స్వేచ్ఛ షార్ట్స్ — తాజా తెలుగు వార్తలు

Dulquer Salmaan: దుల్కర్ ‘ఆకాశంలో ఒక తార’ రిలీజ్ డేట్ కన్‌ఫర్మ్..సినిమాSwechaa17 Sep 2026, 08:31 PM

Dulquer Salmaan: దుల్కర్ ‘ఆకాశంలో ఒక తార’ రిలీజ్ డేట్ కన్‌ఫర్మ్..

Dulquer Salmaan: మలయాళ క్రేజీ హీరో దుల్కర్ సల్మాన్ నటిస్తున్న తాజా చిత్రం 'ఆకాశంలో ఒక తార'. తెలుగులో మంచి మార్కెట్ అండ్ క్రేజ్ తెచ్చుకున్న ఈ మలయాళ హీరో నుంచి రాబోతున్న ఈ లేటెస్ట్ మూవీ విడుదల తేదీని కన్‌ఫర్మ్ చేశారు. నవంబర్ 20వ తేదీన భారీ స్థాయిలో రిలీజ్ చేయబోతున్నారు. అఫీషియల్‌గా నేడు విడుదల తేదీని ప్రకటిస్తూ దుల్కర్ ఉన్న కొత్త పోస్టర్‌ను వదిలారు.

Prabhas-Fauzi: డిసెంబర్ 3 కాదు జనవరి 26..ఇందులో నిజమెంత?సినిమాSwechaa17 Sep 2026, 08:21 PM

Prabhas-Fauzi: డిసెంబర్ 3 కాదు జనవరి 26..ఇందులో నిజమెంత?

Prabhas-Fauzi: పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న ఫౌజీ సినిమాకి సంబందించి ఓ షాకింగ్ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. హను రాఘవపూడి ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. అయితే, ఈ ఏడాది డిసెంబర్ 3న ఫౌజీ రిలీజ్ అని నిర్మాత అధికారికంగా వెల్లడించాడు. కానీ, ఇప్పుడు ఇది దాదాపు అసాధ్యమని తెలుస్తోంది. డిసెంబర్ 3న కాకుండా 2027 జనవరి 26న రిలీజ్ చేయనున్నట్టు లేటెస్ట్ అప్‌డేట్.

Nizamabad Murder: యూట్యూబర్‌ వైష్ణవి భర్త దారుణ హత్యతెలంగాణSwechaa17 Sep 2026, 08:11 PM

Nizamabad Murder: యూట్యూబర్‌ వైష్ణవి భర్త దారుణ హత్య

Nizamabad Murder: కొన్ని నెలల కిందప్పుడు అదే రీతిలో దారుణ హత్యకు గురయ్యాడు. ‘వైషు అమ్మ’ ఛానల్ ద్వారా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వైష్ణట నిండు గర్భిణి అయిన యూట్యూబర్‌ను అత్యంత కిరాతకంగా పొడిచి చంపిన కేసులో ప్రధాన నిందితుడు ఇవి భర్త చిథారి హరిబాబును నిజామాబాద్ నడిబొడ్డున గుర్తుతెలియని వ్యక్తి కొబ్బరి బొండాలు నరికే కత్తితో నరికి చంపడం సంచలనం సృష్టిస్తోంది. భార్యను పొట్టనబెట్టుకున్న పాపమే అతడిని వెంటాడిందా? లేక పక్కా ప్లాన్‌తో జరిగిన ప్రతీకార హత్యేనా అన్న చర్చ ఇప్పుడు జోరుగా సాగుతోంది.జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం మాదాపూర్‌కు చెందిన వైష్ణవి, హరిబాబు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ‘వైషు అమ్మ’ పేరుతో వీడియోలు చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్న వైష్ణవి, నాలుగు నెలల గర్భవతిగా ఉన్న సమయంలోనే దారుణ హత్యకు గురైంది. అదనపు కట్నం తీసుకురావాలంటూ భర్త హరిబాబు, అత్త లక్ష్మి, బావలు ఆనంద్, అశోక్ ఆమెను తీవ్రంగా వేధించేవారు.ఈ ఏడాది మార్చి 16 రాత్రి వారి మధ్య చాలా పెద్ద గొడవ జరగడంతో, మార్చి 17న హరిబాబు కత్తితో భార్యను పొడిచి దారుణంగా చంపి, ఆ తర్వాత కోరుట్ల శివారులో దాక్కున్నాడు. ఈ క్రమంలో పోలీసులు అతడిని పట్టుకుని అరెస్ట్ చేశారు. ఆ కేసులో జైలుకు వెళ్లిన హరిబాబు.. ఇటీవల బెయిల్‌పై బయటకు వచ్చాడు.

Kaaka-Sneha: ప్రియమణి ని రీప్లేస్ చేసిన స్నేహ..చిరు జోడీగా బంపర్ ఆఫర్?సినిమాSwechaa17 Sep 2026, 07:16 PM

Kaaka-Sneha: ప్రియమణి ని రీప్లేస్ చేసిన స్నేహ..చిరు జోడీగా బంపర్ ఆఫర్?

Kaaka: దర్శకుడు బాబి, మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్‌లో రూపొందుతోన్న లేటెస్ట్ యాక్షన్ అండ్ ఫ్యామిలీ డ్రామా కాకా. 2027 సంక్రాంతి పండుగ టార్గెట్‌గా ఈ సినిమా షూటింగ్ ని శరవేగంగా పూర్తి చేస్తున్నారు. ఇందులో చిరంజీవి ఓ గ్యాంగ్ స్టర్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఇటీవల వచ్చిన టీజర్‌తో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే, తాజా సమాచారం మేరకు సీనియర్ నటి స్నేహ ఇందులో నటించనుందని తెలుస్తోంది.

Gurukul Scam : గురుకులాల్లో స్కాములు ఎపిసోడ్ లాగా సాగుతున్నయ్‌.. ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ ఆరోపణలుతెలంగాణSwechaa17 Sep 2026, 06:56 PM

Gurukul Scam : గురుకులాల్లో స్కాములు ఎపిసోడ్ లాగా సాగుతున్నయ్‌.. ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ ఆరోపణలు

Gurukul Scam : తెలంగాణలోని సంక్షేమ గురుకులాలు, సర్కారు బడుల్లో చదువుకునే లక్షలాది మంది నిరుపేద విద్యార్థుల జీవితాలతో కాంగ్రెస్ సర్కార్ చెలగాటమాడుతోందని బీఆర్‌ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రంలో ఐపీఎల్ మాదిరిగా గురుకుల కుంభకోణం సీజన్లు నడుస్తున్నాయని, ప్రస్తుతం మొదలైన ‘ఎపిసోడ్ 2’లో విద్యార్థులకు ఏకంగా కల్తీ సరుకులను వండిపెట్టే ఘోరమైన కుట్ర జరుగుతోందని సంచలన ఆరోపణలు చేశారు.

రాష్ట్రంలో విద్యార్థుల ప్రాణాలు ఎంత పెద్ద ప్రమాదంలో పడ్డాయో చూపించేందుకే బీఆర్‌ఎస్ తరఫున ప్రత్యక్ష డెమో ఇచ్చేందుకు రెడీ అయ్యామని స్పష్టం చేశారు. తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడారు. తమ పిల్లలకు మంచి భోజనం అందుతుందని, ప్రోటీన్లు, విటమిన్లు, మంచి పౌష్టికాహారం దొరుకుతుందనే నమ్మకంతోనే పేద తల్లిదండ్రులు గురుకులాలకు తమ పిల్లలను పంపిస్తున్నారని ఆయన గుర్తుచేశారు.

Ranabaali: 130 రోజుల షూటింగ్‌కి ఫైనల్‌గా ప్యాకప్..సినిమాSwechaa17 Sep 2026, 06:53 PM

Ranabaali: 130 రోజుల షూటింగ్‌కి ఫైనల్‌గా ప్యాకప్..

Ranabaali: టాక్సీవాలా దర్శకుడు రాహుల్ సాంకృత్యన్ నుంచి రాబోతున్న పీరియాడికల్ మూవీ రణబాలి. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటించారు. ఇటీవల, హీరోయిన్‌గా నటించిన రష్మిక..తన పాత్రకి సంబందించిన షూటింగ్ పూర్తి చేయగా..ఇప్పుడు, మొత్తం షూటింగ్ కంప్లీట్ అయినట్టుగా దర్శకుడు పోస్ట్ ద్వారా తెలిపాడు. దీంతో, రణబాలి అనుకున్న తేదీకి రిలీజ్ కావడం పక్కా అని తెలుస్తోంది.

KCR Farmhouse: కేసీఆర్ ఫామ్‌హౌస్ భూములపై విచారణ ప్రారంభంSwechaa17 Sep 2026, 06:34 PM

KCR Farmhouse: కేసీఆర్ ఫామ్‌హౌస్ భూములపై విచారణ ప్రారంభం

KCR Farmhouse: సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో రెవెన్యూ అధికారులు రంగంలోకి దిగారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫాంహౌస్ భూములపై విచారణ ప్రారంభించారు. సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫామ్‌హౌస్ పరిసరాల్లో ప్రభుత్వ భూముల వివరాలను రెవెన్యూ అధికారులు సేకరిస్తున్నారు. ఫామ్‌హౌస్‌కు సమీపంలో ఉన్న ప్రభుత్వ భూముల సర్వే నెంబర్లు, గతంలో ఆ భూములను సాగు చేసిన రైతుల పేర్లను ఆరా తీస్తున్నారు. ఆర్డీవో చంద్రకళ మర్కూక్ తహశీల్దార్ ఆఫీసులో రెవెన్యూ రికార్డులను పరిశీలిస్తున్నారు.

KVN Productions: రూమర్స్‌కి చెక్ పెట్టిన "కాకా" టీమ్..సినిమాSwechaa17 Sep 2026, 06:04 PM

KVN Productions: రూమర్స్‌కి చెక్ పెట్టిన "కాకా" టీమ్..

KVN Productions: ప్రస్తుతం ఉన్న అగ్ర నిర్మాణ సంస్థలలో కోలీవుడ్‌లో ఇటీవల కాలంలో ఎస్టాబ్లిష్ అయిన కేవిఎన్ ప్రొడక్షన్స్ ఒకటి. మిడ్ రేంజ్ సినిమాలతో పాటు విజయ్ తలపతి, యష్, మెగాస్టార్ లాంటి బిగ్ స్టార్స్‌తోనూ భారీ బడ్జెట్ సినిమాలను నిర్మిస్తోంది ఈ సంస్థ. వెంకట్ కె నారాయణ..వరుస ఫ్లాప్స్ వస్తున్నా కూడా ప్రాజెక్ట్స్‌ని లైన్‌లో పెడుతున్నాడు. ఇప్పుడు, ఈ సంస్థలో రూపొందుతోన్న సినిమా మెగాస్టార్ కాకా.

Telangana Police Exam Dates :తెలంగాణ పోలీస్‌ ఎగ్జామ్‌ డేట్స్‌ ఇవేతెలంగాణSwechaa17 Sep 2026, 06:01 PM

Telangana Police Exam Dates :తెలంగాణ పోలీస్‌ ఎగ్జామ్‌ డేట్స్‌ ఇవే

Telangana Police Exam Dates: తెలంగాణలో 7,437 పోలీస్ ఉద్యోగాల నియామక ప్రక్రియలో కీలక ముందడుగు పడింది. ప్రాథమిక రాతపరీక్షల తేదీలను రిక్రూట్‌మెంట్ బోర్డు అధికారికంగా ప్రకటించింది. ఎస్ఐ, తత్సమాన పోస్టుల ప్రిలిమ్స్ పరీక్షను నవంబర్ 29న, కానిస్టేబుల్ పోస్టుల ఎగ్జామ్‌ను డిసెంబర్ 20న ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో నిర్వహించనున్నారు.జూలై 29న వచ్చిన నోటిఫికేషన్‌కు దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబర్ 16తో ముగిసింది. ప్రభుత్వం ఏజ్ లిమిట్ పెంచడంతో 1.13 లక్షల మంది అభ్యర్థులకు మేలు జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 4.29 లక్షల మంది అభ్యర్థులు 5,77,064 అప్లై చేసుకున్నారు. ఇందులో 68 శాతానికి పైగా అభ్యర్థులు ఒకే పోస్టుకు పోటీపడుతున్నారు

గిరిజన మహిళల రుణాల్లో భారీ గోల్‌మాల్!!..తెలంగాణSwechaa17 Sep 2026, 05:12 PM

గిరిజన మహిళల రుణాల్లో భారీ గోల్‌మాల్!!..

ఆదిలాబాద్ జిల్లా గాదిగూడ మండలం సావరీ గ్రామంలో మహిళా సంఘాల రుణాల వ్యవహారం కలకలం రేపుతోంది. గ్రామంలోని మూడు మహిళా సంఘాలకు సభ్యుల అనుమతి, తీర్మానం లేకుండానే రూ.4 లక్షల 5 వేల రుణాన్ని విఓఏగా పనిచేస్తున్న న్యానేశ్వర్ బ్యాంకు నుంచి డ్రా చేసినట్లు ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. రికవరీ కోసం వచ్చిన సిబ్బంది సమావేశంతో ఈ వ్యవహారం బయటపడింది. మహిళల అభివృద్ధి కోసం ప్రభుత్వం అందిస్తున్న నిధులు అవినీతికి గురికాకుండా కఠిన పర్యవేక్షణ అవసరమని గ్రామస్థులు కోరుతున్నారు.

ఏసీబీకి చిక్కిన కీసర సీఐ, ఎస్ఐ.. స్టేషన్ ముందు పబ్లిక్ సంబరాలుతెలంగాణSwechaa17 Sep 2026, 04:56 PM

ఏసీబీకి చిక్కిన కీసర సీఐ, ఎస్ఐ.. స్టేషన్ ముందు పబ్లిక్ సంబరాలు

Keesara ACB Trap: పోలీస్ స్టేషన్ అంటే భయం.. ఠాణా మెట్లు ఎక్కాలంటే వణుకు. అలాంటిది ఏకంగా పోలీస్ స్టేషన్ ముందే జనం టపాసులు కాల్చారు.. స్వీట్లు పంచుకుంటూ సంబరాలు చేసుకున్నారు. మేడ్చల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ఈ దృశ్యం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. రక్షక భటులుగా ఉంటూ లంచాల వేటలో మునిగిపోయిన సీఐ, ఎస్సైలు ఏసీబీ వలలో చిక్కడంతో స్థానిక ప్రజలు పండుగ చేసుకున్నారు.కీసర సీఐ ఆంజనేయులు, ఎస్సై జ్ఞానేందర్ రెడ్డి అందినకాడికి దండుకుంటూ బాధితులను వేధింపులకు గురిచేస్తున్నారన్న ఆరోపణలు చాలాకాలంగా వినిపిస్తున్నాయి.

ఈ క్రమంలోనే పక్కా ప్లాన్‌తో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు.. లంచం తీసుకుంటూ ఉండగా ఇద్దరు అధికారులను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. చట్టాన్ని కాపాడాల్సిన కీలక అధికారులే ఇలా ఒకేసారి కటకటాలపాలు కావడం పోలీసు వర్గాల్లో సంచలనంగా మారింది.

ఘట్‌కేసర్‌–బీబీనగర్‌ మధ్య విషాదం.. వందేభారత్‌ ఢీకొని యువకుడు మృతి!..క్రైమ్Swechaa17 Sep 2026, 04:42 PM

ఘట్‌కేసర్‌–బీబీనగర్‌ మధ్య విషాదం.. వందేభారత్‌ ఢీకొని యువకుడు మృతి!..

ఘట్‌కేసర్‌–బీబీనగర్‌ రైల్వే స్టేషన్ల మధ్య వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ ఢీకొని గుర్తుతెలియని యువకుడు మృతి చెందాడు. సుమారు 20–25 ఏళ్ల వయసున్న వ్యక్తి ఏపీ 24 ఎన్‌ 9936 నంబర్‌ గల ఫ్యాషన్‌ ప్లస్‌ మోటార్‌సైకిల్‌పై రైల్వే పట్టాల మధ్య నుంచి బీబీనగర్‌ వైపు వెళ్తుండగా రైలు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అతను కొంత దూరం ఈడ్చుకెళ్లబడి పట్టాల పక్కన పడిపోయాడు. తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఇతని వద్ద ఎలాంటి గుర్తింపు పత్రాలు లభించకపోవడంతో అతని వివరాలు తెలియరాలేదు. మృతుడు సుమారు 5.6 అడుగుల ఎత్తు, చామనఛాయ రంగు కలిగి ఉండగా, కుడి వైపు ఛాతీ పై పుట్టుమచ్చ ఉన్నట్లు పోలీసులు తెలిపారు. సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ డిప్యూటీ ఎస్‌ఎస్‌ నుంచి సమాచారం అందడంతో రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రి మార్చురీలో భద్రపరిచారు. మృతుడి ఆచూకీ లేదా వివరాలు తెలిసిన వారు సికింద్రాబాద్‌ రైల్వే పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ 8712658581 లేదా దర్యాప్తు అధికారి 9666280808 నంబర్లకు సమాచారం ఇవ్వాలని పోలీసులు కోరారు.

Erravalli Farmhouse: కేసీఆర్ భూముల లెక్కలు.. ఇన్ని రోజులు ఎందుకు బయటపెట్టలేదు..?తెలంగాణSwechaa17 Sep 2026, 04:41 PM

Erravalli Farmhouse: కేసీఆర్ భూముల లెక్కలు.. ఇన్ని రోజులు ఎందుకు బయటపెట్టలేదు..?

Erravalli Farmhouse: తెలంగాణ శాసనసభ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి పేల్చిన ‘ఎర్రవల్లి బాంబు’ రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. 388 ఎకరాల ప్రభుత్వ భూమిని కేసీఆర్ ఫాంహౌస్‌లో కలిపేశారని, వందల ఎకరాల అక్రమ సామ్రాజ్యాన్ని నిర్మించారని రేవంత్ సభ సాక్షిగా లెక్కలు బయటపెట్టారు. అయితే సీఎం ప్రసంగం ముగిసిన వెంటనే రాజకీయ వర్గాల్లోనూ, సామాన్య ప్రజల్లోనూ ఒకటే సందేహం మొదలైంది. ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచే ధరణి లొసుగులు, ఎర్రవల్లి బాగోతంపై పోరాడిన రేవంత్ రెడ్డి.. ముఖ్యమంత్రి పీఠం ఎక్కి మూడేళ్లు పూర్తవుతున్నా ఇన్ని రోజులు ఈ ఫైళ్లను ఎందుకు కదల్చలేదు? అసెంబ్లీ సాక్షిగా ఇంత సడన్‌గా ఆ లెక్కల చిట్టా విప్పాల్సిన అవసరం ఇప్పుడే ఎందుకొచ్చింది?ఉద్యమ నాయకుడిగా ఉన్న కేసీఆర్ అధికారాన్ని అడ్డం పెట్టుకుని వేల కోట్లు, వందల ఎకరాలు కూడబెట్టారని రేవంత్ రెడ్డి గతంలో పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడే ఎన్నో వేదికలపై గళమెత్తారు. ధరణి పోర్టల్ ద్వారా జరిగిన భూ దోపిడీని ఎండగట్టారు.

నిజాంను పొగడటం సిగ్గుచేటు..వాళ్లకి డీఎన్ఏ టెస్టులు చేయాలితెలంగాణSwechaa17 Sep 2026, 04:31 PM

నిజాంను పొగడటం సిగ్గుచేటు..వాళ్లకి డీఎన్ఏ టెస్టులు చేయాలి

Bandi Sanjay: సీఎం రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్ పై బీజేపీ నేత, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ మండిపడ్డారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం కేసీఆర్, రేవంత్ నిజాంను పొగడటం సిగ్గుచేటన్నారు. దేశమంతా 1947లో స్వాతంత్ర్యం పొందితే తెలంగాణకు ఏడాది ఆలస్యంగా స్వేచ్ఛ లభించిందన్నారు. సర్దార్ వల్లభభాయ్ పటేల్ ఉక్కు సంకల్పంతో తెలంగాణకు నిజాం రజాకార్ల దౌర్జన్యాల నుంచి విముక్తి లభించిందని ఆయన గుర్తుచేశారు.

రూ.లక్ష లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన చేవెళ్ల ఎస్టీవో ఉద్యోగిSwechaa17 Sep 2026, 04:14 PM

రూ.లక్ష లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన చేవెళ్ల ఎస్టీవో ఉద్యోగి

ACB Raids: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల డివిజనల్ సబ్ ట్రెజరీ కార్యాలయం (STO) లో అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు ఆకస్మిక దాడులు చేశారు. బాధితుడి నుంచి లక్ష రూపాయలు లంచం తీసుకుంటుండగా సంబంధిత అధికారులను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. లంచం తీసుకుంటూ ఏటీవో అనురాధ, ఎస్‌టీవో లక్ష్మయ్య ఏసీబీ అధికారులకు పట్టుబడినట్లు తెలుస్తోంది. ఓ రిటైర్డ్ పంచాయతీ సెక్రటరీ పెన్షన్ ఫైల్ నిమిత్తం లక్ష రూపాయల లంచం డిమాండ్ చేసినట్లు సమాచారం. వీరిని అదుపులోకి తీసుకుని ఏసీబీ అధికారులు విచారణ చేస్తున్నారు.

బాధితుని ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు పక్కా ప్రణాళికతో దాడులు నిర్వహించారు. లంచం తీసుకుంటూ ఉండగా అధికారులను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. వారి నుంచి డబ్బులు స్వాధీనం చేసుకున్నారు. లంచం డిమాండ్ చేసిన అధికారులపై కేసు నమోదు చేసి ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరుపరచనున్నట్లు తెలిపారు.

ట్రెజరీ కార్యాలయంలో రికార్డులను పరిశీలించిన ఏసీబీ అధికారులు పూర్తి స్థాయి విచారణ జరుపుతున్నారు. అవినీతికి పాల్పడే ప్రభుత్వ అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎవరైనా లంచం అడిగితే టోల్ ఫ్రీ నెంబర్ ను సంప్రదించాలని ఏసీబీ అధికారులు సూచించారు. లంచం తీసుకోవడమే కాదు లంచం ఇవ్వడం కూడా నేరమే అని చెప్పారు.

