సినిమా

Gopichand: అవన్నీ రూమర్స్..ఏదైనా మేమే చెప్తాం

Gopichand: మ్యాచో స్టార్ గోపీచంద్ హీరోగా నటిస్తున్న సినిమాలు లైన్‌లో ఉన్నాయి. భరత వర్ష, సింగ చిత్రాలతో పాటు గోపీచంద్ హీరోగా రూపొందనున్న ఆయన 34వ సినిమా. ఇలా, మూడు డిఫరెంట్ కంటెంట్ సినిమాలతో బిజీగా ఉన్నాడు గోపీచంద్. అయితే, గతంలో ఆయన విలన్‌గా నటించిన విషయాన్ని గుర్తుపెట్టుకొని కొందరు ఫాల్స్ న్యూస్ క్రియేట్ చేశారు. వాటికి, గోపీచంద్ అఫీషియల్ టీమ్ క్లారిటీ ఇచ్చింది. విలన్‌గా ఆయన నటించడం లేదని తెలిపింది.

కోలీవుడ్ హీరో సూర్య నటించబోతున్న సినిమాలో గోపీచంద్ విలన్‌గా నటించడానికి ఒప్పుకున్నట్టుగా ఈ నాలుగైదు రోజుల నుంచి సోషల్ మీడియాలో వార్తలు వచ్చి వైరల్ అవుతున్నాయి. అంతేకాదు, హీరోగా సినిమా అవకాశాలు తగ్గడంతో తమిళంలో విలన్‌గా నటించే ఛాన్స్ వస్తే వెంటనే ఒప్పుకున్నాడని ప్రచారం చేస్తున్నారు.

దీనిపై, గోపీచంద్ పీఆర్ టీమ్ స్పందించింది. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను ఖండిస్తూ..గోపీచంద్ నటిచే సినిమాలకి సంబందించి ఎలాంటి అప్‌డేట్ అయినా మేమే అధికారికంగా వెల్లడిస్తామని, అనధికారికంగా వచ్చే వార్తలను నమ్మవద్దని తెలిపింది. దీంతో, సూర్య సినిమాలో విలన్‌గా నటించడానికి గోపీచంద్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన మాట పూర్తిగా ఫాల్స్ అని తేలిపోయింది.

ఇక, సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా భరత వర్ష అనే యాక్షన్ సినిమా తెరకెక్కుస్తోంది. తెలుగమ్మాయి రీతూ వర్మ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాని శ్రీనివాస్ చిట్టూరి నిర్మిస్తున్నాడు. అలాగే, స్టంట్ మాస్టర్ వి వెంకట్ దర్శకుడిగా పరిచయమవుతూ రూపొందిస్తున్న సింగ సినిమాను చేస్తున్నాడు. అనార్కలి నాజర్ హీరోయిన్‌గా పరిచయమవుతోంది. విజయ్ చల్లా, శశి దేవిరెడ్డి నిర్మాతలు. అలాగే, గోపీచంద్ 34వ సినిమా కూడా లైన్‌లో ఉంది.

తర్వాత చదవండి