Rakul Preet Singh: తెలుగు చిత్ర పరిశ్రమే నన్నిలా తయారు చేసింది..అంటూ కృతజ్ఞతను చూపిస్తూ రకుల్ ప్రీత్ సింగ్ చేసిన కామెంట్స్ ఇప్పుడు అంతటా వైరల్ అవుతున్నాయి. సాధారణంగా ఇలా చెప్పడానికి అందరికీ మనసొప్పదు. పైపెచ్చు, పూజా హెగ్డే..తాప్సీ..రాధిక ఆప్టే లాంటి వాళ్ళు తప్పుడు మాటలను మాట్లాడి ట్రోల్స్‌కి గురయ్యారు. ఇటీవలే, రాధిక ఆప్టే తెలుగు సినిమాలపైన, బాలకృష్ణ గురించి మాట్లాడటం ఏ ఒక్కరికీ నచ్చలేదు.
రాధిక ఆప్టేకి, పూజా హెగ్డే, తాప్సీలకి తెలుగు సినిమాలలోనే ముందుగా అవకాశాలు వచ్చాయి. ఇక్కడ చేసిన సినిమాల వల్లే క్రేజ్..పాపులారిటీ దక్కాయి. కానీ, బాలీవుడ్‌కి వెళ్ళి వీళ్ళు తెలుగు చిత్రపరిశ్రమ గురించి తప్పుగా మాట్లాడటం అంటే, ఒడ్డు చేరాక తెప్ప తగలెయ్యడమే. ఇలాంటి వాళ్లకి మళ్ళీ మనవాళ్ళు అవకాశాలిచ్చే ప్రసక్తే ఉండదు. కానీ, కొందరు మాత్రం తెలుగు చిత్ర పరిశ్రమను నెత్తిన పెట్టుకుంటున్నారు.
అలాంటి వారిలో రకుల్ ప్రీత్ సింగ్ కూడా ఉంది. కన్నడలో 'గిల్లి' సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ తెలుగులో 'కెరటం' సినిమాతో పరిచయమైంది. 'వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్' సినిమాతో టాలీవుడ్లో విపరీతంగా పాపులారిటీని సంపాదించుకుంది. ఆ తర్వాత తెలుగులో స్టార్స్ పక్కన నటించే అవకాశాలను అందుకుంది. హిందీ, తమిళం, తెలుగు, కన్నడ భాషలలో స్టార్ హీరోయిన్గా వెలిగింది.
అయితే, అన్ని రకాలుగా రకుల్ ధృడంగా తయారైంది మాత్రం తెలుగు చిత్ర పరిశ్రమ వల్లే. ఇక్కడ ఛాలెంజింగ్ రోల్స్ చేసింది. జీవితంలో ఎలాంటి పరిణామాలు ఎదురైనా తట్టుకునే శక్తి సామర్థ్యాలను ఇచ్చింది. సౌత్‌లో మంచి పాపులారిటీ వచ్చి ఈ స్థాయికి వచ్చిందంటే, అది తెలుగు ఇండస్ట్రీ ఇచ్చిన అవకాశాల వల్లే. కెరీర్ ప్రారంభంలో ఎలాంటి లక్ష్యాన్ని పెట్టుకుందో..అదే ఇప్పటికీ కొనసాగిస్తోంది. తన పనికున్న విలువను తెలిపింది. స్టార్ డమ్ తో పాటు రకుల్ కోరుకున్న ప్రతీది తెలుగు ఇండస్ట్రీనే ఇచ్చిందని కృతజ్ఞతతో చెప్పుకొచ్చింది ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో. ఇలా, ఆమె తెలుగు చిత్రపరిశ్రమ గురించి చెప్పిన మాటలు అందరికీ ఎంతో ఆసక్తిగా అనిపిస్తున్నాయి.
