Balakrshna-Dada: గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ సినిమా 'దాదా'. ఈ సినిమా గురించి గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వస్తున్న రూమర్స్‌కి మరోసారి డబుల్ కన్‌ఫర్మేషన్ ఇస్తూ పెట్టిన ట్వీట్ నెట్టింట బాగా వైరల్ అవుతోంది. "కుమ్మేస్తాం..నో డౌట్" అంటూ ఇచ్చిన అప్‌డేట్‌తో బాలయ్య అభిమానుల్లో ఆనందం రెట్టింపైంది.
మాస్ అండ్ యాక్షన్ సినిమాలతో టాలీవుడ్‌లో తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్న దర్శకుడు గోపీచంద్ మలినేని. ఇక, బాలయ్య అంటే కంటి చూపుతో అందరినీ కంట్రోల్ చేసే పవర్ ఫుల్ రోల్స్, పదునైన డైలాగ్స్, ఊర మాస్ అవతార్, హెవీ యాక్షన్ సీక్వెన్సెస్..ఇలా అన్నీ కలిపి వస్తోన్న సినిమానే 'దాదా'. ఇప్పటికే, ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్‌తో గూస్‌బంప్స్ వచ్చాయి.
ఇక, మ్యూజికల్ జర్నీని స్టార్ట్ చేసిన మేకర్స్ ఇటీవల ఫస్ట్ సింగిల్‌ను కూడా వదిలారు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా నుంచి వచ్చిన ఫస్ట్ సింగిల్..అది కూడా బాలయ్య పాట పాడటం..ఈ పాటలో బాలీవుడ్ హాట్ బ్యూటీ నర్గీస్ ఫక్రీ అందాల ఆరబోత..అన్నీ కలిసి మంచి ట్రెండ్ అయింది. 'పైసా వసూల్' తర్వాత మళ్ళీ ఈ సినిమాలోనే బాలయ్య పాట పాడాడు. ఇప్పటికే, ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
అయితే, ఇదే సినిమా షూటింగ్‌లో బాలయ్యకి గాయమై..రెండు నెలలపాటు షూటింగ్‌లో పాల్గొనలేకపోయాడు. దాంతో, సినిమా రిలీజ్ ఈ ఏడాది ఉండదని ప్రచారం జరిగింది. బాలయ్య సెట్స్‌లో తిరిగి ఎంట్రీ ఇచ్చి నాన్ స్టాప్‌గా షూటింగ్ జరుగుతున్నా కూడా ఈ రూమర్స్ ఆగలేదు. దీంతో, 'దాదా' మేకర్స్ తాజాగా డబుల్ కన్‌ఫర్మేషన్ ఇస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. 'డిసెంబర్ 24న కుమ్మేస్తాం..నో డౌట్ అంటూ'.. ఫైరింగ్ పోస్ట్‌ను పెట్టారు. ఇప్పుడు, ఈ పోస్ట్‌తో 'దాదా' విడుదల వాయిదా అనేది సోషల్ మీడియాలో జరుగుతున్న ఉత్తుత్తి ప్రచారం అని తేలిపోయింది.