రైతు సంక్షేమం, మహిళా సాధికారతే ప్రజా ప్రభుత్వం లక్ష్యం.. ప్రజాపాలన దినోత్సవంలో సీఎం!..తెలంగాణSwechaa17 Sep 2026, 04:13 PM

రైతు సంక్షేమం, మహిళా సాధికారతే ప్రజా ప్రభుత్వం లక్ష్యం.. ప్రజాపాలన దినోత్సవంలో సీఎం!..

తెలంగాణ 17th ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో జాతీయ జెండాను ఘనంగా ఆవిష్కరించారు. అంతకుముందు నాంపల్లిలోని గన్ పార్క్ అమరవీరుల స్థూపం వద్ద పూలమాలలు వేసి తెలంగాణ పోరాటయోధుల త్యాగాలను స్మరిస్తూ అంజలి ఘటించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, తరతరాల అణచివేత, భూస్వామ్య దోపిడీపై ధిక్కార స్వరం వినిపించిన సుదీర్ఘ చరిత్ర తెలంగాణదని, సమ్మక్క-సారలమ్మల కాలం నుంచి సాయుధ పోరాటం వరకు అన్యాయాన్ని ఎదిరించడమే ఈ గడ్డ నైజమని కొనియాడారు.

కేసీఆర్ ఫామ్ హౌస్ పై విచారణ.. రేవంత్ కు కలిసొస్తుందా..?తెలంగాణSwechaa17 Sep 2026, 04:05 PM

కేసీఆర్ ఫామ్ హౌస్ పై విచారణ.. రేవంత్ కు కలిసొస్తుందా..?

Telangana Politics: తెలంగాణ గడ్డపై ఇప్పుడు ఒకటే చర్చ.. ఎర్రవల్లి ఫాంహౌస్‌ చుట్టూ రేవంత్ రెడ్డి సర్కార్ బిగిస్తున్న ఉచ్చు కాంగ్రెస్‌కు రాజకీయ లాభాన్ని తెచ్చిపెడుతుందా? లేక గతంలో పక్క రాష్ట్రంలో జరిగిన సీన్ రిపీట్ అయి గులాబీ బాస్‌కి తిరుగులేని ప్రజా సానుభూతిని కట్టబెడుతుందా? ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా, వ్యవసాయ క్షేత్రానికే పరిమితమైన మాజీ సీఎం కేసీఆర్‌ను లక్ష్యంగా చేసుకుని చేపడుతున్న ఈ దూకుడు.. ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్‌కు తిరుగులేని అధికారాన్ని ఖాయం చేస్తుందా లేక చేతులు కాల్చుకునే ప్రమాదంలో పడేస్తుందా అన్న విశ్లేషణలు రాజకీయ వర్గాల్లో కాకరేపుతున్నాయి.తెలుగు నేలపై మాజీ ముఖ్యమంత్రులపై విచారణలు, అరెస్టుల వ్యవహారాలు ఎప్పుడూ ఊహించని ఫలితాలనే ఇచ్చాయి. గతంలో ఏపీలో స్కిల్ డెవలప్‌మెంట్ కేసు పేరుతో ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడిని జైలుకు పంపినప్పుడు అధికార పక్షం అంతా తమ చేతుల్లోనే ఉందనుకుంది. కానీ తెరవెనుక ప్రజల్లో రేకెత్తిన సానుభూతి సునామీగా మారి కూటమిని రికార్డు మెజారిటీతో అధికార పీఠంపై కూర్చోబెట్టింది.

Suryapet: వినాయక మండపాలకు బంపర్ ఆఫర్.. ఇలా నిమజ్జనం చేస్తే రూ.10,116 క్యాష్ ప్రైజ్!..తెలంగాణSwechaa17 Sep 2026, 03:33 PM

Suryapet: వినాయక మండపాలకు బంపర్ ఆఫర్.. ఇలా నిమజ్జనం చేస్తే రూ.10,116 క్యాష్ ప్రైజ్!..

సూర్యాపేటలోని రాజీవ్ నగర్‌లో ఏర్పాటైన వినాయక మండపాల్లో మద్యం సేవించకుండా, నిష్ఠతో పూజలు నిర్వహించి, భక్తిభావంతో వేడుకలు జరిపి, క్రమశిక్షణతో నిమజ్జనం పూర్తి చేసిన మండపాలకు రూ.10,116 నగదు పురస్కారం అందిస్తామని బీఆర్ఎస్ నేత వల్లాస్ జానీ ప్రకటించారు. భక్తి భావం ఉట్టిపడేలా "మద్యం వద్దు.. మహాగణపతి భక్తి ముద్దు" అనే నినాదంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

రేవంత్, కేసీఆర్‌ల భూముల వ్యవహారాలు.. అసలు లెక్కలు చెప్తారా..?తెలంగాణSwechaa17 Sep 2026, 03:03 PM

రేవంత్, కేసీఆర్‌ల భూముల వ్యవహారాలు.. అసలు లెక్కలు చెప్తారా..?

తెలంగాణ శాసనసభ వేదికగా మొదలైన 22A నిషేధిత భూముల రగడ ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తోంది. "మీరు వందల ఎకరాల ప్రభుత్వ భూమిని మింగేశారు" అని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా గర్జిస్తే.. "మీ కుటుంబానికే 300 ఎకరాలకు పైగా లెక్కల్లో లేని ఆస్తులున్నాయి" అంటూ మాజీ మంత్రి హరీశ్‌రావు మీడియా ముందు ఎదురుదాడికి దిగారు. నిజానికి ఇరుపక్షాలు విసిరిన లెక్కల బాంబులతో సామాన్య జనాలు విస్తుపోతున్నారు. అయితే ఈ ఆరోపణల పర్వంలో నాయకులు చెబుతున్నది ఎంత? రికార్డుల వెనుక దాగిన అసలు నిజాలెంత? అన్నదే ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలిపోయింది.

