Goreti Venkanna: ఏ విషయాన్నైనా ముక్కుసూటిగా, నిక్కచ్చిగా మాట్లడే వ్యక్తి గోరెటి వెంకన్న. ప్రముఖ గేయ రచయిత, గాయకుడు అయిన వెంకన్న, కొత్తగా రూపొందుతోన్న ‘రాజిగాడు రాజయ్యాడు’ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్‌కి అథిదిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అంతేకాదు, ఆ వ్యాఖ్యలు పలువురు సినీ, రాజకీయా నాయకులను ఆలోచింపజేస్తుండటం ఆసక్తికరం.
యూనివర్సిటీ స్థాయిలో కుల ప్రస్థావన ఎందుకు?
గత కొంతకాలంగా యూనివర్సిటీ స్థాయిలో కూడా కుల ప్రస్థావన వస్తోంది. అది ఎందుకూ? అంటూ గోరేటీ ప్రశ్నించారు. అంతేకాదు, గతంలో కంటే కుల ప్రస్థావన ఇప్పుడెక్కువైందని అభిప్రాయపడ్డారు. అధికార వర్గాల్లో కులం అడగడం ఏంటని అన్నారు.
కళకి చిన్న సినిమా పెద్ద సినిమా అనేది ఉండదు:
ఇక, తాజాగా జరిగిన ‘రాజిగాడు రాజయ్యాడు’ సినిమా టీజర్ ఈవెంట్లో చిన్న సినిమా పెద్ద సినిమా అంటూ ఏదీ ఉండదని..అవసరమైన వనరులు సమకూరితే అదే సినిమా అంటూ చెప్పుకొచ్చారు. తమిళ ఇండస్ట్రీలో ఈ బేధాలన్నీ ఎప్పుడో దాటిపోయాయి. మలయాళంలో సత్యం శివం సుందరం అనే సినిమా వచ్చింది. ఆ సినిమా చూసి చెప్పండి..అది చిన్న సినిమానా పెద్ద సినిమానా. తెలుగు సినిమాలో ఈ చిన్న సినిమా పెద్ద సినిమా అనే ప్రచారం ఆగాలి.
5 నందులు వచ్చినటువంటి కథ:
5 నందులు వచ్చినటువంటి కథను ఎన్నుకొని సినిమా తీశాడు అల్తాఫ్. హ్యాట్సాఫ్..నాకసలు సినిమాలు చూసే అలవాటు లేదు కానీ, ఈ సినిమాను మూడుసార్లు చూశాను. ఈ ఏడాది 20 సినిమాలలో పాటలు రాశాను. కానీ, నాకు ఈ సినిమా బాగా నచ్చింది.. అని చెప్పారు గోరేటి వెంకన్న. కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి. లేదంటే ఇంత డబ్బు నిర్మాత ఎందుకు పెడతాడూ..అంటూ సరదాగా అన్నారు.
మొత్తానికి, గోరెటీ వెంకన్న ‘రాజిగాడు రాజయ్యాడు’ సినిమా టీజర్ ఈవెంట్‌కి హాజరవడం ఒకటైతే..కులం, సినిమా గురించి ఆయన చెప్పిన విషయాలు ఎందరినో ఆలోచింపజేసేలా ఉండటం ఇప్పుడు ఇటు సినీ, అటు రాజకీయ, విద్యారంగాలలోనూ పలువురుని ఆలోచింపజేస్తున్నాయి. నిజంగా, తెలుగులో చిన్న సినిమా అంటూ గొప్ప కథలతో రూపొందించిన సినిమాలను కూడా విడుదల చేయడానికి ఎవరూ ముందుకు రాకపోవడంతో ల్యాబ్‌కే పరిమితమవుతున్నాయి. అలాంటి, సినిమాలు కొన్ని వందలున్నాయని సమాచారం.
