తెలంగాణ

Jupally Krishna Rao: మంత్రి జూపల్లి కృష్ణారావు అవినీతి బాగోతం.! రూ. 60లక్షల మోసం

Jupally Krishna Rao: మంత్రి జూపల్లి కృష్ణారావు కుటుంబానికి చెందిన సమీప బంధువుపై రూ.60 లక్షల ఆర్థిక లావాదేవీలకు సంబంధించి తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తాయి. వ్యాపారం, కాంట్రాక్టుల పేరుతో తమ దగ్గర డబ్బులు తీసుకుని, తిరిగి అడిగితే బెదిరింపులకు పాల్పడుతున్నాడని సూర్యాపేట జిల్లా కోదాడకు చెందిన జలగం సుధీర్ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

* మంత్రి జూపల్లి కృష్ణారావు బంధువుపై రూ.60 లక్షల మోసం ఆరోపణలు

* వ్యాపారం పేరుతో డబ్బులు తీసుకుని తిరిగి ఇవ్వడం లేదని బాధిత కుటుంబం ఆవేదన

* మంత్రి అండతోనే బెదిరింపులకు పాల్పడుతున్నారంటూ ఆరోపణలు

Jupally Krishna Rao: మంత్రి జూపల్లి కృష్ణారావు కుటుంబానికి చెందిన సమీప బంధువుపై రూ.60 లక్షల ఆర్థిక లావాదేవీలకు సంబంధించి తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తాయి. వ్యాపారం, కాంట్రాక్టుల పేరుతో తమ దగ్గర డబ్బులు తీసుకుని, తిరిగి అడిగితే బెదిరింపులకు పాల్పడుతున్నాడని సూర్యాపేట జిల్లా కోదాడకు చెందిన జలగం సుధీర్ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

వివరాల్లోకి వెళ్తే.. కోదాడకు చెందిన జలగం సుధీర్ అమెరికాలో ఉంటున్నారు. మంత్రి జూపల్లి కృష్ణారావు అక్క కుమారుడు కనెపర్తి సతీష్.. జలగం సుధీర్ వద్దకు వెళ్లాడు. తాను త్వరలో మంత్రి కాబోతున్నానని వారితో చెప్పాడు. మీరు ఇండియాకు తిరిగి వచ్చేయండి, మీకు కాంట్రాక్టులు ఇప్పిస్తానని నమ్మబలికాడు. అలా తన నుంచి వ్యాపారం నిమిత్తం రూ.60 లక్షలు తీసుకున్నట్లు బాధితుడు సుధీర్ తెలిపాడు.

సతీష్ మాట నమ్మి తాను ఇండియాకు తిరిగి వచ్చాక పరిస్థితి పూర్తిగా మారిపోయిందని సుధీర్ వాపోయాడు. సతీష్ తనకిచ్చిన హామీలను నెరవేర్చలేదన్నాడు. అంతేకాదు డబ్బుల విషయం పట్టించుకోవడం లేదని సుధీర్ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పలుమార్లు డబ్బులు తిరిగి ఇవ్వాలని కోరగా రూ.20 లక్షలు మాత్రమే చెల్లించి, మిగిలిన రూ.40 లక్షలు ఇచ్చేది లేదని, ఏం చేసుకుంటారో చేసుకోండంటూ సతీష్ తమను బెదిరిస్తున్నాడని సుధీర్ కుటుంబసభ్యులు వాపోయారు.

తమ కుమారుడు కష్టపడి, పైసా పైసా కూడబెట్టి సంపాదించిన డబ్బును తిరిగి తమకు ఇప్పించాలని బాధిత కుటుంబం వేడుకుంటోంది. తమకు న్యాయం జరగకపోతే ఎంత దూరమైనా పోరాటం చేస్తామని వారు స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా, ఈ వ్యవహారంపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటివరకు తమకు న్యాయం జరగలేదని బాధిత కుటుంబం ఆవేదన వ్యక్తం చేస్తోంది.

మంత్రి కుటుంబానికి చెందిన వ్యక్తిపై వచ్చిన తీవ్ర ఆరోపణలు ఇప్పుడు స్థానికంగా సంచలనంగా మారాయి. రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీశాయి. ఈ ఆరోపణలపై మంత్రి జూపల్లి కృష్ణారావు, ఆయన దగ్గరి బంధువు సతీష్ నుంచి ఎటువంటి స్పందన వస్తుందో చూడాలి.

తర్వాత చదవండి