Dhanush-O.M: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి నటించిన మల్టీస్టారర్ మూవీ ఓం. నవంబర్ 20న భారీ స్థాయిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో ఓం చిత్రానికి సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. కంటెంట్‌ను బట్టి సెన్సార్ వారు ఈ సినిమాకి యూ/ఏ సర్టిఫికెట్ ను జారీ చేశారు.
అంటే, ఓం సినిమాను అన్నీ వర్గాల ప్రేక్షకులు..అన్నీ వయసుల వారు చూడొచ్చు. ఇందులో, సాయి పల్లవి..శ్రీలీల ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. ‘అమరన్’ సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న దర్శకుడు రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. ఇప్పటికే, ఓం సినిమా ప్రమోషనల్ కంటెంట్ భారీ అంచనాలను పెంచింది. ముఖ్యంగా, సినిమాలో సాయి పల్లవి-శ్రీలీల పాత్రలు సర్‌ప్రైజ్ చేస్తాయని తెలుస్తోంది.

నవంబర్ 20న గట్టి పోటీ..
ఇదే నవంబర్ 20వ తేదీన మమ్ముట్టి తనయుడు, సౌత్ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ నటించిన ఆకాశంలో ఒక తార సినిమా బాక్సాఫీస్ వద్ద విడుదలవుతోంది. కంప్లీట్ క్లాస్ మూవీగా రూపొందిన ఈ సినిమాపై మంచి అంచనాలున్నాయి. తెలుగులో దుల్కర్‌కి మంచి ఫాలోయింగ్ అండ్ మార్కెట్ ఏర్పడింది. కాబట్టి, ఓం సినిమాకి టాలీవుడ్‌లో గట్టి పోటీ ఉండబోతుంది.
కీర్తి సురేష్ కూడా సత్యవాన్ సావిత్రిగా వస్తోంది..
ఈ నవంబర్ 20న కీర్తి సురేష్, మిస్కిన్ ప్రధాన పాత్రల్లో నటించిన సత్యవాన్ సావిత్రి సినిమా విడుదలకాబోతోంది. వరుసగా ఫ్లాప్స్ వస్తున్నా కూడా కీర్తి క్రేజ్‌కి ఏమాత్రం ఢోకా లేదు. కాబట్టి, కంటెంట్ బావుంటే గ్యారెంటీ తమిళంలో ధనుష్-మమ్ముట్టిల ఓం సినిమాకి సత్యవాన్ సావిత్రి కూడా మంచి పోటీ కావచ్చు. చూడాలి, మరి ఈ మూడు సినిమాలలో ఏది బ్లాక్ బస్టర్‌గా నిలుస్తుందో. ఇక, ఓం సినిమాకి సెన్సార్ కంప్లీట్ అవడంతో పాటు రన్ టైం కూడా లాక్ చేశారు. 2 గంటల 59 నిముషాల నిడివితో ఈ సినిమా విడుదలవుతోంది.


