సినిమా

Nagarjuna: కింగ్ 100 నుంచి అప్‌డేట్స్ రావాల్సిందే..

4 నిమిషాల పఠనం

Nagarjuna: నాగార్జున నటిస్తున్న మైల్ స్టోన్ మూవీ "కింగ్ 100". కోలీవుడ్ యంగ్ డైరెక్టర్ రా.కార్తీక్ దర్శకత్వం వహిస్తున్నాడు. చాలా ఏళ్ళ తర్వాత టబు మళ్ళీ ఈ సినిమాలో నాగార్జునతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటోంది. అయితే, ఈ సినిమా నుంచి అక్కినేని అభిమానులు ఆశించిన అప్‌డేట్స్ రావడం లేదని చెప్పుకుంటున్నారు. నిజమే, ఈ సినిమాకి గట్టి పోటీ బాలయ్య నటిస్తున్న 'దాదా' సినిమా ఉంది. అలాంటప్పుడు అప్‌డేట్స్ రావాల్సిందే.

డిసెంబర్ 24న క్రిస్మస్ కానుకగా ఈ సినిమాను భారీ స్థాయిలో రిలీజ్ చేయనున్నారు. కానీ, ఇప్పటి వరకూ 'కింగ్ 100' నుంచి సరైన అప్‌డేట్స్ రాలేదు. నాగార్జున కెరీర్‌లో 100వ సినిమా కాబట్టి, ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. స్వయంగా, నాగార్జునే ఈ సినిమాను తన అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ మీద నిర్మిస్తున్నారు.

ఇటీవల కాలంలో నాగార్జున సోలో హీరోగా నటించిన సినిమాలు రాలేదు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన 'కుబేర' ఆశించిన విజయాన్ని అందుకోలేదు. నిర్మాతలకి నష్టాలే వచ్చాయి. నాగ్ రోల్ కూడా అంతగా మెప్పించలేదు. అలాగే, రజినీకాంత్ నటించిన 'కూలీ' సినిమా కూడా నాగ్ కెరీర్‌కి అంతగా ఉపయోగపడేది కాదు. మంచి రోల్ అయినా, కూడా మన తెలుగు ఆడియన్స్‌కి నచ్చలేదు.

అందుకే, ఇప్పుడు నాగార్జున నటిస్తున్న తన 100వ సినిమా మీదే అందరి చూపు, నాగార్జున ఆశలు ఉన్నాయి. బాలకృష్ణ నటిస్తున్న 'దాదా' నుంచి ఫస్ట్ సింగిల్ వచ్చి దుమ్మురేపుతోంది. టీజర్ కూడా మంచి అంచనాలను రేకెత్తించింది. కానీ, ఎలాంటి హైప్ ఇంకా 'కింగ్ 100' మీద క్రియేట్ కాలేదు. ఇప్పటి నుంచైనా మేకర్స్ ఈ సినిమా అప్‌డేట్స్ మీద ఫోకస్ పెడితే అభిమానుల్లో, ప్రేక్షకుల్లో అంచనాలు పెరుగుతాయి. లేదంటే కష్టమే.

#Nagarjuna#King 100#Tabu#Ra.Karthik#Tollywood
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి