సినిమా

Tollywood: జనవరి నుంచి సెట్స్‌పైకి రానున్న NBK 112..

Tollywood: గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ హీరోగా ఆయన కెరీర్‌లో 112వ సినిమాను సెట్స్ పైకి తీసుకువచ్చే ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. కొరటాల శివ ఈ సినిమాను భారీ స్థాయిలో తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నాడు. ఇప్పటికే స్క్రిప్ట్ లాకైనట్టుగా సమాచారం. ఇక, ఫిల్మ్ సర్కిల్స్ నుంచి అందుతున్న అప్‌డేట్ మేరకు 2027 జనవరి నుంచి కొరటాల-బాలయ్య సినిమా సెట్స్‌పైకి రానుందట.

ప్రస్తుతం, బాలయ్య.. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో చేస్తోన్న దాదా చిత్రాన్ని ముగించే పనిలో ఉన్నారు. షూటింగ్‌తో పాటు డబ్బింగ్ వర్క్‌ను పూర్తి చేస్తున్నాడు బాలయ్య. ఈ డిసెంబర్ 24న క్రిస్మస్ కానుకగా రిలీజ్ చేయనున్నారు. థమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్‌గా కాజల్ అగర్వాల్ నటిస్తోంది. ఇప్పటి వరకూ వచ్చిన ప్రమోషనల్ కంటెంట్‌తో అంచనాలు భారీగా పెరిగాయి.

ఇక, ఈ సినిమాను పూర్తి చేస్తూనే పెద్దగా గ్యాప్ తీసుకోకుండా బాలయ్య తన 112వ సినిమా షూట్‌లో జాయిన్ కానున్నాడని తెలుస్తోంది. కొరటాల 2027 జనవరి నుంచి షెడ్యూల్స్ ప్లాన్ చేశాడట. ఫస్ట్ షెడ్యూల్‌లో బాలయ్యపై హెవీ యాక్షన్ సీక్వెన్సెస్‌ను ప్లాన్ చేసినట్టుగా తెలుస్తోంది. ఇక, ఈ సినిమాలో హీరోయిన్‌గా పలువురు పేర్లు పరిశీలించినప్పటికీ, ఫైనల్‌గా బాలయ్య సరసన అఖండ 2లో నటించిన సంయుక్త మేనన్‌ని ఎంపిక చేసినట్టు తెలుస్తోంది.

ఇక, కొరటాల.. బాలయ్యను కొత్త తరహా మేకోవర్‌లో చూపించబోతున్నట్టుగా తెలుస్తోంది. ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్‌గా జీవీ ప్రకాష్ కుమార్‌ను ఫిక్స్ చేసినట్టుగా విశ్వనీయ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం. నాన్ స్టాప్‌గా షూటింగ్ పూర్తి చేసి 2027 దసరా పండుగ సందర్భంగా రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారట. ఆచార్య, దేవర సినిమాలతో ఆశించిన విజయాన్ని అందుకోని కొరటాల, బాలయ్యతో చేస్తున్న సినిమాతో మళ్ళీ సాలీడ్ హిట్ కొట్టి కంబ్యాక్ ఇవ్వాలని గట్టిగా శ్రమిస్తున్నాడు.

తర్వాత చదవండి