Varanasi: దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న వారణాసి సినిమా వాయిదా పడబోతుందని తాజాగా వార్తలు వచ్చి వైరల్ అవుతున్నాయి. దీనికి, కారణం ఆశించిన స్థాయిలో వీఎఫ్ఎక్స్ అవుట్‌పుట్ రాలేదట. ఈ విషయంలో దర్శకుడు రాజమౌళి పూర్తి అసంతృప్తితో ఉన్నాడని..అందుకే, ఆయన వారణాసి చిత్రాన్ని వాయిదా వేయాలని సూచించాడట.
రాజమౌళి తీసిన ప్రతీ సినిమాకి చాలా సమయం తీసుకుంటాడనే విషయం అందరికీ తెలిసిందే. దీనికి, కారణం ఆయన ప్రతీ ఫ్రేమ్ కూడా ఎంతో పర్ఫెక్ట్గా రావాలని భీష్మించుకు కూర్చుంటాడు. అస్సలు ఈ విషయంలో కాంప్రమైజ్ కాడు. ఇదే, కాదు ఏ విషయంలోనూ దర్శక ధీరుడు ఒక్కశాతం కూడా కాంప్రమైజ్ కాడు. అందుకే, ఇప్పుడు వారణాసి సినిమా విజువల్ ఎఫెక్ట్స్ చాలా పేలవంగా అనిపించి అవసరమైతే రిలీజ్ డేట్ మార్చాలని నిర్ణయించుకున్నాడట.
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న వారణాఇ దాదాపు 1400 కోట్ల భారీ బడ్జెట్‌తో డా.కె.ఎల్.నారాయణ, ఎస్.ఎస్.కార్తికేయ నిర్మిస్తున్నారు. గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్గా మలయాళ క్రేజీ స్టార్ పృథ్వి రాజ్ సుకుమారన్ కీలక పాత్రలో నటించారు. దాదాపు, చిత్రీకరణ మొత్తం పూర్తై పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్‌ను జరుపుకుంటోంది. మరోవైపు కీరవాణి బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌ను కంప్లీట్ చేస్తున్నారు.
120 దేశాలలో..50 భాషలలో అత్యంత భారీ స్థాయిలో రిలీజ్ చేయనున్నారు. అయితే, బాహుబలి నుంచి రాజమౌళి సినిమాలలో వీఎఫ్ఎక్స్ వర్క్‌కి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. దీనికోసం విదేశీ వీఎఫ్ఎక్స్ టెక్నీషియన్స్ వందలకొద్ది పని చేస్తుంటారు. అయితే, ఈసారి వారణాసి కోసం రెట్టింపు స్థాయిలో వర్క్ చేస్తుండగా, ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ కూడా ఉపయోగించారని తెలుస్తోంది. అందుకే, జక్కన్న స్థాయిలో వీఎఫ్ఎక్స్ వర్క్ లేదని..దీనికోసం ఇంకా చాలా సమయం పట్టే అవకాశాలున్నాయని..ఏప్రిల్ నుంచి ఆగస్టుకు వాయిదా వేయాలని చూస్తున్నారట. దీనిపై, జక్కన్న బృందం స్పందించాల్సి ఉంది.
