ఏపీ

Ap : ఏపీలో ప్రధాని మోడీ తల్లి పేరిట ఆలయం..!

3 నిమిషాల పఠనం

ఏపీలో ప్రధాని నరేంద్రమోడీ తల్లి హీరాబెన్ పేరిట ఆలయం నిర్మిస్తున్నట్టు తెలుస్తోంది. కర్నూలు జిల్లాలో ఆలయ నిర్మాణానికి భూమి పూజ కూడా చేశారు. జిల్లాలోని ఎమ్మిగనూరు మండలం గుడికల్ (గుండికల్) గ్రామంలో ఈ ఆలయాన్ని నిర్మిస్తున్నారు. నవంబర్ 15న దీనికి సంబంధించిన శంకుస్థాపన కార్యక్రమం జరిగింది.

ఏపీలో ప్రధాని నరేంద్రమోడీ తల్లి హీరాబెన్ పేరిట ఆలయం నిర్మిస్తున్నట్టు తెలుస్తోంది. కర్నూలు జిల్లాలో ఆలయ నిర్మాణానికి భూమి పూజ కూడా చేశారు. జిల్లాలోని ఎమ్మిగనూరు మండలం గుడికల్ (గుండికల్) గ్రామంలో ఈ ఆలయాన్ని నిర్మిస్తున్నారు. నవంబర్ 15న దీనికి సంబంధించిన శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. మాతా శ్రీ మందిరం చారిటబుల్ ట్రస్ట్ సొసైటీ ఆధ్వర్యంలో హీరాబెన్ మోడీ స్మారకార్థం ఈ మందిరాన్ని నిర్మిస్తున్నారు. అంతేకాకుండా, ఆలయ ప్రాంగణంలో శివుడు, దక్షిణమూర్తి, రాముడు, వినాయక ఆలయాలు, అనాథ శరణాలయం, గోశాలను సైతం నిర్మించనున్నట్టు తెలుస్తోంది.

ఆలయ నిర్మాణ పనుల సమయంలో ఆదోని బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బీజేపీ నేతలతో పాటు జనసేన, వైసీపీ నాయకులు, గ్రామస్తులు పార్టీలకు అతీతంగా హాజరై మద్దతు తెలిపారు.త్వరలోనే నిర్మాణ పనులను పూర్తి చేసి భక్తులకు, సందర్శకులకు అందుబాటులోకి తీసుకురావాలని ట్రస్ట్ నిర్వాహకులు యోచిస్తున్నారు.

ఇదిలాఉండగా, ప్రధాని మోడీ తల్లి జూన్ 18, 1923లో గుజరాత్‌లోని మెహసానా జిల్లా విస్నగర్/వాద్నగర్)లో జన్మించారు. దామోదర్ దాస్ మూల్చంద్ మోడీని వివాహం చేసుకున్నారు. వీరికి ఐదుగురు కుమారులు (సోమ మోడీ, అమృత్ మోడీ, ప్రహ్లాద్ మోడీ, పంకజ్ మోడీ, నరేంద్ర మోడీ), ఒక కుమార్తె (వాసంతీబెన్) ఉన్నారు. కుటుంబ నేపథ్యం విషయానికొస్తే హీరాబెన్ చిన్నతనంలో కఠిక పేదరికాన్ని అనుభవించారని సమాచారం. వివాహం తర్వాత వాద్నగర్‌లోని ఒక చిన్న ఇంట్లో జీవించినట్టు తెలిసింది. డిసెంబర్ 30, 2022న అనారోగ్యంతో అహ్మదాబాద్‌లోని యూఎన్ మెహతా ఆసుపత్రిలో కన్నుమూశారు. ఆ సమయంలో ఆమె వయస్సు (99) సంవత్సరాలు.

#pm modi#mother heeraben#temple#andrapradesh#kurnool#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి