సినిమా

Tollywood: 2027 జూలై నుంచి సెట్స్‌పైకి రానున్న ‘గాడ్ ఆఫ్ వార్’..

4 నిమిషాల పఠనం

Tollywood: మాన్ ఆఫ్ మాసెస్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కనున్న భారీ మైథలాజికల్ సినిమాపై తాజాగా సాలీడ్ అప్‌డేట్ వచ్చింది. ఆదర్శకుటుంబం ఫ్లాప్ వల్ల తారక్ ఈ సినిమాను హోల్డ్ చేశాడని..ఈ సినిమా ఉంటుందో? లేదో? అంటూ పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో వార్తలు వచ్చాయి. ఇటీవల వాటికి హారిక అండ్ హాసిన నిర్మాతతో కలిసి క్లారిటీ ఇచ్చారు గురూజీ.

ఇప్పుడు మరో నిర్మాత నాగవంశీ అభిమానుల్లో కలిగిన సందేహాలకు తెరదించారు. తాజాగా, ఈ ప్రాజెక్ట్ షూటింగ్ ప్రారంభంపై అధికారికంగా ప్రకటించారు. ఇటీవల, ధనుష్-మమ్ముట్టి నటించిన ఓం సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఈవెంట్‌కు ఐకాన్ స్టార్ అల్లు అరున్‌తో పాటు పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. వారిలో నిర్మాత నాగవంశీ కూడా ఉన్నారు. ఈ సందర్భంగానే ఆయన గాడ్ ఆఫ్ వార్ షూటింగ్ 2027 జూలై నుంచి మొదలవనున్నట్టుగా తెలిపారు.

ప్రస్తుతం డ్రాగన్ షూట్‌లో ఉన్న తారక్:

ప్రస్తుతం, ఎన్టీఆర్.. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'డ్రాగన్' సినిమా చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. ఈ సినిమా 2027 జూన్‌లో విడుదల కానున్న నేపథ్యంలో, పూర్తిగా తారక్ ఈ సినిమా మీదే దృష్టి పెట్టాడు. ఈ సినిమా పనులన్నీ పూర్తయిన తర్వాత, త్రివిక్రమ్ ప్రాజెక్ట్‌పై ఎన్టీఆర్ దృష్టి పెట్టనున్నాడు. అందుకే, జూలై 2027ను షూటింగ్ ప్రారంభానికి సన్నాహాలు చేస్తున్నారు.

ఇంతకముందు ఎన్టీఆర్, త్రివిక్రమ్ ల కాంబినేషన్‌లో వచ్చిన 'అరవింద సమేత వీరరాఘవ' బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఇప్పుడు, మళ్ళీ వీరిద్దరూ మరోసారి సినిమా చేస్తుండటంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. అయితే, ఈసారి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ కాకుండా పౌరాణిక కథాంశంతో సినిమా చేయబోతుండటం ఆసక్తికరమైన విషయం. ఇక, ఈ సినిమాను హారిక అండ్ హాసిని వారు భారీ బడ్జెట్‌తో నిర్మించనున్నారు.

#NTR#TRIVIKRAM#NAGAVAMSHI#TOLLYWOOD#LATEST CINEMA UPDATES
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి