Mysaa Movie: మైసా నుంచి ఒసేయ్ రాములమ్మా అంటూ సాగే సాంగ్ రిలీజ్ అయింది. ఇక్కడ విశేషం ఏమిటంటే, ఈ పాటను ప్రముఖ గీత రచయిత సుద్ధాల అశోక్ తేజ రచించగా, ప్రముఖ సంగీత దర్శకుడు వందేమాతరం శ్రీనివాస్ పాడట. ఒకప్పుడు విజయశాంతి నటించిన ఇండస్ట్రీ హిట్ ఒసేయ్ రాములమ్మా సినిమాలో పాడింది వందేమాతరం శ్రీనివాసే.
టాలెంటెడ్ డైరెక్టర్ రవీంద్ర పుల్లే ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందించిన మైసా సినిమాను ఈ నెల 27వ తేదీన భారీ స్థాయిలో రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన ‘మైసా రే’, ‘ఏనాటి వరమో’ పాటలు సినీ ప్రేమికులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఒకప్పటి క్లాసిక్ ‘ఒసేయ్ రాములమ్మ’ పాటను రీమిక్స్ చేసి విడుదల చేశారు.
తాజాగా వచ్చిన ఈ మూడవ పాటతో ఖచ్చితంగా మ్యూజికల్ హిట్ అనే నమ్మకాన్ని సాంగ్స్ కలిగించాయి. మిగతా సినిమాల కంటే మైసా కోసం రష్మిక ఎన్నో సాహసాలు చేసింది. షూటింగ్ సమయంలో నడుముకి గాయం కూడా అయింది. అయినా, కూడా సినిమాను ఎంతో పట్టుదలతో పూర్తి చేసింది. ఈ మధ్యకాలంలో హీరోయిన్గా నటించిన సినిమాలు రష్మికకి హిట్ ఇవ్వలేదు.
పోటీ ఉన్నా నమ్మకాలున్నాయి:
నవంబర్ 27న సంపత్ నంది, శర్వానంద్ కాంబినేషన్లో రూపొందుతోన్న భోగి సినిమా విడుదల కాబోతోంది. వాస్తవానికి, ఈ సినిమా నవంబర్ 12నే రిలీజ్ కావాల్సింది. కానీ, టెక్నికల్ ఇష్యూస్ వల్ల పోస్ట్ పోన్ అయి నవంబర్ 27న రష్మిక మైసా చిత్రానికి పోటీగా వస్తోంది. ఇండస్ట్రీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు భోగి సినిమా అద్భుతంగా వచ్చిందట. గ్యారెంటీ బిగ్ హిట్ అని టాక్ వినిపిస్తోంది. కాబట్టి, రష్మిక శర్వానంద్ నుంచి పోటీని తట్టుకొని హిట్ కొట్టాలి.