CornPriceRecord: మొక్కజొన్న రైతులకు గు‌డ్ న్యూస్.. మార్కెట్‌లో రికార్డు స్థాయి ధర!తెలంగాణSwechaa17 Sep 2026, 03:01 PM

CornPriceRecord: మొక్కజొన్న రైతులకు గు‌డ్ న్యూస్.. మార్కెట్‌లో రికార్డు స్థాయి ధర!

 తెలంగాణ రాష్ట్రంలో మొక్కజొన్న (మక్కలు) సాగు చేసిన అన్నదాతల శ్రమకు తగిన ఫలితం దక్కుతోంది. బహిరంగ మార్కెట్‌లో మక్కలకు అనూహ్య రీతిలో డిమాండ్ పెరగడంతో ధరలకు ఒక్కసారిగా రెక్కలొచ్చాయి. ఆసియాలోనే అతిపెద్ద ధాన్యాల విక్రయ కేంద్రాల్లో ఒకటిగా పేరుగాంచిన వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో క్వింటా మొక్కజొన్న ఏకంగా రూ.2,775రికార్డు ధరకు అమ్ముడైంది. కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధర (MSP) రూ.2,400కంటే క్వింటాలుకు రూ.375కు పైగా అదనంగా పలుకుతుండటంతో రైతాంగంలో తీవ్ర ఆనందోత్సాహాలు వ్యక్తమవుతున్నాయి.

కేసీఆర్ పై రేవంత్ బ్రహ్మాస్త్రం!!..తెలంగాణSwechaa17 Sep 2026, 03:00 PM

కేసీఆర్ పై రేవంత్ బ్రహ్మాస్త్రం!!..

రేవంత్ రెడ్డి వేస్తున్న ప్రతి అడుగు వెనుక కేవలం పాలన మాత్రమే కాదు, ముందస్తు పొలిటికల్ చెక్ మెయిట్ దాగి ఉంది. ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నప్పటికీ, బీఆర్ఎస్ డిఫెన్స్‌లో పడేలా వ్యూహాత్మకంగా ఉచ్చు బిగిస్తున్నారు. గ్రౌండ్ లెవెల్‌లో బీఆర్ఎస్ కేడర్‌ను, అగ్రనేతలను మానసికంగా దెబ్బతీసే పొలిటికల్ స్ట్రాటజీ. క్యాడర్‌లో ధైర్యం సన్నగిల్లేలా చేస్తూ, క్షేత్రస్థాయిలో గులాబీ పార్టీకి శ్వాస ఆడనివ్వకుండా రేవంత్ పక్కా స్కెచ్ అమలు చేస్తున్నారు. విపక్షం కోలుకోవడానికి సమయం ఇవ్వకుండా ఒక వివాదం ముగిసేలోపే మరొక దాడితో సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ మార్చడమే రేవంత్ మైండ్ గేమ్. రాబోయే ఎన్నికల నాటికి బీఆర్ఎస్‌ను కేవలం ప్రతిపక్షంగా కాకుండా, రాజకీయంగా నిలదొక్కుకోలేని స్థితికి తీసుకురావడమే కాంగ్రెస్ అసలు వ్యూహం అనే చర్చలు సాగుతున్నాయి..

ChiranjeeviOdela Srikanth: ప్యారడైజ్‌తో హిట్ కొడితేనే శ్రీకాంత్ కి గ్రీన్ సిగ్నల్?సినిమాSwechaa17 Sep 2026, 02:55 PM

ChiranjeeviOdela Srikanth: ప్యారడైజ్‌తో హిట్ కొడితేనే శ్రీకాంత్ కి గ్రీన్ సిగ్నల్?

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి ఎప్పుడు కూడా యంగ్ టాలెంట్‌ను ఎంకరేజ్ చేస్తారని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆయన ఖైదీ నంబర్ 150 మూవీతో రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఎక్కువగా యంగ్ డైరెక్టర్స్‌తోనే సినిమాలు చేస్తున్నారు. సీనియర్ దర్శకులెవరూ ఆయనతో సినిమా చేయాలని ప్లాన్ చేయడం లేదు కూడా. ఇప్పుడు, లైన్‌లో ఉన్న యువ దర్శకుల్లో శ్రీకాంత్ ఓదెల ఒకరు. కానీ, తాజాగా..ఈ కాంబో సెట్ అవ్వాలంటే ప్యారడైజ్ హిట్టవ్వాలంటున్నారు.

2004 ఎన్నికల అఫిడవిట్‌లో కేసీఆర్‌కు ఒక్క ఎకరం కూడా లేదు : మంత్రి పొంగులేటితెలంగాణSwechaa17 Sep 2026, 02:54 PM

