Vrushakarma: అక్కినేని నాగ చైతన్య నటించిన లేటెస్ట్ మైథలాజికల్ మిస్టిక్ థ్రిల్లర్ సినిమా వృష కర్మ. కార్తీక్ వర్మ దండు ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా తెతకెక్కించాడు. చాలా నెలల నుంచి వృష కర్మ షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌లో ఉంది. ఎట్టకేలకి ఇటీవలే విడుదల తేదీని ప్రకటించింది చిత్రబృందం. డిసెంబర్ నాలువ తేదీ భారీ స్థాయిలో విడుదల అని ప్రకటించారు. కానీ, ఇప్పుడు అది సాధ్యం కాదని టాక్ వినిపిస్తోంది.
సెన్సార్ సమస్యలు..పెండింగ్‌లో పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్:
ఈ మధ్య చాలా సినిమాలు అనుకున్న సమయానికి పూర్తికావడం లేదు. దీనివల్ల ఓటీటీల నుంచి సమస్యలు తలెత్తడమే కాదు, బిజినెస్ పరంగా కూడా లెక్కలు మారిపోతున్నాయి. ఖచ్చితంగా అనుకున్న గడువులోపు సినిమా పూర్తి చేయలేకపోతున్నారు. ఇప్పుడు, నాగ చైతన్య నటిస్తున్న వృష కర్మ కూడా అనుకున్న డిసెంబర్ 4న విడుదల చేయడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ, అది కుదరకపోవచ్చునని అంటున్నారు.
ఇంకా, ఈ సినిమాకి సెన్సార్ కార్యక్రమాలు పూర్తి కాలేదట. ఈ మధ్య సెన్సార్ కూడా చాలా నిబంధనలను పెట్టింది. దీని, ప్రకారం, అన్నీ పనులు పూర్తయ్యాకే సెన్నార్‌కి రావాలని, రెండు లేదా మూడు రోజుల ముందు వస్తే అనుమతించమని తెగేసి చెప్పింది. దీనితో, వృష కర్మ చిత్రానికి ఇంకా పూర్తిగా పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్ అవలేదట.
అందుకే, సెన్సార్ కూడా కంప్లీట్ కానట్టుగా సమాచారం. ప్రమోషన్స్‌లో ఒక ఊపు ఊపి ఇప్పుడు స్లో అయింది చిత్రబృందం. గట్టిగా 15 రోజులు కూడా లేదు. అదేరోజు రిలీజ్ కావాల్సిన సినిమాల కంటే నాగ చైతన్య వృష కర్మ కి మంచి బజ్ క్రియేట్ అయింది. కానీ, ఇప్పుడు విడుదల తేదీ మారే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. మరి, భారీ అంచనాలున్న ఈ సినిమా విషయంలో ఏం జరగనుందో చూడాలి. కాగా, మీనాక్షి చైదరి హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. అజనీష్ లోక్‌నాథ్ సంగీత దర్శకుడు.
