స్వేచ్ఛ షార్ట్స్ — తాజా తెలుగు వార్తలు

UCC: బీజేపీ ఆశలపై నీళ్లు చల్లిన జేడీయూ.. బిహార్‌లో యూసీసీ అమలుకు నో!దునియాSwechaa14 Sep 2026, 10:21 PM

UCC: బీజేపీ ఆశలపై నీళ్లు చల్లిన జేడీయూ.. బిహార్‌లో యూసీసీ అమలుకు నో!

దేశవ్యాప్తంగా ఉమ్మడి పౌరస్మృతి (యూసీసీ)ని పకడ్బందీగా అమలు చేసేందుకు కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం శరవేగంగా అడుగులు వేస్తున్న తరుణంలో, మిత్రపక్షం నుంచే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. 2029 నాటికి 21 ఎన్డీయే పాలిత రాష్ట్రాల్లో యూసీసీని అమల్లోకి తెస్తామంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన ప్రకటనకు జేడీయూ గట్టి కౌంటర్ ఇచ్చింది.

The Paradise-Kayadu: కయాదు లోహర్‌ని ఎందుకు దాచేసున్నారు..ఇది మైనస్ అవుతుందేమో?సినిమాSwechaa14 Sep 2026, 10:17 PM

The Paradise-Kayadu: కయాదు లోహర్‌ని ఎందుకు దాచేసున్నారు..ఇది మైనస్ అవుతుందేమో?

The Paradise: నాని నటిస్తున్న లేటెస్ట్ సినిమా ది ప్యారడైజ్. దర్శకుడు శ్రీకాంత్ ఓదెల. సెప్టెంబర్ 24న భారీ స్థాయిలో 7 భాషల్లో రిలీజ్ కాబోతోంది. ఎలాంటి, భారీ స్థాయి ప్రమోషన్స్ లేకపోయినా సినిమాపై మాత్రం అందరిలో మంచి బజ్ క్రియేట్ అయి ఉంది. అంతేకాదు, ఇప్పటికే యూఎస్ లో రికార్డ్ స్థాయిలో ప్రీ బుకింగ్స్ సేల్ అయ్యాయి. అయితే, అసలు ఈ సినిమాలో హీరోయిన్ ఉందా? అనే సందేహాలు కలుగుతున్నాయి. దీనికి కారణం ఇప్పటి వరకూ కయాదు లోహర్ హీరోయిన్ అని ఎస్టాబ్లిష్ చేయకపోవడమే.

EPFO: కంపెనీ పీఎఫ్ ఎగ్గొడితే ఇలా కంప్లైంట్ చేయండి!దునియాSwechaa14 Sep 2026, 10:02 PM

EPFO: కంపెనీ పీఎఫ్ ఎగ్గొడితే ఇలా కంప్లైంట్ చేయండి!

EPFO: ప్రైవేట్ రంగంలో పనిచేసే ఉద్యోగులకు ప్రావిడెంట్ ఫండ్ (PF) అనేది జీవితాంతం ఉపయోగపడే అతిపెద్ద ఆర్థిక భరోసా. ప్రతినెలా వచ్చే జీతం నుంచి కొంత మొత్తం, దానికి సమానంగా కంపెనీ వాటా పీఎఫ్ అకౌంట్లో జమ కావడం చాలా కామన్ రూల్. అయితే చాలామంది ఉద్యోగులు జీతం రాగానే శాలరీ స్లిప్‌లో పీఎఫ్ కట్ కావడం చూసి, ఆ మొత్తం అమౌంట్ తమ పీఎఫ్ అకౌంట్‌లో పడిపోయిందని గుడ్డిగా నమ్ముతుంటారు. కానీ అక్కడే అసలు మోసం స్టార్ట్ అవుతోంది. జీతంలో పీఎఫ్ డబ్బులు కట్ చేస్తున్నప్పటికీ, ఆ మొత్తాన్ని ఉద్యోగుల పీఎఫ్ ఖాతాల్లో జమ చేయకుండా చేతులెత్తేసే సంస్థలు ఎన్నో ఉన్నాయి. ఈపీఎఫ్‌వో రూల్స్ ప్రకారం ప్రతినెలా 15వ తేదీ లోపు ఉద్యోగి, యాజమాన్యం వాటాలను పీఎఫ్ అకౌంట్‌లో జమ చేయాల్సిందే.

కేటీఆర్ స్టాఫ్‌పై దాడి అంటూ ప్రచారం.. అసలు నిజం చెప్పిన పోలీసులు!తెలంగాణSwechaa14 Sep 2026, 09:55 PM

కేటీఆర్ స్టాఫ్‌పై దాడి అంటూ ప్రచారం.. అసలు నిజం చెప్పిన పోలీసులు!

తెలంగాణ రాజకీయాల్లో మరో తీవ్ర దుమారం చెలరేగింది. హైదరాబాద్‌లోని సైఫాబాద్ పోలీస్ స్టేషన్ వేదికగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యక్తిగత సిబ్బందిపై దాడి జరిగిందన్న అంశం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. పోలీస్ స్టేషన్‌లోని విచారణ గదిలోనే ముసుగులు ధరించిన వ్యక్తులు ఈ దాడికి ఒడిగట్టారని మాజీ మంత్రి హరీశ్ రావు సంచలన ఆరోపణలు చేయగా, పోలీస్ యంత్రాంగం ఆ వార్తలను తీవ్రంగా ఖండించింది.

Movies Without Trailers : ట్రైలర్ లేకుండా బాక్సాఫీస్‌ను షేక్ చేసిన సినిమాలు ఇవే.. ఈ లిస్ట్‌లోకి ది ప్యారడైజ్!సినిమాSwechaa14 Sep 2026, 09:25 PM

Movies Without Trailers : ట్రైలర్ లేకుండా బాక్సాఫీస్‌ను షేక్ చేసిన సినిమాలు ఇవే.. ఈ లిస్ట్‌లోకి ది ప్యారడైజ్!

Movies Without Trailers : సినిమా ఇండస్ట్రీలో ప్రమోషన్స్ అంటే గ్లింప్స్, టీజర్, వరుస సాంగ్స్.. వీటన్నింటికీ మించి రిలీజ్‌కు కొద్దిరోజుల ముందు వచ్చే 'ట్రైలర్'. ట్రైలర్ కట్ బాగుంటేనే థియేటర్లకు ఆడియన్స్ పోటెత్తుతారని, అడ్వాన్స్ బుకింగ్స్ రికార్డు స్థాయిలో జరుగుతాయని అందరూ నమ్ముతారు. కానీ ప్రస్తుత ట్రెండ్‌కు పూర్తి భిన్నంగా, అసలు ట్రైలర్ అనేదే లేకుండా డైరెక్ట్‌గా థియేటర్లలోకి వచ్చి చరిత్ర సృష్టించిన అరుదైన చిత్రాలు కూడా టాలీవుడ్‌లో ఉన్నాయి. తాజాగా నేచురల్ స్టార్ నాని నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ చిత్రం ‘ది ప్యారడైజ్’ కూడా సరిగ్గా ఇదే బాటలో నడుస్తుండటం ఇప్పుడు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాని నటిస్తున్న రా అండ్ రస్టిక్ మూవీ ‘ది ప్యారడైజ్’పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. అయితే ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి ట్రైలర్ విడుదల చేయడం లేదని ఇటీవల నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో మేకర్స్ స్పష్టం చేశారు.

Naga Chaithanya-Awards: ఒక్క సినిమా..అవార్డులు..అదీ చైతూ అంటేసినిమాSwechaa14 Sep 2026, 09:21 PM

Naga Chaithanya-Awards: ఒక్క సినిమా..అవార్డులు..అదీ చైతూ అంటే

Naga Chaithanya: ఒక సినిమా బ్లాక్ బస్టర్ అయితే ఆ సినిమాకి వచ్చే లాభాల గురించి, ఆ సమయంలో మాత్రమే మాట్లాడుకుంటారు. అదే అవార్డులు వస్తే ఎప్పుడూ మాట్లాడుకుంటారు. ఇక, ఒకే వ్యక్తికి వరుసగా అవార్డులు వస్తే ఓ సంచలనం అవుతుంది. అలా, అక్కినేని నాగ చైతన్య ఇప్పుడు సంచలనం సృష్టించాడు. ఆయన హీరోగా నటించిన తండేల్ సినిమాకి చైతూ 3 అవార్డులు అందుకున్నాడు. తాజాగా, 3వ అవార్డ్ అందుకోవడంతో అందరూ దీని గురించే మాట్లాడుకుంటున్నారు.

Eesha Rebba-Tarun Bhaskar: వినాయకుడి సాక్షిగా పెళ్లెప్పుడూ..అని అడుగుతున్నారు!సినిమాSwechaa14 Sep 2026, 08:43 PM

Eesha Rebba-Tarun Bhaskar: వినాయకుడి సాక్షిగా పెళ్లెప్పుడూ..అని అడుగుతున్నారు!

Eesha Rebba-Tarun Bhaskar: టాలీవుడ్ ఇండస్ట్రీలో గత కొన్ని నెలలుగా ఎక్కడో చోట కనిపించి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతున్న జంట హీరోయిన్ ఈషా రెబ్బ, హీరో కం డైరెక్టర్ తరుణ్ భాస్కర్. వీరి మధ్య ఏదో ఉంది..అంటూ అప్పుడప్పుడు మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఇప్పుడు, కూడా ఇలాగే వినాయకుడి సాక్షిగా ఈషా-తరుణ్ కలిసి ఉన్న పిక్ నెట్టింట వైరల్ అవుతోంది. దాంతో, త్వరలో వీరు కూడా పెళ్లి వార్త ప్రకటిస్తారని కామెంట్స్ చేస్తున్నారు.

Khairatabad Ganapati: ఖైరతాబాద్‌లో భక్తజన సంద్రం.. 75 వేల మందికిపైగా గణపయ్య దర్శనం!తెలంగాణSwechaa14 Sep 2026, 08:16 PM

Khairatabad Ganapati: ఖైరతాబాద్‌లో భక్తజన సంద్రం.. 75 వేల మందికిపైగా గణపయ్య దర్శనం!

వినాయక చవితి పర్వదినం వేళ భాగ్యనగరంలో ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడుతోంది. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ఖైరతాబాద్ బడా గణేశుడి దర్శనం కోసం తొలిరోజే భక్తులు పెద్ద ఎత్తున పోటెత్తారు. వేలాదిగా తరలివచ్చిన భక్తజనంతో ఖైరతాబాద్ పరిసరాలు కిక్కిరిసిపోయాయి. సాయంత్రం 6 గంటల సమయానికే రికార్డు స్థాయిలో ఏకంగా 75 వేల మందికి పైగా భక్తులు శ్రీ పంచముఖ సంకటహర మహాగణపతిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

Samantha-Seemantham: సమంతకి సీమంతం..ఎవరెవరు వచ్చారంటే..సినిమాSwechaa14 Sep 2026, 08:11 PM

Samantha-Seemantham: సమంతకి సీమంతం..ఎవరెవరు వచ్చారంటే..

Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంతకి సీమంతం నిర్వహించారు. 'మా ఇంటి బంగారం' సినిమా సమయంలో సమంత గర్భవతి. సాంగ్ సమయంలో ఆమె ప్రగ్నెంట్ అని తెలిసింది. అయినా కూడా సినిమా కోసం అన్నీ జాగ్రత్తలు తీసుకొని షూటింగ్ పూర్తి చేసింది. చిత్ర దర్శకురాలు బి.వి.నందిని రెడ్డి, సమంత భర్త రాజ్ నిడిమోరు సమంత గర్భవతి అని తెలిసి చాలా జాగ్రత్తగా చిత్రీకరణ జరిపారు. వినయాకచవితి పండుగ సందర్భంగా ఆమెకి సీమంతం జరిగింది.

అంబర్‌పేట శంకర్‌పై మళ్లీ రౌడీ షీట్ ఓపెన్!!..క్రైమ్Swechaa14 Sep 2026, 07:47 PM

అంబర్‌పేట శంకర్‌పై మళ్లీ రౌడీ షీట్ ఓపెన్!!..

అంబర్‌పేట శంకర్‌పై పోలీసులు మళ్లీ రౌడీషీట్ ఓపెన్ చేశారు. జూబ్లీహిల్స్, మేడిపల్లి పోలీస్‌స్టేషన్ పరిధుల్లో ఆయన బెదిరింపులకు పాల్పడినట్టు వచ్చిన ఆరోపణల నేపథ్యంలో మరోసారి అతడిపై రౌడీషీట్ ఓపెన్ చేశారు. 2019లో శంకర్‌పై రౌడీషీట్ మూసివేశారు. తాజాగా రెండు పోలీస్‌ స్టేషన్లలో కేసులు నమోదవడంతో రౌడీషీట్‌ ఓపెన్ చేసినట్టు తెలుస్తోంది.

FSSAI: లేబుల్స్‌పై 'నో షుగర్'.. లోపల మాత్రం.. 150 కంపెనీల గుట్టురట్టు!తెలంగాణSwechaa14 Sep 2026, 07:24 PM

FSSAI: లేబుల్స్‌పై 'నో షుగర్'.. లోపల మాత్రం.. 150 కంపెనీల గుట్టురట్టు!

మనం తినే ఆహారమే మన ఆరోగ్యాన్ని కాపాడాలి.. కానీ ఈ రోజుల్లోని పరిస్థితి దానికి పూర్తి భిన్నంగా మారిపోయింది. నాలికకు రుచినిచ్చే పదార్థాలే నెమ్మదిగా ప్రాణాలను హరించే స్లో పాయిజన్‌లా మారుతున్నాయి. పేరున్న రెస్టారెంట్లలో దొరికే ఖరీదైన తిండి మొదలుకుని, మార్కెట్లో లభించే కలర్‌ఫుల్ ప్యాకేజ్డ్ ఫుడ్స్ వరకు అంతటా కల్తీ, మోసమే రాజ్యమేలుతోంది.

కరీంనగర్‌లో వైద్యుడి విషాదాంతం.. పీజీ సీటు రాలేదన్న మనోవేదన కారణమా!?క్రైమ్Swechaa14 Sep 2026, 07:16 PM

కరీంనగర్‌లో వైద్యుడి విషాదాంతం.. పీజీ సీటు రాలేదన్న మనోవేదన కారణమా!?

పీజీ సీటు రాలేదనే మనోవేదనతో ఓ ఎంబీబీఎస్ డాక్టర్ ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన కరీంనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. పసుల గౌతమ్ (39) ఎంబీబీఎస్ కోర్సు పూర్తి చేసి గత నాలుగేళ్లుగా కాంట్రాక్ట్ ప్రాతిపదికన ధర్మారం మండలంలోని నందిమేడారం, చొప్పదండి మండలంలోని కటికనపల్లి గ్రామాల్లోని పీహెచ్‌సీల్లో వైద్యుడిగా విధులు నిర్వహించాడు. సుమారు నెల రోజుల క్రితం ఉద్యోగానికి రాజీనామా చేసి ఇంటి వద్దనే ఉంటున్నాడు. గౌతమ్ గతంలో రెండుసార్లు పీజీ ప్రవేశ పరీక్ష రాసినప్పటికీ మెరిట్ మార్కులు రాకపోవడంతో సీటు లభించలేదు. దీంతో కొంతకాలంగా తీవ్ర మనోవేదనకు గురవుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

Tollywood-Sri Vishnu: సంక్రాంతికి "ఫ్యామిలీ ప్యాక్"..ఇంత ఠఫ్ కాంపిటీషన్‌లో కూడానా!సినిమాSwechaa14 Sep 2026, 06:48 PM

Tollywood-Sri Vishnu: సంక్రాంతికి "ఫ్యామిలీ ప్యాక్"..ఇంత ఠఫ్ కాంపిటీషన్‌లో కూడానా!

