సినిమా

Tollywood: ఇటు త్రివిక్రమ్ అటు అనిల్ మధ్యలో ఎన్టీఆర్..

4 నిమిషాల పఠనం

Tollywood: ఇటు త్రివిక్రమ్ అటు అనిల్ మధ్యలో ఎన్టీఆర్. అవును, ఇలా ఇద్దరు స్టార్ డైరెక్టర్స్‌తో దాదాపు ఒకేసారి ఓ స్టార్ హీరో సినిమాలు మొదలైతే, ఆ కిక్కే నెక్స్ట్ లెవల్. ప్రస్తుతం, మాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్..ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో డ్రాగన్ అనే హెవీ యాక్షన్ సినిమాను చేస్తున్నాడు. ఇందులో, ఆయన పాత్ర చాలా సీరియస్‌గా సాగుతుంది. అయితే, ఈ సినిమా పూర్తి కాగానే ఇంచుమించు ఒకేసారి రెండు చిత్రాలు సెట్స్‌పైకి తీసుకురానున్నాడు తారక్.

వరుసగా సీరియస్ సినిమాలు చేసిన తారక్..ఇప్పుడు కాస్త ట్రాక్ మార్చి కంప్లీట్ ఎంటర్‌టైనర్‌గా ఉండే కథకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఆ దర్శకుడెవరో కాదు అనిల్ రావిపూడి. ఇటీవలే, అఫీషియల్‌గా ఈ ప్రాజెక్ట్‌ను ప్రకటించాడు ఎన్టీఆర్ సోదరుడు, హీరో కం ప్రొడ్యూసర్ నందమూరి కళ్యాణ్ రామ్. తన ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌లో ఈ సినిమాను నిర్మించనున్నాడు.

అయితే, 2027 జూలై నుంచి 'గాడ్ ఆఫ్ వార్' మూవీ షూటింగ్ ప్రారంభం కాబోతుందని నిర్మాతలలో ఒకరైన సూర్యదేవర నాగవంశీ వెల్లడించాడు. త్రివిక్రమ్ కూడా గాడ్ ఆఫ్ వార్ కథను తారక్‌కి నరేట్ చేసేశాడు. బౌండెడ్ స్క్రిప్ట్ వర్క్ పూర్తవుతోంది. పక్కాగా, స్క్రిప్ట్ అండ్ టెక్నికల్ టీమ్..ఇతర నటీనటుల ఎంపిక ప్రక్రియను మరో రెండు నెలల్లో పూర్తి చేయనున్నారు. ఎట్టి పరిస్థితుల్లో 2027 జూలై నుంచి షూటింగ్ మొదలవుతుంది.

ఇంకోవైపు, అనిల్ రావిపూడి కూడా కాస్త అటు ఇటుగా అదే సమయంలో ఎన్టీఆర్ సినిమాను సెట్స్‌పైకి తీసుకురానున్నాడు. ప్రతీ ఏడాది అంతే. జూన్ లేదా జూలై నుంచి షూటింగ్ ప్రారంభించి నవంబర్ లోపు మొత్తం సినిమాను రెడీ చేస్తున్నాడు. జోరుగా ప్రమోషన్స్ నిర్వహించి సంక్రాంతి బరిలో దిగి హిట్ కొడుతున్నాడు. ఎన్టీఆర్ సినిమాను కూడా అలాగే 2028 సంక్రాంతికి ప్లాన్ చేస్తున్నాడు. గురూజీ సినిమాకి ఎలాగైనా ఎక్కువ సమయం పడుతుంది కాబట్టి..రెండు ప్రాజెక్ట్స్ ఒకేసారి మొదలైనా..ముందు అనిల్ రావిపూడి సినిమా రెడీ అవుతుంది. మొత్తానికి, ఎన్టీఆర్ కి ఒకవైపు అనిల్ రావిపూడి ఇంకో త్రివిక్రమ్ ఉండి రఫ్ఫాడించబోతున్నారనమాట.

#NTR#TRIVIKRAM#ANIL RAVIPUDI#TOLLYWOOD#LATEST MOVIE UPDATES#Swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి