అంతర్జాతీయం

UAE Bus Accident: యూఏఈలో ఘోర బస్సు ప్రమాదం.. 13 మంది మృతి.. ఆరుగురు భారతీయుల్లో తెలుగు ఎన్నారై!

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)లోని రాస్ అల్ ఖైమాలో మంగళవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతుల సంఖ్య 13కు చేరింది. తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మరో ఇద్దరు ప్రయాణికులు మృతి చెందడంతో మృతుల సంఖ్య పెరిగింది.

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)లోని రాస్ అల్ ఖైమాలో మంగళవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతుల సంఖ్య 13కు చేరింది. తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మరో ఇద్దరు ప్రయాణికులు మృతి చెందడంతో మృతుల సంఖ్య పెరిగింది. మృతుల్లో ఆరుగురు భారతీయులు ఉండగా, అందులో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 31 ఏళ్ల తెలుగు ఎన్నారై వినోద్ కుమార్ కూడా ఉన్నట్లు సమాచారం. ఈ ప్రమాదంలో మరో నలుగురు గాయపడ్డారు. కేరళకు చెందిన ముగ్గురు, తమిళనాడు, గుజరాత్‌కు చెందిన ఒక్కొక్కరు మృతుల్లో ఉన్నారని, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని నివేదికలు పేర్కొంటున్నాయి.

బాధితుల కుటుంబాలను కలవడానికి భారత కాన్సుల్ జనరల్ డాక్టర్ ఇ. విష్ణువర్ధన్ రెడ్డి బుధవారం రాస్ అల్ ఖైమా పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌ను సందర్శించారు. బాధితులకు సంబంధించిన అధికారిక వివరాలను ఇంకా నిర్ధారిస్తున్నందున మృతుల సంఖ్యపై ఇప్పుడే పూర్తి వ్యాఖ్యలు చేయడం తొందరపాటు అవుతుందని ఆయన తెలిపారు. తొలుత 11 మంది ప్రాణాలు కోల్పోగా, ఆసుపత్రిలో చేరిన వారిలో ఇద్దరు మరణించడంతో మృతుల సంఖ్య 13కు చేరింది.

పొరుగునున్న ఒమన్ నుంచి ఈ బస్సు తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది. ఉపాధి కోసం విజిట్ వీసాపై యూఏఈకి వచ్చే భారతీయులలో చాలామంది వీసా స్టేటస్ మార్చుకునేందుకు తరచూ సమీపంలోని ఒమన్‌కు వెళ్లి వస్తుంటారు. ఈ దుర్ఘటనకు సంబంధించిన పుకార్లను లేదా ధృవీకరించని సమాచారాన్ని నమ్మవద్దని, అధికారిక వర్గాల సమాచారాన్నే విశ్వసించాలని అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

తర్వాత చదవండి