Tollywood: కొత్త కాంబోను సెట్ చేశాడు నేచురల్ స్టార్ నాని(Nani). ఈ విషయాన్ని ఆయన సోదరి దీప్తి గంటా(Deepthu Ganta) కన్‌ఫర్మ్ చేశారు. హిట్ 3 (Hit 3), ది ప్యారడైజ్(The Paradise) సినిమాల ఫలితం తర్వాత నాని తన నెక్స్ట్ సినిమాల విషయంలో ఎంతో జాగ్రత్త వహిస్తున్నాడు. అందుకే, విభిన్న కథలను ఎంచుకుంటూ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతున్నాడు.
నాని, ప్రస్తుతం సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'బ్లడీ రోమియో' సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో నాని రెండు విభిన్నమైన పాత్రల్లో నటిస్తున్నాడు. మేకోవర్ కూడా చాలా కొత్తగా ప్లాన్ చేశాడు దర్శకుడు సుజీత్. ఓజీ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత నానితో సుజీత్ చేస్తున్న 'బ్లడీ రోమియో' సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
అయితే, ఈ సినిమా తర్వాత నాని ఓ ఎమోషనల్ లవ్ స్టోరీ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ తమిళ దర్శకుడు సి. ప్రేమ్ కుమార్‌తో నాని సినిమా చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. తాజాగా, ఈ వార్తలకి నాని సోదరి దీప్తి అధికారికంగా ప్రకటనను వెల్లడించారు. త్రిష-విజయ్ సేతుపతి కాంబోలో వచ్చిన డీసెంట్ హిట్ 96, అలాగే సత్యం సుందరం లాంటి కమర్షియల్ హిట్స్ అందించిన ఈ దర్శకుడు, ఇప్పుడు నానితో సినిమాను చేయనున్నాడు.
అలియాస్ రుక్మిణి ప్రమోషన్స్ లో క్లారిటీ:
గత కొన్ని రోజుల నుంచి సోషల్ మీడియాలో ప్రేమ్ కుమార్‌తో నాని సినిమా అని వస్తున్న వార్తలను దీప్తి గంట నితిన్ నటించిన లేటెస్ట్ సినిమా అలియాస్ రుక్మిణి ప్రమోషన్స్‌లో క్లారిటీ ఇచ్చారు. వీరి కాంబోలో సినిమా ఉన్న మాట వాస్తవమని వెల్లడించారు. అంతేకాదు, సుజీత్ దర్శకత్వంలో చేస్తున్న బ్లడీ రోమియో తర్వాత ఈ కాంబోలో సినిమా మొదలవనుందని ఆమె కన్‌ఫర్మేషన్ ఇచ్చారు.
