అనే ఐ ఫోన్ లవర్స్ ముందు ఈ ధరలు, గంటల తరబడి నిరీక్షణలు చిన్నవిగా మారిపోయాయి.

అసెంబ్లీలో జీరో అవర్‌కు విలువే లేదు: ఎమ్మెల్యే దానం నాగేందర్తెలంగాణSwechaa18 Sep 2026, 12:09 PM

అసెంబ్లీలో జీరో అవర్‌కు విలువే లేదు: ఎమ్మెల్యే దానం నాగేందర్

తెలంగాణ శాసనసభలో జీరో అవర్ (Zero Hour) నిర్వహణ తీరుపై, అలాగే ఇందిరమ్మ ఇళ్ల టాయింపులపై ఎమ్మెల్యే దానం నాగేందర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో ప్రజాప్రతినిధులు లేవనెత్తుతున్న సమస్యలకు ఏమాత్రం విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. శాసనసభ సభ్యులు అడిగిన ప్రశ్నలకు సంబంధించి ‘నోట్ చేసుకుంటున్నాం’ అని మంత్రులు చెబుతున్నారే తప్ప, ఏ ఒక్క ప్రశ్నకూ ప్రభుత్వం నుంచి సరైన సమాధానం రావడం లేదని ఆయన బాహాటంగానే విమర్శించారు.

ట్రాఫిక్ చలానాలు వసూళ్ల దందా కాదు.. ట్రాఫిక్ పోలీసుల తీరుపై హైకోర్టు ఆగ్రహం!తెలంగాణSwechaa18 Sep 2026, 11:55 AM

ట్రాఫిక్ చలానాలు వసూళ్ల దందా కాదు.. ట్రాఫిక్ పోలీసుల తీరుపై హైకోర్టు ఆగ్రహం!

హైదరాబాద్ మహానగరంలో వాహనం బయటకు తీయాలంటేనే సామాన్య ప్రజలు భయపడిపోయే పరిస్థితులు దాపురించాయి. ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన పేరుతో రోడ్లపై వాహనదారులను నిలిపివేసి, వేలకు వేలు జరిమానాలు వసూలు చేయడం నిత్యకృత్యంగా మారింది. చలానాలు చెల్లించలేదనే సాకుతో జప్తు చేయడం, ఒరిజినల్ ఆర్సీ పత్రాలను బలవంతంగా స్వాధీనం చేసుకోవడం వంటి చర్యలతో వాహనదారులు నరకయాతన అనుభవిస్తున్నారు. ఈ వేధింపుల పర్వంపై దాఖలైన పిటిషన్లను తీవ్రంగా పరిగణించిన తెలంగాణ హైకోర్టు, ట్రాఫిక్ పోలీసుల తీరుపై ఘాటు వ్యాఖ్యలు చేసింది.

Mahesh-Rajamouli: "వారణాసి" కౌంట్ డౌన్ మొదలు..ఇంకా 200 రోజులేసినిమాSwechaa18 Sep 2026, 11:49 AM

Mahesh-Rajamouli: "వారణాసి" కౌంట్ డౌన్ మొదలు..ఇంకా 200 రోజులే

Mahesh-Rajamouli: సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి కాంబినేషన్‌లో రూపొందుతోన్న వారణాసి (గ్లోబ్ ట్రాటర్) ఆగమనానికి ఇంకా 200 రోజులే మిగిలింది. ఈ నేపథ్యంలో ఈ మూవీ టీమ్ ఒక పోస్ట్ ను సోషల్ మీడియాలో వదిలింది. యావత్ ప్రపంచ దేశాలు ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే, పాడ్ కాస్ట్ ద్వారా ఈ పాన్ వరల్డ్ అడ్వంచర్‌పై రాజమౌళి అంచనాలు పెంచే పనిలో ఉన్నాడు. ఈ క్రమంలో 200 రోజుల వారణాసి కౌంట్ డౌన్ మొదలు..అని పెట్టిన ట్వీట్ వైరల్ అవుతోంది.

హీరో విశాల్‌‌కు షూటింగ్‌లో ప్రమాదం.. ఆందోళనలో అభిమానులు!సినిమాSwechaa18 Sep 2026, 11:31 AM

హీరో విశాల్‌‌కు షూటింగ్‌లో ప్రమాదం.. ఆందోళనలో అభిమానులు!

 చిత్రదర్శకుడు సుందర్.సి సారథ్యంలో రూపొందుతున్న ‘పురుషన్’ ప్రాజెక్ట్ కోసం గోవా తీరప్రాంతాల్లో కొన్ని రోజులుగా కీలక దృశ్యాలను తెరకెక్కిస్తున్నారు. విదేశీ స్టంట్ నిపుణుల నేతృత్వంలో ఓ ఉత్కంఠభరితమైన ఫైట్ సీన్‌ను చిత్రీకరిస్తున్న సమయంలో ఈ ఊహించని ఘటన చోటుచేసుకుంది. రిస్క్‌తో కూడుకున్న స్టంట్స్‌ను ఎలాంటి డూప్ లేకుండా స్వయంగా పూర్తిచేయాలనే ఆలోచనతో విశాల్ ఈ షాట్‌లో పాల్గొన్నారు. అయితే టైమింగ్ తప్పడం వల్ల ఆయన తీవ్రంగా గాయపడ్డారు.

హిందీపై తమిళనాడు ప్రభుత్వం వైఖరి మార్చుకోవాలి.. సుప్రీం కోర్టు సంచలన వ్యాఖ్యలు!NationalSwechaa18 Sep 2026, 10:54 AM

హిందీపై తమిళనాడు ప్రభుత్వం వైఖరి మార్చుకోవాలి.. సుప్రీం కోర్టు సంచలన వ్యాఖ్యలు!

 తమిళనాడులో జవహర్ నవోదయ విద్యాలయాల (JNV) ఏర్పాటు, హిందీ భాష బోధనపై కొనసాగుతున్న సుదీర్ఘ వివాదంపై సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేసింది. తమిళనాడు గడ్డపై హిందీని నేర్పించకూడదనే పట్టుదలను విడనాడాలని, రాష్ట్ర ప్రభుత్వం తన ఆలోచనా విధానంలో మార్పు తెచ్చుకోవాలని ధర్మాసనం హితవు పలికింది. ప్రతీ జిల్లాలో నవోదయ పాఠశాలల స్థాపనకు భూమిని గురించాలంటూ 2025 డిసెంబర్‌లో ఇచ్చిన ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలంటూ తమిళనాడు దాఖలు చేసిన పిటిషన్‌ను రద్దు చేయడానికి కోర్టు నిరాకరించింది.

ఫార్ములా ఈ-రేస్ కేసులో కీలక పరిణామం.. ఏసీబీ కోర్టుకు కేటీఆర్!!..తెలంగాణSwechaa18 Sep 2026, 10:37 AM

ఫార్ములా ఈ-రేస్ కేసులో కీలక పరిణామం.. ఏసీబీ కోర్టుకు కేటీఆర్!!..

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఏసీబీ కోర్టు విచారణకు హాజరయ్యారు. సంచలనం సృష్టించిన ఫార్ములా ఈ-రేసు కేసులో కాసేపట్లో విచారణ ప్రారంభం కానుంది. ఈ కేసుకు సంబంధించి కోర్టు ప్రాంగణంలో ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే, ఫార్ములా ఈ-రేసు నిర్వహణలో నిధుల దుర్వినియోగం జరిగిందంటూ 2024 డిసెంబర్ నెలలో ఏసీబీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌ను A1గా పేర్కొన్నారు. దీనికి సంబంధించి గతంలో 2023 జూలై 31న కూడా ఏసీబీ కోర్టులో విచారణకు కేటీఆర్ హాజరయ్యారు.

కూలిన అమెరికా యుద్దవిమానం.. పైలట్ ఏం చేశాడంటే!..InternationalSwechaa18 Sep 2026, 10:20 AM

కూలిన అమెరికా యుద్దవిమానం.. పైలట్ ఏం చేశాడంటే!..

అమెరికా అత్యాధునిక యుద్ధ విమానాల్లో ఒకటైన F-16 ఫైటింగ్ ఫాల్కన్ ప్రమాదానికి గురైంది. సెప్టెంబర్ 17న మిచిగాన్‌లోని గ్రాండ్ ట్రావర్స్ కౌంటీ సమీపంలో టెక్సాస్ ఎయిర్ నేషనల్ గార్డ్‌కు చెందిన F-16 శిక్షణ సమయంలో కూలిపోయింది. ఈ విమానం టెక్సాస్‌లోని 149వ ఫైటర్ వింగ్‌కు చెందినదిగా అధికారులు తెలిపారు. ఆల్పెనా కంబాట్ రెడీనెస్ ట్రైనింగ్ సెంటర్ నుంచి సాధారణ శిక్షణ మిషన్‌లో భాగంగా విమానం ప్రయాణిస్తుండగా ఈ ఘటన జరిగింది.

అర్ధరాత్రి హైడ్రామా.. కేటీఆర్ పీఆర్వో మాణిక్య మహేష్ విడుదల..!తెలంగాణSwechaa18 Sep 2026, 10:10 AM

అర్ధరాత్రి హైడ్రామా.. కేటీఆర్ పీఆర్వో మాణిక్య మహేష్ విడుదల..!

బీఆర్ఎస్(BRS) కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పీఆర్వో మాణిక్య మహేష్ ముదిరాజ్‌ను బొల్లారం పోలీసులు శుక్రవారం ఉదయం 4గంటల సమయంలో విడుదల చేశారు. బీఎన్ఎస్/సీఆర్‌పీసీ 35(3) సెక్షన్ కింద నోటీసులు జారీ చేస్తూ అర్ధరాత్రి దాటిన తర్వాత ఆయనను వదిలిపెట్టారు. అంతకుముందు గురువారం రాత్రి ఆయనను సైఫాబాద్ పోలీస్ స్టేషన్ నుంచి బొల్లారం పోలీస్ స్టేషన్‌కు రహస్యంగా తరలించడంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ పరిణామాల నేపథ్యంలో ఈరోజు ఉదయం 10 గంటలకు బీఆర్ఎస్ అగ్రనేత కేటీఆర్ మీడియాతో ప్రత్యేకంగా మాట్లాడనున్నారు.

వినాయక మండపాలకు ఉచిత విద్యుత్.. ఈసారి ఎన్ని కనెక్షన్లు ఇచ్చారంటే?తెలంగాణSwechaa18 Sep 2026, 10:04 AM

వినాయక మండపాలకు ఉచిత విద్యుత్.. ఈసారి ఎన్ని కనెక్షన్లు ఇచ్చారంటే?

టీజీఎస్పీడీసీఎల్ పరిధిలోని గ్రేటర్ హైదరాబాద్ ప్రాంతానికి చెందిన 9 సర్కిళ్లలో ఈ ఏడాది వినాయక మండపాల కోసం 17,348 తాత్కాలిక విద్యుత్ కనెక్షన్లు ఇచ్చింది. వీటికి ఇప్పటివరకు 51.72 మెగావాట్ల విద్యుత్ లోడ్ నమోదు కాగా.. రూ.8,18,09,482 విద్యుత్ చార్జీలు, స్థిర చార్జీల రూపంలో ఇప్పటి వరకు బిల్ నమోదైంది. ఈ ఖర్చును రాష్ట్ర ప్రభుత్వం భరించనున్నది. కాగా, వినాయక ఉత్సవాలతో పాటు నిమజ్జనోత్సవాల టైంలో నిరంతర విద్యుత్ కోసం టీజీఎస్పీడీసీఎల్ ప్రత్యేక కంట్రోల్ రూమ్‌‌‌‌‌‌‌‌లు ఏర్పాటు చేసింది. అన్ని సర్కిళ్లలో ఇంజినీర్లు, సిబ్బంది 24 గంటలపాటు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంది.

చిత్రం లేదు
క్రీడలుSwechaa18 Sep 2026, 10:00 AM

34 బంతుల్లోనే 108 రన్స్.. సక్సెస్‌పై స్పందించిన అభిషేక్‌శర్మ

 ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా విరుచుకుపడిన యువ ఓపెనర్ అభిషేక్ శర్మ, తన అద్భుతమైన ఫామ్ వెనుక ఉన్న అసలు రహస్యాన్ని బహిర్గతం చేశాడు. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో కేవలం 34 బంతుల్లోనే 108 పరుగులు చేసి విధ్వంసం సృష్టించిన అభిషేక్.. సిరీస్‌కు ముందే ప్రత్యర్థి బౌలర్ల బలాబలాలను విశ్లేషించుకుని ప్రత్యేక ప్రణాళికలతో సిద్ధమవ్వడమే తన విజయానికి ప్రధాన కారణమని తెలిపాడు. ఈ మ్యాచ్‌లో భారత్ 127 పరుగుల భారీ తేడాతో విజయం సాధించి, 3-0 తేడాతో సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసింది.

న్యాయం జరగలేదనే హరిబాబును చంపాను.. వైష్ణవి అన్న సంతోష్ వీడియో!క్రైమ్Swechaa18 Sep 2026, 09:30 AM

న్యాయం జరగలేదనే హరిబాబును చంపాను.. వైష్ణవి అన్న సంతోష్ వీడియో!

 నిజామాబాద్ నగరంలో నడిరోడ్డుపై సంచలనం సృష్టించిన యూట్యూబర్ వైష్ణవి భర్త, ఆమె హత్య కేసు ప్రధాన నిందితుడైన చిత్తరి హరిబాబు(26) హత్య కేసులో ఊహించని మలుపు తిరిగింది. హరిబాబును తానే నరికి చంపానని, తన చెల్లెలి హత్యకు ప్రతీకారంగానే ఈ ఘాతుకానికి ఒడిగట్టానని వైష్ణవి సోదరుడు సంతోష్ ఓ సెల్ఫీ వీడియోను విడుదల చేయడం స్థానికంగా తీవ్ర ప్రకంపనలు సృష్టించింది. గురువారం మధ్యాహ్నం పట్టపగలు నడిరోడ్డుపై నిందితులు హరిబాబుపై దాడి చేసి కిరాతకంగా నరికి చంపిన కొద్ది గంటల్లోనే సంతోష్ ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి పోలీసులకు లొంగిపోతున్నట్లు ప్రకటించాడు.

లాటరీ పేరుతో కొత్త స్కెచ్.. ట్యాక్స్‌లు, జీఎస్టీ అంటూ మోసం!క్రైమ్Swechaa18 Sep 2026, 09:28 AM

లాటరీ పేరుతో కొత్త స్కెచ్.. ట్యాక్స్‌లు, జీఎస్టీ అంటూ మోసం!

చేవెళ్ల మండలం తంగడిపల్లి రెవెన్యూ పరిధిలోని మడికట్టుకు చెందిన దేవరి మల్లేశం సైబర్ మోసానికి బలయ్యారు. జులై 10న గుర్తుతెలియని వ్యక్తి ఆయనకు ఫోన్ చేసి.. తాము కేరళ లాటరీ కార్యాలయం నుంచి మాట్లాడుతున్నామని, మీకు రూ.8 లక్షల లాటరీ వచ్చిందని నమ్మించాడు. లాటరీ డబ్బులు పొందాలంటే బ్యాంక్ ఖాతా, ఆధార్ వివరాలు పంపాలని చెప్పడంతో.. మల్లేశం వాటిని వాట్సాప్ ద్వారా పంపించారు. తర్వాత లాటరీ డబ్బులు విడుదల చేయాలంటే ప్రాసెసింగ్ ట్యాక్స్, నగదు బదిలీ చార్జీలు, జీఎస్టీ, ఎన్‌ఓసీ, కోర్టు అగ్రిమెంట్, నెఫ్ట్ చార్జీలు, టీడీఎస్, ఈ-స్టాంప్ పేపర్ అంటూ ఒక్కో కారణం చెబుతూ పదేపదే డబ్బులు అడిగారు. లాటరీ డబ్బులు వస్తాయన్న ఆశతో మల్లేశం విడతల వారీగా ఏకంగా రూ.7,47,468 పంపించారు. కానీ చివరకు అటువైపు నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో తాను మోసపోయినట్లు గుర్తించిన బాధితుడు జులై 31న సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ 1930కు ఫిర్యాదు చేశారు.

‘వన్ వే’ శాశ్వతం.. కేబీఆర్ పార్క్ చుట్టూ ఫ్లైఓవర్ల ప్రాజెక్ట్ రద్దు!తెలంగాణSwechaa18 Sep 2026, 09:06 AM

‘వన్ వే’ శాశ్వతం.. కేబీఆర్ పార్క్ చుట్టూ ఫ్లైఓవర్ల ప్రాజెక్ట్ రద్దు!

హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ కేబీఆర్ పార్క్ (KBR Park) చుట్టూ ప్రతిపాదించిన బహుళ ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌ల నిర్మాణ ప్రణాళికలో ప్రభుత్వం, రవాణా అధికారులు కీలక మార్పులు చేశారు. ఇటీవల ట్రాఫిక్ నివారణ కోసం ప్రయోగాత్మకంగా అమలు చేసిన 'వన్‌వే' (One-way) విధానం ఊహించని రీతిలో అద్భుత ఫలితాలనివ్వడంతో పాత ప్రాజెక్టును ఉపసంహరించుకోవాలని భావిస్తున్నారు. ప్రాజెక్టు వ్యయం , భూసేకరణ భారాన్ని తగ్గించుకోవడంలో భాగంగా కేబీఆర్ పార్క్ చుట్టూ నిర్మించతలపెట్టిన రూ.1,090 కోట్ల విలువైన పలు ఫ్లైఓవర్ల ఫ్లష్ ప్లాన్‌ను రద్దు చేయాలని అధికారులు నిర్ణయించారు.

గుంటూరు మస్తాన్ మరో కబ్జా?తెలంగాణSwechaa18 Sep 2026, 08:26 AM

గుంటూరు మస్తాన్ మరో కబ్జా?

తెలంగాణ భూములు ఎలా కబ్జాలు అవుతున్నాయో సీఎం రేవంత్ రెడ్డి నిండు శాషన సభలో చెప్పడం సంచలనం సృష్టించింది. కబ్జాలను అడ్డుకోవడానికి ప్రత్యేక సిట్‌ను ఏర్పాటు చేశారు. కానీ కళ్ల ముందే ఫేక్ పత్రాలతో, సర్టిఫికెట్స్‌తో తప్పుడు సమాచారంతో కబ్జాలు చేస్తున్న భూ బకాసురలను మాత్రం వదిలేస్తున్నారు. ప్రతిదీ రాజకీయంగా వాడుకోకండి సార్. ఇలాంటి క్రిమినల్స్‌ను మొక్కలోనే తొక్కేస్తే, మరొకరు నకిలీ పత్రాలతో సామాన్యుల భూములను కొల్లగొట్టలేరు. పొలిటికల్ పరిచయాలు ఉన్నాయని బరితెగిస్తున్న వారి భరతం పడితేనే బాధితులకు భరోసా ఉంటుంది ముఖ్యమంత్రి గారు. లేదంటే ఆంధ్రా నుంచో, అమెరికా నుంచో వచ్చి జీవితాంతం కష్టపడి సంపాదించుకున్న భూములను కబ్జా చేసి ఆరా మస్తాన్ లాగానే ఇళ్లు కట్టేస్తారు.

షుగర్ కంట్రోల్ కోసం 16/8 ఫాస్టింగ్.. టైప్-1 డయాబెటిస్‌లో ఎంతవరకు సేఫ్?..HealthSwechaa18 Sep 2026, 07:57 AM

షుగర్ కంట్రోల్ కోసం 16/8 ఫాస్టింగ్.. టైప్-1 డయాబెటిస్‌లో ఎంతవరకు సేఫ్?..

నేటి జీవనశైలిలో ఆహారపు అలవాట్లు మారడం, శారీరక శ్రమ తగ్గడం, అధిక బరువు వంటి కారణాలతో డయాబెటిస్ సమస్యపై ఆందోళన పెరుగుతోంది. అయితే టైప్-1 డయాబెటిస్ ఉన్నవారి విషయంలో ఆహారం, ఇన్సులిన్, రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను సమతుల్యం చేయడం మరింత కీలకం. ఈ నేపథ్యంలో టైప్-1 డయాబెటిస్ ఉన్నవారు ఇంటర్‌మిటెంట్ ఫాస్టింగ్ చేయవచ్చా అనే అంశంపై తాజాగా జరిగిన ఒక చిన్న అధ్యయనం ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది.

ఆరు నెలల పాటు 32 మంది టైప్-1 డయాబెటిస్ బాధితులపై నిర్వహించిన ఈ అధ్యయనంలో, కొంతమంది రోజులో 8 గంటల సమయంలో మాత్రమే ఆహారం తీసుకునే టైమ్-రిస్ట్రిక్టెడ్ ఈటింగ్ విధానాన్ని పాటించారు. అంటే దాదాపు 16 గంటల పాటు ఉపవాసం ఉండే విధానం. ఆరు నెలల తర్వాత ఈ విధానాన్ని పాటించిన వారిలో HbA1c సగటున సుమారు 0.46 శాతం పాయింట్లు తగ్గినట్లు పరిశోధకులు గుర్తించారు. అయితే మొత్తం ఇన్సులిన్ అవసరం, సగటు గ్లూకోజ్ స్థాయిల్లో గణనీయమైన మార్పు కనిపించలేదు.

గణేశుడి ఎనిమిది అవతారాల విశిష్టత ఇదే!..SpiritualitySwechaa18 Sep 2026, 07:35 AM

గణేశుడి ఎనిమిది అవతారాల విశిష్టత ఇదే!..

మనం ఏ కొత్త పని ప్రారంభించినా, ఏ శుభకార్యానికి శ్రీకారం చుట్టినా ముందుగా తలచుకునేది ఆ బొజ్జ గణపయ్యనే! విఘ్నాలను తొలగించి, విజయాన్ని అందించే లంబోదరుడు బుద్ధికి, విచక్షణకు, మహా జ్ఞానానికి ప్రతీక. మన జీవిత ప్రయాణంలో ఎదురయ్యే ఆటంకాలను దాటుకుంటూ సన్మార్గంలో ఎలా సాగాలో వినాయకుని రూపం, ఆయన విశిష్టత మనకు ఎల్లప్పుడూ గుర్తుచేస్తూనే ఉంటాయి. వినాయకుడి రూపం వెనుక ఎంతటి ఆధ్యాత్మిక తత్త్వం ఉందో.. ఆయన అవతారాల కథలు అంతకంటే లోతైన సందేశాన్ని అందిస్తాయి. ఇక గణేశుడి అవతారాల గురించి ప్రధానంగా ముద్గల పురాణంలో విశదంగా ప్రస్తావన కనిపిస్తుంది. ఈ పురాణం గణపతికి సంబంధించిన ఎనిమిది ప్రధాన అవతారాలను వివరిస్తుంది. ప్రతి అవతారం ఒక దుష్టశక్తిని సంహరించడంతో పాటు.. మనిషి అంతరంగంలోని ఒక దుర్గుణాన్ని జయించాల్సిన ఆధ్యాత్మిక మార్గాన్ని సూచిస్తుంది.

శ్రీవారికి ఆదిశేషుడే ఎందుకు వాహనం..?SpiritualitySwechaa18 Sep 2026, 07:31 AM

శ్రీవారికి ఆదిశేషుడే ఎందుకు వాహనం..?

శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ఆదిశేష వాహన సేవకు అత్యంత విశిష్ట స్థానం ఉంది. సప్తగిరులపై కొలువైన శ్రీ వేంకటేశ్వర స్వామివారు ఆదిశేషుడిని వాహనంగా అధిరోహించి భక్తులకు దివ్య దర్శనమిస్తారు.. పురాణాల ప్రకారం ఆదిశేషుడు శ్రీమహావిష్ణువుకు నిత్యసేవకుడు. క్షీరసాగరంలో విష్ణుమూర్తి శేషతల్పంపై శయనిస్తే.. ఆ స్వామివారికి ఆధారంగా నిలిచేది ఆదిశేషుడే. భగవంతుడి సేవలో తనను తాను పూర్తిగా అర్పించుకున్న శేషుడు.. భక్తి, దాస్యభావానికి ప్రతీకగా భావించబడతాడు.

ప్రజాసేవలో నిమగ్నమైన గొప్ప నాయకుడు..తెలంగాణSwechaa17 Sep 2026, 10:38 PM

ప్రజాసేవలో నిమగ్నమైన గొప్ప నాయకుడు..

PM Modi: దేశ ప్రధాని నరేంద్ర మోడీపై ప్రశంసల వర్షం కురిపించారు బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్. భారత దేశ కీర్తి పతాకాన్ని ప్రపంచ చరిత్ర పుటలపై తిరుగులేని విధంగా లిఖించిన నాయకుడు, ప్రపంచంలో భారత జాతి ఆత్మగౌరవ బావుటాను ఎగురవేసిన నాయకుడు మోదీ అంటూ కీర్తించారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ పికెట్‌లోని అటల్ బిహారీ వాజ్‌పేయి పార్క్‌లో జరిగిన ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ పాల్గొని కేక్ కట్ చేశారు.

IndiGo Fare Hike: ఇండిగో బాదుడు.. ఫ్లైట్ జర్నీ మరింత కాస్ట్లీ!దునియాSwechaa17 Sep 2026, 10:02 PM

IndiGo Fare Hike: ఇండిగో బాదుడు.. ఫ్లైట్ జర్నీ మరింత కాస్ట్లీ!

IndiGo Fare Hike: ఇండిగో ప్రయాణికులకు గట్టి ఝలక్ ఇచ్చింది. చిన్న పిల్లల టికెట్ ఛార్జీలతో పాటు ఎక్స్‌ట్రా లగేజీ, ఇతర సేవల ధరలను భారీగా పెంచుతూ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే టికెట్ ధరలు మండిపోతుండగా, ఈ తాజా పెంపు విమాన ప్రయాణికులపై మరింత భారాన్ని మోపనుంది. పెంచిన ధరలు తక్షణమే అమల్లోకి వచ్చాయి.రెండేళ్ల లోపు పసిపిల్లలకు ఇప్పటి వరకు రూ.2,000 వసూలు చేయగా, ఇప్పుడు దాన్ని ఏకంగా రూ.3,000కి పెంచారు. తల్లిదండ్రులతో కలిసి ప్రయాణించే ఈ చిన్నారులకు ప్రత్యేకంగా సీటు కేటాయించకపోయినా ఇకపై ఈ రేటు కట్టాల్సిందే.

Telangana Politics: ఓ వైపు లీడర్ల భూముల గొడవలు.. ఇంకోవైపు 22ఏతో సామాన్యుల తిప్పలుతెలంగాణSwechaa17 Sep 2026, 09:55 PM

Telangana Politics: ఓ వైపు లీడర్ల భూముల గొడవలు.. ఇంకోవైపు 22ఏతో సామాన్యుల తిప్పలు

Telangana Politics: శాసనసభ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ అధినేత, ప్రతిపక్షనేత కేసీఆర్, ఆయన కుటుంబ భూ చిట్టాలు విప్పారు. అనంతరం మీడియా ముందుకొచ్చిన మాజీ మంత్రి హరీశ్‌రావు సీఎం ఆస్తుల లెక్కలు బయటపెట్టి ఎదురుదాడికి దిగారు. మైకుల ముందు నడిచిన ఈ హైవోల్టేజ్ ఆరోపణల యుద్ధం రాజకీయ వర్గాల్లో కాకరేపింది నిజమే కానీ ఈ పోరులో సామాన్య జనం ఎదుర్కొంటున్న అసలు సిసలు కష్టం మరుగున పడిపోయిందన్నది మాత్రం వాస్తవం. నాయకులు వందల ఎకరాల ఆక్రమణలపై వాదులాడుకుంటుంటే.. తమకున్న రెండెకరాలు, ఓ గుంట జాగ అమ్ముకోలేక, కొనుక్కోలేక సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్న సామాన్యుడి గోడును పట్టించుకునే నాథుడే కరువయ్యాడు.ప్రస్తుతం తెలంగాణలో 22A నిషేధిత భూముల వ్యవహారం ఒక పెను సంక్షోభంగా మారింది. అసలు ఈ సమస్యపై సమగ్ర చర్చ జరిగి బాధితులకు ఊరట దక్కుతుందని ప్రజలు ఆశించారు. కానీ ప్రజా సమస్యలను తీర్చాల్సిన చట్టసభ వేదిక.. ఇరుపార్టీల నేతల భూ బాగోతాలు, సవాళ్లు, ప్రతిసవాళ్లకు వేదికగా మారిపోయింది.ఒకరిపై ఒకరు చేసుకుంటున్న ఆరోపణలు, మీడియా ముందు పెడుతున్న లెక్కలు టీవీల్లో హెడ్‌లైన్లుగా మారుతున్నాయే తప్ప, క్షేత్రస్థాయిలో సమస్యను పరిష్కరించడం లేదన్నది వాస్తవం. అసెంబ్లీలో నడిచిన ఈ రాజకీయ డ్రామాతో అసలు ఎజెండా ఎప్పుడో పక్కదారి పట్టిందని ప్రజా క్షేత్రంలో వినిపిస్తున్న విమర్శ.

