Kaaka-Dada: మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న కాకా, నందమూరి బాలకృష్ణ నటిస్తున్న దాదా చిత్రాలు విడుదలకి సిద్ధమవుతున్నాయి. అయితే, ఈ రెండు సినిమాలు థమన్‌కి చాలా కీలకంగా మారాయి. ఎందుకంటే, ఆయనే ఇటు మెగాస్టార్ అటు బాలయ్య సినిమాలకి మ్యూజిక్ అందిస్తున్నాడు. అఖండ నుంచి బాలయ్య సినిమాలకి థమన్ వాయిస్తూనే ఉన్నాడు. అందుకే, నందమూరి థమన్ అని కూడా బాలయ్య అన్నాడు.
ఇటీవలే, దాదా సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ వచ్చింది. నర్గీస్ ఫక్రీ ఈ సాంగ్‌లో బాలయ్యతో కలిసి చిదులేసింది. అంతేకాదు, ఈ సాంగ్‌ను బాలయ్య పాడటం కూడా ఓ విశేషం. అయితే, దాదా ధమాక అంటూ వచ్చిన ఈ ఫస్ట్ సింగిల్ మీద ఆశించిన బజ్ క్రియేట్ అవలేదు. పైగా, ఎప్పటిలాగే ఈ సాంగ్ ట్యూన్ బాగా విన్నట్టుగా ఉందంటూ కామెంట్స్ చేశారు. ఇంకా, చెప్పాలంటే.. కొందరైతే 'మన శంకరవరప్రసాద్‌గారు' సినిమాలోని హుక్ స్టెప్ ట్యూన్ కాపీలా ఉందన్నారు.
మొత్తానికి, బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ సినిమా దాదా నుంచి వచ్చిన దాదా ధమాక ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. ఇప్పుడు, ఇదే టెన్షన్ మెగా అభిమానుల్లో మొదలైంది. బాబీ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న కాకా సినిమాకి థమన్ సంగీతం అందిస్తున్నాడు. బాలయ్య సినిమాకే ఇలాంటి ట్యూన్స్ ఇస్తున్నాడంటే, ఇక మెగాస్టార్ సినిమా పరిస్థితేంటీ? అని మాట్లాడుకుంటున్నారు.
అసలే, ఈ మధ్య థమన్ జోరు బాగా తగ్గింది. చేతిలో ఉన్న సినిమాలు కూడా చాలా తక్కువ. ఆయన ప్లేస్‌ను తమిళ సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ కుమార్ భర్తీ చేస్తున్నాడు. ఎక్కువ సినిమాలకి మేకర్స్ జీవీనే పిలుస్తున్నారు. థమన్ గనక కాకా-దాదా సినిమాలకి బెస్ట్ మ్యూజిక్ ఇవ్వకపోతే మెల్లగా ఈ సీనియర్ స్టార్ హీరోలు కూడా థమన్‌కి పక్కకి పెట్టే అవకాశాలు లేకపోలేదు. సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టి ఊదరగొడుతున్న థమన్..ఆ స్థాయిలో మాత్రం అవుట్‌పుట్ ఇవ్వడం లేదంటున్నారు.


