స్వేచ్ఛ షార్ట్స్ — తాజా తెలుగు వార్తలు

డోర్నకల్ ఎమ్మెల్యేకు తప్పిన పెనుప్రమాదం..తెలంగాణSwechaa17 Sep 2026, 01:44 PM

డోర్నకల్ ఎమ్మెల్యేకు తప్పిన పెనుప్రమాదం..

డోర్నకల్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేకు పెను ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన డ్రైవర్ వెంటనే కారును పక్కకు ఆపినట్టు తెలిసింది. సెక్యూరిటీ సిబ్బంది సైతం కారు వద్దకు చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చినట్టు సమాచారం. వివరాల్లోకివెళితే..సెప్టెంబర్ 17న నిజాం పాలన నుంచి తెలంగాణకు స్వాతంత్ర్యం లభించడంతో నేడు అధికార కాంగ్రెస్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా ప్రజాపాలన దినోత్సవ వేడుకలను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.దీంతో నియోజకవర్గ ఎమ్మెల్యేలు జాతీయ జెండాను ఎగురవేసి ప్రజా పాలన దినోత్సవ వేడుకల్లో భాగస్వాములు అవుతున్నారు. ఈ క్రమంలోనే డోర్నకల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే రామచంద్రు నాయక్‌ సైతం ఆ వేడుకల్లో పాల్గొనేందుకు మహబూబాబాద్ వెళ్తున్నారు. మార్గంమధ్యలో ఎమ్మెల్యే వాహనంలో ఉన్నట్టుండి పవర్ బ్యాంక్ పేలి మంటలు చెలరేగినట్లు తెలిసింది.ఈ ప్రమాదంలో డ్రైవర్‌కు స్వల్ప గాయాలు అయ్యాయి.

వాహనదారులకు హెచ్చరిక.. ఇలా చేయకుంటే డ్రైవింగ్ లైసెన్స్‌ రద్దు!NationalSwechaa17 Sep 2026, 01:33 PM

వాహనదారులకు హెచ్చరిక.. ఇలా చేయకుంటే డ్రైవింగ్ లైసెన్స్‌ రద్దు!

దేశవ్యాప్తంగా ఉన్న వాహనదారులందరూ తమ డ్రైవింగ్ లైసెన్స్‌కు (DL) మొబైల్ నంబర్‌ను తప్పనిసరిగా లింక్ చేసుకోవాలని కేంద్ర రవాణా శాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. రాబోయే సెప్టెంబరు 25నాటికి ఈ అప్‌డేట్ ప్రక్రియను పూర్తిచేయాలని రవాణా శాఖ అధికారులు తుది గడువు విధించారు. ఒకవేళ నిర్దేశిత గడువులోగా మొబైల్ నంబర్‌ను అనుసంధానించకపోతే సంబంధిత డ్రైవింగ్ లైసెన్సులను రద్దు చేస్తామని అధికారులు స్పష్టమైన హెచ్చరికలు జారీ చేశారు.

The Paradise-Promotional Tour: ప్రమోషనల్ టూర్‌తో జడల్ జమానా షురూ..సినిమాSwechaa17 Sep 2026, 01:26 PM

The Paradise-Promotional Tour: ప్రమోషనల్ టూర్‌తో జడల్ జమానా షురూ..

The Paradise: నేచురల్ స్టార్ నాని నటించిన ది ప్యారడైజ్ సినిమా రిలీజ్ కి ఇంకా కొన్ని రోజులు మాత్రమే మిగిలింది. అయితే, ఇన్నాళ్ళు చిత్రబృందం ఎలాంటి ప్రమోషన్స్ నిర్వహించలేకపోతున్నామని చెప్పింది. థియేట్రికల్ ట్రైలర్ కూడా లేదని ఓపెన్‌గానే వెల్లడించింది. కానీ, ఉన్నట్టుంటి ఈ మూవీకి ప్రమోషన్స్ ప్లాన్ చేసి సర్‌ప్రైజ్ ఇచ్చింది. తాజాగా, దీనికి సంబందించిన అప్‌డేట్‌ని మేకర్స్ వదిలారు.

ఆశావహులకు శుభవార్త.. నెలరోజుల్లో నామినేటెడ్ పోస్టుల భర్తీ : పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్తెలంగాణSwechaa17 Sep 2026, 01:18 PM

ఆశావహులకు శుభవార్త.. నెలరోజుల్లో నామినేటెడ్ పోస్టుల భర్తీ : పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్

కాంగ్రెస్ పార్టీలో నామినేటెడ్ పోస్టుల భర్తీకి రంగం సిద్ధమైంది.ఇంతకాలం పదవుల కోసం ఎదురుచూస్తున్న ఆశావహులకు టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ శుభవార్త చెప్పారు. దీంతో వారంతా మరోసారి జోరుగా లాబీయింగ్ మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. హైకమాండ్ పెద్దలతో పరిచయం ఉన్న నేతలు ఢిల్లీ స్థాయిలో పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ గురువారం ఏఐసీసీ పెద్దలతో సమావేశానికి ముందు మీడియాతో మాడ్లాడారు.రాష్ట్రంలో 22ఏ భూముల వ్యవహారం కాంగ్రెస్ పాపం కాదని పేర్కొన్నారు. తన పదవీకాలానికి మరో ఏడాది సమయం ఉందని పేర్కొన్న మహేశ్ గౌడ్.. మంత్రివర్గ విస్తరణ చేపట్టాలా? వద్దా? అనే అంశంపై నిర్ణయం సీఎం రేవంత్ రెడ్డిదే అని తెలిపారు. నామినేటెడ్ పోస్టులను నెల రోజుల్లో భర్తీ చేస్తామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి త్వరలో పూర్తి స్థాయి కార్యవర్గాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. డీసీసీ అధ్యక్షుల నియామక ప్రక్రియను కూడా త్వరలో చేపడతామని చెప్పారు.

కేసీఆర్ చట్టప్రకారం భూమి కొన్నాడు : కేటీఆర్తెలంగాణSwechaa17 Sep 2026, 12:55 PM

కేసీఆర్ చట్టప్రకారం భూమి కొన్నాడు : కేటీఆర్

సీఎం రేవంత్ రెడ్డి నిన్న అసెంబ్లీ వేదికగా కేసీఆర్ కుటుంబం ఆస్తుల మీద చేసిన ఆరోపణలకు తాజాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గురువారం తెలంగాణ భవన్‌లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి మీద తీవ్ర విమర్శలు చేశారు. కేసీఆర్ పుట్టినప్పుడే ఆయన ఇల్లు రెండు ఎకరాల్లో ఉండేదని, ఆయన తండ్రికి వందల ఎకరాల భూమి ఉందని పేర్కొన్నారు. రైతు కుటుంబం నుంచి వచ్చారు కాబట్టే వ్యవసాయం మీద ఉన్న మక్కువతో ఈనాటికీ వ్యవసాయం చేస్తూనే ఉన్నారని, ఆరోజుల్లోనే చింతమడకలో రెండెకరాల ఇళ్లు ప్రభుత్వ పాఠశాలకు దానం చేశారని పేర్కొన్నారు.కేసీఆర్‌కు ఎప్పటినుంచో వందల ఎకరాలు ఉన్నాయని చెప్పారు.కేసీఆర్ దొర అంటావా? లేక ఈ మధ్య సంపాదించుకున్నాడు అంటావా? ఏదో ఒకటి ఫిక్స్ అవ్వాలని సీఎం రేవంత్‌కు హితవు పలికారు.

HealthMinistry: మెడికల్ షాపుల్లో సీసీటీవీ నిఘా.. కేంద్రం కీలక ప్రతిపాదనలు!NationalSwechaa17 Sep 2026, 12:48 PM

HealthMinistry: మెడికల్ షాపుల్లో సీసీటీవీ నిఘా.. కేంద్రం కీలక ప్రతిపాదనలు!

 వైద్యుల సిఫార్సుతో (ప్రిస్క్రిప్షన్) విక్రయించే మందుల పంపిణీపై కఠిన నిఘా ఉంచేందుకు కేంద్ర ప్రభుత్వం బృహత్తర చర్యలు చేపట్టింది. లైసెన్స్ పొందిన ప్రాంగణాలు, మెడికల్ షాపుల్లో డాక్టర్ల ప్రిస్క్రిప్షన్ ఆధారంగా మందులను విక్రయించే సమయంలో తప్పనిసరిగా సీసీ కెమెరాల నిఘా ఉండాలనే ప్రతిపాదనను కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ తీసుకొచ్చింది. ఈ మేరకు డ్రగ్స్ రూల్స్, 1945కి సవరణలు చేస్తూ సెప్టెంబర్ 8న కేంద్రం నోటిఫికేషన్‌ ముసాయిదా విడుదల చేసింది.

NIMS: నిమ్స్‌లో సమ్మెకు దిగిన జూనియర్ డాక్టర్లు.. రోగుల అవస్థలు!తెలంగాణSwechaa17 Sep 2026, 12:11 PM

NIMS: నిమ్స్‌లో సమ్మెకు దిగిన జూనియర్ డాక్టర్లు.. రోగుల అవస్థలు!

హైదరాబాద్‌లోని నిమ్స్ (NIMS) ఆస్పత్రిలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఎమర్జెన్సీ మెడిసిన్ విభాగంలో విధుల్లో ఉన్న జూనియర్ రెసిడెంట్ డాక్టర్ కె.శ్రీకాంత్‌పై రోగి బంధువులు తీవ్ర పదజాలంతో దూషిస్తూ, భౌతిక దాడులకు దిగుతామని బెదిరించారు. బుధవారం మధ్యాహ్నం ఈ సంఘటన జరగగా రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ (RDA) గురువారం ఉదయం సమ్మెకు పిలుపునిచ్చింది. వైద్యుల భద్రతను గాలికి వదిలేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆసుపత్రిలో అవుట్ పేషెంట్ (OPD) సేవలతో పాటు ఎలక్టివ్ సేవలను నిరవధికంగా బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు.