2004 ఎన్నికల అఫిడవిట్‌లో కేసీఆర్‌కు ఒక్క ఎకరం కూడా లేదు : మంత్రి పొంగులేటి

ప్రతిపక్ష బీఆర్ఎస్ సభ్యులు అధికారంలో ఉన్నప్పుడు ఎంత సంపాదించుకున్నారు? ఎన్ని వేల ఎకరాలు వెనకేసుకున్నారు? అనే అంశం మీద ప్రస్తుతం జోరుగా చర్చ జరుగుతోంది. నిన్న అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి మాజీ సీఎం కేసీఆర్ కుటుంబం ‘ధరణి’ మాటున వందల ఎకరాల భూదోపిడీకి పాల్పడిందని ఆరోపించగా.. ఆ వెంటనే మాజీ మంత్రి హరీశ్ రావు సైతం.. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాకముందు ఆయనకు ఎంత భూమి ఉంది? ఇప్పుడు ఎంత ఉందో లెక్కలు చెప్పారు. ఇవాళ ఉదయం కేటీఆర్.. సీఎం రేవంత్ రెడ్డికి కౌంటర్ ఇవ్వగా.. తాజాగా కేటీఆర్‌కు మంత్రి పొంగులేటి ‘ఎక్స్’ వేదికగా కౌంటర్ ఇచ్చారు. ఎన్నికల అఫిడవిట్‌ ఆధారంగా ‘కల్వకుంట్ల ముఠా’ అడ్డంగా దొరికిపోయిందని.. సున్నా ఎకరాల నుండి రూ.వేల కోట్ల విలువైన ఆస్తులకు ఎదిగిన భూ బకాసురుడు కేసీఆర్ అని మంత్రి పొంగులేటి విమర్శించారు. 2004 కరీంనగర్ లోక్‌సభ ఎన్నికల అఫిడవిట్‌లో ఒక్క ఎకరం కూడా భూమి లేదని తెలిపిన కేసీఆర్‍కు.. ఇప్పుడు రూ.వేల కోట్ల విలువైన భూములు ఎలా వచ్చాయని ప్రశ్నించారు.

యాక్సిడెంట్ కేసు పక్కకేనా?.. సీఎం చంద్రబాబుతో ఆర్ట్ డైరెక్టర్తెలంగాణSwechaa17 Sep 2026, 02:34 PM

యాక్సిడెంట్ కేసు పక్కకేనా?.. సీఎం చంద్రబాబుతో ఆర్ట్ డైరెక్టర్

ఏపీకి చెందిన కీలక వ్యక్తులు, నేతల కొడుకులు హైదరాబాద్‌లో యాక్సిడెంట్స్ చేసి ప్రాణాలు తీస్తున్నా తెలంగాణ పోలీసులు వారి మీద కేసులు పెట్టి చర్యలు తీసుకోవడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి..ఇటీవల మాదాపూర్‌లో ఓ యువతిని కారుతో ఢీకొట్టి చంపిన ఏపీకి చెందిన జనసేన ఎంపీ లింగమనేని రమేశ్ కొడుకు సంజూష్ మీద ఇంతవరకు పోలీసులు చర్యలు తీసుకోలేదు. ప్రస్తుతం అతను బయటే తిరుగుతున్నాడని ప్రచారం జరగుతోంది. ఈ క్రమంలోనే రాయదుర్గంలో కారుతో ఢీకొట్టి ఓ వ్యక్తి మృతికి కారణమైన ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కుమారుడు సందీప్‌ మీద కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదని సమాచారాం.నిందితుడు ఘటనా స్థలం నుంచి పారిపోగా సీసీటీవీ కెమెరాలను పరిశీలించి పోలీసులు అతడిని పట్టుకున్నారు. సందీప్‌ను రాత్రి 11 గంటలకు న్యాయమూర్తి ముందు హాజరుపరచగా అతనికి కండీషన్ బెయిల్‌ దొరికింది.

Rajamouli-Varanasi: మహేష్-ప్రియాంక లను అందుకే సెలెక్ట్ చేశాను!సినిమాSwechaa17 Sep 2026, 02:22 PM

Rajamouli-Varanasi: మహేష్-ప్రియాంక లను అందుకే సెలెక్ట్ చేశాను!

Rajamouli-Varanasi: దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తన దర్శకత్వంలో రూపొందిస్తున్న వారణాసి సినిమా గురించి ఇండియాలో ప్రస్తుతానికి ఎలాంటి అప్‌డేట్స్ ఇవ్వకపోయినా..బాలీవుడ్..హాలీవుడ్‌లో మాత్రం సినిమాకి సంబందించిన ఏదో ఒక విషయాన్ని వెల్లడిస్తూ ముందుగా అక్కడ బిజినెస్‌ను టార్గెట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన వారణాసిలో మహేష్-ప్రియాంక పాత్రలపైకీలకమైన విషయాన్ని రివీల్ చేశారు.

40ప్లస్ ఉద్యోగులకు లేఆఫ్స్ టెన్షన్.. ఈ ఏడాది 1.28లక్షల మందిపై వేటు!వ్యాపారంSwechaa17 Sep 2026, 02:21 PM

40ప్లస్ ఉద్యోగులకు లేఆఫ్స్ టెన్షన్.. ఈ ఏడాది 1.28లక్షల మందిపై వేటు!

భారతీయ కార్పొరేట్ రంగంలో 40నుంచి 45ఏళ్ల వయసున్న సీనియర్ ఉద్యోగుల్లో ఉద్యోగ భద్రతపై తీవ్ర భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఒకప్పుడు సుదీర్ఘ అనుభవానికి పెద్దపీట వేసిన కంపెనీలు, ఇప్పుడు ఖర్చుల నియంత్రణ నెపంతో నడివయసు ఉద్యోగులపైనే వేటు వేస్తున్నాయి. టెక్ దిగ్గజం ఒరాకిల్, స్పోర్ట్స్ బ్రాండ్ అడిడాస్ వంటి అంతర్జాతీయ సంస్థలు ఇటీవల చేపట్టిన పునర్‌వ్యవస్థీకరణ ప్రక్రియలో భాగంగా అధిక వేతనాలు తీసుకుంటున్న సీనియర్, మేనేజీరియల్ స్థాయి ఉద్యోగులను విధుల్లోంచి తొలగించడం ఈ ఆందోళనలకు ప్రధాన కారణమైంది.

క్షుద్రపూజల ఆరోపణలు..వారిపై హరీశ్ రావు పరువునష్టం దావా!తెలంగాణSwechaa17 Sep 2026, 02:20 PM

క్షుద్రపూజల ఆరోపణలు..వారిపై హరీశ్ రావు పరువునష్టం దావా!

రాష్ట్ర రాజకీయాల్లో మరో కీలకపరిణామం చోటుచేసుకుంది. తన మీద అసత్య ఆరోపణలు చేసినందుకు గాను బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మాజీ మంత్రి హరీశ్ రావు చట్టపరమైన చర్యలకు ఉపక్రమించారు. క్షుద్రపూజల పేరిట నిరాధారమైన ఆరోపణలు చేశారని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్‌ల మీద హరీశ్ రావు న్యాయపోరాటానికి దిగారు. ఇప్పటికే వారికి లీగల్ నోటీసులు పంపించిన ఆయన.. వారిద్దరూ బహిరంగ క్షమాపణ చెప్పకపోవడంతో ప్రజాప్రతినిధుల కోర్టును ఆశ్రయించినట్టు తెలిసింది. గురువారం నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల కోర్టులో కాంగ్రెస్ నేతలపై క్రిమినల్ పరువు నష్టం పిటిషన్ దాఖలు చేసినట్టు సమాచారం. తన రాజకీయ ప్రతిష్టను, వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా కాంగ్రెస్ నేతలు అసత్య ఆరోపణలు చేశారని, వీరిపై చర్యలు తీసుకోవాలని పిటిషన్‌లో పేర్కొన్నట్టు తెలిసింది.

ఓటుకు నోటు కేసుపై సుప్రీంలో విచారణ.. న్యాయమూర్తి కీలక వ్యాఖ్యలుతెలంగాణSwechaa17 Sep 2026, 02:04 PM

ఓటుకు నోటు కేసుపై సుప్రీంలో విచారణ.. న్యాయమూర్తి కీలక వ్యాఖ్యలు

బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటును ప్రభావితం చేసేంందుకు ఓ ప్రజాప్రతినిధికి లంచం ఆఫర్ చేసిన కేసులో ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసులో ఏసీబీ అధికారులకు చిక్కిన విషయం తెలిసిందే. ఆ కేసుపై తాజాగా సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.అయితే, తన మీద నమోదైన కేసు కొట్టివేయాలని సుప్రీంకోర్టును రేవంత్ రెడ్డి కోరినట్టు తెలిసింది.కేసు విచారణలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి తరఫున సీనియర్ లాయర్ సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపించారు. 2015లో జరిగిన ఘటనకు 2018లో సవరించిన అవినీతి నిరోధక చట్టం వర్తించదని సుప్రీంకోర్టుకు రేవంత్ రెడ్డి తరపు న్యాయవాది వివరించారు. అయితే, ఓటు అనేది చట్టబద్ధమైన హక్కు అని, దానిని ప్రభావితం చేసినప్పుడు అవినీతి నిరోధక చట్టం వర్తిస్తుందని సుప్రీంకోర్టు న్యాయమూర్తి కీలక వ్యాఖ్యలు చేసినట్టు తెలిసింది.

విలీన చరిత్రకు మతం రంగు పులిమే ప్రయత్నాలు.. కవిత విమర్శలు!తెలంగాణSwechaa17 Sep 2026, 01:52 PM

విలీన చరిత్రకు మతం రంగు పులిమే ప్రయత్నాలు.. కవిత విమర్శలు!

సెప్టెంబర్‌ 17 తెలంగాణ పౌరుషానికి, త్యాగాల చరిత్రకు నిదర్శనమని, అయితే ఈ చారిత్రక ఘట్టాన్ని కాంగ్రెస్‌, బీజేపీలు తమ రాజకీయ ప్రయోజనాల కోసం పూర్తిగా వక్రీకరిస్తున్నాయని తెలంగాణ రక్షణ సేన అధినేత్రి కల్వకుంట్ల కవిత విమర్శించారు. సెప్టెంబర్‌ 17 పురస్కరించుకుని బంజారాహిల్స్‌లోని పార్టీ కార్యాలయంలో గురువారం ఆమె జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. తెలంగాణ విలీన పోరాట యోధుల స్ఫూర్తితో రాష్ట్రంలో రాజ్యమేలుతున్న అరాచక శక్తులను గద్దె దించాలని పిలుపునిచ్చారు.

Ravi Teja-Remunaration: ‘ఇరుముడి’ తర్వాత రెమ్యునరేషన్ పెంచాడా.. వాటానా?సినిమాSwechaa17 Sep 2026, 01:45 PM

Ravi Teja-Remunaration: ‘ఇరుముడి’ తర్వాత రెమ్యునరేషన్ పెంచాడా.. వాటానా?

Ravi Teja: మన హీరోలలో కొందరు నాలుగు ఫ్లాపులొచ్చినా కూడా అస్సలు రెమ్యునరేషన్ తగ్గించుకోరని ఇండస్ట్రీలో టాక్ ఉంది. కొందరు మాత్రం నిర్మాత నిలబడితే ఇంకో సినిమా చేస్తాడనే ఉద్దేశ్యంతో సినిమా రిజల్ట్ గనక తేడా కొడితే తమ రెమ్యునరేషన్ తిరిగి ఇచ్చేస్తుంటారు. లేదా, కొంతైనా వెనక్కి పంపిస్తారు. అదే, ఒక సినిమా గనక భారీ హిట్ కొట్టిందంటే రెట్టింపు చేయడానికి కూడా వెనకాడరు.