స్వేచ్ఛ షార్ట్స్ — తాజా తెలుగు వార్తలు

అసైన్డ్ భూమిని ఎలా రిజిస్ట్రేషన్ చేయించుకున్నావ్ హరీశ్ రావు : మంత్రి పొంగులేటితెలంగాణSwechaa16 Sep 2026, 01:18 PM

అసైన్డ్ భూమిని ఎలా రిజిస్ట్రేషన్ చేయించుకున్నావ్ హరీశ్ రావు : మంత్రి పొంగులేటి

రాష్ట్రంలో 22ఏపై విమర్శలు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో ఈ అంశం మీద అసెంబ్లీలో క్లారిటీ ఇచ్చేందుకు కాంగ్రెస్ సర్కార్ సిద్ధపడింది. ఈ క్రమంలోనే రెవెన్యూ, గృహ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి సభలో సభ్యులు అడిగే ప్రశ్నలకు సమాధానం ఇచ్చే ప్రయత్నం చేశారు. సెషన్స్ ప్రారంభానికి ముందు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అసెంబ్లీ లాబీలో మీడియాతో చిట్‌చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీశ్ రావుపై మంత్రి మరోసారి ఘాటు విమర్శలు చేశారు. గత ప్రభుత్వంలో హరీశ్‌రావు భారీ భూ దోపిడీకి పాల్పడ్డారని ఆరోపించారు. తన మామ భూములకు నాటి కాంగ్రెస్ ప్రభుత్వమే ఎన్ఓసీ ఇచ్చిందన్న మాజీ మంత్రి వ్యాఖ్యలకు మంత్రి పొంగులేటి కౌంటర్ ఇచ్చారు. అసైన్డ్ భూములకు ఏ ప్రభుత్వం అనుమతి ఇచ్చినా అది తప్పే అవుతుందని.. ఆ విషయం హరీశ్ రావుకు తెలియదా? అని ప్రశ్నించారు.

ట్యాంక్ బండ్‌పై నిమజ్జనం నిషేధం.. పోలీసుల కఠిన ఆంక్షలు!తెలంగాణSwechaa16 Sep 2026, 01:06 PM

ట్యాంక్ బండ్‌పై నిమజ్జనం నిషేధం.. పోలీసుల కఠిన ఆంక్షలు!

 హైదరాబాద్‌లోని ప్రముఖ అప్పర్ ట్యాంక్ బండ్ వెంబడి గణేష్ విగ్రహాల నిమజ్జనాన్ని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC), నగర పోలీసు విభాగం సంయుక్తంగా పూర్తిగా నిషేధించాయి. తెలంగాణ హైకోర్టు గతంలో జారీ చేసిన స్పష్టమైన మార్గదర్శకాలు, ఆదేశాల ప్రకారమే ఈ కఠిన నిర్ణయాన్ని అమలు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ మేరకు ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో హైదరాబాద్ పోలీస్ కమిషనర్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ల పేరిట హెచ్చరిక ఫ్లెక్సీలు, ప్రత్యేక బ్యానర్లను విస్తృతంగా ఏర్పాటు చేశారు.

లెక్కలు చెప్పి రాజీనామా చేస్తా :ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డితెలంగాణSwechaa16 Sep 2026, 12:50 PM

లెక్కలు చెప్పి రాజీనామా చేస్తా :ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డి

రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాలు ఉదయం ప్రారంభం అవ్వగా వాడివేడీగా నడుస్తున్నాయి. ప్రశ్నోత్తరాలకు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అనుమతి ఇవ్వడంతో సభ్యులు తమ నియోజకవర్గాలకు సంబంధించిన సమస్యలపై సభా వేదికగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఎన్నికలు ముగిసి రెండున్నరేండ్లు అయినా నియోజకవర్గాల్లో ఎలాంటి అభివృద్ధి పనులు జరగడం లేదని, నిధులు కేటాయిచడం లేదని, మంత్రులు పట్టించుకోవడం లేదని విపక్ష సభ్యులు ప్రశ్నించారు. ఈ క్రమంలోనే ఆర్మూర్ బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పరిగి, సీఎం సొంత నియోజకవర్గం కొండగల్‌కు వేల కోట్ల రూపాయల నిధులు ఇస్తున్నారని పేర్కొన్నారు. కానీ, తన సొంత నియోజకవర్గం ఆర్మూర్‌కు నిధులు ఇవ్వడం లేదని సభలో ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్మూరులో నిజాం కాలంలో కట్టిన ఎంఆర్వో ఆఫీస్ ఉందని, సబ్‌కలెక్టర్ ఆఫీస్‌లో మాత్రం క్లర్క్ కూర్చునే విధంగా సౌకర్యాలు ఉన్నాయని, ఇంటిగ్రేటెడ్ కార్యాలయం ఇవ్వాలని కోరారు.

ఎథిక్స్ కమిటీ కీలక నిర్ణయం.. పాడికౌశిక్ రెడ్డిపై వేటు!తెలంగాణSwechaa16 Sep 2026, 12:37 PM

ఎథిక్స్ కమిటీ కీలక నిర్ణయం.. పాడికౌశిక్ రెడ్డిపై వేటు!

హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి బిగ్‌షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ఆయన సభ్యత్వం రద్దు అవుతుందని జోరుగా ప్రచారం నడుస్తున్న వేళ ఎథిక్స్ కమిటీ ఆయనకు షాక్ ఇచ్చింది. గత అసెంబ్లీ సమావేశాల్లో ఆయన సభలో ప్రవర్తించిన తీరు, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కడియం శ్రీహరిని ఉద్దేశించి ఆయన వ్యాఖ్యలు, అసభ్యకర సైగలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన కమిటీ.. ఆయనపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని ఏకగ్రీవంగా తీర్మానించింది. సభా నిబంధనలను, శాసనసభ మర్యాదలను ఉల్లంఘించారన్న అభియోగాలపై విచారణ జరిపిన ఎథిక్స్ కమిటీ, హుజూరాబాద్ ఎమ్మెల్యే ప్రవర్తన సభ గౌరవాన్ని కించపరిచేలా ఉందని నిర్ధారణకు వచ్చింది. ఈ మేరకు వచ్చే శాసనసభ సమావేశాలు ప్రారంభమయ్యేలోపే ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై తగిన చర్యలు తీసుకోవాలని కమిటీ నిర్ణయించింది. దీంతో అసెంబ్లీ నిబంధనావళి ప్రకారం ఆయనపై వేటు పడేందుకు రంగం సిద్ధమైనట్టు సమాచారం.

ఇండియా సహా 5 దేశాలపై 100 శాతం టారిఫ్! : ట్రంప్ప్రపంచంSwechaa16 Sep 2026, 11:47 AM

ఇండియా సహా 5 దేశాలపై 100 శాతం టారిఫ్! : ట్రంప్

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి ప్రపంచదేశాలకు షాక్ ఇచ్చేందుకు రెడీ అయ్యారు. రష్యా నుంచి ముడి చమురు, గ్యాస్‌ను భారీగా దిగుమతి చేసుకుంటున్న ఇండియా సహా 5 ప్రధాన దేశాల నుంచి వచ్చే వస్తువులపై ఏకంగా 100 శాతం వరకు దిగుమతి సుంకాలను విధించేందుకు సిద్ధమయ్యారు. దానికి వీలు కల్పించే ఆంక్షల బిల్లును అమెరికా ప్రతినిధుల సభలో తుది ఓటింగ్‌కు సిద్ధం చేశారు. రష్యా,ఇరాన్‌లపై ఆర్థిక ఒత్తిడిని తీవ్రతరం చేసేలా రూపొందించిన ‘లిండ్సే గ్రాహం సాంక్షనింగ్ రష్యా అండ్ ఇరాన్ యాక్ట్ 2026’ బిల్లుకు ఇప్పటికే సెనేట్ ఆమోదం తెలపగా.. తాజాగా ప్రతినిధుల సభలో రూల్స్ కమిటీ పరిశీలన తర్వాత తుది ఆమోద ప్రక్రియకు మార్గం సుగమం అయ్యింది. ఉక్రెయిన్‌తో యుద్ధం జరుగుతున్న సమయంలో రష్యా.. ఇంధనాన్ని ఎగుమతి చేసి భారీగా నిధులు సమకూర్చుకుంటోంది. రష్యా నుంచి భారత్ భారీగా ముడిచమురును దిగుమతి చేసుకుంటున్న విషయం తెలిసిందే.

UPINews: బ్యాంకులకు మహర్దశ.. యూపీఐ చార్జీలతో రూ.20,000 కోట్ల లాభం!NationalSwechaa16 Sep 2026, 11:38 AM

UPINews: బ్యాంకులకు మహర్దశ.. యూపీఐ చార్జీలతో రూ.20,000 కోట్ల లాభం!

 దేశీయ డిజిటల్ చెల్లింపుల రంగాన్ని శాసిస్తున్న యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) సేవల్లో నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) సరికొత్త వాణిజ్య విధానానికి తెరలేపింది. మర్చంట్ డిస్కౌంట్ రేట్ (MDR) పునరుద్ధరణ నిర్ణయంతో దాదాపు ఆరేళ్ల ఉచిత విధానానికి తెరపడనుండగా, ఇది బ్యాంకులు, ఫిన్‌టెక్ సంస్థల రాబడిని ఊహించని రీతిలో పెంచనుంది. ఈ నూతన సంస్కరణ ద్వారా బ్యాంకులు, పేమెంట్ అగ్రిగేటర్లకు ప్రతి ఏటా రూ.20,000కోట్ల వరకు అదనపు ఆదాయం సమకూరే అవకాశం ఉందని అంతర్జాతీయ ఆర్థిక విశ్లేషక సంస్థలు అంచనా వేస్తున్నాయి.

గణనాథుని పూజలో వింత.. విగ్రహంపై ప్రత్యక్షమైన మూషికం.. ఆశ్చర్యంలో భక్తులు!వైరల్ న్యూస్Swechaa16 Sep 2026, 11:21 AM

గణనాథుని పూజలో వింత.. విగ్రహంపై ప్రత్యక్షమైన మూషికం.. ఆశ్చర్యంలో భక్తులు!

