సినిమా

AOT-Tollywood: దుల్కర్‌పై రాజమౌళి కామెంట్స్ వైరల్..

AOT-Tollywood: ఆకాశంలో ఒక తార..ఈ సినిమా వచ్చినప్పటి నుంచి టాలీవుడ్ సినీ ప్రముఖులంతా అటు దుల్కర్ సల్మాన్, సాత్విక వీరవల్లిలపై, ఇటు దర్శకుడు పవన్ సాదినేనిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మెగాస్టార్, ఎన్‌టిర్, అల్లు అర్జున్ సహా పలువురు టాలీవుడ్ స్టార్స్ సినిమాపై తమ ప్రేమాభిమానాలను చూపారు. ఈ క్రమంలో దర్శక ధీరుడు రాజమౌళి కూడా దుల్కర్ గురించి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

AOT-Tollywood: "ఆకాశంలో ఒక తార"(Aakasamlo Oka Tara)..ఈ సినిమా వచ్చినప్పటి నుంచి టాలీవుడ్ సినీ ప్రముఖులంతా అటు దుల్కర్ సల్మాన్(Dulquer Salmaan), సాత్విక వీరవల్లి(Satvika Veeravalli)లపై, ఇటు దర్శకుడు పవన్ సాదినేనిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మెగాస్టార్, ఎన్‌టిర్, అల్లు అర్జున్ సహా పలువురు టాలీవుడ్ స్టార్స్ సినిమాపై తమ ప్రేమాభిమానాలను చూపారు. ఈ క్రమంలో దర్శక ధీరుడు రాజమౌళి కూడా దుల్కర్ గురించి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

“తమ్మీ.. నువ్వు మావోనివే”

“తమ్మీ.. నువ్వు మావోనివే” అంటూ ఎస్.ఎస్.రాజమౌళి దుల్కర్‌ను ఉద్దేశించి ఎంతో ఆసక్తికరంగా మాట్లాడటం సినీ పరిశ్రమలో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అసలు, జక్కన్న రియాక్షన్ ఈ రేంజ్‌లో ఉంటుందని ఎవరూ అనుకోలేదు. ఈ మధ్య కాలంలో దుల్కర్ నటించిన సినిమాలు మన తెలుగులో మంచి ఆదరణను అందుకుంటున్నాయి.

అంతేకాదు, తెలుగులోనూ స్ట్రైట్ సినిమాలను చేస్తూ ఇక్కడ తనకంటూ ఓ ప్రత్యేకమైన మార్కెట్‌ను సంపాదించుకున్నాడు. మహానటి, సీతారామం, లక్కీ భాస్కర్ చిత్రాలతో తెలుగులో హ్యాట్రిక్ హిట్స్ అందుకున్నాడు దుల్కర్ సల్మాన్. అందుకే, ఇప్పుడు మళ్ళీ, ఆకాశంలో ఒక తార సినిమాతో వచ్చాడు. ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ టాక్‌తో బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. ఈ సినిమా సక్సెస్‌తో పవన్ సాదినేనికి గీతా ఆర్ట్స్‌లో మరో సినిమా చేసే ఛాన్స్ అందుకున్నాడు. హీరోయిన్‌గా సాత్విక కి రెండు ప్రాజెక్ట్స్ చేయనుంది.

‘ఆకాశంలో ఒక తార’ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్‌కి హాజరైన దర్శకుడు రాజమౌళి మాట్లాడుతూ.. "ఈ కథలో హీరోయిన్ కల్పన తన కలను నెరవేర్చుకోవడానికి హీరో కృష్ణ అండగా నిలబడినట్టుగానే, నిజ జీవితంలోనూ ఈ సినిమాను దుల్కర్ సల్మాన్ తన భుజాలపై మోసి ముందుకు తీసుకెళ్లారని పొగడ్తల వర్షం కురిపించాడు. అంతేకాదు, దుల్కర్ లేకపోతే ‘ఆకాశంలో ఒక తార’ సినిమా వచ్చేది కాదని, ఇటువంటి మంచి కథను ప్రేక్షకులు చూసే అవకాశం కూడా ఉండేది కాదని జక్కన్న ప్రశంసించారు. మొత్తానికి, దుల్కర్ మీద రాజమౌళి చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియా మొత్తం వైరల్ అవుతున్నాయి.

తర్వాత చదవండి