సినిమా

Bhogi New Release Date: సంపత్ నంది, శర్వానంద్ ల "భోగి" కొత్త విడుదల తేదీ లాక్

Bhogi New Release Date: కొన్ని సినిమాలు, కొన్ని కాంబినేషన్స్ గురించి ఇటు సినీ వర్గాలలో అటు అభిమానుల్లో, ప్రేక్షకుల్లో ఆసక్తి విపరీతంగా ఉంటుంది. విడుదల వాయిదా పడ్డా కూడా అదే ఆసక్తి, ఉత్సాహం ఉంటాయి. అలా ఉన్న సినిమా భోగి. ఇది, మన టాలెంటెడ్ డైరెక్టర్ సంపత్ నంది దర్శకత్వంలో రూపొందుతోన్న పీరియాడికల్ డ్రామా. హీరోగా శర్వానంద్ నటించాడు. ఈ నవంబర్ 27న భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

తాజాగా, మేకర్స్ కొత్త విడుదల తేదీని ప్రకటిస్తూ విడుదల తేదీతో కూడుకున్న శర్వా పోస్టర్‌ను వదిలారు. అంతేకాదు, ఇంతకముందు పోస్ట్ పోన్ అయిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను కూడా ప్రకటించారు. నవంబర్ 22న హైదరాబాద్ దసపల్లా హోటల్‌లో సాయంత్రం 5 గంటల నుంచి భోగి ట్రైలర్ లాంచ్ ఈవెంట్ మొదలవనున్నట్టుగా వెల్లడించారు.

హీరోయిన్స్‌గా అనుపమ, డింపుల్:

భోగి సినిమా.. ఇందులో హీరోయిన్స్‌గా నటించిన అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హయాతిలకి చాలా ప్రత్యేకంగా నిలవనుంది. వారి పాత్రలను ఎంతో అద్భుతంగా డిజైన్ చేశారు సంపత్ నంది. వీరిద్దరు ఇప్పటి వరకూ చేసిన సినిమాలన్నీ ఒకెత్తైతే..భోగి ఒక్కటే ఒకెత్తు అని చెప్పుకునేలా ఉంటాయి అనుపమ, డింపుల్ పాత్రలు.

సంపత్ నందికి మైల్ స్టోన్ మూవీగా భోగి:

ఈ సినిమా దర్శకుడిగా సంపత్ నందికి మైల్ స్టోన్ మూవీగా నిలవనుందని ఇండస్ట్రీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. శర్వా కెరీర్‌లో గంగ పాత్ర ఎప్పటికీ మర్చిపోని విధంగా దర్శకుడు సంపత్ నంది తయారు చేశారట. ఎంతో ఎమోషనల్‌గా సాగుతుందని..కొన్ని సన్నివేశాలు చూస్తున్నప్పుడు గుండె బరువెక్కి కన్నీళ్ళు ఆగవని చిత్ర యూనిట్ ద్వారా తెలుస్తోంది. ఇక, శర్వాకి భోగి హ్యాట్రిక్ సినిమా కానుంది. ఇందులో, ఎలాంటి సందేహమూ లేదు. కాగా, ఈ సినిమాను శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కె.కె. రాధామోహన్ నిర్మిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో సంగీత దర్శకుడు.

తర్వాత చదవండి