‘నిన్ను కలెక్టర్ చేస్తా’.. మహిళా ఉద్యోగికి ఎస్పీ నేత వేధింపులుNationalSwechaa17 Sep 2026, 11:58 AM

‘నిన్ను కలెక్టర్ చేస్తా’.. మహిళా ఉద్యోగికి ఎస్పీ నేత వేధింపులు

మహిళలను వేధిస్తున్న రాజకీయ నేతల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇలాంటివి కొన్ని ఘటనలు బయటపడుతుంటే మరికొన్ని బయటకు రావడం లేదు. పరువు కోసం మహిళలు బయటకు రావడం లేదని, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా మౌనంగా బరిస్తున్నారని తెలుస్తోంది. సొసైటీ నుంచి ఎదురయ్యే ప్రశ్నలు, కుటుంబం కోసం మౌనంగా ఉంటూ వేధింపులను బరిస్తున్నట్టు తెలుస్తోంది. ఉత్తరప్రదేశ్‌లో ఓ మహిళను రాజకీయ నేత వేధించిన ఘటన తాజాగా కలకలం రేపింది. సదరు నేత మహిళను వాట్సాప్‌లో వేధించడంతో పాటు అసభ్యకర సందేశాలు పంపినట్టు సమాచారం. దానికి సంబంధించిన స్క్రీన్ షాట్స్ ప్రస్తుతం నెట్టంట వైరల్ అవుతున్నాయి. వివరాల్లోకి వెళ్తే.. సమాజ్ వాదీ పార్టీ మైనారిటీ విభాగం కార్యదర్శి రాజన్ రిజ్వీ తనను వేధిస్తున్నాడని ఓ మహిళా బ్యాంక్ ఉద్యోగిని పోలీసులను ఆశ్రయించింది. దీనికితోడు తనకు పంపిన మెసేజ్‌లను మీడియా ముందు పెట్టింది.

SrideviPropertyCase: శ్రీదేవి ఆస్తుల కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు!సినిమాSwechaa17 Sep 2026, 11:46 AM

SrideviPropertyCase: శ్రీదేవి ఆస్తుల కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు!

 దివంగత హీరోయిన్ శ్రీదేవి కుటుంబానికి చెందిన చెన్నై ఈస్ట్ కోస్ట్ రోడ్డులోని కోట్లాది రూపాయల ఆస్తి వివాదం మళ్లీ తెరపైకి వచ్చింది. ఈ కేసు దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టుకు చేరింది. 1988లో శ్రీదేవి కొనుగోలు చేసిన 2.7ఎకరాల భూమిలో వాటా కోరుతూ దాఖలైన పిటిషన్‌ను విచారించిన జస్టిస్ కేవీ.విశ్వనాథన్, జస్టిస్ అరుణ్ పల్లిలతో కూడిన ధర్మాసనం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణ పూర్తయ్యే వరకు వివాదాస్పద ఆస్తిపై యథాతథ స్థితిని (స్టేటస్ కో) కొనసాగించాలని ఆదేశిస్తూ, శ్రీదేవి భర్త బోనీ కపూర్, కుమార్తెలు జాన్వీ కపూర్, ఖుషీ కపూర్‌లకు నోటీసులు జారీ చేసింది.

ఆళ్ల నాని హుందా రాజకీయాలు చేశారు : మంత్రి నారా లోకేశ్ఏపీSwechaa17 Sep 2026, 11:27 AM

ఆళ్ల నాని హుందా రాజకీయాలు చేశారు : మంత్రి నారా లోకేశ్

గత వైసీపీ ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం, వైద్యారోగ్య శాఖ మంత్రిగా పనిచేసిన ఆళ్ల నాని మంగళవారం గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే.గురువారం ఏలూరు జిల్లాలో ఆయన అంత్యక్రియలు జరిగాయి. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి నారాలోకేష్ హాజరయ్యారు. ఆళ్ల నాని కుటుంబసభ్యులను పరామర్శించి సానుభూతి ప్రకటించారు.లోకేష్‌ వెంట మంత్రులు నిమ్మల, పార్థసారథి, ప్రజాప్రతినిధులు సైతం ఉన్నారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ.. ఆంధ్ర రాష్ట్రం మంచి వ్యక్తిని కోల్పోయిందని పేర్కొన్నారు. నాని డివ్యూటీ సీఎం అయ్యాక శాసనమండలిలో ఆయనతో పరిచయం ఏర్పడిందని తెలిపారు. ఆయన ఏ రోజు వ్యక్తిగత విమర్శలు చేయలేదని గుర్తుచేశారు. చాలా హుందాగా ప్రజాసమస్యలపై మాత్రమే మాట్లాడారని వెల్లడించారు. ఎన్ని ఇబ్బందులు ఉన్నా ప్రజలకు నిబద్ధతతో సేవ చేసిన వ్యక్తి ఆళ్లనాని అని చెప్పారు.

Karthikeya: దర్శకుడిగా మారబోతున్న "RX 100" హీరోసినిమాSwechaa17 Sep 2026, 11:08 AM

Karthikeya: దర్శకుడిగా మారబోతున్న "RX 100" హీరో

Karthikeya: మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఆర్ఎక్స్ 100 సినిమాలో నటించి విమర్శకుల ప్రశంసలతో పాటు ఓవర్‌నైట్ హీరోగా మంచి క్రేజ్ తెచ్చుకొని సంచలనంగా మారిన హీరో కార్తికేయ గుమ్మకొండ. అయితే, ఇది మొదటి సినిమాకే పరిమితం అయింది. ఆ తర్వాత కార్తికేయ హీరోగా ఏ సినిమా చేసినా కానీ ఆశించిన విజయాలను అందుకోలేకపోయాడు. నాని హీరోగా వచ్చిన గ్యాంగ్ లీడర్, తమిళ స్టార్ హీరో అజిత్ నటించిన వలిమై వంటి పెద్ద సినిమాల్లో విలన్‌గా ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.

ప్రేమ వివాహంపై కక్ష.. సినీ ఫక్కీలో కారు ఛేజింగ్, యువతి కిడ్నాప్!క్రైమ్Swechaa17 Sep 2026, 10:58 AM

ప్రేమ వివాహంపై కక్ష.. సినీ ఫక్కీలో కారు ఛేజింగ్, యువతి కిడ్నాప్!

 కర్ణాటక రాజధాని బెంగళూరు నగరంలో ప్రేమ వివాహం చేసుకుందన్న ఆక్రోశంతో ఓ యువతిని ఆమె కుటుంబ సభ్యులే సినీ ఫక్కీలో కిడ్నాప్ చేయడం తీవ్ర సంచలనం సృష్టించింది. రాజస్థాన్‌కు చెందిన పూజ(21), ఓం ప్రకాశ్ (23) కులాంతర వివాహం చేసుకుని బెంగళూరులోని అగ్రహార దాసనహళ్లిలో నివాసముంటున్నారు. ఈ పెళ్లిని అంగీకరించని యువతి కుటుంబీకులు ఆమెను తిరిగి తీసుకువెళ్లేందుకు నలుగురు వ్యక్తులను రాజస్థాన్ నుంచి బెంగళూరుకు పంపగా, బుధవారం రాత్రి వారు యువతి ఇంట్లోకి చొరబడి బలవంతంగా కారులో ఎక్కించుకుని పరారయ్యారు.

విద్యార్థుల మృతి కేసులో కీలక పరిణామం.. శిరీష మెమోరియల్ ట్రస్ట్ వార్డెన్ అరెస్ట్!..తెలంగాణSwechaa17 Sep 2026, 10:53 AM

విద్యార్థుల మృతి కేసులో కీలక పరిణామం.. శిరీష మెమోరియల్ ట్రస్ట్ వార్డెన్ అరెస్ట్!..

పటాన్‌చెరు మండలం పెద్ద కంజర్లలో ఆరుగురు విద్యార్థుల మృతి తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. బుధవారం వినాయక నిమజ్జనానికి వెళ్లిన ఆరుగురు విద్యార్థులు నేరేడు చెరువులో పడి ప్రాణాలు కోల్పోయారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. శిరీష మెమోరియల్ ట్రస్ట్ వార్డెన్ జయప్రకాశ్‌ను అరెస్ట్ చేశారు. మరోవైపు పటాన్‌చెరు ఏరియా ఆస్పత్రి వద్ద మృతుల కుటుంబాలు ఆందోళనకు దిగాయి. న్యాయం జరిగే వరకు మృతదేహాలను తీసుకోబోమని స్పష్టం చేశాయి. ప్రభుత్వం ఒక్కో కుటుంబానికి రెండు లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా ప్రకటించగా.. రెండు కుటుంబాలు చెక్కులు తీసుకునేందుకు నిరాకరించాయి.

తెలంగాణ ప్రజలకు ప్రజాపాలన దినోత్సవ శుభాకాంక్షలు : సీఎం రేవంత్తెలంగాణSwechaa17 Sep 2026, 10:53 AM

తెలంగాణ ప్రజలకు ప్రజాపాలన దినోత్సవ శుభాకాంక్షలు : సీఎం రేవంత్

రాష్ట్రవ్యాప్తంగా అధికార పార్టీ శ్రేణులు ప్రజాపాలన దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుతున్నారు.సెప్టెంబర్ 17న నిజాం పాలన నుంచి తెలంగాణకు స్వాతంత్ర్యం లభించిన సందర్భంగా నేడు ‘తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ’ వేడుకలను ప్రభుత్వం నిర్వహిస్తున్నది. హైదరాబాద్‌ నాంపల్లిలోని పబ్లిక్ గార్డెన్స్‌లో నిర్వహించిన అధికారిక కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి చీఫ్ గెస్టుగా హాజరై త్రివర్ణ పతాకాన్నిఆవిష్కరించారు.దానికి ముందు గన్ పార్క్ వద్ద అమరవీరుల స్తూపానికి నమస్కరించి అమరుల త్యాగాలను స్మరిస్తూ నివాళులర్పించారు. పబ్లిక్ గార్డెన్స్‌‌లో పోలీసు బలగాల నుంచి గౌరవ వందనం స్వీకరించిన సీఎం రేవంత్..ఈ సందర్భంగా మాట్లాడుతూ.. భూస్వామ్య దోపిడీ, అణచివేతపై పోరాడిన అమరుల త్యాగాలను స్మరిస్తూ 4 కోట్ల తెలంగాణ ప్రజలకు ప్రజాపాలన దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

MS-Subbulakshmi: కమల్ క్లాప్‌తో లెజండరీ బయోపిక్ ప్రారంభంసినిమాSwechaa17 Sep 2026, 10:48 AM

MS-Subbulakshmi: కమల్ క్లాప్‌తో లెజండరీ బయోపిక్ ప్రారంభం

MS-Subbulakshmi: నేషనల్ క్రష్ రష్మిక మందన్న తాజాగా ఓ బయోపిక్ మూవీలో నటించడానికి ఒప్పుకున్న సంగతి తెలిసిందే. ఆ బయోపిక్ ఎవరిదో కాదు..సంగీత సామ్రాజ్ఞి, భారతరత్న ఎంఎస్ సుబ్బులక్ష్మి గారిది. ఆవిడ జీవిత చరిత్రను సినిమాగా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాను టాలెంటెడ్ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ నిర్మిస్తున్నారు. ఎంఎస్ సుబ్బులక్ష్మి 110వ జన్మదినోత్సవం సందర్భంగా ఈ సినిమాను భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ప్రకటించారు.

75 ఏళ్ల ప్రస్థానంలో దేశ రాజకీయాలను మార్చిన నాయకుడు!NationalSwechaa17 Sep 2026, 10:42 AM

75 ఏళ్ల ప్రస్థానంలో దేశ రాజకీయాలను మార్చిన నాయకుడు!

ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజు సందర్భంగా ఆయన రాజకీయ ప్రస్థానాన్ని, దేశ పాలనలో చోటు చేసుకున్న ముఖ్యమైన మార్పులను గుర్తు చేసుకునే సమయం ఇది. 1950 సెప్టెంబర్ 17న గుజరాత్‌లో జన్మించిన మోదీ, ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా మొదలైన తన ప్రయాణాన్ని గుజరాత్ ముఖ్యమంత్రి పదవి, ఆ తర్వాత దేశ ప్రధానమంత్రి స్థాయి వరకు తీసుకెళ్లారు.

115 మ్యాచ్‌ల్లోనే 100 గోల్స్.. ఎంఎల్ఎస్ చరిత్రలోనే మెస్సీ ఆల్‌టైమ్ రికార్డు!క్రీడలుSwechaa17 Sep 2026, 10:37 AM

115 మ్యాచ్‌ల్లోనే 100 గోల్స్.. ఎంఎల్ఎస్ చరిత్రలోనే మెస్సీ ఆల్‌టైమ్ రికార్డు!

 ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ తన అద్భుతమైన కెరీర్‌లో మరొక అరుదైన మైలురాయిని అధిగమించాడు. ఇంటర్ మయామి క్లబ్ తరఫున తన 100వ గోల్‌ను నమోదు చేయడమే కాకుండా, జట్టుకు ప్రతిష్టాత్మకమైన కాంపియోన్స్ కప్ టైటిల్‌ను అందించి సరికొత్త చరిత్ర సృష్టించాడు. బుధవారం రాత్రి జరిగిన తీవ్ర ఉత్కంఠభరితమైన ఫైనల్ మ్యాచ్‌లో ఇంటర్ మయామి 2-0 తేడాతో మెక్సికన్ క్లబ్ క్రూజ్ అజుల్‌పై ఘన విజయం సాధించి ట్రోఫీని కైవసం చేసుకుంది. ఈ కీలక విజయంలో మెస్సీ ఒక గోల్ చేయడంతో పాటు మరొక గోల్‌కు అసిస్ట్ అందించి జట్టు విజయంలో ప్రధాన భూమిక పోషించాడు.

రాష్ట్రానికి భారీ వర్షసూచన.. రెండ్రోజులు  బీ అలర్ట్తెలంగాణSwechaa17 Sep 2026, 10:35 AM

రాష్ట్రానికి భారీ వర్షసూచన.. రెండ్రోజులు బీ అలర్ట్

రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ పేర్కొంది. వినాయకచవితి రోజున రాష్ట్రవ్యాప్తంగా మోస్తరు వర్షం కురిసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత రాష్ట్రంలో అక్కడక్కడ చిరుజల్లులు కురిసాయి. అయితే, నేడు, రేపు రాష్ట్రంలో తీవ్రమైన ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ నిపుణులు, తెలంగాణ వెదర్‌మ్యాన్ హెచ్చరించారు. ఉదయం నుంచి సాయంకాలం వరకు ఎండ తీవ్రత అధికంగా ఉండటంతో పాటు అత్యంత ఉక్కపోత ఉంటుందని, వాతావరణంలో మాత్రం తేమ ఉంటుందని వెల్లడించారు. సాయంత్రం తర్వాత అక్కడక్కడ చెదురుమొదురు జల్లులు కురుస్తాయని పేర్కొన్నారు.రాత్రి వేళ నుంచి తెల్లవారుజాము సమయంలో వాతావరణంలో వేగంగా మార్పులు చోటు చేసుకుంటాయని, పలు జిల్లాల్లో బలమైన గాలులతో కూడిన భీకర వర్షాలు, పిడుగులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

యూపీఐ చార్జీలపై పొలిటికల్ వార్.. రాహుల్ గాంధీ వైఖరిపై బీజేపీ విమర్శలు!!..NationalSwechaa17 Sep 2026, 10:17 AM

యూపీఐ చార్జీలపై పొలిటికల్ వార్.. రాహుల్ గాంధీ వైఖరిపై బీజేపీ విమర్శలు!!..

