వ్యాపారం

Stock Market Crash: దలాల్ స్ట్రీట్‌లో బ్లాక్ మండే.. ఒక్కరోజే రూ. 5 లక్షల కోట్ల లాస్!

గత రెండు రోజులుగా లాభాల్లో దూసుకెళ్లిన స్టాక్ మార్కెట్లకు సోమవారం గట్టి దెబ్బ తగిలింది. ట్రేడింగ్ మొదలైనప్పటి నుంచే అమ్మకాల ఒత్తిడి పెరగడంతో మార్కెట్లు భారీ నష్టాల్లోకి వెళ్లాయి. ఈ పతనంతో కేవలం ఒక్కరోజే ఇన్వెస్టర్లకు సుమారు రూ. 5 లక్షల కోట్ల సంపద ఆవిరైపోయింది.

సెన్సెక్స్, నిఫ్టీ భారీగా డౌన్

సోమవారం మార్కెట్ ముగిసే సమయానికి ప్రధాన సూచీలు కుదేలయ్యాయి. సెన్సెక్స్ ఏకంగా 1,484 పాయింట్లు నష్టపోయి 82,436 దగ్గర ముగిసింది. నిఫ్టీ 451 పాయింట్లు పడిపోయి 25,350 కంటే కిందకు చేరుకుంది.

మార్కెట్‌ను ముంచిన షేర్లు ఇవే!

ముఖ్యంగా ఆటో, మెటల్, బ్యాంకింగ్ సెక్టార్ షేర్లలో ఇన్వెస్టర్లు భారీగా అమ్మకాలకు దిగడమే మార్కెట్ పతనానికి కారణమైందని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. గత రెండు రోజుల్లో వచ్చిన లాభాలను బుక్ చేసుకోవడానికి ట్రేడర్లు మొగ్గు చూపడంతో మార్కెట్లు కోలుకోలేకపోయాయి. ఈ భారీ పతనం వల్ల బీఎస్ఈలో లిస్టయిన కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ. 514 లక్షల కోట్ల నుంచి రూ. 509 లక్షల కోట్లకు పడిపోయింది.

మంగళవారం మార్కెట్లకు సెలవు

భారీ నష్టాలతో డీలా పడిన ఇన్వెస్టర్లకు మంగళవారం కొంత గ్యాప్ దొరకనుంది. గురునానక్ జయంతి సందర్భంగా మంగళవారం స్టాక్ మార్కెట్లకు సెలవు ప్రకటించారు. దీంతో తిరిగి బుధవారం మార్కెట్లు ఎలా ఓపెన్ అవుతాయనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

తర్వాత చదవండి