Breaking: జబర్దస్త్ కమెడియన్స్ రైజింగ్ రాజు, దొరబాబుల కి ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ప్రాణాపాయం ఏమీ లేకపోయినా, తీవ్రంగా గాయాలైయ్యాయి. తెలుగులో స్మాల్ స్క్రీన్ మీద స్టార్ కెమెడియన్స్గా వెలుగుతున్నారు కమెడియన్లు దొరబాబు, రైజింగ్ రాజు. వీరు ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురికావడం ఇప్పుడు టాలీవుడ్లో కలకలం రేపుతోంది.
ఈ ఘటన పశ్చిమగోదావరి జిల్లాలో చోటుచేసుకుంది. పాపులర్ కమెడియన్స్ కావడంతీ జరిగిన ఈ సంఘటనతో అభిమానులు ఆందోళన పడుతున్నారు. జబర్దస్త్ కమెడియన్లు అయిన దొరబాబు, రైజింగ్ రాజు ప్రయాణిస్తున్న కారు రోడ్డు ప్రమాదానికి గురి కావడం ఊహించంది. వీరిద్దరూ ప్రయాణిస్తున్న కారు, ఒక్కసారిగా అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న కరెంట్ పోల్‌ను బలంగా ఢీకొట్టింది.
ఓ ప్రైవేట్ ప్రోగ్రాంలో పాల్గొనేందుకు వీరు కాకినాడ నుంచి భీమవరం బయలుదేరారట. ఈ క్రమంలో మార్గమధ్యలోనే అనుకోని ప్రమాదం జరిగింది. ఇక, పశ్చిమగోదావరి జిల్లా పాలకోడేరు మండల పరిధిలోని పెన్నాడ అగ్రహారం వద్ద ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. వేగంగా ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి కరెంట్ స్తంభాన్ని ఢీకొట్టడంతో వాహనం ముందు భాగం బాగా దెబ్బతిన్నట్లుగా తెలుస్తోంది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న దొరబాబు, రైజింగ్ రాజుకు తీవ్రంగా గాయాలయ్యాయి. వీరితో పాటు డ్రైవర్‌కు కూడా గాయాలైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వీరు సమీపంలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రాణాపాయం ఏమీ లేదని డాక్టర్లు వెల్లడించినట్టుగా సమాచారం.
