సినిమా

RC17-Official: సుకుమార్-చరణ్ సినిమాకి DOP గా రత్నవేలు కన్‌ఫర్మ్

RC17-Official: గ్లోబల్ రేంజ్‌లో క్రేజ్ తెచ్చుకున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Mega Power Star Ram Charan) త్వరలో తన 17వ సినిమా కోసం రంగంలోకి దిగబోతున్నాడు. దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి(SS.Rajamouli) దర్శకత్వంలో వచ్చిన పాన్ ఇండియా సినిమా ఆర్ఆర్ఆర్(RRR) చరణ్‌(Ram CharaN)కి ఏ స్థాయిలో పాపులారిటీ తెచ్చిందో అందరికీ తెలిసిందే. కానీ, ఆ సక్సెస్ ట్రాక్‌ను గేమ్ ఛేంజర్(Game Changer), పెద్ది(Peddi) సినిమాలతో కంటిన్యూ చేయలేకపోయాడు.

RC17-Official: గ్లోబల్ రేంజ్‌లో క్రేజ్ తెచ్చుకున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Mega Power Star Ram Charan) త్వరలో తన 17వ సినిమా కోసం రంగంలోకి దిగబోతున్నాడు. దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి(SS.Rajamouli) దర్శకత్వంలో వచ్చిన పాన్ ఇండియా సినిమా ఆర్ఆర్ఆర్(RRR) చరణ్‌(Ram CharaN)కి ఏ స్థాయిలో పాపులారిటీ తెచ్చిందో అందరికీ తెలిసిందే. కానీ, ఆ సక్సెస్ ట్రాక్‌ను గేమ్ ఛేంజర్(Game Changer), పెద్ది(Peddi) సినిమాలతో కంటిన్యూ చేయలేకపోయాడు. అందుకే, ఇప్పుడు ఆర్సీ 17(RC17)తో మళ్ళీ గ్లోబల్ వైడ్‌గా సాలీడ్ హిట్ కొట్టడానికి రెడీ అవుతున్నాడు. ఈ ప్రాజెక్ట్‌కి డిఓపిగా ఆర్.రత్నవేలు(R. Rathnavelu) ఫిక్సైయ్యాడు.

రంగస్థలం కాంబో రిపీట్:

రామ్ చరణ్, సుకుమార్, మైత్రీ మూవీ మేకర్స్ కెరీర్‌లో రంగస్థలం మైల్ స్టోన్ మూవీగా నిలిచింది. ముఖ్యంగా, నిర్మాణ సంస్థ మైత్రీ వారి జర్నీ ఈ స్థాయికి వచ్చిందంటే అది రంగస్థలం ఇచ్చిన సాలీడ్ సక్సెస్ అని చెప్పక తప్పదు. ఈ సినిమాకి పనిచేసిన ప్రతీ ఒక్కరికీ మరపురాని చిత్రంగా నిలిచింది. సమంత పోషించిన రామలక్ష్మి పాత్ర సినిమాకి హైలెట్‌గా నిలిచింది. రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ అందించిన సంగీతం రత్నవేలు సినిమాటోగ్రఫీ..ఆర్ట్ డైరెక్టర్ మౌనిక-రామకృష్ణ వేసిన సెట్స్..ఇలా ప్రతీది సినిమా సక్సెస్‌కి కారణమయ్యాయి.

సుకుమార్ సినిమా అంటే ఎన్నో ప్రత్యేకతలు ఉంటాయి. ముఖ్యంగా, కథ-కథనాలలో ఎంతో క్రియోటివిటీ ఉంటుంది. అందుకు తగ్గ నిర్మాణ సంస్థ కేటాయించే బడ్జెట్ చాలా కీలకం. మ్యూజికల్‌గా, సినిమాటోగ్రఫీ పరంగా సెట్స్ పరంగా చాలా స్పెషల్‌గా ఉంటుంది సినిమా. అందుకే, ఆయన తనకంటూ ఒక సపరేట్ టీమ్ ని మేయింటైన్ చేస్తుంటాడు. ఆ లిస్ట్‌లో సినిమాటోగ్రాఫర్ ఆర్.రత్నవేలు కూడా కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నాడు.

సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఆర్య సినిమా నుంచి దాదాపు చాలా సినిమాలకి డిఓపిగా రత్నవేలు వర్క్ చేశాడు. వాటిలో 1.నేనొక్కడినే, రంగస్థలం లాంటి సినిమాలున్నాయి. అయితే, ఇప్పుడు ఆర్సీ 17 ఓ ప్రత్యేకమైన ప్రాజెక్ట్ కానుంది. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్, రామ్ చరణ్, రత్నవేలు..ఇలా దాదాపు రంగస్థలం సినిమా టీమ్ మొత్తం మళ్ళీ ఆర్సీ 17కి కలిసింది. మరి, ఈ సినిమా ఎలాంటి సంచలనాన్ని సృష్టిస్తుందో చూడాలి.

తర్వాత చదవండి