 అల్లూరి సీతారామరాజు జిల్లా సీలేరులోని ట్రైబల్ గర్ల్స్ స్కూల్‌లో వినాయక చవితి పూజా వేడుకల్లో ఓ వింత సంఘటన చోటుచేసుకుంది. పాఠశాల ఆవరణలో విద్యార్థినులు, ఉపాధ్యాయులు భక్తిశ్రద్ధలతో ప్రతిష్ఠించిన గణేశుడి మండపంలోకి హఠాత్తుగా ఒక ఎలుక ప్రవేశించింది. సాధారణంగా చిన్న అలికిడికే పరుగులు తీసే మూషికం అక్కడ ఉన్న మైకుల హోరు, విద్యార్థినుల భజనల కోలాహలం మధ్య కూడా ఏమాత్రం భయపడకుండా నేరుగా గణపతి విగ్రహం పాదాల వద్దకే చేరుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.

VIRAL: పానీపూరీలతో 13అడుగుల వినాయకుడు.. నెట్టింట వైరల్!వైరల్ న్యూస్Swechaa16 Sep 2026, 11:05 AM

VIRAL: పానీపూరీలతో 13అడుగుల వినాయకుడు.. నెట్టింట వైరల్!

 దేశవ్యాప్తంగా గణేష్ ఉత్సవాల సందడి అంబరాన్ని తాకుతోంది. ఏటా నవరాత్రుల సమయంలో భక్తులు తమ భక్తిశ్రద్ధలకు కళాత్మక ఆలోచనలను జోడించి విభిన్న ప్రతిమలను ప్రతిష్ఠించడం పరిపాటిగా మారింది. ఈ ఏడాది కూడా పలు ప్రాంతాల్లో కొలువుదీరిన వినూత్న గణనాథులు, ప్రత్యేక నైవేద్యాలు ప్రజలను విశేషంగా అలరిస్తూ నెట్టింట విస్తృతంగా ప్రచారమవుతున్నాయి. ముఖ్యంగా మహారాష్ట్రలోని పుణె నగరంలో రూపుదిద్దుకున్న 'పానీపూరీ గణేశుడు' ఈ ఉత్సవాల్లోనే ప్రత్యేక ఆకర్షణగా నిలిచి అందరి దృష్టినీ ఆకట్టుకుంటున్నాడు.

శ్రీవారి భక్తులకు శుభవార్త.. తిరుమలలో భారీగా తగ్గిన రద్దీఏపీSwechaa16 Sep 2026, 10:53 AM

శ్రీవారి భక్తులకు శుభవార్త.. తిరుమలలో భారీగా తగ్గిన రద్దీ

తిరుమల వెళ్లాలని ప్లాన్ చేసుకునే భక్తులకు శుభవార్త.. ఇన్నిరోజులు భక్తుల రద్దీతో కిటకిటలాడిన స్వామి వారి సన్నిధానంలో ప్రస్తుతం ఫ్రీగా దర్శనాలు జరుగుతున్నట్టు టీటీడీ పేర్కొంది.శ్రావణమాసంలో సర్వదర్శనానికి 24 గంటల సమయం పట్టగా.. ప్రస్తుతం 4 గంటలు మాత్రమే పడుతోందని టీటీడీ అధికారులు పేర్కొన్నారు. మెట్ల మార్గంలో కూడా భక్తుల రద్దీ తగ్గిందని వెల్లడించారు. దేశవ్యాప్తంగా వినాయక చవితి పండుగ వేడుకలు జరుగుతుండగా ప్రజలు తిరుమల ప్రయాణాలు పోస్టు పోన్ చేసుకున్నట్టు అధికారులు భావిస్తున్నారు. అందుకే రద్దీ తగ్గిందని చెబుతున్నారు. దీంతో ప్రస్తుతం వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 8 కంపార్ట్‌మెంట్లలో మాత్రమే భక్తులు వేచి ఉన్నారని తెలిపారు. ఎలాంటి దర్శన టోకెన్లు లేని సాధారణ భక్తులకు శ్రీవారి సర్వదర్శనం కేవలం 4 గంటల వ్యవధిలోనే పూర్తవుతుందని టీటీడీ తెలిపింది.

FBI పేరిట ‘ఎక్స్’ను మస్కా కొట్టించిన ఏపీ పోలీసులు.. చివరకు!ఏపీSwechaa16 Sep 2026, 10:37 AM

FBI పేరిట ‘ఎక్స్’ను మస్కా కొట్టించిన ఏపీ పోలీసులు.. చివరకు!

ప్రభుత్వాలు సరిగా పని చేయకుంటే నేరుగా స్పందించని కొందరు ఈ మధ్య సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నారు. ప్రభుత్వం వైఫల్యాలను తమ సోషల్ మీడియా వాల్ మీద రాసుకొస్తున్నారు. మరికొందరు అసహనం ఎక్కువై దూషణలు సైతం చేస్తున్నారు. దీంతో ప్రభుత్వాలు వారి మీద కఠినచర్యలు తీసుకుంటున్నాయి. ఒక వ్యక్తి చేసిన పోస్టును హైడ్ చేయడం అనేది అతని చేతిలోనే ఉంటుంది. లేదా రిమూవ్ చేసే అధికారం సదరు సోషల్ మీడియా సంస్థకు ఉంటుంది. దీంతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేస్తున్న పోస్టులను రిమూవ్ చేయాలని లేదా హైడ్ చేయాలని ఇటీవలి కాలంలో సైబర్ పోలీసులు సదరు సోషల్ మీడియా సంస్థలకు రిక్వెస్ట్‌లు పెడుతున్నారు. ఈ క్రమంలోనే ఏపీ పోలీసులు ‘ఎక్స్’సంస్థకు FBI పేరిట ఒక మెయిల్ పెట్టారు. పోస్టులు తొలగించాలని అందులో కోరగా.. ఎక్స్ ఈ విషయాన్ని పసిగట్టి విషయాన్ని బయటపెట్టింది.

45 ఏళ్ల కిందట చోరీ.. దొంగను పట్టించిన 80s ట్రెండ్వైరల్ న్యూస్Swechaa16 Sep 2026, 10:09 AM

45 ఏళ్ల కిందట చోరీ.. దొంగను పట్టించిన 80s ట్రెండ్

ఏఐ మానవాళికి ముప్పు తెస్తుందని ప్రపంచవ్యాప్తంగా ఉన్న సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.ఆ విషయం పక్కన పడితే ఏఐ మాత్రం పనిని చాలా సులభం చేస్తోంది. కేవలం టెక్నాలజీ, వర్క్ విషయంలోనే కాకుండా నేరాలను ఛేదించడంలో రేపటి రోజున పోలీసులకు ఆశా జ్యోతిగా మారనుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. భవిష్యత్‌లో ఫేస్ మాస్కులు ధరించి, క్యాప్స్ పెట్టుకుని తిరిగినా ఏఐ ఫేస్ రికగ్నిషన్ కెమెరాలు, బాడీ లాంగ్వేజ్ ఆధారంగా నిందితులను ఇట్టే పట్టేయచ్చని నిపుణులు చెబుతున్నారు. కాగా, 45 ఏళ్ల కింద జరిగిన చోరీలో పోలీసులు ఎలాంటి క్లూ కనుగొనలేకపోయారు. నాడు ఇంత టెక్నాలజీ లేకపోవడంతో సాధ్యం కాలేదు అనుకుందాం. తాజాగా 1980'S ట్రెండ్ తాజాగా ఆ దొంగను పట్టించింది. పోలీసులు విచారణ చేయగా.. నిందితురాలు దొంగతనం చేసినట్టు అంగీకరించడం గమనార్హం.

ఉమ్మడి పౌరస్మృతి టార్గెట్ 2029.. అసలు UCC అంటే ఏమిటి? విపక్షాల అభ్యంతరం ఎందుకు..?NationalSwechaa16 Sep 2026, 10:07 AM

ఉమ్మడి పౌరస్మృతి టార్గెట్ 2029.. అసలు UCC అంటే ఏమిటి? విపక్షాల అభ్యంతరం ఎందుకు..?

దేశంలోని పౌరులందరికీ మతంతో సంబంధం లేకుండా కొన్ని వ్యక్తిగత, కుటుంబ సంబంధిత పౌర వ్యవహారాల్లో ఒకే విధమైన చట్టాలు ఉండాలన్నదే ఉమ్మడి పౌరస్మృతి ఉద్దేశం. వివాహం, విడాకులు, వారసత్వం, దత్తత, కుటుంబ ఆస్తి వంటి అంశాల్లో ఒకే రకమైన చట్టపరమైన నిబంధనలు ఉండేలా చేయడం UCCలో ప్రధాన అంశం.

HouthiDroneAttack: మక్కాపై డ్రోన్ దాడికి యత్నం.. ఇస్లామిక్ దేశాల్లో అలజడి!InternationalSwechaa16 Sep 2026, 09:59 AM

HouthiDroneAttack: మక్కాపై డ్రోన్ దాడికి యత్నం.. ఇస్లామిక్ దేశాల్లో అలజడి!

సౌదీ అరేబియాలోని అత్యంత పవిత్రమైన మక్కా నగరాన్ని లక్ష్యంగా చేసుకుని యెమెన్‌లోని హౌతీ తిరుగుబాటుదారులు ప్రయోగించిన డ్రోన్‌ను సౌదీ నేతృత్వంలోని కూటమి బలగాలు విజయవంతంగా అడ్డుకుని నాశనం చేశాయి. మంగళవారం సాయంత్రం మక్కా ఆకాశంలోకి ప్రవేశించే ముందే సౌదీ అరేబియా రాయల్ ఎయిర్ డిఫెన్స్ ఫోర్స్ ఈ డ్రోన్‌ను గాలిలోనే పేల్చివేసింది. ఈ దాడి యత్నం మక్కా నగర భద్రతకు తీవ్ర ముప్పు కలిగించేలా ఉందంటూ సౌదీ నేతృత్వంలోని కూటమి ప్రతినిధి తుర్కి అల్-మాలికీ తీవ్రంగా ఖండించారు.

