స్వేచ్ఛ షార్ట్స్ — తాజా తెలుగు వార్తలు

వచ్చే ఎన్నికల్లో బీజేపీతో పొత్తుపై కేటీఆర్ క్లారిటీతెలంగాణSwechaa16 Sep 2026, 09:44 PM

వచ్చే ఎన్నికల్లో బీజేపీతో పొత్తుపై కేటీఆర్ క్లారిటీ

KTR : తెలంగాణ రాజకీయాల్లో గత కొంతకాలంగా బీఆర్ఎస్, బీజేపీ పొత్తుపై జోరుగా సాగుతున్న ప్రచారాలకు మాజీ మంత్రి కేటీఆర్ పూర్తిస్థాయిలో తెరదించారు. రాబోయే 2028 తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో బీజేపీతో ఎలాంటి పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని ఆయన కుండబద్దలు కొట్టారు. జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీలో నిర్వహించిన ‘‘ఇన్నోవేషన్ ఇన్ గవర్నెన్స్: ది స్టోరీ ఆఫ్ ఎ స్టార్టప్ స్టేట్’’ సదస్సులో పాల్గొన్న ఆయన, విద్యార్థులతో నిర్వహించిన ముఖాముఖిలో రాజకీయ, పాలనాపరమైన అంశాలపై చేసిన కామెంట్స్ ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారాయి.2028 ఎన్నికల్లో బీజేపీ పార్టీతో బీఆర్ఎస్ చేతులు కలపబోతోందా అని ఓ విద్యార్థి అడిగిన ప్రశ్నకు కేటీఆర్ ఏమాత్రం తడబడకుండా స్పందించారు. "బీజేపీతో ఎలాంటి పొత్తు ఉండదు" అని ఒక్క మాటలో స్పష్టం చేస్తూ ఊహాగానాలకు బ్రేక్ వేశారు. సొంత బలంతోనే ప్రజల్లోకి వెళ్లి తీర్పు కోరతామనే సంకేతాన్ని ఆయన ఇచ్చారు.

"గజం ఎక్కువ ఉన్నా ప్రభుత్వానికే ఇచ్చేస్తా.." సీఎం రేవంత్‌కు కవిత ఓపెన్ ఛాలెంజ్తెలంగాణSwechaa16 Sep 2026, 09:25 PM

"గజం ఎక్కువ ఉన్నా ప్రభుత్వానికే ఇచ్చేస్తా.." సీఎం రేవంత్‌కు కవిత ఓపెన్ ఛాలెంజ్

TG Politics: శాసనసభ వేదికగా 22A నిషేధిత భూముల వ్యవహారంపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలపై తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి చెప్పినవన్నీ పచ్చి అబద్ధాలని కొట్టిపారేసిన ఆమె, 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా నేరుగా ప్రభుత్వానికే సవాల్ విసిరారు. ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్న దానికంటే ఒక్క గజం భూమి తనకు అదనంగా ఉన్నట్లు తేలినా, నిబంధనలకు విరుద్ధంగా ఉన్నట్లు రుజువైనా ఆ భూమిని తక్షణమే సర్కార్‌కే సరెండర్ చేయడానికి సిద్ధమని తెగేసి చెప్పారు.సభలో 22A భూములపై చర్చ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. సిద్దిపేట జిల్లా పరిధిలో కవిత, ఆమె భర్త పేరిట ఏకంగా 37.26 ఎకరాల భూమి ఉందని ఆరోపించారు. ఈ ప్రకటన రాష్ట్ర రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారం రేపింది. సీఎం వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ కవిత సోషల్ మీడియాలో స్పందించారు. తన కుటుంబానికి ఎక్కడెక్కడో భూములు ఉన్నట్లు సీఎం రేవంత్ అసత్య ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Kayadu Lohar-Nani: సిగరెట్ వెలిగించిన హీరోయిన్..ఇది కదా కావాల్సింది!సినిమాSwechaa16 Sep 2026, 09:24 PM

Kayadu Lohar-Nani: సిగరెట్ వెలిగించిన హీరోయిన్..ఇది కదా కావాల్సింది!

Kayadu Lohar: ప్యారడైజ్ సినిమా మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకూ అన్నీ అప్‌డేట్స్ వస్తున్నాయి గానీ హీరోయిన్ గురించి..ఆమె పాత్ర గురించి మాత్రం ఎలాంటి అప్‌డేట్ ఇవ్వలేదు. దీంతో, అసలు ప్యారడైజ్ సినిమాలో హీరోయిన్ ఉందా..? అని కామెంట్స్ చేశారు. ఒకే ఒక్క పాటలో కనిపించిన కీర్తి సురేష్ మాత్రం బాగా హైలెట్ అయింది. కానీ, టీజర్‌లో ఎక్కడుందో అని వెతుక్కున్నారు హీరోయిన్‌ని.

సీఎం రేవంత్ చెప్పినవన్నీ అబద్ధాలే : హరీష్ రావుతెలంగాణSwechaa16 Sep 2026, 09:21 PM

సీఎం రేవంత్ చెప్పినవన్నీ అబద్ధాలే : హరీష్ రావు

TG Politics: తెలంగాణ శాసనసభలో 22A నిషేధిత భూముల వ్యవహారంపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత తన్నీరు హరీశ్‌రావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన, ప్రభుత్వం తన వైఫల్యాలను, కుంభకోణాలను కప్పిపుచ్చుకోవడానికే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పథకం ప్రకారం అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేసిందని మండిపడ్డారు. ప్రజా సమస్యలు, 6 గ్యారెంటీల అమలుపై నిలదీస్తామనే భయంతోనే రేవంత్ రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్‌కు తెరలేపారని ధ్వజమెత్తారు.రాహుల్ గాంధీ లోక్‌సభకు టీ-షర్టులు, స్టిక్కర్లతో వెళ్తే తప్పులేదు కానీ, ప్రజా సమస్యలను టీ-షర్టులపై రాసుకొచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను బూతు పదాలంటూ సస్పెండ్ చేయడం కాంగ్రెస్ ద్వంద్వ నీతికి నిదర్శనమని హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు

బీఆర్ఎస్‌పై విమర్శలు, ఆరోపణలే తప్ప ఆధారాలు ఏవి?తెలంగాణSwechaa16 Sep 2026, 09:10 PM

బీఆర్ఎస్‌పై విమర్శలు, ఆరోపణలే తప్ప ఆధారాలు ఏవి?

Alleti Maheshwar Reddy: సీఎం రేవంత్ రెడ్డిపై బీజేపీ నేతలు మండిపడ్డారు. గత ప్రభుత్వంలో ధరణి పేరుతో కేసీఆర్ కుటుంబం లక్ష కోట్ల విలువైన భూ అక్రమాలకు పాల్పడిందంటున్న సీఎం రేవంత్ రెడ్డి.. వాటిని ఎందుకు బయట పెట్టలేకపోతున్నారని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ప్రశ్నించారు. భూ దందాలో దోపిడీదారులు, కుట్రదారులు ఎవరో బహిర్గతం చేయాలని సీఎం రేవంత్ ను డిమాండ్ చేశారు.

బీఆర్ఎస్ నేతలపై విమర్శలు, ఆరోపణలు చేయడం తప్ప.. ఆధారాలు మాత్రం చూపడం లేదని ముఖ్యమంత్రి రేవంత్ పై ధ్వజమెత్తారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య చీకటి ఒప్పందం కుదిరిందని ఆయన ఆరోపించారు. గత ప్రభుత్వంలో జరిగిన భూ అక్రమాలపై స్పెషల్ ఎంక్వైరీ టీమ్ ను ఏర్పాటు చేస్తామన్న సీఎం రేవంత్ ప్రకటనపై సెటైర్లు వేశారు ఏలేటి మహేశ్వర్ రెడ్డి. సిట్ కాస్త సెట్ అయ్యింది.. సెట్ కాస్త సెట్టింగ్ అవుతుందేమో అని విమర్శించారు.

Dharman-Rashiikhanna: రజినీకాంత్, రాశీఖన్నా..ధర్మన్ షూట్ అప్‌డేట్ ఇదే..సినిమాSwechaa16 Sep 2026, 08:56 PM

Dharman-Rashiikhanna: రజినీకాంత్, రాశీఖన్నా..ధర్మన్ షూట్ అప్‌డేట్ ఇదే..

Dharman: సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ జైలర్ 2 విడుదల కోసం అభిమనులే కాదు, యావత్ సినీ లవర్స్ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. జైలర్ భారీ విజయాన్ని అందుకున్న నేపథ్యంలో సీక్వెల్ మీద భారీ అంచనాలున్నాయి. నెల్సన్ దిలీప్‌కుమార్ రచన, దర్శకత్వంలో రూపొందుతున్న ఈ యాక్షన్ కామెడీ చిత్రాన్ని అగ్ర నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కలానిధి మారన్ నిర్మించారు.

Ram Charan-Om Raut: ఆ ఫ్లాప్ డైరెక్టర్‌కి ఛాన్స్ ఇస్తాడా?సినిమాSwechaa16 Sep 2026, 08:18 PM

Ram Charan-Om Raut: ఆ ఫ్లాప్ డైరెక్టర్‌కి ఛాన్స్ ఇస్తాడా?

Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ మూవీతో గ్లోబల్ వైడ్‌గా ఎంతటి క్రేజ్ సంపాదించుకున్నాడో అందరికీ తెలిసిందే. కానీ, ఆ తర్వాత వచ్చిన రెండు సినిమాలు ఆ స్థాయిలో విజయాన్ని అందివ్వలేకపోయాయి. వాస్తవానికి, రాజమౌళి సినిమాతో హిట్ కొట్టిన హీరోలకి తర్వాత సినిమా ఫ్లాప్ పడుతుందని అన్న మాట తారక్, చరణ్‌ల విషయంలోనూ నిజమైంది.

స్వేచ్ఛ న్యూస్.. సత్యాలే వార్తలు.. సీఎం రేవంత్ చెప్పిన స్కాంలు రెండేళ్ల క్రితం రాసినవే!స్వేచ్ఛ ఛైర్మన్ డెస్క్Swechaa16 Sep 2026, 08:05 PM

స్వేచ్ఛ న్యూస్.. సత్యాలే వార్తలు.. సీఎం రేవంత్ చెప్పిన స్కాంలు రెండేళ్ల క్రితం రాసినవే!

* స్వేచ్ఛ న్యూస్.. సత్యాలే వార్తలు.. దేవేందర్ రెడ్డి చింతకుంట్ల రాసినవే.. అక్షర సత్యాలని మరోసారి శాసనసభలో రుజువు! సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన స్కాంలు రెండేళ్ల క్రితం ఇచ్చాం.. ప్పుడే గుర్తుకు వచ్చాయా రేవంత్ రెడ్డి? గత ప్రభుత్వంలో ధరణి మాటున జరిగిన అక్రమాలపై ఎన్నో వార్తలు ఇచ్చాం ...

మై హోంకు శంషాబాద్‌లో 2వేల ఎకరాలు.. సీఎం రేవంత్‌ సంచలన ఆరోపణలు(My Home)తెలంగాణSwechaa16 Sep 2026, 07:57 PM

మై హోంకు శంషాబాద్‌లో 2వేల ఎకరాలు.. సీఎం రేవంత్‌ సంచలన ఆరోపణలు(My Home)

My Home Group: తెలంగాణ శాసనసభ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ అగ్రనాయకత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో గత ప్రభుత్వ హయాంలో ధరణి ముసుగులో సాగిన అక్రమ భూ బాగోతాలను సర్వే నంబర్లతో సహా బట్టబయలు చేస్తూ అసెంబ్లీని నివ్వెరపరిచారు. "కేసీఆర్ హోమే మైహోం.. ఆ సంస్థ ఎవరి బినామీనో ఈ రాష్ట్రంలో తెలియనివారు ఎవరైనా ఉన్నారా?" అంటూ నేరుగా కేసీఆర్‌ను టార్గెట్ చేశారు. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం పరిసరాల్లో ఒకే సంస్థ చేతుల్లోకి ఏకంగా వేల ఎకరాలు ఎలా వెళ్లాయో వివరిస్తూ, ఇది సుమారు లక్ష కోట్ల భారీ భూ కుంభకోణమని ఆరోపించారు.

ఈ వ్యవహారంపై తక్షణమే ప్రత్యేక సమగ్ర విచారణకు ఆదేశాలు జారీ చేశారు.శంషాబాద్ ప్రాంతంలో సాగిన భూ ఆక్రమణల లెక్కలను సీఎం రేవంత్ రెడ్డి సభ ముందుంచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శంషాబాద్ పరిధిలోని 5 ప్రధాన గ్రామాల్లో పేదలు, అసైన్డ్ రైతుల భూములను మైహోం సంస్థ బలవంతంగా లాక్కుందని ఆరోపించారు.

ఎయిర్‌పోర్టుకు ఆనుకుని ఉన్న అత్యంత ఖరీదైన ప్రాంతంలో ఏకంగా 2,463 ఎకరాల భూమిని ఒక్క సంస్థకే ఎలా కట్టబెడతారని విమర్శించారు. చట్టాల కళ్లుగప్పి, సీలింగ్ నిబంధనల నుంచి తప్పించుకోవడానికి ఈ మొత్తం భూములను 28 డొల్ల కంపెనీల పేరుతో రిజిస్ట్రేషన్ చేయించారని ఆధారాలతో సహా సీఎం వివరించారు.

Prashanth Neel-NTR: డ్రాగన్..ఫిబ్రవరి టార్గెట్ రీచ్ అవకపోతే..లెక్కలన్నీ మారిపోతాయ్!సినిమాSwechaa16 Sep 2026, 07:51 PM

Prashanth Neel-NTR: డ్రాగన్..ఫిబ్రవరి టార్గెట్ రీచ్ అవకపోతే..లెక్కలన్నీ మారిపోతాయ్!

Prashanth Neel: మాన్ ఆఫ్ మాసెస్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా దర్శకుడు ప్రశాంత్ నీల్ రూపొందిస్తున్న డ్రాగన్‌ సినిమాను 2027, జూన్ 11వ తేదీన రిలీజ్ చేయబోతున్నామని నిర్మాతలు ఇంతకముందే డేట్ ని కూడా ప్రకటించారు. ఈ మధ్యలోనే ఎన్టీఆర్ భుజానికి గాయం కావడంతో డ్రాగన్ షూటింగ్‌కు బ్రేక్ పడింది. ఈ నేపథ్యంలో రిలీజ్ డేట్ మారుతుందనే ప్రచారం మొదలైంది.

The Paradise-Nani-Risk: లైఫ్ లో మొదటిసారి పెద్ద రిస్క్ చేస్తున్న నాని!సినిమాSwechaa16 Sep 2026, 07:21 PM

The Paradise-Nani-Risk: లైఫ్ లో మొదటిసారి పెద్ద రిస్క్ చేస్తున్న నాని!

The Paradise: న్యాచురల్ స్టార్ నాని ఇప్పుడు జడల్ పాత్రలో బాక్సాఫీస్ వద్ద సత్తా చాటడానికి రెడీ అవుతున్నాడు. దసరా దర్శకుడు శ్రీకాంత్ ఓదెలతో నాని చేస్తున్న ఈ ప్రయోగం మీద భారీ అంచనాలున్నాయి. ఎంతో ప్రెస్టీజియస్ చిత్రంగా ‘ది ప్యారడైజ్’ తెరకెక్కుతుండగా, సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా విడుదలకి సిద్ధమవుతోంది. ఈ సినిమా కోసం ప్రేక్షకులు, అభిమానులు, సినీ వర్గాలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

సీజ్‌ చేసిన సత్యం రామలింగరాజు భూములు కేటీఆర్‌ భార్య పేరు మీదకు మార్చారు : సీఎం రేవంత్తెలంగాణSwechaa16 Sep 2026, 07:18 PM

సీజ్‌ చేసిన సత్యం రామలింగరాజు భూములు కేటీఆర్‌ భార్య పేరు మీదకు మార్చారు : సీఎం రేవంత్

CM Revanth Reddy: తెలంగాణ శాసనసభ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ అగ్రనేతలపై విరుచుకుపడ్డారు. నిషేధిత 22A భూముల అంశంపై అసెంబ్లీలో జరిగిన చర్చ సందర్భంగా, మాజీ మంత్రి కేటీఆర్ కుటుంబంపై సీఎం చేసిన ఆరోపణలు రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సత్యం స్కాంలో ప్రభుత్వం సీజ్ చేసిన విలువైన భూములను సైతం అధికార బలంతో కేటీఆర్ తన కుటుంబ సభ్యుల పేరిట బదలాయించుకున్నారని సభాముఖంగా రేవంత్ రెడ్డి ఆరోపించారు.ధరణి పోర్టల్‌ను అడ్డుపెట్టుకుని గత బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ కుటుంబం అడ్డగోలుగా భూ దోపిడీకి పాల్పడిందని రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇందులో భాగంగానే సత్యం రామలింగరాజు కుటుంబానికి చెందిన సంస్థల భూములను తమ ఖాతాలో వేసుకున్నారని ఆరోపించారు. సత్యం కంపెనీ వ్యవహారంలో గతంలో ప్రభుత్వ అధీనంలోకి వెళ్లిన భూములను నిబంధనలకు విరుద్ధంగా కేటీఆర్ బదిలీ చేసుకున్నారని అన్నారు. రామలింగరాజు కుటుంబానికి చెందిన ‘శతభిష ఆగ్రో ప్రైవేట్ లిమిటెడ్’ కంపెనీ భూములను ఆయన తన భార్య, అత్తమామల పేర్లపై రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని ఆరోపించారు.

కేసీఆర్ కుటుంబానికి వందల ఎకరాలు.. సీఎం రేవంత్ సంచలన వివరాలుతెలంగాణSwechaa16 Sep 2026, 06:32 PM

కేసీఆర్ కుటుంబానికి వందల ఎకరాలు.. సీఎం రేవంత్ సంచలన వివరాలు

KCR Family Lands: 22ఏ నిషేధిత భూముల అంశంపై అసెంబ్లీలో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి.. మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను, ఆయన కుటుంబాన్ని టార్గెట్ చేశారు. ఉద్యమం ముసుగులో కేసీఆర్, ఆయన కుటుంబం భూ దోపిడీకి పాల్పడిందని.. కేసీఆర్ కుటుంబానికి వందల ఎకరాల భూములు ఉన్నాయంటూ సంచలన ఆరోపణలు చేశారు. కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీశ్ రావు.. ఇలా ఒక్కొక్కరి పేరు చెబుతూ ఒక్కొక్కరు ఎన్ని ఎకరాల భూమి కలిగి ఉన్నారో అసెంబ్లీ వేదికగా చిట్టా విప్పారు రేవంత్ రెడ్డి.

22A Lands: ధరణి ఖర్చులు రూ.1,350 కోట్లకు ఎలా పెరిగింది : సీఎం రేవంత్తెలంగాణSwechaa16 Sep 2026, 06:06 PM

22A Lands: ధరణి ఖర్చులు రూ.1,350 కోట్లకు ఎలా పెరిగింది : సీఎం రేవంత్

22A Lands : తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తున్న 22A నిషేధిత భూముల వ్యవహారంపై శాసనసభ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యర్థులపై విరుచుకుపడ్డారు. గత బీఆర్‌ఎస్ పాలనలో తెరవెనుక సాగిన భారీ భూ దందాలను, ధరణి ముసుగులో జరిగిన అక్రమాలను ఎండగడుతూ అధికార పక్షం తరఫున గట్టి కౌంటర్ ఇచ్చారు. రాష్ట్రంలో కోటి ఎకరాలకు పైగా భూములు 22A (నిషేధిత జాబితా)లో ఉండటంపై విపక్షాలు చేస్తున్న విమర్శలకు సమాధానమిస్తూ.. అసలు ఆ కోటి ఎకరాల లెక్క ఏంటో అసెంబ్లీ సాక్షిగా బట్టబయలు చేశారు. "ఆ కోటి ఎకరాల భూమి నిషేధిత జాబితాలోనే ఉండాలి.. అందులోంచి ఒక్క ఇంచు భూమిని కూడా తొలగించే అధికారం ఏ ప్రభుత్వానికీ లేదు" అంటూ సంచలన కామెంట్స్ చేశారు.ప్రస్తుతం రాష్ట్రంలో మొత్తం కోటి 2 లక్షల ఎకరాల భూమి 22A నిషేధిత జాబితాలో ఉందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అయితే ఈ కోటి ఎకరాలను ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వమే నిషేధిత జాబితాలో పెట్టినట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ భూములన్నీ గత ప్రభుత్వ హయాంలోనే ఆ జాబితాలోకి వెళ్లాయని సీఎం సభలో వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన భూములకు సంబంధించిన అధికారిక లెక్కలను వెల్లడించారు.

అశ్విని అనుమానాస్పద మృతి ఘటనపై మానవ హక్కుల కమిషన్‌ స్పందనతెలంగాణSwechaa16 Sep 2026, 05:54 PM

అశ్విని అనుమానాస్పద మృతి ఘటనపై మానవ హక్కుల కమిషన్‌ స్పందన

రంగారెడ్డి జిల్లా ఫరూక్‌నగర్‌ మండలం కమ్మదనం గురుకులంలో ఇంటర్మీడియట్‌ విద్యార్థిని అశ్విని అనుమానాస్పద మృతి ఘటనపై తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ స్పందించింది. జాతీయ బీసీ దళ్‌ అధ్యక్షుడు, న్యాయవాది దుండ్ర కుమారస్వామి దాఖలు చేసిన ఫిర్యాదు ఆధారంగా హెచ్‌ఆర్‌ కేసు నం. 3641/2026లో రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌, జిల్లా మేజిస్ట్రేట్‌కు కమిషన్‌ నోటీసులు జారీ చేసింది. ఘటనకు సంబంధించిన సమగ్ర నివేదికను 2026 నవంబర్‌ 9లోగా సమర్పించాలని ఆదేశించింది.విద్యార్థిని మృతి ఘటనకు సంబంధించిన పరిస్థితులు, విద్యార్థుల భద్రత, సంస్థాగత బాధ్యతలపై సమగ్ర వివరాలను నివేదికలో పొందుపరచాల్సి ఉంది. ఫిర్యాదులో పేర్కొన్న అంశాల నేపథ్యంలో ఘటనకు ముందు, తరువాతి పరిస్థితులు, పర్యవేక్షణ, వైద్య సహాయం, సంబంధిత అధికారుల విధుల నిర్వహణ వంటి అంశాలపై వాస్తవాలను పరిశీలించాల్సిన అవసరం ఉంది.

నిషేధిత జాబితాలో ఉన్న భూములన్నీ బీఆర్‌ఎస్‌ హయాంలో పెట్టినవే : సీఎం రేవంత్తెలంగాణSwechaa16 Sep 2026, 05:29 PM

నిషేధిత జాబితాలో ఉన్న భూములన్నీ బీఆర్‌ఎస్‌ హయాంలో పెట్టినవే : సీఎం రేవంత్

CM Revanth Reddy : తెలంగాణ శాసనసభ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుటుంబ భూములపై విరుచుకుపడ్డారు. కేసీఆర్‌కు చెందిన ప్రతిష్టాత్మక ఎర్రవల్లి ఫామ్‌హౌస్ కేంద్రంగా సాగిన భూ బాగోతాన్ని బయటపెడుతూ అసెంబ్లీ సాక్షిగా బాంబు పేల్చారు. ఎర్రవల్లి ఫామ్‌హౌస్ పరిధిలో ఏకంగా 388 ఎకరాల ప్రభుత్వ, అసైన్డ్ భూమి అక్రమంగా కలిసిపోయిందని, దాదాపు 700 ఎకరాల విస్తీర్ణంలో ఈ వ్యవహారం నడుస్తోందని ఆరోపిస్తూ సభను నివ్వెరపరిచారు. ఆ భూమిని ప్రభుత్వం వెంటనే స్వాధీనం చేసుకుని, 800 మంది దళిత కుటుంబాలకు పట్టాల రూపంలో పంచిపెడతామని సంచలన అల్టిమేటం జారీ చేశారు.కేసీఆర్ ఫామ్‌హౌస్ ఉన్న ప్రాంతంలో జరిగిన భూ మార్పిడులపై రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. 1944 సర్వేల ప్రకారం ఎర్రవల్లి, షేర్ వెంకటాపూర్ గ్రామాల సరిహద్దుల్లోని భూముల వివాదాలను అనుకూలంగా మార్చుకున్నారని మండిపడ్డారు. ప్రస్తుతం రికార్డుల్లో కేసీఆర్ కుటుంబం పేరిట ఉన్నది 295 ఎకరాలు మాత్రమేనని స్పష్టం చేశారు. అయితే అదే ప్రాంతంలోని సర్వే నెంబర్ 325 పరిధిలో సుమారు 388 ఎకరాల ప్రభుత్వ అసైన్‌మెంట్ భూమి ఉందని ఆధారాలతో సహా సభ ముందుంచారు. 2017లో ధరణి ల్యాండ్ రికార్డుల ప్రక్షాళన ముసుగులో భారీగా మార్పులు చేసి, రికార్డులు లేని ఈ 388 ఎకరాల ప్రభుత్వ భూమితో కలిపి మొత్తంగా 700 ఎకరాలను తమ ఆధీనంలోకి తీసుకున్నారని ఆరోపించారు.

ఆ భూములను 22ఏ నుంచి తొలగిస్తాం- సీఎం రేవంత్ గుడ్‌న్యూస్ (22A Lands)తెలంగాణSwechaa16 Sep 2026, 05:27 PM

ఆ భూములను 22ఏ నుంచి తొలగిస్తాం- సీఎం రేవంత్ గుడ్‌న్యూస్ (22A Lands)

22A Lands: తెలంగాణలో తీవ్ర వివాదాస్పదంగా మారిన 22ఏ నిషేధిత భూముల అంశంపై అసెంబ్లీ వేదికగా కీలక ప్రకటన చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. 22ఏ భూముల సమస్యల పరిష్కారానికి హైపవర్‌ ఆఫీసర్స్‌ కమిటీ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. సమస్యల పరిష్కారానికి వారంలోపు సమగ్ర గైడ్‌లైన్స్‌ తీసుకొస్తామన్నారు. హెచ్‌ఎండీఏ, జీహెచ్‌ఎంసీ, డీటీసీపీ లేఔట్ల దరఖాస్తులు పరిశీలిస్తామని తెలిపారు. అలాగే పెండింగ్‌లో ఉన్న, కొత్తగా వచ్చే దరఖాస్తులను పరిష్కరిస్తామని వెల్లడించారు. సమస్యల పరిష్కారానికి వారంలోపు వ్యవస్థ తీసుకొస్తామని సీఎం రేవంత్ వెల్లడించారు. 22ఏ నిషేధిత భూముల అంశంపై అసెంబ్లీలో సీఎం రేవంత్ మాట్లాడారు.

Mahesh Babu-Bhansali: వారణాసి తర్వాత భన్సాలీతో మహేష్!సినిమాSwechaa16 Sep 2026, 03:51 PM

Mahesh Babu-Bhansali: వారణాసి తర్వాత భన్సాలీతో మహేష్!

Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు నేరుగా ఇప్పటి వరకూ బాలీవుడ్ డైరెక్టర్‌తో పనిచేసిన దాఖలాలు లేవు. దీనికి కారణం ఆయనే స్వయంగా నాకు హిందీ రాదని ఒప్పుకోవడంతో పాటు బాలీవుడ్‌లో స్ట్రైట్ సినిమా చేయడానికి కూడా హిందీ భాషే సమస్య అని చెప్పాడు. అయితే, తాజా సమాచారం మేరకు బాలీవుడ్ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీతో నెక్ట్ సినిమా చేస్తాడనే వార్త ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.

కేసీఆర్ ఫాంహౌస్ భూములపై విచారణకు సీఎం రేవంత్ ఆదేశంSwechaa16 Sep 2026, 03:42 PM

కేసీఆర్ ఫాంహౌస్ భూములపై విచారణకు సీఎం రేవంత్ ఆదేశం

సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫాంహౌస్ పై విచారణకు ఆదేశించారు. 30 రోజుల్లో విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని రెవెన్యూ శాఖ మంత్రి, రెవెన్యూ శాఖ యంత్రాంగాన్ని సీఎం రేవంత్ ఆదేశించారు. ఈ మేరకు అసెంబ్లీలో ప్రకటన చేశారు. శాసనసభలో 22ఏ నిషేధిత భూముల అంశంపై చర్చ జరిగింది.

''రెవెన్యూ శాఖకు, కలెక్టర్ కు ఆదేశాలు ఇస్తున్నా. తక్షణమే కేసీఆర్ కి నోటీసులు ఇవ్వండి. ఆయన కొనుగోలు చేసింది ఎంత? అక్కడ అందుబాటులో ఉన్న భూమి ఎంత? అక్కడ ప్రభుత్వానికి ఉండాల్సిన 388 ఎకరాల భూమి ఎవరి ఆధీనంలో ఉంది? 30 రోజుల వ్యవధిలో ఇది తేల్చాలి? రెవెన్యూ శాఖ మంత్రికి, రెవెన్యూ శాఖ అధికారులకు ఆదేశాలు ఇస్తున్నా'' అని సీఎం రేవంత్ అన్నారు.

కేసీఆర్ 700 ఎకరాల ఎర్రవెల్లి ఫామ్‌హౌస్‌ పై 30 రోజుల్లో విచారణ జరిపి నివేదిక ఇవ్వకపోతే అధికారులు, మంత్రులపై చర్యలు తీసుకుంటానని సీఎం రేవంత్ హెచ్చరించారు. క్షమించే సమస్యే లేదన్నారు. తెలంగాణ ఉద్యమకారుడిని అని చెప్పుకునే కేసీఆర్ వేల కోట్లు రూపాయల విలువ చేసే వందల ఎకరాలు ఎలా సంపాదించారు అని సీఎం రేవంత్ ప్రశ్నించారు. మొత్తం 9 జిల్లాల్లో 439.30 ఎకరాలు కేసీఆర్ కుటుంబసభ్యుల పేరుపై ఉందన్నారు. కేసీఆర్ కి నోటీసులిచ్చి ఆ 388 ఎకరాల భూములను 800 దళిత కుటుంబాలకు పట్టాల రూపంలో పంచుతానని అసెంబ్లీ వేదికగా సంచలన ప్రకటన చేశారు ముఖ్యమంత్రి రేవంత్.

Telugu States DebtCrisis: అప్పుల సునామీలో తెలుగు రాష్ట్రాలు.. భవిష్యత్తు దివాలా దిశగానేనా?తెలంగాణSwechaa16 Sep 2026, 03:41 PM

Telugu States DebtCrisis: అప్పుల సునామీలో తెలుగు రాష్ట్రాలు.. భవిష్యత్తు దివాలా దిశగానేనా?

Telugu States DebtCrisis: ప్రజా సంక్షేమం ముసుగులో రెండు తెలుగు రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థలు ఇప్పుడు ప్రమాదకరమైన అంచుకు చేరుకుంటున్నాయి. ఎన్నికల్లో గెలవడమే ఏకైక లక్ష్యంగా రాజకీయ పార్టీలు గుప్పిస్తున్న ఉచిత హామీలు, పథకాల అమలు ఇప్పుడు రాష్ట్ర ఖజానాలను కొల్లగొడుతున్నాయి. రాష్ట్రాల మొత్తం ఆదాయంలో ఏకంగా 62 శాతం కేవలం జీతాలు, పింఛన్లు, వడ్డీలు, ఉచిత పథకాలకే సరిపోతుండటం ఆర్థిక నిపుణులను నివ్వెరపరుస్తోంది. అప్పు తెచ్చి మరీ సంక్షేమం పంచడం అనే ప్రమాదకర విధానం ఇలాగే కొనసాగితే.. భవిష్యత్తులో పాలన సాగించడం కూడా అసాధ్యంగా మారి రాష్ట్రాలు ఆర్థిక వ్యవస్థ దివాలా తీసే పరిస్థితులు తప్పవన్న తీవ్ర హెచ్చరికలు వ్యక్తమవుతున్నాయి.రెండు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలు, పాలకులు మారుతున్నా అప్పుల వేగం మాత్రం తగ్గడం లేదు. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం మినహా, అప్పుల ఊబి నుంచి గట్టెక్కించే దీర్ఘకాలిక ప్రణాళికలు మాత్రం ఎక్కడ కనిపించడం లేదు.

భూములు కొల్లగొట్టేందుకే.. నిషేధిత జాబితా నుంచి తొలగించాలంటున్నారుతెలంగాణSwechaa16 Sep 2026, 03:20 PM

భూములు కొల్లగొట్టేందుకే.. నిషేధిత జాబితా నుంచి తొలగించాలంటున్నారు

Cm Revanth: 22ఏ నిషేధిత భూముల అంశంపై సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో సమాధానం ఇచ్చారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. గత ప్రభుత్వంలో ధరణితో భూదందాకు తెరలేపారని సీఎం రేవంత్ ఆరోపించారు. 2.50 కోట్ల ఎకరాల భూముల డేటా విదేశీ మాఫియా (కేమెన్ ఐల్యాండ్స్) చేతిలోకి వెళ్లిపోయిందని సంచలన ఆరోపణలు చేశారు.

పేదల గురించి మాట్లాడే హక్కు బీఆర్ఎస్ నేతలకు లేదన్నారు సీఎం రేవంత్. సభలో కేసీఆర్ కూర్చుంటే ఆయన ముందే అన్ని ఆధారాలు బయట పెడతామని చెప్పారు. వారు చేసిన అక్రమాలను బయటపెడతామనే బీఆర్ఎస్ సభ్యులు గందరగోళం సృష్టించి సభ నుంచి పారిపోయారని సీఎం రేవంత్ విమర్శించారు. కేసీఆర్ సభకు వస్తారని అనుకోవడం లేదన్నారు.

గెంటేసిన కొడుకు.. న్యాయం చేయాలని తల్లిదండ్రుల నిరసనతెలంగాణSwechaa16 Sep 2026, 03:01 PM

గెంటేసిన కొడుకు.. న్యాయం చేయాలని తల్లిదండ్రుల నిరసన

పున్నామా నరకం నుంచి రక్షించేవాడిని కొడుకు అంటారని నానుడి ఉంది.కానీ, నేడు ఆ తనయులే తల్లిదండ్రులను వీధుల్లోకి లాగుతున్నారు. ఆస్తిపాస్తుల కోసం, భార్య చెప్పిందని, సంతానం కోసం పేరెంట్స్‌ను నిర్లక్ష్యం చేస్తున్నారు.వారిని పట్టించుకోకుండా తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారు.డబ్బులు ఇవ్వడం లేదని, ఆస్తి పేరిట రాయడం లేదని వారిని దూషించడం, దాడులు చేయడం వంటివి చేస్తున్నారు. వారికి తిండి పెట్టకుండా నరకయాతనకు గురిచేస్తున్నారు. ఇలాంటి ఘటనలు ప్రస్తుత రోజుల్లో అనేకం వెలుగుచూస్తున్నాయి. తాజాగా ఇలాంటి ఘటనే మరొకటి వెలుగుచూసింది. కన్నకొడుకు ఇంటి నుండి గెంటివేశాడనని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్లెక్సీ ఏర్పాటు చేసి మరి తనయుడి ఇంటి ముందు ధర్నాకు దిగారు. ఈ ఘటన మియాపూర్‌లోని ఇంద్రారెడ్డి అల్విన్ కాలనీలో బుధవారం ఉదయం చోటుచేసుకుంది.

Balakrishna-Dada: 'దాదా'లో ఆ రెండు సినిమాల సెంటిమెంట్!సినిమాSwechaa16 Sep 2026, 02:53 PM

Balakrishna-Dada: 'దాదా'లో ఆ రెండు సినిమాల సెంటిమెంట్!

Balakrishna: గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ సినిమా దాదా. ఈ సినిమాకి గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్నాడు. కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇటీవల వచ్చిన టీజర్‌తో సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్దాయి. అదీకాక, ఇంతకముందు బాలకృష్ణ-గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో వచ్చిన వీర సింహారెడ్డి భారీ కమర్షియల్ సక్సెస్‌ను సాధించింది. ఆ ప్రభావం కూడా 'దాదా'పై ఉంది. ఇక, ఈ సినిమాలో యాక్షన్ సీక్వెన్స్ మాత్రమే కాదు ఫ్యామిలీ ఎమోషన్స్‌కి పెద్ద పీట వేసినట్టు తెలుస్తోంది.

రూల్ పెట్టి బ్రేక్ చేశారు..అందుకే సస్పెండ్ అయ్యారు : సీఎం రేవంత్ రెడ్డితెలంగాణSwechaa16 Sep 2026, 02:44 PM

రూల్ పెట్టి బ్రేక్ చేశారు..అందుకే సస్పెండ్ అయ్యారు : సీఎం రేవంత్ రెడ్డి

అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా బీఆర్ఎస్ సభ్యులపై సీఎం రేవంత్ విరుచుకుపడ్డారు. సభను తప్పుదోవ పట్టించాలని, ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావడానికే సెషన్స్ ప్రారంభం రోజున బీఆర్ఎస్ సభ్యులు గందరగోళం సృష్టించే ప్రయత్నం చేశారని సీఎం అన్నారు. గత బీఆర్ఎస్ హయాంలోని తప్పిదాలపై సభలో చర్చ జరుగుతుందని వారికి ముందే తెలుసునని, దీనికి తోడు ఇతర రాష్ట్రాలకు వెళ్లి క్షుద్రపూజలు చేసిన అంశంపైనా చర్చకు పట్టుబడతామని తెలిసే వికృత చేష్టలు చేశారని ధ్వజమెత్తారు.

పాకిస్థాన్‌కు వరంగా మారిన గాడిదలు.. చైనా పిచ్చి కలిసొచ్చిందా!?InternationalSwechaa16 Sep 2026, 02:42 PM

పాకిస్థాన్‌కు వరంగా మారిన గాడిదలు.. చైనా పిచ్చి కలిసొచ్చిందా!?

 చైనా నుంచి వస్తున్న విపరీతమైన గిరాకీ కారణంగా పాకిస్థాన్‌లో గాడిదల వ్యాపారం ఊపందుకుంది. గాడిద మాంసం, దాని చర్మంతో తయారు చేసే సంప్రదాయ ఔషధాల కోసం చైనా నుంచి భారీ డిమాండ్ ఉండటంతో పాకిస్థాన్ ఇప్పుడు వాటిని పెద్ద ఎత్తున ఎగుమతి చేస్తోంది. బలూచిస్థాన్ ప్రావిన్స్‌లోని గ్వాదర్ సమీపంలో ఏర్పాటు చేసిన ఒక భారీ స్లాటర్ హౌస్‌లో రోజూ వందల సంఖ్యలో గాడిదలను వధిస్తూ, వాటి మాంసం, చర్మాలను చైనాకు తరలిస్తున్నారు.

M.M.Keeravani: మ్యూజిక్ వర్క్‌లో వారణాసి..కీరవాణి అస్సలు రెస్ట్ తీసుకోవడం లేదా!సినిమాSwechaa16 Sep 2026, 02:19 PM

M.M.Keeravani: మ్యూజిక్ వర్క్‌లో వారణాసి..కీరవాణి అస్సలు రెస్ట్ తీసుకోవడం లేదా!

M.M.Keeravani: దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి సినిమా విషయంలో ఎంత ఖచ్చితంగా, పట్టుదలగా ఉంటారో చాలామందికి తెలియకపోవచ్చు. ఆయనతో వర్క్ చేస్తున్న టెక్నికల్ టీమ్ కి, నటీనటులకి మాత్రం గ్యారెంటీగా తెలుస్తుంది. కథ విషయంలో ఏమాత్రం మొహమాటపడకుండా తండ్రి విజయేంద్ర ప్రసాద్‌నే "నాన్నగారు నాకు ఈ సీన్ ఇలానే కావాలి" అని నిర్మొహమాటంగా చెప్పేరకం.

సింగరేణిలో సూపర్‌వైజర్ లైంగిక వేధింపులు.. విద్యార్థిని సూసైడ్!క్రైమ్Swechaa16 Sep 2026, 02:04 PM

సింగరేణిలో సూపర్‌వైజర్ లైంగిక వేధింపులు.. విద్యార్థిని సూసైడ్!

సింగరేణిలో సూపర్‌వైజర్ లైంగిక వేధింపుల కారణంగా ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడగా ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఆ అధికారితో పాటు మరో వ్యక్తి కూడా బాధితురాలిని వేధించినట్టు సమాచారం. వివరాల్లోకివెళితే..పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో డిప్లొమా పూర్తి చేసిన యువతి (21). ఈసెట్ ద్వారా ఉస్మానియాలో ఇంజినీరింగ్ సీటు సాధించింది.అనంతరం ఇంటర్న్‌షిప్ కోసం ఈ ఏడాది సింగరేణి సంస్థలో జాయిన్ అయ్యింది. ఈ క్రమంలోనే బొమ్మకంటి రవికుమార్ అనే ఓవర్‌మ్యాన్ (సూపర్‌వైజర్) ఆమెకు పరిచయం అయ్యాడు. తాను కూడా సేమ్ కాలేజీలో డిప్లొమా చేశానని నమ్మించి దగ్గరయ్యాడు. అనంతరం యువతిపై రవికుమార్ లైంగిక దాడికి పాల్పడినట్టు సమాచారం. ఇద్దరి వేధింపులు తాళలేక యువతి ఆత్మహత్యకు పాల్పడిగా.. బాధితురాలు రాసిన సూసైడ్ నోట్ లభ్యమైంది.

పాక్ బుద్ది మారదా? సముద్రంలో భారత నౌకను ఢీకొన్న పాకిస్థాన్‌ నావికాదళం!InternationalSwechaa16 Sep 2026, 01:51 PM

పాక్ బుద్ది మారదా? సముద్రంలో భారత నౌకను ఢీకొన్న పాకిస్థాన్‌ నావికాదళం!

అంతర్జాతీయ జలాల్లో పాకిస్థాన్ నావికాదళానికి చెందిన నౌక అత్యంత బాధ్యతారాహిత్యంగా వ్యవహరించి భారత నౌకాదళ నౌకను ఢీకొట్టిన ఘటన ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. సెప్టెంబరు 15న ఉత్తర అరేబియా సముద్రంలో సాధారణ నిఘా విధుల్లో ఉన్న భారత యుద్ధనౌకకు అతి సమీపంలోకి వచ్చిన పాక్ నౌక, ప్రమాదకర రీతిలో దిశ మార్చుకోవడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనపై భారత ప్రభుత్వం అత్యంత తీవ్రంగా స్పందిస్తూ, ఢిల్లీలోని పాకిస్థాన్ హైకమిషన్ ఛార్జ్ డి అఫైర్స్ సాద్ అహ్మద్ వారైచ్‌ను విదేశాంగ శాఖకు పిలిపించి కఠిన నిరసన వ్యక్తం చేసింది.

చాలా కష్టంగా ఉంది.. ఫ్యామిలీని పోషించుకోలేకపోతున్నా : ఐబొమ్మ రవితెలంగాణSwechaa16 Sep 2026, 01:41 PM

చాలా కష్టంగా ఉంది.. ఫ్యామిలీని పోషించుకోలేకపోతున్నా : ఐబొమ్మ రవి

కొత్తగా విడుదలైన సినిమాలను పైరసీగా మార్చి ‘ఐ బొమ్మ’(iBomma) వెబ్‌సైట్‌లో ప్రదర్శించడంతో పాటు జనాలను బెట్టింగ్ యాపుల వైపు అట్రాక్ట్ అయ్యేలా ప్రోత్సహించిన కేసులో ఐబొమ్మ రవి నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే. ఏపీ రాష్ట్రం విశాఖపట్టణంకు చెందిన రవి.. ఉన్నత చదువులు, ఉద్యోగం కోసం విదేశాలకు వెళ్లి అక్కడి నుంచి ఐ బొమ్మ సామ్రాజ్యాన్ని నడిపించాడు.సినిమాలను పైరసీ చేయడం ద్వారా వచ్చిన డబ్బుల కంటే బెట్టింగ్ యాప్స్‌ను ‘ఐ బొమ్మ’ సైట్లో ప్రమోట్ చేసినందుకు గాను రూ.వందల కోట్ల ఆస్తులు పొగేసుకున్నాడు. తాజాగా రవి నాంపల్లి కోర్టును ఆశ్రయించాడు. బ్యాంకు ఖాతాల్లోని డబ్బులు ఫ్రీజ్ అవ్వడంతో తన కుటుంబాన్ని పోషించుకోలేకపోతున్నాని పిటిషన్ వేసినట్టు సమాచారం. బ్యాంక్ అకౌంట్లు ఫ్రీజ్ అవ్వడంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని,కుటుంబ పోషణ, నిత్యావసరాలు, వైద్య ఖర్చులు కూడా భారంగా మారాయని, ఇతరుల మీద ఆధార పడాల్సివస్తోందని తన సమస్యలను కోర్టు దృష్టికి తీసుకెళ్లినట్టు సమాచారం.

ఆ ఇద్దరు కాంగ్రెస్‌ను మళ్లీ అధికారంలోకి తెస్తారు: మంత్రి శ్రీధర్ బాబుతెలంగాణSwechaa16 Sep 2026, 01:25 PM

ఆ ఇద్దరు కాంగ్రెస్‌ను మళ్లీ అధికారంలోకి తెస్తారు: మంత్రి శ్రీధర్ బాబు

తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్‌ల మధ్య అత్యుత్తమ పరిపాలనా, రాజకీయ సమన్వయం ఉందనడంలో ఎలాంటి సందేహం లేదని రాష్ట్ర శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. ప్రభుత్వ విజన్, పార్టీ నిర్మాణం ఒకే దిశలో వేగంగా పయనిస్తున్నాయని వెల్లడించారు. రాబోయే శాసనసభ ఎన్నికల్లో వీరిద్దరి సమర్థవంతమైన నాయకత్వంలోనే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో మళ్లీ ఘన విజయం సాధించి తిరిగి అధికారంలోకి రావడం ఖాయమని ఆయన తీవ్ర ధీమా వ్యక్తం చేశారు.