సినిమా

January-12-Vidudala: ప్రమోషన్స్ మొదలు..ఫస్ట్ వచ్చేది ఫస్ట్ సింగిల్

January-12-Vidudala: సినిమా ప్రమోషన్స్‌లో దర్శకుడు అనిల్ రావిపూడి స్ట్రాటజీ ఎప్పుడూ కొత్తగానే ఉంటోంది. సగం ప్రేక్షకులు అక్కడే ఆకర్షితులవుతున్నారు. సినిమా పూర్తి చేయడం తప్ప ప్రమోషన్స్‌కి ఒప్పుకోని నయనతార కూడా మన శంకరవరప్రసాద్‌గారు సినిమాకి ప్రమోషన్స్ చేయడానికి ఒప్పించడం అంటే అనిల్ టాలెంట్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు, "జనవరి 12 విడుదల" కోసం పక్కా ప్లాన్స్ వేస్తున్నాడు.

వెంకటేష్, కళ్యాణ్ రామ్, కీర్తి సురేష్, కృతి శెట్టి హీరో హీరోయిన్లుగా అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న "జనవరి 12 విడుదల" 2027 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ప్రతీ సంక్రాంతికి ఓ సినిమాతో రావడం హిట్ కొట్టడం అన్నట్టుగా మారింది అనిల్ రావిపూడి ప్రయాణం. ఇక, దాదాపు షూటింగ్ మొత్తం పూర్తి కావస్తుండటంతో, ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారు.

అతి త్వరలోనే ఫస్ట్ సింగిల్‌తో ప్రమోషన్స్ మొదలుపెట్టి..వరుస బెట్టి హీరోహీరోయిన్లతో పాటు సంగీత దర్శకుడితో కూడా స్పెషల్ ఇంటర్వ్యూస్, ఫన్నీ వీడియోస్, సాంగ్స్ విడుదల.. వంటివి అనిల్ రావిపూడి ప్లాన్ చేస్తున్నాడు. ఈ సారి సంక్రాంతికి బిగ్ ఫైట్ ఉండబోతుంది. మెగాస్టార్ చిరంజీవి, రజినీకాంత్ లాంటి సీనియర్స్‌తో పాటు యంగ్ హీరోల సినిమాలు బాక్సాఫీస్ వద్ద బరిలో దిగుతున్నాయి. ఎన్ని సినిమాలు వచ్చిన అనిల్ రావిపూడి సినిమాకి ఫ్యామిలీ ఆడియన్స్ ఫస్ట్ ఛాయిస్‌గా ఉంటారనేది ఒప్పుకోవాల్సిందే.

ఆ రేంజ్ బజ్ క్రియేట్ చేయడానికి అనిల్ రావిపూడి ఈ డిసెంబర్ నెల మొత్తం ప్రమోషనల్ కంటెంట్‌తో హోరెత్తించబోతున్నాడు. మరి, 'బావ బామ్మర్ది సౌజన్యంతో' అన్న ట్యాగ్ పెట్టి మన ముందుకు తీసుకురాబోతున్న 'జనవరి 12 విడుదల' ప్రేక్షకులను ఏమేరకు ఆకట్టుకుంటుందో చూడాలి. ఇక, ఈ సినిమా తర్వాత మాన్ ఆఫ్ మాసెస్ నందమూరి తారక రామారావుతో కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ను చేయబోతున్నాడు అనిల్ రావిపూడి.

వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి