Tollywood: ఇటీవల సెన్సార్ బోర్డ్ పెట్టిన కఠిన నిబంధనల వల్ల ఇప్పటికే, నాగ చైతన్య నటించిన వృష కర్మ వాయిదా వేయనున్నారని ఫిల్మ్ సర్కిల్స్‌లో న్యూస్ వైరల్ అవుతుండగా, ఇప్పుడు రష్మిక మందన్న నటించిన మైసా సినిమాను రిలీజ్ పోస్ట్ పోన్ చేస్తున్నట్టుగా నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. త్వరలోనే, మళ్ళీ కొత్త విడుదల తేదీని ప్రకటిస్తామని కూడా తాజా ప్రకటనలో వెల్లడించింది.
నేషనల్ క్రష్ రష్మిక మందన్న నటించిన పాన్ ఇండియా చిత్రం ‘మైసా’ ముందుగా ప్రకటించిన తేదీ ప్రకారం నవంబర్ 27న థియేటర్లలోకి రావాల్సి ఉంది. అయితే, అనుకోకుండా సినిమా విడుదల తేదీని వాయిదా వేయాలని మేకర్స్ నిర్ణయించారు. ఈ మూవీ, వాయిదా వేయడానికి ముఖ్యంగా సెన్సార్ నిబంధనలు ఉన్నట్లు సమాచారం. ఇటీవల, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ సినిమా సర్టిఫికేషన్ విషయంలో సరికొత్త మార్గదర్శకాలను అమల్లోకి తీసుకొచ్చింది.
వీటి ప్రకారం సినిమా విడుదలకు కనీసం రెండు వారాల ముందే ప్రాజెక్ట్ కు సంబంధించిన ఫైనల్ కాపీని సెన్సార్ కోసం సమర్పించాల్సి ఉంటుంది. అయితే ‘మైసా’ పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఇంకా పూర్తికాకపోవడంతో ఫైనల్ కాపీ సిద్ధం కాలేదని తెలుస్తోంది. దీంతో సెన్సార్ ప్రక్రియ ఆలస్యమవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే మైసా వాయిదా పడినట్టుగా అర్థమవుతోంది.
డిసెంబర్లో కొత్త రిలీజ్ డేట్?
ఇక, ఈ సినిమాను డిసెంబర్‌కు వాయిదా వేయాలని మేకర్స్ భావిస్తున్నట్లు సమాచారం. డిసెంబర్ 11న విడుదల కొత్త విడుదల తేదీని పరిశీలిస్తున్నారట. అయితే, ఇంకా దీనిపై చిత్ర బృందం నుంచి అధికారికంగా ప్రకటన రావాలి. రవీంద్ర పుల్లే ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించాడు. ఇప్పటి వరకూ రష్మిక చేసిన సినిమాలన్నీ ఒకెత్తైతే, మైసా సినిమా ఒక్కటే ఒకెత్తు. ఇటీవల, ఆమె హీరోయిన్గా నటించిన కమర్షియల్ సినిమాలు ఫ్లాపయ్యాయి. ఇప్పుడు, తానే ప్రధాన పాత్రలో రూపొందుతోన్న మైసా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.