Tollywood: టాలీవుడ్ యంగ్ హీరో శ్రీవిష్ణు నటిస్తున్న సినిమాకి తాజాగా టైటిల్‌ను ఫిక్స్ చేశారు మేకర్స్. రామ్ అబ్బరాజు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకి ఫ్యామిలీ ప్యాక్ అనే ఫన్నీ టైటిల్ ని ప్రకటించారు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండటం విశేషం. ఇక, వినయాక చవితి పండుగ సందర్భంగా టైటిల్ పోస్టర్‌ను రిలీజ్ చేయగా..దీనితో, ఈ సినిమా కథాంశం డబ్బు చుట్టూ తిరుగుందని అర్థమవుతోంది.

నిషేధం ఉన్నా పాక్‌ సరుకు భారత్‌లోకి.. గుట్టు రట్టు చేసిన డీఆర్ఐ!..InternationalSwechaa14 Sep 2026, 06:19 PM

నిషేధం ఉన్నా పాక్‌ సరుకు భారత్‌లోకి.. గుట్టు రట్టు చేసిన డీఆర్ఐ!..

పాకిస్థాన్‌ నుంచి అక్రమంగా ఎండు ఖర్జూరాలు భారత్‌కు తరలిస్తున్న ముఠాను డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు స్వాధీనం చేసుకొన్నారు. పాక్‌ నుంచి దిగుమతులపై నిషేధం ఉన్నప్పటికీ.. ఆ దేశానికి చెందిన 362 మెట్రిక్ టన్నులకు పైగా ఎండు ఖర్జూరాలను నాసిక్‌కు చేర్చినట్లు నిఘా వర్గాలు డీఆర్ఐ అధికారులకు సమాచారం ఇచ్చాయి. దీంతో నాసిక్‌లోని అంబాడ్ కంటైనర్ ఫ్రైట్ స్టేషన్ వద్ద ముంబయికి చెందిన ఓ సంస్థ దిగుమతి చేసుకున్న 13 కంటైనర్ల ఎండు ఖర్జూరాలను డీఆర్ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

Nayanthara-Mahashakthi: మహాశక్తిగా లేడీ సూపర్ స్టార్!సినిమాSwechaa14 Sep 2026, 06:05 PM

Nayanthara-Mahashakthi: మహాశక్తిగా లేడీ సూపర్ స్టార్!

Nayanthara: సీనియర్ స్టార్ హీరోయిన్, లేడీ సూపర్ స్టార్ నయనతార వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారు. హీరోయిన్‌గా పక్కా కమర్షియల్ సినిమాలను స్టార్ హీరోల సరసన నటిస్తూనే డివోషనల్ మూవీస్‌లోనూ అమ్మవారి పాత్రల్లో నటించి అలరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే, నయనతార నటిస్తున్న లేటెస్ట్ సినిమా ముకుత్తి అమ్మన్ 2 చేస్తున్నారు. తెలుగులో, ఈ సినిమా మహాశక్తిగా విడుదల కాబోతోంది. వినాయక చవితి పండుగ సందర్భంగా ఈ సినిమా నుంచి పోస్టర్ రిలీజైంది.

Telangana BJP :  తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్ vs బీఆర్ఎస్ వార్.. పత్తాలేని బీజేపీ లీడర్లు!తెలంగాణSwechaa14 Sep 2026, 05:49 PM

Telangana BJP : తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్ vs బీఆర్ఎస్ వార్.. పత్తాలేని బీజేపీ లీడర్లు!

Telangana BJP : తెలంగాణ అసెంబ్లీ వేదికగా అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ మధ్య సాగిన మాటల యుద్ధం రాష్ట్రాన్ని కుదిపేసింది. సభ లోపల, బయట ఇరు పార్టీల నేతలు మాటల తూటాలు, పోటాపోటీ సవాళ్లు ప్రజాక్షేత్రంలో తీవ్ర చర్చకు దారితీశాయి. రేవంత్ వర్సెస్ గులాబీ నాయకులు అన్నట్లుగా సాగిన ఈ హై-వోల్టేజ్ పొలిటికల్ డ్రామాతో రాష్ట్రంలోని ప్రధాన వార్తలన్నీ ఈ రెండు పార్టీల చుట్టూనే తిరిగాయి. అయితే తెలంగాణలో తామే ప్రత్యామ్నాయం అని నిత్యం గళమెత్తే బీజేపీ పార్టీ మాత్రం ఈ హోరాహోరీ పోరులో కనీసం కనిపించకుండా సైడ్ అయిపోవడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది.అసెంబ్లీ సమావేశాల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ వ్యూహాత్మకంగా వ్యవహరించి మీడియా ఫోకస్‌ను, ప్రజల దృష్టిని పూర్తిగా తమవైపే తిప్పుకున్నాయి. ప్రజా సమస్యలపై రచ్చ లేపడం, పరస్పర విమర్శలతో మైలేజ్ సాధించడంలో ఈ రెండు పార్టీలు దూకుడు ప్రదర్శించాయి. కానీ జనాల సమస్యలపై సర్కార్‌ను గట్టిగా నిలదీసి తన బలాన్ని నిరూపించుకోవాల్సిన బీజేపీ శాసనసభాపక్షం మాత్రం ఈ సువర్ణావకాశాన్ని చేజేతులా జారవిడుచుకుంది.

జగన్‌తో కుమ్మక్కు..! తెలంగాణలో కరవు పాపం కేసీఆర్‌దే!తెలంగాణSwechaa14 Sep 2026, 05:17 PM

జగన్‌తో కుమ్మక్కు..! తెలంగాణలో కరవు పాపం కేసీఆర్‌దే!

Komatireddy Venkat Reddy: మాజీ సీఎం కేసీఆర్‌పై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. తెలంగాణలో కరవు పాపం కేసీఆర్‌దే అని అన్నారు. ఏపీ మాజీ సీఎం జగన్‌తో కేసీఆర్ కుమ్మక్కయ్యారని, అందుకే తెలంగాణకు రావాల్సిన నీటిని కోల్పోయామని మంత్రి కోమటిరెడ్డి చెప్పారు. కేసీఆర్ చేసిన పనితో కష్ట కాలంలో శ్రీశైలం నుంచి నీటి తరలించే పరిస్థితి లేకుండా పోయిందని వాపోయారు.

Ramayana: వినాయక చవితి రోజున సీతా-రాముల పొస్టర్ రిలీజ్సినిమాSwechaa14 Sep 2026, 05:11 PM

Ramayana: వినాయక చవితి రోజున సీతా-రాముల పొస్టర్ రిలీజ్

Ramayana: బాలీవుడ్ లో స్టార్ హీరో రణబీర్ కపూర్ నటిస్తున్న డివోషనల్ మూవీ ‘రామాయణ’. బాలీవుడ్ దర్శకుడు నితేష్ తివారీ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఇందులో, రాముడిగా రణబీర్ కపూర్, టాలీవుడ్ హీరోయిన్, ఫిదా బ్యూటీ సాయి పల్లవి సీతగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈరోజు వినాయక చవితి. ఈ సందర్భంగా మేకర్స్ రామాయణ మూవీ నుంచి సీతా-రాముల పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ప్రస్తుతం, ఈ పోస్టర్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

కేసీఆర్‌పైనే రేవంత్ గురి.. కేటీఆర్, హరీశ్‌లను లైట్ తీసుకోవడం వెనుక అసలు స్కెచ్ ఇదే!తెలంగాణSwechaa14 Sep 2026, 05:01 PM

కేసీఆర్‌పైనే రేవంత్ గురి.. కేటీఆర్, హరీశ్‌లను లైట్ తీసుకోవడం వెనుక అసలు స్కెచ్ ఇదే!

Telangana Politics : కాంగ్రెస్ ప్రభుత్వంపై విపక్షాలు దాడి చేస్తున్న వేళ, సీఎం రేవంత్ రెడ్డి స్పందిస్తున్న తీరు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. రోజూ రోడ్లపైకి వచ్చి పోరాడుతున్నది కేటీఆర్, హరీశ్ రావులే అయినప్పటికీ.. రేవంత్ మాత్రం వారిని పూర్తిగా పక్కనపెట్టి ఫామ్‌హౌస్‌లో సైలెంట్‌గా ఉంటున్న గులాబీ బాస్ కేసీఆర్‌నే పదే పదే తెరపైకి తెస్తున్నారనే వాదన రాజకీయ వర్గాల్లో ప్రముఖంగా వినిపిస్తోంది. అయితే దీని వెనుక ఒక వ్యూహాత్మకమైన మైండ్ గేమ్‌తో పాటు దీర్ఘకాలిక రాజకీయ ఎత్తుగడ దాగి ఉందన్న విశ్లేషణలు బలంగా వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి క్షేత్రస్థాయిలో పోరాటాలు చేస్తోంది బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావు మాత్రమే. మీడియా సమావేశాలు, ధర్నాలు, క్షేత్రస్థాయి పర్యటనలతో ప్రభుత్వాన్ని ఎండగట్టేందుకు ఈ ఇద్దరు నేతలు నిరంతరం శ్రమిస్తున్నారు. కానీ సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగాలు గమనిస్తే, వీరిద్దరి విమర్శలకు కౌంటర్ ఇవ్వడానికి పెద్దగా ప్రాధాన్యం ఇచ్చినట్లు ఎక్కడ కనిపించడం లేదు.

Telangana Cabinet Expansion : తెలంగాణ కేబినెట్ లొల్లి.. టీపీసీసీ చెప్పినా తగ్గని ఆశావహులు.. రేవంత్ తేల్చేస్తారా?తెలంగాణSwechaa14 Sep 2026, 04:01 PM

Telangana Cabinet Expansion : తెలంగాణ కేబినెట్ లొల్లి.. టీపీసీసీ చెప్పినా తగ్గని ఆశావహులు.. రేవంత్ తేల్చేస్తారా?

తెలంగాణ కాంగ్రెస్ వర్గాల్లో మంత్రివర్గ విస్తరణ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతూ హైటెన్షన్ పుట్టిస్తోంది. ప్రస్తుతం కేబినెట్ విస్తరణ లేదని టీపీసీసీ చీఫ్ స్పష్టమైన ప్రకటన చేసినప్పటికీ, పదవులు ఆశిస్తున్న నేతల్లో మాత్రం వేడి ఏమాత్రం తగ్గడం లేదు. అధిష్టానం వద్ద తమకున్న పరపతిని ఉపయోగించి ఎలాగైనా ఈసారి మంత్రి పీఠం దక్కించుకోవాలని ఆశావహులు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ఈ గందరగోళానికి చెక్ పడాలంటే ఇప్పుడు స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డే రంగంలోకి దిగి క్లారిటీ ఇవ్వాల్సిన అనివార్య పరిస్థితి ఏర్పడిందని అంటున్నారు.

GolD :  24 క్యారెట్ల గోల్డ్, వజ్రాలతో మెరిసిన ‘బొజ్జ గణపయ్య’తెలంగాణSwechaa14 Sep 2026, 03:44 PM

GolD : 24 క్యారెట్ల గోల్డ్, వజ్రాలతో మెరిసిన ‘బొజ్జ గణపయ్య’

వినాయక చవితి వచ్చిందంటే చాలు..రంగురంగుల తీరొక్క గణపయ్యలు గల్లీగల్లీలో దర్శనమిస్తుంటాయి.పండుగకు రెండు, మూడు నెలల ముందు నుంచే విగ్రహాల తయారీ ప్రారంభం అవుతుంది. పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చిన కార్మికులు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన టెంట్లలో విగ్రహాల తయారీని ప్రారంభిస్తారు. విగ్రహా తయారీలో ప్రత్యేక శ్రద్ధ పెడతారు. కాగా, ప్రస్తుతం నగరంలో24 క్యారెట్ల బంగారం, వజ్రాలతో తయారైన విగ్రహం అందరినీ ఆకట్టుకుంటోంది. నగరంలోని బేగంబజార్ ఫీల్ ఖానాలోని ఓ జ్యువెలరీ షాపులో పంచలోహాలు, 24 క్యారెట్ల బంగారం, 3.83 లక్షల అమెరికన్ వజ్రాలతో 48 కేజీల భారీ గణపతి విగ్రహాన్ని తయారు చేయించారు. 8 మంది కళాకారులు 8 నెలల పాటు శ్రమించి దీన్ని రూపొందించారు. 11 రోజుల పూజల అనంతరం ఈ విగ్రహాన్ని యథావిధిగా ఉంచి, కేవలం మట్టి వినాయకుడిని మాత్రమే నిమజ్జనం చేస్తామని నిర్వాహకులు ఆధార్, నిఖితేశ్ తెలిపారు.

GaneshUtsav: 1000 రోజుల ప్రజాపాలనపై వినూత్న గణపతి !తెలంగాణSwechaa14 Sep 2026, 03:35 PM

GaneshUtsav: 1000 రోజుల ప్రజాపాలనపై వినూత్న గణపతి !

 భాగ్యనగరంలో గణేష్ నవరాత్రోత్సవాల సందర్భంగా ఒక సరికొత్త రాజకీయ-ఆధ్యాత్మిక థీమ్ నెటిజన్లను, భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు మద్దతుగా హైదరాబాద్‌లో కాంగ్రెస్ నేత మెట్టు సాయి కుమార్ ఆధ్వర్యంలో వినూత్న గణేష్ మండపాన్ని ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ పార్టీ చేపట్టిన 1000 రోజుల ప్రజాపాలనకు ప్రతీకగా ఈ ప్రత్యేక మండపాన్ని తీర్చిదిద్దడం నగరంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

అమెరికాలో రూ.620 కోట్ల మోసం.. హైదారాబాద్‌లో మకాం!క్రైమ్Swechaa14 Sep 2026, 03:26 PM

అమెరికాలో రూ.620 కోట్ల మోసం.. హైదారాబాద్‌లో మకాం!

అమెరికాలోని మెడికేర్ స్కీంలో భారీ కుంభకోణం జరిగినట్టు తెలుస్తోంది. అమెరికా నిఘా వర్గాలు ఈ విషయాన్ని తాజాగా కనిపెట్టగా యూఎస్ సర్కారు నుంచి భారీగా నిధులు దోచేసిన మాస్టర్‌మైండ్ ఓ భారతీయుడిగా అనుమానిస్తున్నారు. నకిలీ బిల్లులు సమర్పించి భారతీయ కరెన్సీలో రూ.వందల కోట్లు స్కామ్ చేసినట్టు సమాచారం. విషయం బయటకు రాకముందే అమెరికా విడిచి ఇండియాకు పారిపోయి వచ్చినట్టు అక్కడి నిఘావర్గాలు గుర్తించినట్టు సమాచారం. అమెరికాలో మెడికేర్ స్కీం ద్వారా అక్కడి పౌరులకు ఉచితంగా వైద్యం అందుతుంటుంది. ఆస్పత్రులకు యూఎస్ గవర్నమెంట్ బిల్లులు చెల్లిస్తుంటుంది.అయితే, రోగులు రాకుండానే, ట్రీట్మెంట్ చేయకుండానే చేసినట్టు నకిలీ బిల్లులు సమర్పించి రూ. వందల కోట్లు కాజేయగా.. దీని వెనుక ఆస్ప్రత్రుల హస్తం ఉందా? అనే కోణంలోనూ అమెరికా పోలీసులు విచారణ జరుపుతున్నట్టు తెలుస్తోంది.ఈ క్రమంలోనే అమెరికాలోని టెక్సాస్‌లో అమెరికన్ ప్రీమియర్ ల్యాబ్స్ నిర్వహించిన మహ్మద్ ఖదీర్‌ ఖాన్‌ అనే వ్యక్తి ఈ స్కాంలో సూత్రధారుడిగా ఉన్నట్టు తెలుస్తోంది.

