స్వేచ్ఛ షార్ట్స్ — తాజా తెలుగు వార్తలు

కేసీఆర్ ఫామ్‌హౌస్ వద్ద శుద్ధి వివాదం.. పోలీసులకు హైకోర్టు కీలక ఆదేశాలుతెలంగాణSwechaa15 Sep 2026, 06:14 PM

కేసీఆర్ ఫామ్‌హౌస్ వద్ద శుద్ధి వివాదం.. పోలీసులకు హైకోర్టు కీలక ఆదేశాలు

High Court: తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ఫామ్‌హౌస్ దగ్గర శుద్ధి వివాదంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ వ్యవహారంలో రేవంత్ సర్కార్ కి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో నిందితులను వెంటనే అరెస్ట్ చేయొద్దని న్యాయస్థానం ఆదేశించింది. కేవలం నోటీసులు ఇచ్చి దర్యాఫ్తు చేయాలని తేల్చి చెప్పింది.

ఏడు సంవత్సరాలలోపు శిక్ష పడే సెక్షన్ల కింద ఉన్న కేసుల్లో నిందితులను ఎలా అరెస్ట్ చేస్తారని కోర్టు ప్రశ్నించింది. సుప్రీంకోర్టు మార్గదర్శకాల్లో అరెస్ట్ చేయొద్దని స్పష్టంగా ఉన్నా.. వాటిని కాదని ఎలా అరెస్ట్ చేస్తారంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది ధర్మాసనం. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించరాదని పోలీసులను హెచ్చరించింది. కేసీఆర్ ఫామ్ హౌస్ వద్ద శుద్ధి వ్యవహారంపై హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలైంది. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది.

నానక్‌రామ్‌గూడలో భూవివాదం.. అల్లు అర్జున్ మామపై కేసు నమోదు!?..తెలంగాణSwechaa15 Sep 2026, 05:39 PM

నానక్‌రామ్‌గూడలో భూవివాదం.. అల్లు అర్జున్ మామపై కేసు నమోదు!?..

హైదరాబాద్‌ ఐటీ కారిడార్‌లో మరో భూవివాదం ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. నానక్‌రామ్‌గూడలోని ప్రతిష్టాత్మక మంత్రీ కాస్మోస్ ప్రాంగణం చుట్టూ తలెత్తిన వివాదం.. పోలీస్ స్టేషన్‌ వరకు వెళ్లింది. ఈ వ్యవహారంలో సినీ హీరో అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డితో పాటు మురళీధర్ రెడ్డి, గడ్డం రవి తదితరుల పేర్లు ఫిర్యాదులో ప్రస్తావనకు రావడం మరింత ఆసక్తిని రేపుతోంది.

Kamareddy: కామారెడ్డి జిల్లాలో కలకలం.. రూ.15లక్షల విలువైన ప్రభుత్వ మందులు రోడ్డుపాలుSwechaa15 Sep 2026, 05:20 PM

Kamareddy: కామారెడ్డి జిల్లాలో కలకలం.. రూ.15లక్షల విలువైన ప్రభుత్వ మందులు రోడ్డుపాలు

Kamareddy: కామారెడ్డి జిల్లాలో కలకలం రేగింది. ప్రభుత్వ ఆసుపత్రులకు చేరాల్సిన మందులు రోడ్డు పాలయ్యాయి. గడువు ఉన్న మెడిసిన్‌ను ఓ మినీ డీసీఎం వ్యానులో తరలించి రోడ్డు పక్కన పారబోస్తున్నారు. ఇవి ప్రభుత్వ ఆసుపత్రుల కోసం ప్రభుత్వం సరఫరా చేసే మెడిసిన్స్. కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండలం రామేశ్వర్‌పల్లి గ్రామ శివారులో జాతీయ రహదారి 44 పక్కన ఈ ఘటన జరిగింది.

సుమారు 15 లక్షల విలువైన ప్రభుత్వ ఆసుపత్రులకు సరఫరా చేయాల్సిన మెడిసిన్స్‌ను ఇలా రోడ్డు పక్కన పారబోయడం సంచలనంగా మారింది. సమాచారం అందుకున్న వైద్యాధికారులు అక్కడికి చేరుకున్నారు. డీసీఎంలో ఉన్న మందులను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోలీసులకు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన బిక్కనూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్నారు. మెడిసిన్స్ పారబోసిన ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.

Amalapuram: ఏపీలో కల్తీ పనీర్‌ కలకలం!..ఏపీSwechaa15 Sep 2026, 04:16 PM

Amalapuram: ఏపీలో కల్తీ పనీర్‌ కలకలం!..

పనీర్ చాలామందికి ఇష్టమైన ఫుడ్. వెజ్ బిర్యానీ నుంచి బటర్ పనీర్ వరకు.. హోటల్ మెనూలో పనీర్ వంటకాలకు ప్రత్యేక స్థానం ఉంటుంది. కానీ ఇప్పుడు అదే పనీర్ పేరుతో జరుగుతున్న దందా ఆందోళన కలిగిస్తోంది. కొందరు వ్యాపారులు కల్తీ పనీర్ ను తయారు చేస్తూ ప్రజల ఆరోగ్యాలతో చెలాగాటమాడుతున్నారు.. ఇలాంటి ఘటనలు రెండు రాష్ట్రాలలో తరచుగా వెలుగులోకి వస్తున్న విషయం తెలిసిందే.. తాజాగా అమలాపురం, రావులపాలెం ప్రాంతాల్లో కల్తీ పనీర్ కలకలం సృష్టించింది. అమలాపురం పరిధిలో అధికారులు సాధారణ తనిఖీలు నిర్వహించగా అనుమానాస్పదంగా ఉన్న పనీర్‌ను గుర్తించి నమూనాలు సేకరించి వాటిని పరీక్షలకు పంపించారు.

Tollywood-Ravi Teja: రవితేజతో హిట్ కొడితే నెక్స్ట్ లెవలే ఇంక!సినిమాSwechaa15 Sep 2026, 04:08 PM

Tollywood-Ravi Teja: రవితేజతో హిట్ కొడితే నెక్స్ట్ లెవలే ఇంక!

Tollywood: తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి తర్వాత స్వయంకృషితో ఎదిగిన మరో హీరో ఎవరైనా ఉన్నారా అంటే అది మాస్ మహారాజ్ రవితేజ అని ఠక్కున ఎవరైనా చెప్పేస్తారు. వరుస ఫ్లాప్స్ వచ్చినా ఇంచు కూడా వణకని రవితేజ..అదే జోరులో కొత్త సినిమాలను ఒప్పుకుంటూ ముందుకు సాగుతున్నాడు. ఈ మధ్యకాలంలో ఆయన చేసినన్ని సినిమాలు ఇంకో చేయలేదనే చెప్పాలి.

శాంతా శ్రీరామ్ కన్‌స్ట్రక్షన్స్ కేసు.. సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి చుక్కెదురుSwechaa15 Sep 2026, 03:50 PM

శాంతా శ్రీరామ్ కన్‌స్ట్రక్షన్స్ కేసు.. సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి చుక్కెదురు

Supreme Court: సికింద్రాబాద్ శాంతా శ్రీరామ్ కన్‌స్ట్రక్షన్స్ ల్యాండ్ కేసులో సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి చుక్కెదురైంది. కంట్మోనెంట్‌లో 40 ఎకరాల భూమి ప్రభుత్వానిదే అంటూ సర్కార్ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది. హైకోర్టు తీర్పుపై సకాలంలో సవాల్ చేయలేదన్న సుప్రీంకోర్టు.. ఆలస్యంగా దాఖలు చేశారని పిటిషన్‌పై విచారణకు నిరాకరించింది. వివాదాస్పద 40 ఎకరాల భూమి శాంతా శ్రీరామ్ కన్‌స్ట్రక్షన్స్‌కే చెందుతుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

శాంతా శ్రీరామ్ కన్‌స్ట్రక్షన్స్ కేసులో తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. 219 రోజుల ఆలస్యంగా పిటిషన్ దాఖలు చేశారనే కారణంతో పిటిషన్‌ను డిస్మిస్ చేసింది సుప్రీం ధర్మాసనం. కంటోన్మెంట్‌లోని 40 ఎకరాల భూమి శాంతా శ్రీరామ్ కన్‌స్ట్రక్షన్స్‌దేనన్న హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది. ఇది ప్రభుత్వ భూమి అంటూ సుప్రీంకోర్టులో తెలంగాణ సర్కార్ దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్‌ను కొట్టివేసింది.

ఏపీ మాజీ డిప్యూటీ సీఎం హఠాన్మరణం!..ఏపీSwechaa15 Sep 2026, 03:19 PM

ఏపీ మాజీ డిప్యూటీ సీఎం హఠాన్మరణం!..

ఆంధ్రప్రదేశ్ మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని కన్నుమూశారు. విశాఖలోని ఆయన నివాసంలో నేడు గుండె పోటుతో హఠాన్మరణం చెందారు. ఇక 2004,2009 లో ఏలూరు ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన నాని అనంతరం 2019 ఎన్నికల్లో ఏలూరు నుంచి విజయం సాధించి.. వైఎస్ జగన్ మంత్రివర్గంలో వైద్య, ఆరోగ్యశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అదే సమయంలో డిప్యూటీ సీఎంగా కూడా పనిచేశారు. 2024లో టీడీపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆయన వైసీపీకి గుడ్ బై చెప్పి చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు.

ఫ్రిడ్జి పేలి నలుగురు సజీవదహనంక్రైమ్Swechaa15 Sep 2026, 03:08 PM

ఫ్రిడ్జి పేలి నలుగురు సజీవదహనం

మనం ఇంట్లో ఎలక్ట్రానిక్ వస్తువులు ఎంత ప్రమాదకరమో తెలిపే ఘటన మరొకటి చోటుచేసుకుంది. ఏ వస్తువు అయినా వాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఏమాత్రం అలసత్వం ప్రదర్శించినా ప్రాణాలకే ముప్పు పొంచి ఉంటుంది. తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి వెలుగుచూసింది. ఇంట్లో ఫ్రిడ్జి పేలిన ఘటనలో ఒకే కుటుంబంలోని నలుగురు సజీవదహనం అయ్యారు. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రం బెళగావిలోని చమౌలి గల్లీలో చోటుచేసుకోగా ఆలస్యంగా వెలుగుచూసింది. బెళగావికి చెందిన రాజారాం కుటుంబ సభ్యులు ఇటీవల ఓ కొత్త ఫ్రిడ్జ్ కొనుగోలు చేశారు. సోమవారం రాత్రి ప్రమాదవశాత్తు భారీ శబ్దంతో పేలింది. ఇంట్లో మంటలు చెలరేగాయి. క్షణాల్లో ఇల్లు మొత్తం వ్యాపించడంతో శారద డమోలి (50), ఆమె కుమార్తెలు ప్రియా(28), గంగ(25)తో సహా మరో మహిళ ప్రాణాలు కోల్పోయారు.

‘కొండా’ విషయంలో అలా చేయాల్సింది కాదు : టీపీసీసీ చీఫ్తెలంగాణSwechaa15 Sep 2026, 02:46 PM

‘కొండా’ విషయంలో అలా చేయాల్సింది కాదు : టీపీసీసీ చీఫ్

ఇక మాజీ మంత్రి కొండా సురేఖను కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయడం బాధాకరమైన విషయం అన్నారు. అలా చేయాల్సింది కాకుండేనని.. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించినందుకే ఏఐసీసీ ఈ నిర్ణయం తీసుకుందని పేర్కొన్నారు. పదవులు, హోదాలు, వ్యక్తుల కంటే ‘పార్టీ క్రమశిక్షణే అత్యంత ప్రధానం. ఏఐసీసీ నిర్దేశించిన హద్దులు, పార్టీ లైన్‌ను ఎవరు దాటినా చర్యలు తప్పవు’ అని ఆయన తేల్చిచెప్పారు. ముఖ్యమంత్రితో కలసి ప్రజాక్షేమం, కాంగ్రెస్ బలోపేతమే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. ఇక మాజీ మంత్రి కొండా సురేఖను కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయడం బాధాకరమైన విషయం అన్నారు. అలా చేయాల్సింది కాకుండేనని.. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించినందుకే ఏఐసీసీ ఈ నిర్ణయం తీసుకుందని పేర్కొన్నారు. పదవులు, హోదాలు, వ్యక్తుల కంటే ‘పార్టీ క్రమశిక్షణే అత్యంత ప్రధానం. ఏఐసీసీ నిర్దేశించిన హద్దులు, పార్టీ లైన్‌ను ఎవరు దాటినా చర్యలు తప్పవు’ అని ఆయన తేల్చిచెప్పారు.

Mahesh Babu-Comments: రాజమౌళితో వర్క్ చాలా చాలా సులభం..సినిమాSwechaa15 Sep 2026, 02:46 PM

Mahesh Babu-Comments: రాజమౌళితో వర్క్ చాలా చాలా సులభం..

Mahesh Babu: దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళితో వర్క్ చేయడం చాలా కష్టమని బాహుబలి తర్వాత ప్రభాస్, రానా..ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్‌టిర్-చరణ్ చెప్పిన సంగతి తెలిసిందే. తారక్ అయితే, ఏకంగా రాక్షడు అని పేరు పెట్టాడు. కానీ, మహేష్ బాబు మాత్రం తాజాగా ఓ పాడ్ కాస్ట్‌లో రాజమౌళితో వర్క్ చాలా చాలా సులభం.. అని స్టేట్‌మెంట్ ఇచ్చాడు. దీనితో, వారణాసి సినిమా గురించే మహేష్ ఇలా చెప్పాడని అందరూ చెప్పుకుంటున్నారు.

ఇళ్లు లేని పేదలకు కేంద్రం శుభవార్త..తెలంగాణSwechaa15 Sep 2026, 02:24 PM

ఇళ్లు లేని పేదలకు కేంద్రం శుభవార్త..

ఇళ్లు లేని పేదలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (PMAY) పథకం కింద మరిన్నిఇళ్లను కేటాయించింది. రెండు తెలుగు రాష్ట్రాలకు అదనంగా కేటాయింపులు చేసినట్టు సమాచారం. ఇప్పటికే తెలుగు రాష్ట్రాలకు 2 కోట్ల ఇళ్లను కేటాయించిన కేంద్రం.. వాటికి అదనంగా మరో 5 లక్షల ఇళ్లను మంజూరు చేసింది. వీటిలో ఏపీకి 3 లక్షలు, తెలంగాణకు 2 లక్షల ఇళ్లను కేటాయించింది. ఈ నిర్ణయంతో రెండు రాష్ట్రాల్లోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఉన్న వేలాది ఇళ్లు లేని నిరుపేద కుటుంబాలకు సొంతిల్లు నిర్మించుకునే వెసులుబాటు కలగనుంది. త్వరలోనే సంబంధిత జిల్లాల వారీగా లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ ప్రారంభం కానున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం పేదల కోసం ఇందిరమ్మ ఇండ్లను నిర్మిస్తోంది.

Ramya Krishna: మంచు మనోజ్ సినిమాలో రమ్యకృష్ణ..లుక్ అదిరిందిసినిమాSwechaa15 Sep 2026, 02:04 PM

Ramya Krishna: మంచు మనోజ్ సినిమాలో రమ్యకృష్ణ..లుక్ అదిరింది

Ramya Krishna: మంచు మనోజ్ ఇటీవల విలన్ గా మారి సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. మిరాయ్ సినిమాలో మనోజ్ చేసిన నెగిటివ్ రోల్ కి విశేషమైన స్పందన లభించింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో కొత్త విలన్ వచ్చాడని అందరూ చెప్పుకున్నారు. ఇకపై, కథ డిమాండ్ చేస్తే ఎలాంటి నెగిటివ్ రోల్ అయినా చేయడానికి మనోజ్ రెడీ ఓపెన్‌గానే చెప్పాడు. అలా, అని హీరోగా నో అంటున్నాడా..అంటే అదేమీ లేదు.

కాంగ్రెస్ సోషల్ మీడియా స్టేట్ సెక్రెటరీగా అరెల్లి కిరణ్ గౌడ్తెలంగాణSwechaa15 Sep 2026, 02:00 PM

కాంగ్రెస్ సోషల్ మీడియా స్టేట్ సెక్రెటరీగా అరెల్లి కిరణ్ గౌడ్

రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని సోషల్ మీడియా విభాగాన్ని మరింత బలోపేతం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ కీలక అడుగులు వేస్తున్నది. రాష్ట్రంలో ప్రతిపక్ష బీఆర్ఎస్ సోషల్ మీడియా వింగ్ బలంగా పనిచేస్తున్న తరుణంలో అధికార పార్టీ తరపున గట్టి కౌంటర్ ఇవ్వడానికి సోషల్ మీడియా విభాగ అధిపతుల్లో మార్పులు చేర్పులు చేసినట్టు సమాచారం. ఈ క్రమంలోనే అరెల్లి కిరణ్ గౌడ్‌ కాంగ్రెస్ సోషల్ మీడియా రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికయ్యారు. ఈ మేరకు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సోషల్ మీడియా డిపార్ట్‌మెంట్ నూతనంగా ఎన్నికైన సోషల్ మీడియా సెక్రెటరీల లిస్ట్‌ను విడుదల చేసింది.అరెల్లి కిరణ్ గౌడ్.. పెద్దపల్లి జిల్లా మంథని నియోజకవర్గంలోని సూరయ్యపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ కీలక నేత.

Srikanth Odela-Ram Charan: ప్యారడైజ్ డైరెక్టర్ కి రామ్ చరణ్ కాస్ట్లీ గిఫ్ట్..ఫ్యూచర్‌లో ఛాన్స్!సినిమాSwechaa15 Sep 2026, 01:42 PM

Srikanth Odela-Ram Charan: ప్యారడైజ్ డైరెక్టర్ కి రామ్ చరణ్ కాస్ట్లీ గిఫ్ట్..ఫ్యూచర్‌లో ఛాన్స్!

Srikanth Odela: దసరా, ది ప్యారడైజ్ సినిమాల దర్శకుడు శ్రీకాంత్ ఓదెలకి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చాడు. ఆ విషయాన్ని తాజాగా ఆయన ప్యారడైజ్ సినిమా ప్రమోషనల్ ఇంటర్వ్యూలో రివీల్ చేశాడు. నానీ, కయాదు లోహర్ జంటగా నటించిన ది ప్యారడైజ్ సినిమా ఈ నెల 24న భారీ స్థాయిలో రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలో జరుగుతున్న ప్రమోషనల్ ఇంటర్వ్యూలో చరణ్ ఇచ్చిన గిఫ్ట్ గురించి వెల్లడించడం ఆసక్తికరమైన చర్చగా మారింది.

బండ్లగూడ వైన్స్‌లో రౌడీషీటర్ దారుణ హత్య.. వీడియో వైరల్క్రైమ్Swechaa15 Sep 2026, 01:42 PM

బండ్లగూడ వైన్స్‌లో రౌడీషీటర్ దారుణ హత్య.. వీడియో వైరల్

హైదరాబాద్ మహానగరంలో దారుణం జరిగింది. పాత కక్షల నేపథ్యంలో ఓ వ్యక్తిని కొందరు వెంటబడి మరి నరికి చంపారు. ఈ ఘటన నగరంలోని నాగోల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకివెళితే.. ఖమ్మం జిల్లా ఇల్లందు పట్టణానికి చెందిన రౌడీషీటర్లు ఉమామహేశ్వర్ అలియాస్ జేకే మహేష్, మహమ్మద్ నహీమ్ చిన్ననాటి నుండి కలిసి చదువుకున్న ఆప్తమిత్రులు.సెటిల్మెంట్లు చేసిన డబ్బుల విషయంలో గత మూడు నెలలుగా వీరిద్దరి మధ్య గొడవలు జరుగుతున్నట్టు సమాచారం. ఈ క్రమంలోనే మహమ్మద్ నహీమ్ ఇల్లందు నుంచి నగరానికి వచ్చి బండ్లగూడ సహభావన అపార్ట్‌మెంట్లో నివాసముంటున్నాడు. విషయం తెలుసుకున్న మహేశ్.. అతన్ని అంతం చేయాలని తిరుగుతున్నట్టు సమాచారం. మహేశ్ తనను ఎక్కడ చంపేస్తాడో అని భయంతో బండ్లగూడలోని సుప్రీం వన్స్ షాపులో తలదాచుకున్న నయీమ్‌ను.. మహేశ్ మరికొందరి సాయంతో మర్డర్ చేసినట్టు తెలిసింది.

కాంగ్రెస్ కార్యకర్తల కంటే ఎక్కువగా పనిచేస్తున్న తెలంగాణ పోలీసుశాఖ : కేటీఆర్తెలంగాణSwechaa15 Sep 2026, 01:15 PM

కాంగ్రెస్ కార్యకర్తల కంటే ఎక్కువగా పనిచేస్తున్న తెలంగాణ పోలీసుశాఖ : కేటీఆర్

1000 రోజుల కాంగ్రెస్ పాలనపై తాము అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పలేక కాంగ్రెస్ దాడులకు తెగబడుతున్నదని కేటీఆర్ ఆరోపించారు. ప్రభుత్వం నిరాశ నిస్పృహల్లో ఉందని, అందుకే ప్రతిరోజూ అటెన్షన్ డైవర్షన్‌కు పాల్పడుతోందని వెల్లడించారు. మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ ఇంటిమీద దాడి చేశారని, ప్రాణాలకు లెక్క చేయకుండా తెలంగాణ కోసం పోరాడిన నాయకుడి ఇంటిపైన దాడి జరగడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. వారి మీద కేసులు ఎందుకు పెట్టలేదని పోలీసుశాఖను నిలదీశారు. సైఫాబాద్ పోలీస్‌స్టేషన్ లోపల 15 మంది గుర్తుతెలియని దుండగలు..తన పీఆర్వో, పీఏ మీద దాడికి యత్నించారని చెప్పారు. పోలీస్‌స్టేషన్‍లో దాడికి ప్రయత్నించింది గుండాలా? పోలీసులా? మఫ్టీలో వచ్చి దాడి చేసిన వారు ఎవరో తేల్చాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. తెలంగాణలో పోలీస్ శాఖ కాంగ్రెస్ కార్యకర్తల కంటే ఎక్కువగా పని చేస్తుందని ఆరోపించారు.

రేవంత్ ఒకలా? పొంగులేటి మరొకలా? : ఎంపీ రఘునందన్ రావుతెలంగాణSwechaa15 Sep 2026, 12:56 PM

రేవంత్ ఒకలా? పొంగులేటి మరొకలా? : ఎంపీ రఘునందన్ రావు

రాష్ట్రంలో 22 ఏ నిషేధిత భూముల అంశంపై మెదక్ బీజేపీ పార్లమెంట్ సభ్యులు రఘునందన్ రావు తాజాగా స్పందించారు.22 ఏ మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒకలా? రెవెన్యూ,గృహ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మరొకలా? మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ప్రభుత్వాలు మారగానే రెవెన్యూ చట్టాలు మార్చడం సరికాదని, దేశవ్యాప్తంగా ఒకే చట్టం ఉండాలని రఘునందన్ రావు స్పష్టంచేశారు. 22ఏ అంశం మీద తెలంగాణ రైతాంగం, పేద, మధ్యతరగతి ప్రజలు ఆందోళన చెందుతున్నారని చెప్పారు. గత ప్రభుత్వం తెచ్చిన ధరణి, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన భూభారతి అక్రమాలపై సిట్టింగ్ హైకోర్టు జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. మంగళవారం ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 22ఏ మీద మంత్రి పొంగులేటి, సీఎం రేవంత్ రెడ్డి తలోమాట మాట్లాడుతున్నారని విమర్శించారు. 22ఏ మీద మాట్లాడితే బీఆర్ఎస్,బీజేపీ ఒక్కటే అని మంత్రి పొంగులేటి అనడం సరికాదన్నారు.

విగ్రహ ప్రతిష్టచేయకుండానే గంగమ్మ ఒడికి గణేశుడుతెలంగాణSwechaa15 Sep 2026, 12:43 PM

విగ్రహ ప్రతిష్టచేయకుండానే గంగమ్మ ఒడికి గణేశుడు

వినాయకచవిత పండుగ సందర్భంగా గల్లీగల్లీలో బొజ్జ గణపయ్యలు కొలువుదీరారు. ఘనంగా పూజలు అందుకున్నారు. నవరాత్రుల సందర్భంగా ప్రతిరోజూ వినాయకులు ప్రత్యేక పూజలు అందుకోనున్నారు. తీరొక్క గణపయ్యలు వాడవాడాలా కొలువుదీరడంతో యువత, చిన్నారుల సందడి నెలకొంది.నిన్నటివరకు వరుసగా సెలవులు రావడంతో గణపయ్య మండపాల వద్ద కోలాహలం నెలకొంది.సాయంత్రం వరకు వినాయకులను డప్పుచప్పుళ్లు, ఊరేగింపుల నడుమ తీసుకొచ్చి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మండపాల్లో ప్రతిష్టించారు. అయితే, విగ్రహాన్ని ప్రతిష్టించాక నవరాత్రులు పూర్తయ్యాక గణపతిని గంగమ్మ ఒడికి పంపిస్తారు. అయితే,నగరాల్లో ట్రాఫిక్ రద్దీని దృష్టిలో ఉంచుకుని మూడో రోజు నుంచే నిమజ్జనాలు కొనసాగుతాయి. ఇదిలాఉండగా,విగ్రహాన్ని ప్రతిష్టించకుండానే ఓ చోట గణపయ్యను గంగమ్మ ఒడికి చేర్చారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.

భూముల దందా?  సీఎం గారు ఈ ప్రశ్నలకు జవాబిస్తారా?టాప్ న్యూస్Swechaa15 Sep 2026, 11:25 AM

భూముల దందా? సీఎం గారు ఈ ప్రశ్నలకు జవాబిస్తారా?

