సినిమా

Tollywood: రెండేళ్ల తర్వాత అమ్ముడైన ‘దేవర’ శాటిలైట్ రైట్స్..

Tollywood: గతంలో ఒక సినిమా ప్రొడక్షన్‌లో ఉందంటే ఆ సినిమా మ్యూజిక్ ఆల్బం రిలీజైయ్యాకో, లేదంటే విడుదలకి ముందు నిర్వహించే గ్రాండ్ ఈవెంట్ తర్వాతనో..ఇంకా కాదంటే సినిమా విడుదలయ్యాక ఫలితాన్ని బట్టో శాటిలైట్ బిజినెస్ జరిగేది. కానీ, ఇప్పుడు ట్రెండ్ మారింది. దిగ్గజ ఓటీటీలే చిన్న సినిమా నుంచి పాన్ ఇండియా సినిమా వరకూ విడుదల తేదీని సెట్ చేస్తున్నాయి. అయినా, కూడా దేవర సినిమా రెండేళ్ళ వరకూ శాటిలైట్ నిజినెస్ జరగకపోవడం షాకింగ్ విషయం. ఎట్టకేలకి ఆ పని పూర్తైనట్టుగా తెలుస్తోంది.

సోనీ తెలుగు చేతికి దేవర రైట్స్!

తాజాగా, దేవర సినిమా శాటిలైట్ హక్కులకు సంబంధించి ఆసక్తికరమైన అప్‌డేట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ప్రముఖ, సోనీ నెట్‌వర్క్ ఎన్టీఆర్ నటించిన ‘దేవర’ తెలుగు శాటిలైట్ హక్కులను సొంతం చేసుకున్నట్లు సమాచారం. త్వరలో, తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలోకి అడుగుపెట్టబోతున్న సోనీ తెలుగు ఛానెల్ కోసం ఈ చిత్రాన్ని దక్కించుకున్నట్లు ఫిల్మ్ సర్కిల్స్‌లో టాక్ వినిపిస్తోంది. గతంలో, దేవర శైటిలైట్ రైట్స్ కోసం ఈటీవీ కూడా పోటీ పడిందని ప్రచారం జరిగింది. అయితే, చివరకు సోనీ ఈ డీల్‌ను కుదుర్చుకుందట.

అయితే, సోనీ తెలుగు ఛానెల్ ఇంకా అఫీషియల్‌గా ఆన్ ఎయిర్ కాలేదు. ఈ కాబట్టి, ఈ ఛానెల్ లాంచ్ అయిన తర్వాతే ‘దేవర’ టెలివిజన్ ప్రీమియర్ కి రానుంది. ఛానెల్ ప్రారంభానికి భారీ చిత్రాలను కొనుగోలు చేసే ప్రయత్నంలో భాగంగానే ఎన్టీఆర్ డ్యూయల్ రోల్‌లో నటించిన దేవర హక్కులను సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ డీల్‌కు సంబంధించిన ధర, టెలికాస్ట్ తేదీపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

మొత్తానికి, రెండేళ్ళ తర్వాత దేవర సినిమా శాటిలైట్ రైట్స్‌కి సంబందించిన వార్తలు రావడం అభిమానుల్లో ఆసక్తికరమైన చర్చగా మారింది. కొరటాల శివ దర్శకత్వంలో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా, బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించారు. అనిరుధ్ సంగీతం అందించిన సంగతి తెలిసిందే. వాస్తవానికి, ఈ సినిమాకి సీక్వెల్ కూడా ఉందని పార్ట్ 1 ఎండింగ్‌లో రివీల్ చేశారు.

కానీ, ఇప్పట్లో ఆ అప్‌డేట్ రావడం కష్టమని అర్థమవుతోంది. ఎందుకంటే, ప్రస్తుతం కొరటాల ఫుల్ ఫోకస్ బాలయ్య 112 మూవీ మీదే పెట్టాడు. ఇక, తారక్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో డ్రాగన్ చేస్తున్నాడు. దీని, తర్వాత అనిల్ రావిపూడి, త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ప్రాజెక్ట్స్ లాకై ఉన్నాయి. కాబట్టి, దేవర సీక్వెల్‌పై అప్‌డేట్ ఇప్పట్లో ఉండనట్టే.

తర్వాత చదవండి