యూపీఐ లావాదేవీలపై ఎండీఆర్ చార్జీల విధించే ప్రతిపాదనపై రాజకీయాలు వేడెక్కాయి! కేంద్ర ప్రభుత్వంపై లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మండిపడుతుంటే, బీజేపీ మాత్రం ఆయనపై ఎదురుదాడికి దిగింది. ఎండీఆర్ విధానాన్ని సమర్థిస్తూ పార్లమెంటరీ కమిటీ ఇచ్చిన నివేదికకు పి. చిదంబరం, మనీష్ తివారీ సహా ఐదుగురు కాంగ్రెస్ ఎంపీలు సంతకాలు చేశారని బీజేపీ గుర్తుచేసింది. కమిటీలో సొంత ఎంపీలు మద్దతు తెలిపిన అంశాన్ని బయట రాహుల్ గాంధీ ఎందుకు వ్యతిరేకిస్తున్నారని బీజేపీ ప్రశ్నిస్తోంది.

ప్రపంచ రికార్డ్ సొంతం చేసుకున్న 72 అడుగుల మట్టి గణపతి!..ఏపీSwechaa17 Sep 2026, 09:56 AM

ప్రపంచ రికార్డ్ సొంతం చేసుకున్న 72 అడుగుల మట్టి గణపతి!..

విజయవాడలో ఏర్పాటు చేసిన అతిపెద్ద వినాయకుడి మట్టి విగ్రహం ప్రపంచ రికార్డు సాధించింది. డూండీ గణేశ సేవా సమితి ఆధ్వర్యంలో నగరంలోని విద్యాధరపురం సితార గ్రౌండ్స్‌లో 72 అడుగుల ఎత్తయిన శ్రీపంచముఖ వరసిద్ధి మహా గణపతి మట్టి విగ్రహాన్ని నెలకొల్పారు. ఈ విగ్రహం ఎత్తయిన పర్యావరణ హిత గణేశుడిగా.. ఇంజీనియస్‌ ఛార్మ్‌ వరల్డ్‌ రికార్డ్‌ (ఐసీడబ్ల్యూఆర్‌) సాధించింది.

అమెరికా వడ్డీ రేట్ల షాక్.. రూపాయి, స్టాక్ మార్కెట్లపై పడనున్న తీవ్ర ప్రభావం!InternationalSwechaa17 Sep 2026, 09:31 AM

అమెరికా వడ్డీ రేట్ల షాక్.. రూపాయి, స్టాక్ మార్కెట్లపై పడనున్న తీవ్ర ప్రభావం!

 అమెరికా ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ (FOMC) కీలక ఫెడరల్ ఫండ్స్ రేటును పావు శాతం (25 బేసిస్ పాయింట్లు) పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో అమెరికాలో వడ్డీ రేట్లు 3.75 - 4 శాతానికి చేరుకున్నాయి. ద్రవ్యోల్బణం ఇంకా లక్ష్యానికి పైన ఉండటం, మధ్యప్రాచ్య ఉద్రిక్తతలు, ఇంధన ధరల పెరుగుదల వల్ల ఈ నిర్ణయం తప్పలేదని ఫెడ్ పేర్కొంది. అయితే అగ్రరాజ్యంలో జరిగిన ఈ వడ్డీ రేట్ల పెంపు అంతర్జాతీయ వాణిజ్య సరళిని మార్చడమే కాకుండా భారత ఆర్థిక వ్యవస్థపై కూడా గణనీయమైన ప్రతికూల ప్రభావం చూపే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

Hyderabad: హైదరాబాద్ హోటళ్లలో దారుణ పరిస్థితులు.. 9 హోటళ్ల లైసెన్సులు రద్దు!!..తెలంగాణSwechaa17 Sep 2026, 09:12 AM

Hyderabad: హైదరాబాద్ హోటళ్లలో దారుణ పరిస్థితులు.. 9 హోటళ్ల లైసెన్సులు రద్దు!!..

హైదరాబాద్‌లో హోటళ్లు, రెస్టారెంట్లలో నిబంధనల ఉల్లంఘనపై టీజీ సేఫ్‌ కొరడా ఝళిపించింది. ఎల్బీనగర్, చంపాపేట్, వనస్థలిపురం ప్రాంతాల్లో 10 ప్రత్యేక బృందాలు 20 ఆహార తయారీ కేంద్రాల్లో తనిఖీలు చేపట్టగా.. 9 చోట్ల తీవ్ర అపరిశుభ్రత బయటపడింది. దీంతో 9 హోటళ్ల లైసెన్సులను రద్దు చేసి.. వ్యాపార కార్యకలాపాలను వెంటనే నిలిపివేయాలని అధికారులు ఆదేశించారు. గెలాక్సీ కేఫ్‌, అంటెరా, లక్కీ రెస్టారెంట్‌, జాయింట్‌ ఆల్‌మండి, విజయ రాఘవేంద్ర హోటళ్లకు షోకాజ్‌ నోటీసులు ఇచ్చారు. మరో మూడు సంస్థలకు ఇంప్రూవ్‌మెంట్‌ నోటీసులు జారీ చేశారు. ప్రజారోగ్యంతో చెలగాటమాడితే కఠిన చర్యలు తప్పవని టీజీ సేఫ్‌ హెచ్చరించింది.

