సినిమా

Megastar-Kaaka: డిసెంబర్ 1 నుంచి ‘కాకా’ ప్రమోషన్ల హోరు..

Megastar-Kaaka: మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో దర్శకుడు బాబీ కొల్లి రూపొందిస్తున్న సినిమా ‘కాకా’. ఈ సినిమా భారీ అంచనాలతో 2027, సంక్రాంతి పండుగ సందర్భంగా రాబోతుంది. అయితే, తాజా సమాచారం మేరకు ప్రస్తుతం కాకా సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ కూడా శరవేగంగా జరుగుతున్నాయి. అధికారికంగా ప్రకటించిన తేదీకే ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు మేకర్స్ అన్ని రకాలుగా రెడీ అవుతున్నారు.

ఈ నేపథ్యంలోనే, మెగాస్టార్ చిరంజీవి తన పాత్రకి ఈ వారంలో డబ్బింగ్ కి సంబంధించి బ్యాలెన్స్ వర్క్ ను పూర్తి చేయనున్నారు. ఇక, డిసెంబర్ 1 నుంచి ‘కాకా’ ప్రమోషన్ల హోరు భారీ స్థాయిలో ప్రారంభించబోతున్నారు. ముందుగా, పాటలను, ఆ తర్వాత టీజర్ ను, తర్వాత ట్రైలర్‌తోనూ ప్రచారాన్ని మరింత హీటెక్కించనున్నారు.

ఇక కాకా సినిమాలో ఫ్యామిలీ ఎమోషన్స్ ఎక్కువగా ఉంటాయని తెలుస్తోంది. గ్లింప్స్ వదిలినప్పుడే ఈ విషయం అర్థమైంది. ఇక, ఇటీవల ఓ సినిమా ఈవెంట్‌లో చిరుకు కూతురుగా నటిస్తున్న యంగ్ బ్యూటీ అనస్వర రాజన్ మూగమ్మాయిగా కనిపించఓతుందని ఇచ్చిన లీక్‌తో ఇంకాస్త డెప్త్ తెలిసింది. దీన్ని బట్టే కాకా కథ కూడా ఎంతో ప్రత్యేకంగా ఉంటుందని అర్థమైపోయింది.

దర్శకుడు బాబీ మెగాస్టార్‌ను కొత్తగా చూపించాలనే ఉద్దేశ్యంతో ఈ కాకా కథ రాసుకున్నాని చెప్పాడు. ఇంతకముందు వచ్చిన వాల్తేరు వీరయ్య’ మంచి కమర్షియల్ హిట్ సాధించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత మళ్ళీ వీరిద్దరి కలయికలో వస్తున్నది కాకా మూవీ కావడంతో మెగా అభిమానుల్లో, ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇక, ఈ సినిమాని కెవిఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై లోహిత్, వెంకట్ కె నారాయణ, భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. థమన్ సంగీత దర్శకుడు. జనవరి 13, 2027న సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా బరిలో దిగనున్నట్టుగా నిర్మాతలు ఇప్పటికే ప్రకటించారు.

తర్వాత చదవండి