Sathyavan Savithiri: కొన్ని సినిమాలకి హిట్ టాక్ వస్తుంది. కానీ, ఇతర సినిమాలతో ఉన్న పోటీ వల్ల ఆశించిన స్థాయిలో థియేటర్స్ లభించక ప్రేక్షకులను చేరుకోలేవు. దాంతో, మంచి సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు కరువై ఫ్లాప్ సినిమాల లిస్ట్‌లో చేరుతుంది. ఇప్పుడు, అలాంటి ఇబ్బందులను ఎదుర్కొంటుంది కీర్తి సురేష్ నటించిన సత్యవాన్ సావిత్రి.
నవంబర్ 20వ తేదీన ధనుష్ నటించిన ఓం, తెలుగులో వచ్చిన ఆకాశంలో ఒక తారా సినిమాలతో పాటు థియోటర్స్‌లో విడుదలైంది. కానీ, ఈ సినిమాకి థియోటర్స్ అధికంగా ఇవ్వలేదు. లిమిటెడ్ థియీటర్స్ లో రిలీజైన సత్యవాన్ సావిత్రికి మంచి ఆక్యుపెన్సీ ఉంది. కానీ, సూర్య సీన్ సినిమా, ధనుష్ ఓం సినిమాలకి ఎక్కువ థియేటర్స్ ఇవ్వడంతో కీర్తి సురేష్ సినిమాకి తక్కువ లభించాయి.
ఇదే, ఆమె సినిమాకి కలెక్షన్స్ పరంగా గండి పడటానికి కారణం అయింది. గత కొంతకాలంగా కీర్తి నటించిన సినిమాలేవీ ప్రేక్షకులను మెప్పించలేకపోతున్నాయి. చేయడానికి, వరుస ప్రాజెక్ట్స్ లైన్‌లో పెడుతోంది. ఇటు సినిమాలు అటు సిరీస్ ఒకదాని తర్వాత ఒకటి..ఒక భాష తర్వాత ఒకటి ప్రేక్షకుల ముందుకు వస్తూనే ఉన్నాయి. కానీ, ఏ భాషలో వచ్చిన సినిమా కూడా హిట్ అనిపించుకోవడం లేదు.
బాలీవుడ్‌లో అక్క సిరీస్‌కి తమిళంలో వచ్చిన సత్యవాన్ సావిత్రి సినిమాకి పెద్ద గ్యాప్ లేదు. ఈ రెండు గనక హిట్ సాధించి ఉంటే, కీర్తి మళ్ళీ సక్సెస్ ట్రాక్ ఎక్కి ఉండేది. వినూత్న ప్రయోగం..కీర్తి ఛాలెంజింగ్‌గా చేసిన అక్క సిరీస్ ఆశించిన స్థాయిలో హిట్ సాధించలేదు. దీని, కోసం సరికొత్త మేకోవర్‌లో తయారైంది. కానీ, ఈ సిరీస్ కీర్తికి కలిసి రాలేదు. అలాగే, సత్యవాన్ సావిత్రి టాక్ పాజిటివ్‌గా ఉన్నా థియేటర్స్ కొరత వల్ల సక్సెస్ ఫీట్‌కి దూరంగా నిలిచిపోయింది.