HYD: భాగ్యనగరంలో గణనాథుడి మహిమ.. 10రోజుల్లో రూ.10,000కోట్ల బిజినెస్!తెలంగాణSwechaa17 Sep 2026, 09:01 AM

HYD: భాగ్యనగరంలో గణనాథుడి మహిమ.. 10రోజుల్లో రూ.10,000కోట్ల బిజినెస్!

 హైదరాబాద్‌లో గణేశ్ నవరాత్రి ఉత్సవాలు ఆధ్యాత్మిక పరవశంతో పాటు నగర ఆర్థిక వ్యవస్థకు ఊహించని స్థాయిలో జవసత్వాలు అందిస్తున్నాయి. వివాహాలు, ఇతర శుభకార్యాలు లేక శూన్యమాసంలో మందగించిన వివిధ వ్యాపారాలకు ఈ పండుగ సీజన్ కొత్త ఊపిరి పోసింది. భాగ్యనగర గణేశ్ ఉత్సవ సమితి ప్రాథమిక అంచనాల ప్రకారం.. అధికారికంగా రూ.6,000కోట్ల వ్యాపారం అవుతుందని భావించినప్పటికీ, అనధికారికంగా ఈ ఉత్సవాల టర్నోవర్ రూ.10,000 కోట్లను దాటుతుందని ఆర్థిక, వాణిజ్య వర్గాలు విశ్లేషిస్తున్నాయి. 

భూ స్కాం వార్తలకు ట్రెండ్ సెట్టర్ "స్వేచ్ఛ న్యూస్"..తెలంగాణSwechaa17 Sep 2026, 08:48 AM

భూ స్కాం వార్తలకు ట్రెండ్ సెట్టర్ "స్వేచ్ఛ న్యూస్"..

భూ ఉద్యమాలు ప్రభుత్వాల తప్పిదాలతోనే పుడతాయన్నది చరిత్ర చెబుతోంది. పన్నుల నుంచి కౌలుదారుల చట్టం, భూసీలింగ్‌ వరకు ఎన్నో పోరాటాల తర్వాతే చట్టాలు వచ్చాయి. మరి 1950 నుంచి కాంగ్రెస్‌ పాలన ఉన్నప్పుడు 1976 వరకు ఎందుకు ఆలస్యం చేశారన్న ప్రశ్న ఇప్పుడు తెరపైకి వస్తోంది. ప్రజల ప్రయోజనాల కోసం చట్టాలు పనిచేయాలే కానీ.. రాజకీయ ప్రయోజనాల కోసం కాదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఫీనిక్స్‌, వంశీరాం భూములు, బినామీ లావాదేవీలపై ఎందుకు చర్చించలేదంటూ స్వేచ్ఛ న్యూస్‌ ప్రశ్నిస్తోంది. వీటిపై ఆధారాలతో మరిన్ని వివరాలు బయటపెడతామని ఆ సంస్థ చెబుతోంది.

విలువలు వలువలు వదిలేసిన ఖాకీల కహానీ!!..క్రైమ్Swechaa17 Sep 2026, 08:30 AM

విలువలు వలువలు వదిలేసిన ఖాకీల కహానీ!!..

పేదల కడుపు నింపాల్సిన PDS రేషన్ బియ్యం దందాలో ఏకంగా ఖాకీలే పాత్రధారులుగా మారడం తీవ్ర కలకలం రేపుతోంది! కీసర పోలీస్ స్టేషన్‌లో అక్రమార్కులకు సహకరిస్తూ కొందరు అధికారులు హద్దులు దాటారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఓ కేసులో నిందితుడికి స్టేషన్ బెయిల్ ఇచ్చేందుకు కీసర ఇన్‌స్పెక్టర్ ఆంజనేయులు ఏకంగా 10 లక్షల లంచం డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది.

సామాన్యుడికి వంద గజాలు కరువు.. నాయకులకు వందల ఎకరాలెలా? రేవంత్–కల్వకుంట్ల భూముల యుద్ధం వెనుక లెక్కలేంటి..?తెలంగాణSwechaa17 Sep 2026, 12:32 AM

సామాన్యుడికి వంద గజాలు కరువు.. నాయకులకు వందల ఎకరాలెలా? రేవంత్–కల్వకుంట్ల భూముల యుద్ధం వెనుక లెక్కలేంటి..?

తెలంగాణలో ఇప్పుడు మాటల యుద్ధం కాదు... భూముల యుద్ధం మొదలైంది. ఒకవైపు సీఎం రేవంత్ రెడ్డి. మరోవైపు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబం. మధ్యలో వందల ఎకరాల భూముల ఆరోపణలు. అసెంబ్లీ వేదికగా మొదలైన ఈ రగడ ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు తెరతీసింది.

22ఏ భూములు.. 12 రకాల సమస్యలు.. పరిష్కార మార్గాలు..తెలంగాణSwechaa16 Sep 2026, 10:45 PM

22ఏ భూములు.. 12 రకాల సమస్యలు.. పరిష్కార మార్గాలు..

22ఏ నిషేధిత భూముల అంశానికి సంబంధించి ప్రధానంగా 12 రకాల సమస్యలను ప్రభుత్వం గుర్తించింది. వాటి పరిష్కారానికి అనుసరించబోయే మార్గాల వివరాలను అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు.

1) ULC భూములు పాక్షికంగా క్రమబద్ధీకరించబడిన, క్రమబద్ధీకరించని కాలనీలు..

పట్టణ భూగరిష్ట పరిమితి చట్టం (ULC) మిగులు భూముల క్రమబద్ధీకరణ నిమిత్తం ప్రభుత్వం నూతన విధానాన్ని త్వరలోనే ప్రవేశపెట్టనుంది. ఈ పథకం పెండింగ్ లో ఉన్న పాత దరఖాస్తులతో పాటు కొత్త దరఖాస్తులన్నింటికీ వర్తిస్తుంది. భూముల రిజిస్ట్రేషన్, క్రమబద్ధీకరణ ప్రక్రియలు రెండూ సమాంతరంగా, ఏకకాలంలో.

వినాయక నిమజ్జనంలో తీవ్ర విషాదం.. ఆరుగురు విద్యార్థులు దుర్మరణంతెలంగాణSwechaa16 Sep 2026, 09:59 PM

వినాయక నిమజ్జనంలో తీవ్ర విషాదం.. ఆరుగురు విద్యార్థులు దుర్మరణం

Sangareddy Tragedy: సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు పరిధిలో వినాయక నిమజ్జనం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. పటాన్‌చెరు మండలం ఇంద్రేశం మున్సిపాలిటీ పరిధిలోని పెద్దకంజర్ల గ్రామ శివారులో ఉన్న శిరీష అనాథాశ్రమానికి చెందిన ఆరుగురు విద్యార్థులు ప్రమాదవశాత్తు నీటి కుంటలో మునిగి ప్రాణాలు కోల్పోయారు.గణేశ్ విగ్రహ నిమజ్జనం కోసం ఆశ్రమానికి చెందిన విద్యార్థులు సమీపంలోని నీటి కుంట వద్దకు వెళ్లారు. నిమజ్జనం చేసే క్రమంలో ఒకరి తర్వాత ఒకరు ప్రమాదవశాత్తు లోతైన నీటిలోకి జారిపడ్డారు. ఈత రాకపోవడంతో నీటిలో మునిగిపోయి ఆరుగురు చిన్నారులు అక్కడికక్కడే జలసమాధి అయ్యారు. ఈ హృదయ విదారక ఘటనతో స్థానికంగా తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి.

Rashmika Mandanna-New Decision: పెళ్లి తర్వాత ఇలాంటి డెసిషన్ తీసుకుంటుందని ఎవరూ ఊహించలేదుగా!సినిమాSwechaa16 Sep 2026, 09:53 PM

Rashmika Mandanna-New Decision: పెళ్లి తర్వాత ఇలాంటి డెసిషన్ తీసుకుంటుందని ఎవరూ ఊహించలేదుగా!

Rashmika Mandanna: నేషనల్ క్రష్..పాన్ ఇండియన్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న ఇప్పుడు ఓ సంచలన నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. దీనికి కారణం ఆమె పెళ్లే అని తెలుస్తోంది. సాధారణంగా హీరోయిన్స్ కెరీర్ పీక్స్‌లో ఉండగానే పెళ్లి చేసుకుంటున్నారు. కొందరు పెళ్లి తర్వాత సినిమాలకి కొంతకాలం బ్రేక్ ఇస్తుంటే, కొందరు మాత్రం కంటిన్యూ అవుతున్నారు. ఇక్కడే, ఊహించని నిర్ణయం తీసుకుంది రష్మిక మందన్న. ఇకపై నో గ్లామర్ రోల్స్ అని తెలుస్తోంది.

Adivi Sesh: మొత్తానికి గూఢాచారి 2 (G2) రిలీజ్ డేట్ వచ్చేసింది..సినిమాSwechaa16 Sep 2026, 09:48 PM

Adivi Sesh: మొత్తానికి గూఢాచారి 2 (G2) రిలీజ్ డేట్ వచ్చేసింది..

Adivi Sesh: టాలీవుడ్ యంగ్ హీరోలలో అడవి శేష్ ది ఒక సపరేట్ ఇమేజ్..సపరేట్ జర్నీ. అయన సినిమాలన్నీ ఎంతో ప్రత్యేకంగా ఉంటాయి. ముందు నుచ్ణి శేష్ కి కథలపై మంచి పట్టుంది. స్క్రీన్ ప్లే కూడా బాగా రాయగలడు. మేకింగ్ విషయంలోనూ అడవి శేష్ చాలా క్లారిటీగా ఉంటాడు. ఇంత క్లారిటీ ఉన్నప్పటికీ అడవి శేష్ నుంచి వచ్చే సినిమాలు చాలా గ్యాప్ తీసుకుంటున్నాయి. మొత్తానికి జీ2 రిలీజ్ డేట్‌ను మేకర్స్ ప్రకటించారు.