తెలంగాణ

Yadadri : గురుకుల విద్యార్థినులకు లైంగిక వేధింపులు!

4 నిమిషాల పఠనం

సాంఘీక సంక్షేమ బాలికల గురుకుల స్కూల్లో వంటమనిషి విద్యార్థినులను లైంగికంగా వేధిస్తున్నట్టు తెలిసింది. రూ.500, 1000 ఇస్తాను.. వస్తారా? అని విద్యార్థినులను గత కొంతకాలంగా వంటమనిషి ఇబ్బందులకు గురిచేస్తున్నట్టు సమాచారం.

రాష్ట్రంలో గురుకుల విద్యార్థినులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఓవైపు మౌలిక సదుపాయాల లేమి, నీటి సమస్యలతో పాటు ఆహారం నాణ్యత లేకపోవడంతో నానా అవస్థలు పడుతున్నారు. ప్రభుత్వం నుంచి వారికి ఎటువంటి సహకారం అందడం లేదని, టీచర్లు పట్టించుకోకపోవడంతో అనారోగ్య సమస్యల బారిన పడుతున్నట్టు తెలుస్తోంది.ఇటీవిల కాలంలో వరుస ఫుడ్ పాయిజన్ ఘటనలు వెలుగుచూసిన విషయం తెలిసిందే.

ఇదిలాఉండగా, సాంఘీక సంక్షేమ బాలికల గురుకుల స్కూల్లో వంటమనిషి విద్యార్థినులను లైంగికంగా వేధిస్తున్నట్టు తెలిసింది. రూ.500, 1000 ఇస్తాను.. వస్తారా? అని విద్యార్థినులను గత కొంతకాలంగా వంటమనిషి ఇబ్బందులకు గురిచేస్తున్నట్టు సమాచారం.యాదాద్రి జిల్లా అడ్డగూడూరు సాంఘీక సంక్షేమ బాలికల గురుకుల స్కూల్లో ఈ ఘటన వెలుగుచూసింది.

సుమారు 20 మంది విద్యార్థినులను కీచక వంటమనిషి వేధించినట్టు ఆరోపణలు వచ్చాయి.ఈ విషయం బయటకు పొక్కకుండా ప్రిన్సిపాల్ విద్యార్థినులను బెదిరించినట్టు సమాచారం.బాధిత విద్యార్థినులు ఈ విషయం తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లడంతో గుట్టుచప్పుడు కాకుండా వంట మనిషిని ప్రిన్సిపాల్ పంపించివేసినట్టు తెలుస్తోంది. దీంతో స్కూల్ ఎదుట విద్యార్థుల తల్లిదండ్రుల ఆందోళనకు దిగారు. మీడియాను లోపలికి వెళ్లకుండా ప్రిన్సిపాల్ ఝాన్సీరాణీ అడ్డుకుంటున్నట్టు తెలిసింది.

బాలికలతో అనుచితంగా ప్రవర్తించిన వంటమనిషిని వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని పిల్లల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు గురుకుల పాఠశాల వద్దకు చేరుకుని వివరాలు సేకరించినట్టు సమాచారం.ప్రిన్సిపాల్ నుంచి వివరణ సైతం తీసుకుంటున్నట్టు తెలుస్తోంది.కాగా, వంటమనిషి, ప్రిన్సిపాల్ మీద చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.

#social welfare school#yadadri#students#sexual harrasment#cook#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి