Ee Nagaraniki Emaindi Sequel: కొన్ని సినిమాలకి సీక్వెల్ వస్తుందంటే అటు ప్రేక్షకుల్లో ఇటు సినీ వర్గాలలో ఆ సినిమా మీద విపరీతమైన ఆసక్తి నెలకొంటుంది. అలాంటి సినిమాలలో ఈ నగరానికి ఏమైంది ఒకటి. మరికొన్ని గంటల్లో (నవంబర్ 19న) ఈ సినిమా సీక్వెల్ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే, ఎప్పుడో 2028లో వచ్చిన ఈ నగరానికి ఏమైంది చిత్రానికి ఇప్పుడు వస్తున్న సీక్వెల్ మీద భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. అందుకే, ఒక్కరోజు ముందు(నవంబర్ 18) పెయిడ్ ప్రీమియర్స్ ప్లాన్ చేయగా అనూహ్య స్పందన లభిస్తోంది.
దాదాపు, 7 ఏళ్ళ తర్వాత సీక్వెల్ అంటే అంతగా ఎవరూ పట్టించుకోరనే భావన కొందరిలో ఉంటుంది. అందులోనూ, అదేమీ పాన్ ఇండియా సినిమానో..భారీ కాస్టింగ్, బిగ్ డైరెక్టర్ తీసిన సినిమానో కాదు. ఓ యూత్ ఫుల్ మూవీ. కంప్లీట్ ఎంటర్టైనర్. అయినా, కూడా అన్నీ వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకొని అప్పట్లో సూపర్ హిట్ సినిమాగా నిలిచింది. అందుకే, ఇన్నేళ్ళ తర్వాత వస్తున్నా..అదే రెస్పాన్స్ వస్తోంది.
ఇది, మేకర్స్ కూడా ఊహించి ఉండరు. ఇక, ఈ సినిమాలో విశ్వక్ సేన్, అభినవ్ గోమఠం కీలక పాత్రల్లో నటించారు. విశ్వక్ చేస్తున్న సినిమాలకి ప్రేక్షకుల్లో మంచి ఆదరణ ఉంటోంది. కల్ట్, లెగసీ లాంటి సినిమాలతో మన ముందుకు రాబోతున్నాడు. అలాగే, ఈ నగరానికి ఏమైంది సినిమా సీక్వెల్తోనూ. విశ్వక్ బాడీ లాంగ్వేజ్..కామెడీ టైమింగ్‌కి యూత్ ఆడియన్స్ బాగా అట్రాక్ అవుతున్నారు.
ఇలాంటి, అంశాలన్నీ ఉన్న సినిమా ఈ నగరానికి ఏమైంది సీక్వెల్. ఇక, నబంవర్ 18న మన రెండు తెలుగు రాష్ట్రాలలో పెయిడ్ ప్రీమియర్స్‌ను ప్రదర్శించనున్నారు. సృజన్ ఎరబోలు, సందీప్ నాగిరెడ్డి నిర్మాతలు కాగా, వివేక్ సాగర్ సంగీతం అందించాడు. తరుణ్ భాస్కర్ దర్శకత్వం వహించాడు. మరి, 2018లో వచ్చిన మొదటి భాగం ఈ నగరానికి ఏమైంది కంటే ఇప్పుడు రాబోతున్న ఈ సీక్వెల్ మూవీకి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో..కలెక్షన్స్ పరంగా ఏ రేంజ్ కనిపిస్తుందో అని ఇండస్ట్రీ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.