కేటీఆర్ పీఏ, పీఆర్వోలకు పోలీసుల ప్రశ్నలు!తెలంగాణSwechaa14 Sep 2026, 03:15 PM

కేటీఆర్ పీఏ, పీఆర్వోలకు పోలీసుల ప్రశ్నలు!

 తెలంగాణ అసెంబ్లీ గేట్ నంబర్-3 వద్ద చోటుచేసుకున్న ఘర్షణ ఘటనకు సంబంధించి బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పీఏ మహేందర్ రెడ్డి, పీఆర్వో మాణిక్య మహేష్‌లను సైఫాబాద్ పోలీసులు సుదీర్ఘంగా ప్రశ్నిస్తున్నారు. జారీ చేసిన నోటీసుల మేరకు వీరిద్దరూ సైఫాబాద్ పోలీస్ స్టేషన్‌లో విచారణాధికారి ముందు హాజరయ్యారు. ఈ విచారణ ప్రక్రియ వారి తరఫు న్యాయవాదుల సమక్షంలో ప్రారంభం కాగా, పోలీసుల ప్రశ్నల తీరు, విచారణ సరళిపై న్యాయవాదులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడంతో స్థానికంగా ఉత్కంఠ వాతావరణం నెలకొంది.

Erravalli: గులాబీ బాసుల దాకా విచారణ.. ఎర్రవల్లి కేసులో సిట్ స్పీడ్!తెలంగాణSwechaa14 Sep 2026, 03:05 PM

Erravalli: గులాబీ బాసుల దాకా విచారణ.. ఎర్రవల్లి కేసులో సిట్ స్పీడ్!

తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా ఎర్రవల్లి ఫాంహౌస్‌ చుట్టూ భగ్గుమన్నాయి. అసెంబ్లీ వద్ద స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌ను ఉద్దేశించి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో రాజుకున్న అగ్గి.. చివరకు ఎర్రవల్లిలో పసుపు నీళ్లతో ‘శుద్ధి’ చేసే స్థాయికి చేరి పెను రాజకీయ తుఫానుగా మారింది. ఈ ఘటనను ప్రభుత్వం చాలా సీరియస్‌గా తీసుకోవడం, విచారణ బాధ్యతలను హైదరాబాద్ జాయింట్ కమిషనర్ విజయ్ కుమార్‌కు అప్పగించడంతో వ్యవహారం పతాక స్థాయికి చేరింది. కేవలం కింది స్థాయి కార్యకర్తలతో ఈ వ్యవహారం ముగుస్తుందా? లేక విచారణ సెగ గులాబీ దళపతులకు కూడా తాకుతుందా? అన్నది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది.

భారత్-అఫ్గాన్ మ్యాచ్‌లో వందేమాతరం పూర్తి గీతం.. వేడెక్కిన రాజకీయాలు!క్రీడలుSwechaa14 Sep 2026, 03:03 PM

భారత్-అఫ్గాన్ మ్యాచ్‌లో వందేమాతరం పూర్తి గీతం.. వేడెక్కిన రాజకీయాలు!

 భారత క్రికెట్ చరిత్రలో ఒక అరుదైన అధ్యాయానికి తెరలేచింది. అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ ప్రారంభానికి ముందు తొలిసారిగా జాతీయ గేయం ‘వందేమాతరం’ పూర్తి గీతాన్ని అధికారికంగా ఆలపించారు. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో భారత్, ఆఫ్ఘనిస్థాన్ జట్ల మధ్య జరిగిన తొలి టీ20 మ్యాచ్ ఆరంభానికి ముందు ఈ భావోద్వేగ ఘట్టం చోటుచేసుకుంది. సుమారు 3 నిమిషాల 10 సెకన్ల నిడివి కలిగిన ఆరు చరణాల ‘వందేమాతరం’ పూర్తి గీతాన్ని ఆలపించిన అనంతరం, యథావిధిగా జాతీయ గీతం ‘జనగణమన’ను ప్లే చేశారు.

హైవేపై రెచ్చిపోయిన పోకిరీలు.. కారుతో మహిళా బైకర్‌ను ఢీకొట్టి పరార్!వైరల్ న్యూస్Swechaa14 Sep 2026, 02:52 PM

హైవేపై రెచ్చిపోయిన పోకిరీలు.. కారుతో మహిళా బైకర్‌ను ఢీకొట్టి పరార్!

ఢిల్లీ-గురుగ్రామ్ సరిహద్దు రహదారిపై మహిళా భద్రతను ప్రశ్నించేలా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించే దారుణ సంఘటన వెలుగుచూసింది. రహదారిపై స్పోర్ట్స్ బైక్ నడుపుకుంటూ వెళ్తున్న 'సియా' అనే మహిళా బైకర్‌ను కొందరు పోకిరీలు కారులో వెంబడించి దారుణానికి ఒడిగట్టారు. ఒంటరిగా బైక్ నడుపుతున్న మహిళను లక్ష్యంగా చేసుకుని ఈ ఆకతాయి మూక వేధింపులకు దిగడంతో స్థానికంగా, సోషల్ మీడియాలో తీవ్ర నిరసనలు, ఆగ్రహజ్వాలలు వ్యక్తమవుతున్నాయి.

‘రీల్ మాక్’ కాదు.. తలసానిని ప్రతిపక్ష నేతను చేయండి : టీపీసీసీ చీఫ్తెలంగాణSwechaa14 Sep 2026, 02:31 PM

‘రీల్ మాక్’ కాదు.. తలసానిని ప్రతిపక్ష నేతను చేయండి : టీపీసీసీ చీఫ్

బీఆర్ఎస్ సభ్యులు మాక్ అసెంబ్లీ నిర్వహించడంపై తాజాగా టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ స్పందించారు. ముందుగా తెలంగాణ రాష్ట్ర ప్రజానీకానికి, పార్టీ నాయకులకు, విపక్ష నాయకులకు, ఇతర పార్టీల నాయకులకు, మీడియా మిత్రులకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు.వినాయక చవితి పండుగ సందర్బంగా సోమవారం గాంధీ భవన్‌లో టీపీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రీల్ మాక్ అసెంబ్లీ పెట్టడం కాదు, దమ్ముంటే మాజీ మంత్రి, సనత్ నగర్‌ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను ప్రతిపక్ష నాయకుడిని చేయాలని డిమాండ్ చేశారు. పండగ రోజున తప్పని పరిస్థితుల్లో రాజకీయాలు మాట్లాడాల్సి వస్తుందని, స్పీకర్‌ను కులం పేరుతో దూషించిన దుస్థితి రాష్ట్రంలో నెలకొన్నదని పేర్కొన్నారు. దళితుల పట్ల బీఆర్‌ఎస్ వైఖరి స్పష్టం అయ్యిందని, ఉద్దేశపూర్వకంగానే స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మీద అనుచిత వ్యాఖ్యలు చేశారన్నారు.

లవ్ మ్యారేజ్‌కు సాయం చేశాడని.. యువకుడిపై కిరాతకంక్రైమ్Swechaa14 Sep 2026, 02:10 PM

లవ్ మ్యారేజ్‌కు సాయం చేశాడని.. యువకుడిపై కిరాతకం

ప్రేమ వివాహానికి సాయం చేశాడనే కారణంతో ఓ యువకుడిపై అమ్మాయి కుటుంబ సభ్యులు, బంధువులు దాడి చేసి దారుణంగా హతమార్చారు.ఈ ఘటన హైదరాబాద్‌లోని లాలాగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకోగా..ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకివెళితే.. కార్తీక్ (40) అనే వ్యక్తి లాలాగూడలో నివాసం ఉంటున్నాడు. స్థానికంగా పని చేసుకుంటూ కుటుంబంతో కలిసి జీవనం సాగిస్తున్నాడు. అయితే, నాలుగేళ్ల కిందట ఓ యువతి ప్రేమపెళ్లికి కార్తీక్‌ సహకారం అందించాడు. దాంతో అప్పటి నుంచి యువతి కుటుంబ సభ్యులు, బంధువులు కార్తీక్‌ మీద కక్షపెంచుకున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే పండుగ నేపథ్యంలో వినాయక మండపం ఏర్పాటు చేస్తుండగా కార్తీక్‌తో యువతి తరపు బంధువుల గొడవకు దిగినట్టు సమాచారం. అది కాస్త తీవ్రతరం కావడంతో ఇరువర్గాల మధ్య తీవ్ర ఘర్షణకు దారితీసింది. యువతి సోదరులు కార్తీక్ గొంతుకోసి పరార్ అయినట్టు తెలిసింది.

మీనాక్షి నటరాజన్ ఔట్? కొత్తగా వచ్చేది ఎవరు?తెలంగాణSwechaa14 Sep 2026, 01:30 PM

మీనాక్షి నటరాజన్ ఔట్? కొత్తగా వచ్చేది ఎవరు?

తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌ను త్వరలోనే తప్పించనున్నారని మరోసారి జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇటీవల అధికార పార్టీలో నెలకొన్న పరిస్థితులు, కేబినెట్ నుంచి కొండా సురేఖను తప్పించడం, మరో నలుగురు జిల్లా స్థాయి నేతలకు షోకాజు నోటీసులు ఇవ్వడం..పదవుల కోసం కొందరు సీనియర్లు అధికారపార్టీనే టార్గెట్ చేయడం, పదే పదే నేతలు ఢిల్లీకి వస్తూ ఫిర్యాదులు చేస్తుండటంతో రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి ఏం చేస్తున్నారనే ప్రశ్న ఉత్పన్నం అయినట్టు తెలుస్తోంది. నేతలు పార్టీ లైన్ దాటి మాట్లాడుతుంటే మీనాక్షి నటరాజన్ సరిగా హ్యండిల్ చేయలేకపోతున్నారనే విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి అధిష్టానం వద్ద ఫిర్యాదు చేసినట్టు ప్రచారం జరుగుతోంది. దీంతో ఆమె స్థానంలో కొత్తవారిని నియమించేందుకు అధిష్టానం కసరత్తు చేేస్తున్నట్టు తెలిసింది.