సినిమా

Tollywood: ప్రభుదేవా-మంచు విష్ణు కాంబోను ఊహించారా అసలు!

Tollywood: కొన్ని కాంబినేషన్స్‌లో సినిమాను అస్సలు ఎవరూ ఊహించలేరు. అలాంటి కాంబినేషన్ ప్రభుదేవా-మంచు విష్ణులది. తాజాగా, ఈ కాంబోలో సినిమాను ప్రకటించడం కాస్త షాకింగ్ విషయమే. ఈరోజు మంచు విష్ణు పుట్టినరోజు. ఈ సందర్భంగా నృత్య దర్శకుడు ప్రభుదేవా ఈ ప్రాజెక్ట్‌ను ప్రకటించాడు. అంతేకాదు, విష్ణుతో ఉన్న ఫొటోను షేర్ చేస్తూ ఆసక్తికరమైన కామెంట్‌ను జత చేశాడు.

బర్త్‌డే సందర్భంగా VM24 అనౌన్స్‌మెంట్..

నవంబర్ 23న మంచు విష్ణు పుట్టినరోజు. ఈ సందర్భంగా ప్రభుదేవా ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను అఫీషియల్‌గా ప్రకటించారు. విష్ణుతో కలిసి దిగిన ఫొటోను తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేస్తూ.. నా హీరో, తమ్ముడు అంటూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ.. ఈ వేడుకను ఇంకా ప్రత్యేకంగా, కలర్‌ఫుల్‌గా మార్చేందుకు విఎం24తో వస్తున్నామని ప్రకటించాడు ప్రభుదేవా. దీంతో, ఈ మూవీపై ఆసక్తి మొదలైంది.

తెలుగు, తమిళ భాషల్లో యాక్షన్ థ్రిల్లర్గా VM24..

ఇక, ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో రూపొందించబోతున్నారు. ముఖ్యంగా, మంచు విష్ణుకు తమిళంలో హీరోగా ఇది మొదటి చిత్రం. చెన్నైలో పుట్టి పెరిగిన విష్ణుకు తమిళం బాగా మాట్లాడగలడు. ఇప్పుడు, ప్రభుదేవా డైరెక్షన్‌లో తమిళ ప్రేక్షకుల ముందుకు వెళ్లబోతుండటం ఆసక్తికరమైన విషయం. అంతేకాదు, ఇందులో ప్రభుదేవా కూడా ఓ కీలక పాత్రను పోషించబోతున్నట్టుగా తెలుస్తోంది.

18 ఏళ్ల తర్వాత టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్న ప్రభుదేవా !

దర్శకుడిగా, నటుడిగా ప్రభుదేవాకు తెలుగు ఇండస్ట్రీలో మంచి గుర్తింపు ఉంది. సిద్ధార్థ్, త్రిషలతో తెరకెక్కించిన ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ప్రభాస్‌తో పౌర్ణమి సినిమాను రూపొందించాడు. ఆ తర్వాత, మెగాస్టార్ చిరంజీవితో ‘శంకర్ దాదా జిందాబాద్’తోనూ హిట్ కొట్టాడు. మళ్ళీ చాలా కాలం తర్వాత తెలుగు సినిమాకి దర్శకత్వం వహించబోతుండటంతో టాలీవుడ్‌లో ఆసక్తికరమైన చర్చగా మారింది.

తర్వాత చదవండి