Sharwanand: 'ఈ ఏడాది ఇప్పటికే, రెండు సినిమాలతో వచ్చి సూపర్ హిట్స్ అందుకున్నాడు చార్మింగ్ స్టార్ శర్వానంద్. ఆ సినిమాలే బైకర్, నారి నారి నడుమ మురారి. ఇప్పుడు, హ్యాట్రిక్ కోసం సిద్ధమవుతున్నాడు. మాస్ అండ్ యాక్షన్ చిత్రాల దర్శకుడు సంపత్ నంది దర్శకత్వంలో నటించిన భోగి సినిమా ఈ నవంబర్ 27న భారీ స్థాయిలో రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలో మేకర్స్ హైదరాబాద్ దసపల్లా హోటల్లో గ్రాండ్‌గా ట్రైలర్ లాంచ్‌తో పాటు ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను జరిపారు.
ఈ ఈవెంట్లో హీరో శర్వానంద్ మాట్లాడుతూ.."సాధారణంగా ఒక సినిమా విడుదలవుతుందంటే ముందురోజు ఒత్తిడి, భయం ఉంటాయి. కానీ, భోగి సినిమా విషయంలో ఆ రెండు లేవని చెప్పాడు. ఈ సినిమా ఫస్ట్ కాపీ చూడగానే ఎంతో సంతృప్తి, నమ్మకం కలిగాయి. గ్యారెంటీగా హిట్ కొట్టబోతున్నాము..అని చెప్పాడు శర్వా.నాలోని నటుడిని ఇంకో కోణంలో కొత్తగా ప్రేక్షకులకి పరిచయం చేయబోతున్న దర్శకుడు సంపత్ నందికి కృతజ్ఞతలు అని అన్నాడు.
భోగి తన కెరీర్లోనే ఓ ప్రత్యేకమైన సినిమాగా నిలుస్తుందని ఆశాభావాన్ని వ్యక్తపరిచాడు. ఇక, ఈ సినిమాకి సంగీతం భీమ్స్. ఆయన మ్యూజిక్‌తో సినిమాను నెక్స్ట్ లెవల్‌కి తీసుకెళ్ళినట్టుగా తాజాగా వచ్చిన ట్రైలర్ చూస్తేనే అర్థమవుతోంది. కంప్లీట్ గా సస్పెన్స్ మేయింటైన్ చేస్తూ కట్ చేసిన భోగి ట్రైలర్ సినిమాపై అందరిలో భారీ అంచనాలను పెంచింది. నవంబర్ 27న థియేటర్స్ దద్దరిల్లిపోవడం ఖాయం అని చెప్పాలి.
ఇక, ఈ సినిమాను శ్రీ సత్యసాయి ఆర్ట్స్ ప్రొడక్షన్ పతాకంపై కె.కె.రాధా మోహన్ నిర్మించారు. హీరోయిన్గా అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హయాతీలు నటించారు. గంగా పాత్రలో శర్వా విశ్వరూపం చూడబోతున్నామని ట్రైలర్‌తో హింట్ ఇచ్చాడు దర్శకుడు సంపత్ నంది. ఆయనతో పాటు హీరోహీరోయిన్స్ కెరీర్లోనూ భోగి ఓ మైల్ స్టోన్ మూవీలా నిలుస్తుందని చాలా నమ్మకంగా ఉన్నారు. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఎలాంటి సంచలనాలను సృష్టిస్తుందో చూడాలి.