నిరుద్యోగులకు శుభవార్త.. పోలీసుశాఖలో ఖాళీల భార్తీకి నోటిఫికేషన్ఏపీSwechaa16 Sep 2026, 09:48 AM

నిరుద్యోగులకు శుభవార్త.. పోలీసుశాఖలో ఖాళీల భార్తీకి నోటిఫికేషన్

రాష్ట్రంలోని నిరుద్యోగ యువతీయువకులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. చాలా కాలంగా ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తున్న వారికి తీపికబురు అందించింది. పోలీసు, అగ్నిమాపక, జైళ్లు, ఫోరెన్సిక్ తదితర విభాగాల్లో ఖాళీగా ఉన్న మొత్తం 2,050 ఖాళీల భర్తీకి ఏపీ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు శ్రీకారం చుట్టింది. 2026 జాబ్ క్యాలెండర్‌లోని మార్గదర్శకాలకు అనుగుణంగా నోటిఫికేషన్లు జారీ చేసింది. పోస్టుల వారీగా చూసుకుంటే 438 ఎస్‌ఐ పోస్టులు ఉండగా.. సివిల్ విభాగంలో 253, ఆర్మ్‌డ్ రిజర్వ్‌లో 116, కమ్యూనికేషన్స్‌లో 50, పోలీస్ ట్రాన్స్‌పోర్ట్ ఆర్గనైజేషన్‌లో 10, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్‌లో 9 ఖాళీలు ఉన్నాయి. 1,156 కానిస్టేబుల్ ఉద్యోగాలకు సైతం నోటిఫికేషన్ విడుదల చేసింది.అందులో సివిల్ కానిస్టేబుల్స్ 542, ఏఆర్ కానిస్టేబుల్స్ 285 పోస్టులు ఉన్నాయి.

UPI charges: యూపీఐ చార్జీల మోత.. ఎన్‌పీసీఐ కీలక ప్రకటన!NationalSwechaa16 Sep 2026, 09:19 AM

UPI charges: యూపీఐ చార్జీల మోత.. ఎన్‌పీసీఐ కీలక ప్రకటన!

 దేశవ్యాప్తంగా డిజిటల్ చెల్లింపుల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) లావాదేవీలపై నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) కీలక ప్రకటన చేసింది. యూపీఐ వ్యవస్థను దీర్ఘకాలికంగా బలోపేతం చేసే లక్ష్యంతో ఎంపిక చేసిన లావాదేవీలకు 'మర్చంట్ డిస్కౌంట్ రేట్' (MDR) ఫ్రేమ్‌వర్క్‌ను ప్రవేశపెట్టింది. ఈ కొత్త నిబంధనలు అక్టోబర్ 15 నుంచి అమల్లోకి రానున్నాయి. అయితే, ఈ మార్పుల వల్ల సాధారణ వినియోగదారులపై ఎలాంటి భారం పడదని, యూపీఐ సేవలు వారికి ఎప్పటిలాగే పూర్తిగా ఉచితంగానే కొనసాగుతాయని ఎన్‌పీసీఐ స్పష్టం చేసింది.

కాంగ్రెస్ పథకాలను ట్రంప్ కాపీ కొడుతున్నాడు.. డీకే శివకుమార్ వ్యాఖ్యలు వైరల్!NationalSwechaa16 Sep 2026, 09:18 AM

కాంగ్రెస్ పథకాలను ట్రంప్ కాపీ కొడుతున్నాడు.. డీకే శివకుమార్ వ్యాఖ్యలు వైరల్!

అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఎన్నికల హామీలపై కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బెంగళూరులోని KPCC (కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ) ఆఫీస్ – 'భారత్ జోడో భవన్' లో ఇటీవల నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజాసంక్షేమ పథకాలను చూసి ప్రపంచ దేశాలు నేర్చుకుంటున్నాయని, చివరికి అమెరికా అధ్యక్షుడు కాబోయే ట్రంప్ కూడా కాంగ్రెస్ పథకాలనే కాపీ కొడుతున్నారని విమర్శించారు.

కాంగ్రెస్‌లో రాహుల్ కొత్త టీమ్ గేమ్! ఇప్పటి నుంచే గ్రౌండ్‌లోకి దిగుతున్నారా?NationalSwechaa15 Sep 2026, 11:54 PM

కాంగ్రెస్‌లో రాహుల్ కొత్త టీమ్ గేమ్! ఇప్పటి నుంచే గ్రౌండ్‌లోకి దిగుతున్నారా?

ఇప్పటి వరకు కాంగ్రెస్‌లో ఒక సమస్య తరచూ కనిపించింది. ఎన్నికల సమయంలో ఒక్కసారిగా యాక్టివేట్‌ అయ్యే నాయకత్వం.. ఎన్నికలు ముగిసిన తర్వాత మళ్లీ ఢిల్లీ కేంద్రంగా మారిపోవడం. రాహుల్‌ గాంధీ ఇప్పుడు ఆ పద్ధతిని మార్చాలనుకుంటున్నారా?

యూకే బ్రేకప్‌..! రవి అస్తమించని బ్రిటన్‌లో ఏం జరుగుతోంది..?InternationalSwechaa15 Sep 2026, 11:23 PM

యూకే బ్రేకప్‌..! రవి అస్తమించని బ్రిటన్‌లో ఏం జరుగుతోంది..?

ఒకప్పుడు రవి అస్తమించని సామ్రాజ్యంగా ప్రపంచాన్ని శాసించిన బ్రిటన్‌.. ఇప్పుడు తనలోని యూనియన్‌ను కాపాడుకోవాల్సిన పరిస్థితిని ఎదుర్కొంటోందా? వందల ఏళ్ల క్రితం రాజకీయ, ఆర్థిక, భద్రతా ప్రయోజనాలతో ఒక్కటైన బ్రిటన్‌లో ఇప్పుడు మళ్లీ విడిపోవాలనే స్వరాలు ఎందుకు బలపడుతున్నాయి..?

The Paradise-Keerthy: టాలీవుడ్ లో సరికొత్త రికార్డ్..ఏషనాగుల సాంగ్‌కి 100 మిలియన్ల వ్యూస్సినిమాSwechaa15 Sep 2026, 10:56 PM

The Paradise-Keerthy: టాలీవుడ్ లో సరికొత్త రికార్డ్..ఏషనాగుల సాంగ్‌కి 100 మిలియన్ల వ్యూస్

The Paradise: నేచురల్ స్టార్ నటించిన ది ప్యారడైజ్ సాంగ్ టాలీవుడ్‌లోనే అత్యంత వేగంగా 100 మిలియన్స్ వ్యూస్ రాబట్టి సరికొత్త రికార్డ్ సృష్ఠించింది. ఎప్పుడు కూడా తెలంగాణ జానపదాలకి ఎంతో ఆదరణ లభిస్తుంది. అందుకే, గత కొంత కాలంగా తెలంగాణ సంసృతిని ప్రతిబింబించేలా సినిమాలలో పాటలను పెడుతున్నారు. ఈ క్రమంలోనే నాని హీరోగా నటించిన ది ప్యారడైజ్ సినిమాలో ఏషనాగుల ఫోక్ సాంగ్ కి విపరీతమైన ఆదరణ దక్కుతోంది.

రేపటి నుంచి మళ్లీ అసెంబ్లీ సమావేశాలు.. 22ఏ కీలక చర్చ..! (22A)Swechaa15 Sep 2026, 10:29 PM

రేపటి నుంచి మళ్లీ అసెంబ్లీ సమావేశాలు.. 22ఏ కీలక చర్చ..! (22A)

తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు రేపటి నుంచి మళ్లీ మొదలు కానున్నాయి. 3 రోజుల వరుస సెలవుల తర్వాత బుధవారం ఉదయం 10 గంటలకు సభ మొదలు కానుంది. ఈ మేరకు అసెంబ్లీ కార్యదర్శి రెండ్ల తిరుపతి ఓ ప్రకటనలో తెలిపారు. ప్రశ్నోత్తరాల సమయంలో స్టార్ గుర్తు ఉన్న ప్రశ్నలు, ఆపై షార్ట్ డిస్కషన్‌లో రిజిష్ట్రేషన్ చట్టంలోని సెక్షన్ 22ఏ పై చర్చ కొనసాగనుంది. రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలపై ప్రభావం చూపిన ఎల్‌నినోపై, ప్రభుత్వం తీసుకున్న చర్యలపై చర్చ ఉంటుందని అసెంబ్లీ కార్యదర్శి రెండ్ల తిరుపతి తెలిపారు.

కాగా, బుధవారం అసెంబ్లీలో 22A పై చర్చించాల్సిన అంశాలపై సీఎం రేవంత్ జూబ్లీహిల్స్‌లోని MCRHRDలో ఉన్నతాధికారులతో సమీక్షించారు. 22A జాబితాపై సీఎం రేవంత్‌కు రెవెన్యూ శాఖ అధికారులు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. ఈ సమీక్షలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, వివేక్, సీఎస్ సంజయ్ జాజుతోపాటు రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు. బుధవారం అసెంబ్లీలో 22ఏ, ఎల్ నినోపై చర్చ సందర్భంగా అనుసరించాల్సిన వ్యూహం గురించి చర్చించినట్లు సమాచారం.

ఎమ్మెల్యే దానం నాగేందర్‌ అనర్హతపై రేపే హైకోర్టు నిర్ణయంSwechaa15 Sep 2026, 09:30 PM

ఎమ్మెల్యే దానం నాగేందర్‌ అనర్హతపై రేపే హైకోర్టు నిర్ణయం

Danam Nagender: ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ అనర్హతపై రేపు హైకోర్టు నిర్ణయం ప్రకటించనుంది. రేపు మధ్యాహ్నం 3.45 గంటలకు తీర్పు వెల్లడించనుంది హైకోర్టు డివిజన్‌ బెంచ్‌. దానం నాగేందర్‌పై ఎమ్మెల్యేగా అనర్హత వేటు వేయాలని పాడి కౌశిక్‌రెడ్డి, మహేశ్వర్‌రెడ్డిలు వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపింది న్యాయస్థానం. ఇరువైపులా వాదనలు విన్న న్యాయస్థానంలో గత నెలలో తీర్పును రిజర్వ్‌ చేసింది.

రాజకీయాల నుంచి తప్పుకుంటా-మంత్రి పొంగులేటికి ఎమ్మెల్యే సంచలన సవాల్తెలంగాణSwechaa15 Sep 2026, 09:22 PM

రాజకీయాల నుంచి తప్పుకుంటా-మంత్రి పొంగులేటికి ఎమ్మెల్యే సంచలన సవాల్

Madhavaram Krishna Rao: రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అసెంబ్లీలో తనపై చేసిన వ్యాఖ్యలపై కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తీవ్రంగా స్పందించారు. సభను తప్పుదోవ పట్టించారు అంటూ మంత్రి పొంగులేటిపై ఆయన మండిపడ్డారు. హైదర్‌నగర్‌ భూముల రిజిస్ట్రేషన్ల అంశంలో తాను చెప్పేది అబద్ధమని నిరూపిస్తే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని సంచలన సవాల్ విసిరారు.

UPI చెల్లింపులపై ఛార్జీలు ఖరారు.. ఎంత పేమెంట్ చేస్తే ఎంత ఛార్జీ... (UPI MDR)వ్యాపారంSwechaa15 Sep 2026, 08:55 PM

UPI చెల్లింపులపై ఛార్జీలు ఖరారు.. ఎంత పేమెంట్ చేస్తే ఎంత ఛార్జీ... (UPI MDR)

UPI ద్వారా పెద్ద మొత్తంలో చెల్లింపులు చేసే వారికి బిగ్ అలర్ట్. రూ.2వేలకు మించిన మర్చంట్ UPI చెల్లింపులపై 0.4 శాతం ఛార్జీ విధించే కొత్త విధానాన్ని NPCI ప్రకటించింది. ఈ కొత్త నిబంధన అక్టోబర్ 15 నుంచి అమల్లోకి రానుంది. అయితే ప్రతి UPI లావాదేవీపై వినియోగదారుడి ఖాతా నుంచి నేరుగా ఛార్జీ కట్ అవుతుందని దీని అర్థం కాదు.

కొత్త విధానం ప్రకారం రూ.2వేలకు మించిన మర్చంట్ చెల్లింపులపై 0.4 శాతం ఛార్జీ ఉంటుంది. ఈ లెక్కన రూ.5వేల చెల్లింపుపై రూ.20, రూ.10,000 చెల్లింపుపై రూ.40 ఛార్జీగా లెక్కించబడుతుంది. అయితే ఈ ఛార్జీ ప్రధానంగా మర్చంట్ లావాదేవీలకు (వ్యాపారులకు చేసే పేమెంట్స్) సంబంధించినది. ఒక వ్యక్తి నుంచి మరో వ్యక్తికి చేసే P2P UPI బదిలీలను ఈ ఛార్జీ పరిధిలోకి తీసుకురాలేదు.

పోలీసులతో కేటీఆర్ స్టాఫ్ దురుసు ప్రవర్తన-వీడియో రిలీజ్ చేసిన మహేశ్ కుమార్ గౌడ్తెలంగాణSwechaa15 Sep 2026, 08:36 PM

పోలీసులతో కేటీఆర్ స్టాఫ్ దురుసు ప్రవర్తన-వీడియో రిలీజ్ చేసిన మహేశ్ కుమార్ గౌడ్

Mahesh Kumar Goud: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్టాఫ్ తీరుపై టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ తీవ్రంగా మండిపడ్డారు. అధికారం పోయినా అహంకారం పోలేదా అంటూ బీఆర్ఎస్ నేతలపై ఆయన ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ నేతలతో పాటు కేటీఆర్ స్టాఫ్ సైతం రెచ్చిపోయారని ధ్వజమెత్తారు. విధుల్లో ఉన్న పోలీసులతో కేటీఆర్ సిబ్బంది వ్యవహరించిన తీరుకు సంబంధించి మహేశ్ కుమార్ గౌడ్ ఒక వీడియోను తన సోషల్ మీడియాలో షేర్ చేశారు. కేటీఆర్ స్టాఫ్ పోలీసులతో దురుసుగా ప్రవర్తించడం, వారిని రాయలేని భాషలో బూతులు తిట్టడం అందులో ఉంది. దీనిపై మహేశ్ కుమార్ గౌడ్ తీవ్రంగా స్పందించారు.

Anu Emmanuel: కాలం కలిసిరాక ఇండస్ట్రీ వదిలేసిందా?సినిమాSwechaa15 Sep 2026, 07:56 PM

Anu Emmanuel: కాలం కలిసిరాక ఇండస్ట్రీ వదిలేసిందా?

Anu Emmanuel: సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్స్ సందడి చేసేది అతి కొద్ది కాలమే. 10 మందిలో ఇద్దరో ముగ్గురో ఓ పదేళ్ల పాటు ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. ఇక్కడ స్టార్ హీరోయిన్‌గా వెలగాలంటే అవకాశాలు వస్తే సరిపోదు. కాలం కూడా కలిసి రావాలి. అప్పుడే కొంతకాలం నిలబడతారు. లేదంటే గ్లామర్ బ్యూటీ అను ఇమ్మాన్యుయేల్ మాదిరిగా దేశం వదిలి వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఇప్పుడు, ఈ బ్యూటీ సినిమా అవకాశాలు రాక ఇండస్ట్రీ వదిలేసిందని టాక్ వినిపిస్తోంది.

Prashanth Neel: 418 మళ్ళీ వాయిదా..ఇన్నిసార్లంటే ఫ్లాపేమో?సినిమాSwechaa15 Sep 2026, 07:46 PM

Prashanth Neel: 418 మళ్ళీ వాయిదా..ఇన్నిసార్లంటే ఫ్లాపేమో?

Prashanth Neel: ఒక సినిమా పదే పదే వాయిదా పడుతుంటే ప్రేక్షకులోనే కాదు సినీ వర్గాలలోనూ ఆసక్తి తగ్గిపోవడం సహజం. సినిమాలో ఎంత పెద్ద స్టార్స్ ఉన్నా..టెక్నికల్‌గా ఎలాంటి స్ట్రాంగ్ టీమ్ ఉన్నా బిజినెస్ పరంగా కూడా అంచనాలన్నీ తారుమారవడం కామన్. కాస్తో కూస్తో వచ్చిన హైప్ కూడా తగ్గిపోతుంది. ఇప్పుడు, 418 మూవీ పరిస్థితి కూడా ఇలాగే ఉంది. సెప్టెంబర్ 18 రిలీజ్ కావాల్సిన మూవీ మళ్ళీ వాయిదా పడింది.

హైదరాబాద్‌కు నాలుగు కొత్త బస్ టెర్మినల్స్.. ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టే మాస్టర్ ప్లాన్!..తెలంగాణSwechaa15 Sep 2026, 06:59 PM

హైదరాబాద్‌కు నాలుగు కొత్త బస్ టెర్మినల్స్.. ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టే మాస్టర్ ప్లాన్!..

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నగరంలో ట్రాఫిక్ ఇబ్బందులను తగ్గించడానికి మరియు రవాణా వ్యవస్థను మెరుగుపరచడానికి సిటీ నలువైపులా నాలుగు కొత్త ఆధునిక బస్ టెర్మినల్స్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అందులో భాగంగా హైదరాబాద్ పరిధిలో నాలుగు కొత్త బస్ టెర్మినల్స్ ఏర్పాటుకు డిసైడ్ అయింది. ఉత్తర తెలంగాణ, మహారాష్ట్ర వైపు వెళ్లే బస్సుల కోసం సుమారు 100 ఎకరాల్లో భారీ ఇంటర్నేషనల్ బస్ టెర్మినల్ ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి.

Devi Sri Prasad-King 100: ఎప్పుడు ఆకాశానికి ఎత్తుతారో ఎప్పుడు పాతాళానికి తొక్కుతారో!సినిమాSwechaa15 Sep 2026, 06:48 PM

Devi Sri Prasad-King 100: ఎప్పుడు ఆకాశానికి ఎత్తుతారో ఎప్పుడు పాతాళానికి తొక్కుతారో!

Devi Sri Prasad: సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు ఆకాశానికి ఎత్తుతారో ఎప్పుడు పాతాళానికి తొక్కుతారో ఎవరూ ఊహించలేరు. సఖ్యత ఉన్నంతవరకూ బాగానే ఉంటుంది. చిన్న తేడా వస్తే మాత్రం బలమైన బంధం మధ్య కూడా పగుళ్ళు ఏర్పడతాయి. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పుడు దేవి శ్రీ ప్రసాద్ పరిస్థితి అలాగే ఉందనిపిస్తోంది. పుష్ప ఫ్రాంఛైజీస్ తర్వాత తెలుగులో చాలా వరకూ అవకాశాలు తగ్గిపోయాయి. దీనికి, కారణాలు చాలానే ఉన్నాయి.

హైదరాబాద్ వాటర్‌పై సంచలన నివేదిక!!..తెలంగాణSwechaa15 Sep 2026, 06:16 PM

హైదరాబాద్ వాటర్‌పై సంచలన నివేదిక!!..

హైదరాబాద్ లో భూగర్భ జలాలు అడుగంటిపోయి ఈ ఏడాది వేసవిలో హైదరాబాద్ వాసులు తీవ్ర ఇబ్బందులు పడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అయితే అసలే అంతంత మాత్రం ఉన్న నీటిలో ఇప్పుడు ప్రమాదకర విష వాయువులు ఉన్నట్లు పలు నివేదికలు చెబుతున్నాయి. ఆ నీటిలో ప్రమాదకరంగా నైట్రేట్, ఫ్లోరైడ్ స్థాయిలు పెరిగినట్లు పలు కథనాలు వెల్లడిస్తున్నాయి. హైదరాబాద్ భూగర్భ జలాల్లో ఈ విష వాయువులు పెరగడం కారణంగా ముఖ్యంగా పిల్లల్లో అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రక్త సంబంధిత వ్యాధులు, బర్త్ డిఫెక్ట్స్, ఎముకల బలం తగ్గిపోవడం లాంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని చెబుతున్నారు.

Srikanth Odela-The Paradise: ప్యారడైజ్ సినిమాతో చాలా నేర్చున్నా..సినిమాSwechaa15 Sep 2026, 06:16 PM

Srikanth Odela-The Paradise: ప్యారడైజ్ సినిమాతో చాలా నేర్చున్నా..

Srikanth Odela: ఇండస్ట్రీకి కొత్త దర్శకులు వస్తున్నారంటే ఇప్పుడు కేవలం సినిమా తీయడం ఒక్కటొస్తే సరిపోదు. కథను జనాలకి అర్థమయ్యేలా ఎలా చెప్పాలి..హీరో ఇమేజ్‌కి తగ్గట్టు ఎలాంటి కథ రాయాలి..దాన్ని స్క్రీన్ మీద ఎలా ప్రజెంట్ చెయ్యాలి..ఏ ఏ అంశాలను జోడిస్తే బిజినెస్ జరుగుతుంది..ఇలాంటి చాలా ఉంటాయి. కానీ, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల మాత్రం మొదటి సినిమాకి ఇవేవీ తెలియకుండా డైరెక్షన్ చేశాడు.