తెలంగాణ

TG: భూ ఆక్రమణదారుల గుండెల్లో రైళ్లు.. రీసర్వేపై మంత్రి పొంగులేటి సంచలన ఆదేశాలు!

TG: తెలంగాణలో ఏళ్ల తరబడి ప్రభుత్వ భూములు, చెరువులు, కుంటలను కబ్జా చేసి దర్జాగా అనుభవిస్తున్న అక్రమార్కులకు ఇక కష్టాలు మొదలయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన భూ రీసర్వే విషయంలో రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ ఆస్తుల విషయంలో ఎక్కడా రాజీ పడొద్దని, ఒక్క అంగుళం భూమి కూడా ఆక్రమణకు గురికాకుండా పక్కాగా సరిహద్దులు తేల్చాలని ఆయన స్పష్టం చేశారు.

కబ్జాదారుల భరతం పట్టేలా నోటీసులు

రీసర్వేలో భాగంగా ప్రభుత్వ భూములు, చెరువులు, కుంటలు, అటవీ ప్రాంతాలను కాపాడటానికే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని మంత్రి తేల్చిచెప్పారు. వీటి సరిహద్దులను గుర్తించేందుకు వెంటనే ఫారమ్-9, ఫారమ్-10 నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు. దీనివల్ల రికార్డులను తారుమారు చేసి ప్రభుత్వ స్థలాలను కబ్జా చేసిన వారి గుట్టు రట్టు కానుంది. గడువులోగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని, ఎవరైనా నిర్లక్ష్యం వహిస్తే ఊరుకునే ప్రసక్తే లేదని కలెక్టర్లను హెచ్చరించారు.

రైతుల కళ్ల ముందే కొలతలు

కబ్జాదారులపై కొరడా ఝుళిపిస్తూనే, సామాన్య రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటోంది. సర్వే చేయడానికి నాలుగు రోజుల ముందే రైతులకు నోటీసులు ఇచ్చి, గ్రామాల్లో దండోరా వేయించి అందరికీ తెలియజేయాలని అధికారులను ఆదేశించారు. రెండు రోజుల ముందే రైతులు తమ పొలం చుట్టూ జెండాలు పాతుకునేలా చూడాలని స్పష్టం చేశారు. రైతుల సమక్షంలోనే భూమిని కొలిచి, ఎంత విస్తీర్ణం ఉందో అక్కడికక్కడే వారికి చెప్పాలని, పాత రికార్డులకు, ఇప్పటి కొలతలకు తేడా ఉంటే కారణాలు రాసి, వెంటనే భూ భారతి పోర్టల్‌లో వివరాలు ఎక్కించాలని ఆదేశాలు జారీ చేశారు.

గ్రామాల్లోనే సమస్యల పరిష్కారం

భూ వివాదాల కోసం రైతులు మండల ఆఫీసుల చుట్టూ తిరగకుండా, తహసీల్దార్లే ఊర్లోకి వచ్చి 3 నుంచి 4 రోజులు ప్రత్యేక శిబిరాలు నిర్వహించనున్నారు. గ్రామ పెద్దలు, చుట్టుపక్కల రైతుల ముందు కూర్చుని సరిహద్దు గొడవలను అక్కడికక్కడే పరిష్కరిస్తారు. సర్వేపై రైతులకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే, అదనపు కలెక్టర్లు, ఆర్డీవోలు స్వయంగా గ్రామాలకు వెళ్లి విచారిస్తారు. అన్నీ క్లియర్ అయ్యాకే తుది గెజిట్ విడుదల చేసి, రైతులకు పూర్తి హక్కులతో కూడిన కొత్త రికార్డులు అందిస్తారు. హైదరాబాద్ మినహా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఈ ప్రక్రియను పక్కాగా అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

తర్వాత చదవండి