రాష్ట్రంలో ప్రస్తుతం 22 ఏ అంశం హాట్‌టాపిక్‌గా మారింది. ఓ వైపు ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతలు, మరోవైపు సామాన్యుల నుంచి తీవ్ర వ్యతిరేకత, విమర్శలు వెల్లువెత్తుతున్న తరుణంలో ఏం చేయాలో తోచక అధికార పార్టీ నేతలు తలలు పట్టుకుంటున్నట్టు తెలుస్తోంది. ఎన్నికలకు ఇంకా రెండేండ్ల సమయం ఉందనుకుంటే ఇప్పటినుంచే జనాల తిరగబడేలా ఉన్నారని హస్తం పార్టీలో జోరుగా చర్చ జరుగుతోంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలు సంగతి దేవుడెరుగు.. కానీ, అనవసరంగా ప్రజల భూములు, ఆస్తుల జోలికి వెళ్లాం కదా? అని ఇప్పుడెలా? అని అధికార పార్టీ నేతలే చర్చించుకుంటున్నట్టు సమాచారం. 22 ఏ నిషేధితా జాబితాలోని భూములపై సీఎం సమాధానం చెప్పాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి.

Official-MS Subba Lakshmi Bio: ఎం ఎస్ సుబ్బలక్ష్మి రష్మిక..ఓపెనింగ్‌కి గెస్ట్‌గా కమల్ హాసన్!సినిమాSwechaa15 Sep 2026, 11:15 AM

Official-MS Subba Lakshmi Bio: ఎం ఎస్ సుబ్బలక్ష్మి రష్మిక..ఓపెనింగ్‌కి గెస్ట్‌గా కమల్ హాసన్!

Official: భారతీయ సినిమా దిగ్గజ గాయనీ, లెజెండరీ సింగర్ ఎం ఎస్ సుబ్బలక్ష్మి ఎలాంటి అద్భుతమైన పాటలను పాడారో అందరికీ తెలిసిందే. ఇప్పటికీ, ఆమె పాటలకి అభిమానులున్నారు. అంతేకాదు, ఈ జనరేషన్‌లో ఎం ఎస్ సుబ్బలక్ష్మి పాటలను వింటూ మైమరిచే ప్రేక్షకులున్నారు. ఈ నేపథ్యంలో ఆమె బయోపిక్ తెరకెక్కబోతుంది. ఈ సినిమాలో ఎం ఎస్ సుబ్బలక్ష్మి గా నేషనల్ క్రష్ రష్మిక మందన్న నటించబోతోంది.

పీఎస్‌లో మా మాళ్లపై మూకదాడి.. వెల్ డన్ రాహుల్ గాంధీ : కేటీఆర్తెలంగాణSwechaa15 Sep 2026, 10:59 AM

పీఎస్‌లో మా మాళ్లపై మూకదాడి.. వెల్ డన్ రాహుల్ గాంధీ : కేటీఆర్

రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తాజాగా స్పందించారు. తన పీఏ మహేందర్ రెడ్డి, పీఆర్‌వో మహేశ్ మీద జరిగిన దాడిని ఖండించిన ఆయన సోషల్ మీడియా‘ఎక్స్’ వేదికగా ఆసక్తికర పోస్టు పెట్టారు. మూకదాడి ఎప్పుడూ హత్యగా ప్రారంభం కాదని, కొన్నిసార్లు అది పోలీస్‌స్టేషన్‌లో, యూనిఫాంలో ఉన్న అధికారుల సమక్షంలోనే ప్లాన్ చేసే దాడిగా మొదలవుతుందని చెప్పారు. ప్రభుత్వ యంత్రాంగం రౌడీయిజానికి మద్దతు ఇస్తూ ప్రోత్సహిస్తున్న తీరును చూస్తుంటే అతి త్వరలోనే వీధుల్లో మూకదాడులు జరుగుతాయేమోనని ఆందోళనగా ఉందన్నారు. అసెంబ్లీ గేట్ నెంబర్ 3 వద్ద జరిగిన తోపులాట విషయమై విచారణ కోసం సైఫాబాద్ పోలీస్‌స్టేషన్‌కు వచ్చిన తన పీఏ మహేందర్ రెడ్డి, పీఆర్‌వో మహేష్‌లపై మూకదాడి జరిగినట్టే, అణిచివేతకు లొంగని ఏ తెలంగాణ పౌరుడిపై అయినా జరగవచ్చని ఆందోళన వ్యక్తం చేశారు.

నేడు మంత్రులతో సీఎం రేవంత్ కీలక భేటీ.. ఏం జరగబోతోంది?తెలంగాణSwechaa15 Sep 2026, 10:16 AM

నేడు మంత్రులతో సీఎం రేవంత్ కీలక భేటీ.. ఏం జరగబోతోంది?

రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు శరవేగంగా మారుతున్నాయి. ఎన్నికలకు మరో రెండేండ్లు సమయం ఉన్నప్పటికీ ప్రస్తుత పరిస్థితులు మాత్రం ఎన్నికల హీట్‌ను పెంచాయి. అందుకు అధికార పార్టీ కారణమని తెలుస్తోంది. గత ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చకపోవడంతో పాటు ప్రజలకు కొత్త సమస్యలను తెచ్చిపెట్టారని, ప్రజలకు సంబంధించిన భూములను ఇష్టారాజ్యంగా కాజేస్తున్నారని ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు మంత్రులతో MCHRDలో సీఎం రేవంత్ రెడ్డి కీలక సమావేశం నిర్వహించనున్నట్టు తెలిసింది. 22/Aపై మంత్రులతో చర్చించనున్నట్టు సమాచారం.

ఒరాకిల్‌లో భారీ లేఆఫ్స్..! టెక్ ప్రపంచంలో అసలేం జరుగుతోంది?వ్యాపారంSwechaa15 Sep 2026, 10:16 AM

ఒరాకిల్‌లో భారీ లేఆఫ్స్..! టెక్ ప్రపంచంలో అసలేం జరుగుతోంది?

ఒరాకిల్‌లో వచ్చిన ఈ లేఆఫ్స్.. ఆ మారుతున్న టెక్ ప్రపంచానికి మరోసారి పెద్ద హెచ్చరికలా కనిపిస్తున్నాయి. ఏఐ కొత్త ఉద్యోగాలను సృష్టిస్తుందా? లేక ఉన్న ఉద్యోగాలను తగ్గించి.. కొత్త రకం ఉద్యోగాలనే మిగులుస్తుందా? ఇదే ఇప్పుడు ప్రపంచ టెక్ పరిశ్రమ ముందున్న అసలు ప్రశ్న.

మొబైల్‌ యూజర్లకు అలర్ట్‌.. 365 రోజుల వ్యాలిడిటీతో బెస్ట్‌ రీఛార్జ్‌ ప్లాన్స్‌!..వ్యాపారంSwechaa15 Sep 2026, 10:01 AM

మొబైల్‌ యూజర్లకు అలర్ట్‌.. 365 రోజుల వ్యాలిడిటీతో బెస్ట్‌ రీఛార్జ్‌ ప్లాన్స్‌!..

మొబైల్‌ యూజర్లకు మరోసారి రీఛార్జ్‌ ధరల పెంపు భయం మొదలైంది. టెలికాం కంపెనీలు రానున్న 3 నుంచి 6 నెలల్లో ప్రీపెయిడ్‌ టారిఫ్‌లను 10 నుంచి 15 శాతం వరకు పెంచే అవకాశం ఉందన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఎయిర్‌టెల్‌ కొన్ని ఎంట్రీ లెవల్‌ ప్లాన్‌లను తొలగించగా.. జియో రూ.300తో ప్రైమ్‌ మెంబర్‌షిప్‌ను తీసుకొచ్చింది. ఈ సభ్యత్వం తీసుకున్న వారికి ఏడాది పాటు టారిఫ్‌ సవరణ నుంచి రక్షణ ఉంటుందని కంపెనీ ప్రకటించింది. దీంతో రాబోయే రోజుల్లో రీఛార్జ్‌ ధరలు పెరగవచ్చనే సంకేతాలు కనిపిస్తున్నాయి.

బస్సులో భారీగా పేలుడు పదార్థాలు.. తప్పిన పెనుప్రమాదం!ఏపీSwechaa15 Sep 2026, 09:56 AM

బస్సులో భారీగా పేలుడు పదార్థాలు.. తప్పిన పెనుప్రమాదం!

ఏపీలో పెనుప్రమాదం తప్పింది. గుర్తుతెలియని వ్యక్తి ఆర్టీసీ బస్సులో భారీగా పేలుడు పదార్థాలు వదిలేసి వెళ్లినట్టు తెలుస్తోంది. ఈ ఘటన విజయవాడ పట్టణంలో మంగళవారం ఉదయం చోటుచేసుకుంది. అయితే, బస్సులో ప్రయాణిస్తున్న మరో వ్యక్తి సమయస్ఫూర్తితో పెను ప్రమాదం తప్పిందనే చెప్పాలి. బస్సులో అనుమానాస్పదంగా ఉన్న బ్యాగును గుర్తించిన సదరు ప్రయాణికుడు వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. బస్సు సిబ్బందిని అలర్ట్ చేసినట్టు తెలిసింది.దీంతో బస్సు డ్రైవర్ బస్సును రద్దీలేని ప్రదేశంలో నిలపగా.. కృష్ణలంక పోలీసులు వెంటనే అక్కడకు చేరుకున్నారు. అనంతరం బస్సులోని అనుమానాస్పద బ్యాగును గుర్తించి తనిఖీలు చేపట్టారు. అందులో 46 జిలెటిన్ స్టిక్స్, 50 డిటోనేటర్లను చూసి పోలీసులు షాక్ అయ్యారు. అనంతరం వాటిని స్వాధీనం చేసుకున్నారు.

పులివెందులలో టీడీపీ నేతల మధ్య ఘర్షణ.. గాలిలోకి గన్ ఫైర్!..ఏపీSwechaa15 Sep 2026, 09:25 AM

పులివెందులలో టీడీపీ నేతల మధ్య ఘర్షణ.. గాలిలోకి గన్ ఫైర్!..

ఒకప్పుడు ఫ్యాక్షన్ రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్‌గా కనిపించిన కడప జిల్లా.. కాలం మారుతున్న కొద్దీ ఆ ముద్ర నుంచి బయటపడుతున్నట్టే కనిపించింది. ప్రశాంత వాతావరణం నెలకొంటోందని అనిపించినప్పటికీ.. అప్పుడప్పుడూ చోటుచేసుకుంటున్న ఘర్షణలు మాత్రం పాత జ్ఞాపకాలను మళ్లీ కదిలిస్తున్నాయి. తాజాగా పులివెందులలో జరిగిన ఘటన ఇప్పుడు జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. పులివెందులలో వినాయక మండపం వద్ద ఇద్దరు టీడీపీ నేతల మధ్య వివాదం తలెత్తింది. పుష్పనాథ్ రెడ్డి, విజయ్ కుమార్ మధ్య మొదలైన గొడవ క్రమంగా ఉద్రిక్తతకు దారితీసినట్లు సమాచారం. పుష్పనాథ్ రెడ్డిపై విజయ్ కుమార్ చేయి చేసుకోవడంతో ఇరు వర్గాల మధ్య పరిస్థితి అదుపుతప్పినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో పరస్పరం రాళ్లు రువ్వుకోవడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

రోడ్డుపై మహిళలకు రక్షణ లేదా..! బైకర్‌ సియాకు న్యాయం ఎక్కడ?NationalSwechaa15 Sep 2026, 09:06 AM

రోడ్డుపై మహిళలకు రక్షణ లేదా..! బైకర్‌ సియాకు న్యాయం ఎక్కడ?

రోడ్డుపై మహిళలు బైక్‌ నడపొద్దా? ఎవరైనా వెంబడిస్తే భరించాలా? రోడ్డుపై ఎవరైనా భయపెడితే మౌనంగా ఉండాలా? ఒకవేళ ప్రమాదం జరిగితే.. కనీసం ఆపి బాధితురాలు ఎలా ఉందో చూడాల్సిన బాధ్యత కూడా లేదా..? గురుగ్రామ్‌లో జరిగిన ఓ ఘటన ఇప్పుడు ఈ ప్రశ్నలన్నింటినీ మన ముందుంచుతోంది.

తిరుమలలో ఈ నియమం తప్పక పాటించాల్సిందే!..SpiritualitySwechaa15 Sep 2026, 08:54 AM

తిరుమలలో ఈ నియమం తప్పక పాటించాల్సిందే!..

కలియుగంలో ప్రత్యక్ష దైవంగా కొలిచే శ్రీ వేంకటేశ్వర స్వామి కొలువైన తిరుమల క్షేత్రం.. భక్తుల విశ్వాసానికి, ఆధ్యాత్మికతకు నిలువెత్తు ప్రతీక. ప్రపంచం నలుమూలల నుంచి కోట్లాది మంది భక్తులు స్వామివారి దర్శనం కోసం ఇక్కడికి వస్తుంటారు. ఇక ఈ క్షేత్రంలో ప్రతి ఆచారానికి ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక నేపథ్యం ఉందని భక్తులు విశ్వసిస్తారు. అలాంటి ఆచారాల్లో ఒకటి.. తిరుమల కొండపై పూలు ధరించకపోవడం. అయితే తిరుమలలో ఈ నియమం ఎందుకు వచ్చింది? దీని వెనుక ఉన్న కథ ఏమిటి? అనేది తెలుసుకుంటే.. శ్రీనివాసుడు అలంకార ప్రియుడు. ఏడుకొండల పైన వికసించే ప్రతి పువ్వు, ప్రతి పత్రం కేవలం శ్రీవారి సేవకే అంకితం కావాలనేది తిరుమలలో తరతరాలుగా వస్తున్న పవిత్ర విశ్వాసం. అందుచేతే భక్తులు కొండపై పూలు ధరించరని చెబుతారు..

సనాతన ధర్మంలో శరభేశ్వర రూపానికి ఉన్న ప్రత్యేకత ఏంటి?..SpiritualitySwechaa15 Sep 2026, 08:28 AM

సనాతన ధర్మంలో శరభేశ్వర రూపానికి ఉన్న ప్రత్యేకత ఏంటి?..

అనాదియైన మన సనాతన ధర్మం కేవలం ఒక విశ్వాసం మాత్రమే కాదు.. అది విశ్వ శాంతిని, ప్రకృతి సమతుల్యతను కాపాడే ఒక గొప్ప జీవన విధానం. ధర్మానికి ముప్పు వాటిల్లిన ప్రతిసారీ లోకాన్ని రక్షించడానికి భగవంతుడు రకరకాల రూపాల్లో అవతరించాడని మన పురాణాలు చెబుతున్నాయి. అలాంటి శివుని లీలల్లో అత్యంత శక్తిమంతమైనది, అరుదైనది శరభేశ్వర అవతారం అని చెబుతారు..

Telangnana: 22 A చర్చ సాగేనా ముఖ్యమంత్రివర్యా ?   క్లారిఫికేషన్స్ లేకుండానే ఖతం పట్టిస్తారా ?స్వేచ్ఛ ఛైర్మన్ డెస్క్Swechaa15 Sep 2026, 08:10 AM

Telangnana: 22 A చర్చ సాగేనా ముఖ్యమంత్రివర్యా ? క్లారిఫికేషన్స్ లేకుండానే ఖతం పట్టిస్తారా ?

ఆనాడు ధరణితో 10 లక్షల కోట్ల భూ కుంభకోణం అని మీరే అన్నారు. సీఎం అయ్యకా దొచుకుంటూ ఎంత పంచుకుంటున్నారో సభలో చెప్పాల్సిన అవసరం ఉంది. చరిత్రలో ఎప్పుడు లేని విధంగా ఓ సబెక్ట్ పై మంత్రి 4 గంటలు మాట్లాడి ఆ తర్వాత ప్రధాన ప్రతిపక్షం లేని సమయంలో చర్చించారు.