తెలంగాణ

Peddapalli PP: హత్య కేసులో లక్షన్నర లంచం.. ఏసీబీకి చిక్కిన పబ్లిక్ ప్రాసిక్యూటర్

పెద్దపల్లిలో పబ్లిక్ ప్రాసిక్యూటర్ రవీందర్ (Peddapalli Public Prosecutor Donkena Ravinder) ఏసీబీ (ACB) అధికారుల వలకు చిక్కారు. లక్షన్నర రూపాయల లంచం (Bribe) తీసుకుంటుండగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు ఏసీబీ అధికారులు. పెద్దపల్లి ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ కోర్టులో రవీందర్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా పనిచేస్తున్నారు.

Peddapalli PP: పెద్దపల్లిలో పబ్లిక్ ప్రాసిక్యూటర్ రవీందర్ ఏసీబీ అధికారుల వలకు చిక్కారు. లక్షన్నర రూపాయల లంచం తీసుకుంటుండగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు ఏసీబీ అధికారులు. పెద్దపల్లి ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ కోర్టులో రవీందర్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా పనిచేస్తున్నారు.

నిందితులకు అనుకూలంగా వాదిస్తానని హామీ

2023లో ధర్మారం మండలం రచ్చపల్లిలో జరిగిన భూ వివాదంలో నలుగురిపై కేసు నమోదైంది. ఈ కేసులో నిందితులకు అనుకూలంగా వాదించి లబ్ది చేకూరుస్తానని రవీందర్ 2లక్షల రూపాయలు లంచం డిమాండ్ చేసినట్లు సమాచారం. చివరకు లక్షన్నరకు ఒప్పందం కుదుర్చుకున్నారు. సమాచారం అందుకున్న ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేశారు. లంచం తీసుకుంటూ ఉండగా పీపీ రవీందర్ ను పట్టుకున్నారు. ఈ వ్యవహారంలో రవీందర్ తో పాటు ఆయనకు సహకరించిన ప్రైవేట్ వ్యక్తి రెడ్డిరాజుల రాజయ్యను కూడా ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరిపై కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.

2లక్షలు లంచం డిమాండ్.. లక్షన్నరకు డీల్

2023లో ధర్మారం మండలం రచ్చపల్లిలో భూ వివాదం జరిగింది. ఈ భూ వివాదంలో ఒకరు చనిపోయారు. మృతుడి కుమారుడి ఫిర్యాదుతో పోలీసులు నలుగురిపై కేసు నమోదు చేశారు. ఈ కేసుకి సంబంధించి పెద్దపల్లి జిల్లా కోర్టులో విచారణ జరుగుతోంది. ఈ కేసులో నిందితులకు అనుకూలంగా వాదిస్తానని, వారికి లబ్ది కలిగిస్తానని పీపీ రవీందర్ హామీ ఇచ్చారు. ఇందులో భాగంగా 2లక్షల రూపాయలు లంచం డిమాండ్ చేసి లక్షన్నరకు ఒప్పందం కుదుర్చుకున్నారు.

న్యాయం జరిగేలా చూడాల్సిన న్యాయవాదే లంచం డిమాండ్ చేయడమా?

తన స్నేహితుడు రెడ్డిరాజుల రాజయ్య ద్వారా లంచం తీసుకుంటుండగా పీపీ రవీందర్ ను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. కరీంనగర్ ఏసీబీ డీఎస్పీ మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ ఆపరేషన్ జరిగింది. పబ్లిక్ ప్రాసిక్యూటర్ నివాసంలో లంచం తీసుకుంటున్న సమయంలో ఏసీబీ అధికారులు మెరుపు దాడి చేసి పట్టుకున్నారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ అంటే ప్రభుత్వం తరపున న్యాయస్థానాల్లో వాదనలు వినిపిస్తారు. చట్టాన్ని కాపాడాల్సిన బాధ్యత కలిగిన ప్రభుత్వ న్యాయవాది. ప్రభుత్వం నుంచి నెల నెల జీతం తీసుకుంటారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న న్యాయవాదే, కేసుల్లో న్యాయం జరిగేలా చూడాల్సిన వ్యక్తే.. ఇలా అవినీతికి పాల్పడటం, లంచం తీసుకుంటూ పట్టుబడటం ఇప్పుడు జిల్లాలో సంచలనంగా మారింది.

తర్వాత చదవండి