తెలంగాణ

Komatireddy Raj Gopal Reddy: కాంగ్రెస్ ప్రభుత్వమైనా నిజాయితీగా పాలన చేయాలి- కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

Komatireddy Raj Gopal Reddy: దొంగలకు, పెట్టుబడిదారులకు దోచిపెట్టకుండా.. అభివృద్ధి విషయంలో న్యాయంగా వ్యవహరించాలన్నారు. ఇప్పటికైనా మంత్రులు అహంకారంతో మాట్లాడడం మానుకోవాలని సూచించారు. అవినీతి లేకుండా పాలన చేస్తున్నారా లేదా అనేది మీకు మీరే ప్రశ్నించుకోవాలన్నారు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.

Komatireddy Raj Gopal Reddy: నియోజకవర్గాలకు నిధుల కేటాయింపు విషయంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ లో ప్రకంపనలు రేపిన సంగతి తెలిసిందే. రాజగోపాల్ రెడ్డి డైరెక్ట్ గా సీఎం రేవంత్ రెడ్డినే టార్గెట్ చేయడం దుమారం రేపింది. తాజాగా ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రభుత్వాన్ని ఉద్దేశించి హాట్ కామెంట్స్ చేశారు. గత పదేళ్లలో రాష్ట్రం అప్పుల పాలైందన్న రాజగోపాల్ రెడ్డి.. కాంగ్రెస్ ప్రభుత్వమైనా నిజాయితీగా పాలన చేయాలని కోరారు.

దొంగలకు, పెట్టుబడిదారులకు దోచిపెట్టొద్దు

దొంగలకు, పెట్టుబడిదారులకు దోచిపెట్టకుండా.. అభివృద్ధి విషయంలో న్యాయంగా వ్యవహరించాలన్నారు. ఇప్పటికైనా మంత్రులు అహంకారంతో మాట్లాడడం మానుకోవాలని సూచించారు. అవినీతి లేకుండా పాలన చేస్తున్నారా లేదా అనేది మీకు మీరే ప్రశ్నించుకోవాలన్నారు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.

కేసీఆర్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పులపాలు చేసింది

''ఆ సీటులో కూర్చొని దొంగలకు, పెట్టుబడిదారులకు, కాంట్రాక్టర్లకు దోచి పెట్టకండి. లక్షల కోట్ల అప్పులు చేసి ఇప్పటికే కేసీఆర్ ప్రభుత్వం పదేళ్లలో రాష్ట్రాన్ని అప్పులపాలు చేసింది. కనీసం మీరైనా నిజాయితీగా పరిపాలన చేసి పేదలకు చెందాల్సిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి విషయంలో న్యాయంగా వ్యవరించాలని.. ఆ బుద్ధి మీకు ప్రసాదించాలని ఆ అయ్యప్ప స్వామిని వేడుకుంటున్నా.

పరిపాలన మంచిగా చేస్తే ప్రజలు మళ్లీ ఆశీర్వదిస్తారు

పరిపాలన మంచిగా చేయండి, మళ్ళీ ప్రజలు ఆశీర్వదిస్తారు. అహంకారంతో మాట్లాడకండి. మీరు ప్రతిపక్షాల మీద విరుచుకుపడటం కాదు. మీరు ఇచ్చిన హామీలు ఏంది? మీరు చేస్తున్నది ఏంది? నిజాయితీగా పరిపాలన చేస్తున్నారా? అవినీతి లేకుండా పరిపాలన చేస్తున్నారా? అనేది ఒక్కసారి మీ గుండె మీద చేయేసి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి'' అని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు.

తర్వాత చదవండి