Nanakramguda Land Dispute: నానక్‌రామ్‌గూడ భూవివాదంపై చంద్రశేఖర్‌రెడ్డి క్లారిటీతెలంగాణSwechaa17 Sep 2026, 09:24 PM

Nanakramguda Land Dispute: నానక్‌రామ్‌గూడ భూవివాదంపై చంద్రశేఖర్‌రెడ్డి క్లారిటీ

Nanakramguda Land Dispute: హైదరాబాద్‌లోని నానక్‌రామ్‌గూడ భూ వివాదంపై ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్‌రెడ్డి క్లారిటీ ఇచ్చారు. తనపై వస్తున్నవన్నీ తప్పుడు ప్రచారాలని పేర్కొంటూ ఓ వీడియో ద్వారా స్పష్టం చేశారు.

నానక్‌రామ్‌గూడ పరిధిలో రైతుల నుంచి తాము నిబంధనల ప్రకారమే 10 ఎకరాల స్థలాన్ని కొన్నామని తెలిపారు. తాను, సునీల్‌ కలిసి ఈ ల్యాండ్ తీసుకున్నామని.. ఇందులో సునీల్‌ వాటాగా 3 ఎకరాలు ఉందని వెల్లడించారు.

ఎర్రవల్లిలో సర్వేయర్లను అడ్డుకున్న రైతులు, గ్రామస్తులు.. రెవెన్యూ అధికారులతో వాగ్వాదంతెలంగాణSwechaa17 Sep 2026, 09:07 PM

ఎర్రవల్లిలో సర్వేయర్లను అడ్డుకున్న రైతులు, గ్రామస్తులు.. రెవెన్యూ అధికారులతో వాగ్వాదం

Kcr Farmhouse: సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో కేసీఆర్ ఎర్రవల్లి ఫాంహౌస్ పరిసరాల్లో ప్రభుత్వ భూములపై సర్వే చేసేందుకు వెళ్లిన రెవెన్యూ అధికారులను గ్రామస్తులు, రైతులు అడ్డుకున్నారు. అధికారులతో వాగ్వాదానికి దిగారు. అసలు ఎందుకు సర్వే చేస్తున్నారో చెప్పాలని నిలదీశారు. మా భూములు మేము సాగు చేసుకుంటుంటే మీరు ఇప్పుడు వచ్చి సర్వే ఎందుకు చేస్తున్నారని నిలదీశారు. ఎర్రవల్లి సర్వే నెంబర్ 325 భూములకు సంబంధించి ఎలాంటి వివాదం లేదని గ్రామస్తులు తేల్చి చెప్పారు. కేసీఆర్ పట్టా స్థలం మేరకు మాత్రమే ఉన్నారని.. ప్రభుత్వ భూమిలోకి రాలేదని స్పష్టం చేశారు. కేసీఆర్ పాండవుల చెరువు తవ్వించడంతో వ్యవసాయం చేసుకుంటూ తాము జీవనం సాగిస్తున్నామని గ్రామస్తులు చెప్పారు.