- వివిధ రకాలుగా ఫిర్యాదులు చేసినా ఎఫ్ఐఆర్ చేయలేకపోయారు?
- అక్రమ కేసులతో ఎంతోమంది జర్నలిస్టులను బెదిరించారు
- రాత్రికి రాత్రి దొంతు రమేష్‌ను, సీసీఎస్‌లో చంటి పాపతో మరొకరిని..
- 120 మంది ఐపీఎస్‌లలో సజ్జనార్ అంటే గుర్తింపు తెచ్చింది ఇదే జర్నలిస్టులు
- మా తప్పు లేకున్నా నాయకులతో అంటకాగే మీకే అంత ఉంటే..
- టైం వచ్చినప్పుడు ఫోర్త్ ఎస్టేట్ ఇలా కూడా పని చేయొద్దా?
- తెలంగాణలో సంపాదించి కర్ణాటకకు పంపిన రూ. వందల కోట్ల లెక్కలు తేలాలి?
- అప్పుడే తెలంగాణ అంటే ఏంటో అర్ధమవుతుంది
- కుట్రలను చేధిస్తాం.. కుతంత్రాలను ‘స్వేచ్ఛ’గా తెలియజేస్తాం
దేవేందర్ రెడ్డి చింతకుంట్ల
9848070809
స్వేచ్ఛ న్యూస్, ఛైర్మన్
పేరు మీకు.. శిక్ష సిబ్బందికా?
‘దిశ’ ఎన్‌కౌంటర్ అంటే పేరొచ్చింది మీకే. మిమ్మల్ని హీరో చేసింది జర్నలిస్టులే. వరంగల్ యాసిడ్ దాడి సమయంలో దగ్గర ఉండి ఆనాడు రిపోర్ట్ చేసిన రిపోర్టర్ దొంతి రమేష్‌ను రాత్రికి రాత్రి పట్టుకొచ్చి అరెస్ట్ చేసి చూపించారు. ఇలా అనేక మందిని మీరు సీపీగా రిమాండ్‌కు తరలించి జైల్లో పెట్టాలని చూశారు. పదుల సంఖ్యలో సోషల్ మీడియా జర్నలిస్టులను ఇబ్బంది పెట్టినా ఊచలు లెక్కబెట్టించలేకపోయారు. కానీ రోజురోజుకూ డబ్బుల కోసం దిగజారిపోయిన తీరును తెలంగాణ సమాజం గుర్తిస్తుంది. మీకు పేరు, ప్రతిష్ట కావాలి. అపవాదు రాకుండా జాగ్రత్త పడతారు. అదే విధంగా అన్ని పదవులు అనుభవించాలనే ఆశ. దిశ ఎన్‌కౌంటర్ ఫేక్ అని జస్టిస్ సర్పఖర్ ధర్మాసనం తేల్చింది.
100 మంది పోలీసులు ప్రత్యక్ష్యంగా పాల్గొన్నా టాప్ 10 మంది పోలీసులపైన మర్డర్ కేసు నమోదు చేశారు. ఇప్పుడు ట్రయల్ నడుస్తోంది. మీకు ఒక్క రిమార్క్ లేకుండా చేసుకున్నారు. మీరు సీపీగా పేరుగాంచారు. కేసుల నుంచి తప్పించుకున్నారు. మీ ఆదేశాలు పాటించిన ఆ అధికారుల పరిస్థితి ఒక్కసారి ఆలోచించారా? మీ సొంత ప్రచారానికి సోషల్ మీడియాలో ఇచ్చుకున్న ప్రయార్టీ ఎందుకోసమో, దేనికోసమే గత సైబరాబాద్ కమిషనర్‌గా, ఆర్టీసీలో స్కీం పేర్లతో స్కాంగా మార్చింది? ఇప్పుడు నీతి నిజాయితీ లేకుండా చేసిన అక్రమాలు ఏంటో అందరికీ తెలిసిపోయాయి సార్.
మీరు ఎంత ఎక్కువ ఆలోచిస్తే మరింతగా ఈ సమాజం ఆలోచిస్తుంది.
మీరు సీపీగా ఉన్నన్ని రోజులు ఎన్ని అక్రమాలు, అవినీతి చేసినా ఒక్కరోజు కూడా రాయలేదు.హైదరాబాద్ అప్పగిస్తే ఇలా కూడా దోచుకోవచ్చా అన్నట్లు చేశారు. వ్యక్తిగతంగా ఏమీ ఉండదు. కానీ మీ తీరు మరో కమిషనరేట్‌కు పాకేలా పనిచేస్తుంది.అందుకే తెలంగాణ సమాజం జై అన్న సజ్జనార్‌ను అక్రమాలతో జీరో చేసి చూపించేందుకు సిద్ధంగా ఉంది. ఎన్ని కేసులు పెట్టాలని ప్రయత్నం చేసినా తెలంగాణ జర్నలిజం ఏదో ఒక మూలన ఇలా నిజాలు చెబుతూనే ఉంటుంది.


